For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమల నుంచి విముక్తికి యోగర్ట్‌ మార్గం

మొటిమల నుంచి విముక్తికి యోగర్ట్‌ మార్గం

By Sateesh Devalla
|

అందాన్ని ఇనుమడింప చేయడంలో యోగర్ట్‌ ఇప్పుడిప్పుడే ప్రసిద్ధి చెందుతోంది. సహజసిద్ధంగా అందాన్ని పెంచుకోవాలనుకునే వారి మొదటి ఎంపిక ఇప్పుడు యోగర్టే.

యోగర్ట్ అనేది వందల ఏళ్లుగా చర్మకాంతిని మెరుగు పరిచేందుకు ఉపయోగిస్తున్నారు. కేవలం చర్మం రంగును మార్చడానికే కాదు వచ్చిన మొటిమలను తగ్గించడానికి, కొత్తవాటిని రాకుండానూ చేయడంలో యోగర్ట్ చేసే మాయే వేరు.

DIY Yogurt Face Masks For Acne Cure and Control

యోగర్ట్‌లో సమృద్ధిగా ఉండే జింక్‌, కాల్షియం, విటమిన్లు మరియు లాక్టిక్ యాసిడ్‌లు దాన్ని మెరుగైన ఫేస్‌మాస్క్‌గా మార్చుతాయని చెప్పవచ్చు. దీనికితోడు, యోగర్ట్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు మొటిమలను కలిగించే క్రిములతో పోరాడటంలో ఉపయోగపడతాయి.

కాబట్టి, మొటిమల మచ్చలను తొలగించుకోవడంలో, కొత్తగా మొటిమలు రాకుండా చేసుకోవడంలో ఈ అద్భుతమైన, సులువైన పదార్థాన్ని ఎలా ఉపయోగపడుతుందో ఇవాళ చూద్దాం. ఆలస్యమెందుకు త్వరగా చదివేయండి!

1) యోగర్ట్‌ మరియు తేనె ఫేస్ మాస్క్‌

1) యోగర్ట్‌ మరియు తేనె ఫేస్ మాస్క్‌

మొటిమల నుంచి విముక్తి లభించాలంటే చర్మంలో పీహెచ్ సమతుల్యంగా ఉండాలి. ఈ విషయంలో యోగర్ట్‌ ఎంతో చక్కగా పనిచేస్తుంది. పీహెచ్‌ సమతుల్యతను కాపాడడం వల్ల మొటిమల నుంచి విముక్తి లభిస్తుంది. తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్‌ మరియు యాంటీ ఫంగల్‌ లక్షణాలు మొటిమలు కలిగించే క్రిములను అంతం చేస్తాయి.

కావల్సిన పదార్థాలు

1 టేబుల్‌ స్పూన్‌ యోగర్ట్‌

1 టేబుల్ స్పూన్‌ స్వచ్ఛమైన తేనె

ఎలా ఉపయోగించాలి

శుభ్రమైన గిన్నెను తీసుకుని అందులో యోగర్ట్ మరియు స్వచ్ఛమైన తేనెను వేసి కలపండి. దాన్ని సమస్యాత్మక ప్రాంతంలో గానీ లేదా ముఖం మొత్తంగానీ రాసుకోండి. దాన్ని 10 నిమిషాలపాటు అలానే ఉంచి ఆ తర్వాత సాధారణ నీళ్లతో కడుగుకుని ఆరనివ్వండి. దీన్ని కొన్ని రోజులకోసారి మీరు చేసుకోవచ్చు.

2. యోగర్ట్ మరియు తెల్లసొన ఫేస్‌ మాస్క్‌

2. యోగర్ట్ మరియు తెల్లసొన ఫేస్‌ మాస్క్‌

యోగర్ట్‌లోని మెత్తని లక్షణాలు చర్మాన్ని మృదువుగా మరియు సున్నితంగా మార్చుతాయి. చర్మానికి ఎలాంటి ఇన్పెక్షన్లు లేదా దద్దుర్లు రాకుండా చేస్తాయి. గుడ్డులోని తెల్లసొన చర్మంలోని రంధ్రాలను కుచించుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల మొటిమలకు కారణమయ్యే అదనపు జిడ్డు తయారీ తగ్గిపోతుంది.

కావల్సిన పదార్థాలు

1 టేబుల్ స్పూన్‌ గుడ్డులోని తెల్లసొన

1 టేబుల్‌ స్పూన్‌ యోగర్ట్‌

ఎలా ఉపయోగించాలి

గుడ్డులోని తెల్లసొనను వేరు చేసి ఓ గిన్నెలోకి తీసుకోండి. దాన్ని గిలక్కొట్టి మృదువుగా చేయండి. ఆ తర్వాత తెల్లసొనలో యోగర్ట్ వేసి రెండింటినీ బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకుని 10-15 నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత, సాధారణ నీళ్లతో కడుగుకుని ఆరనివ్వండి.

3) యోగర్ట్ మరియు ఓట్‌మీల్‌ ఫేస్ మాస్క్‌

3) యోగర్ట్ మరియు ఓట్‌మీల్‌ ఫేస్ మాస్క్‌

యోగర్ట్‌లో ఉండే లాక్టిక్ యాసిడ్‌ కేవలం మొటిమలను తగ్గించడానికి, చర్మంపై దద్దర్లు రాకుండా చేయడానికే కాదు చర్మంపై మృత కణాలను తొలగించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓట్‌మీల్‌ కూడా దానిలోని పొరల లక్షణాల కారణంగా ఇలానే ఉపయోగపడుతుంది.

కావల్సిన పదార్థాలు

1 టేబుల్‌ స్పూన్‌ యోగర్ట్‌

1 టేబుల్ స్పూన్‌ ఓట్‌మీల్‌

ఎలా ఉపయోగించాలి

ముందుగా ఓట్‌మీల్‌ను పొడిగా చేసుకోవాలి. అందులో యోగర్ట్‌ను వేసి బాగా కలపాలి. ఆ యోగర్ట్‌ మరియు ఓట్‌మీల్ స్క్రబ్‌ను మీ ముఖంపై రాసుకోండి. ఆ తర్వాత మీ ముని వేళ్లతో మృదువుగా వలయాకారంలో మర్దనా చేసుకోండి. కొన్ని నిమిషాల పాటు ఇలా చేసి, ఆ తర్వాత 10 నిమిషాలు వదిలివేయండి. 10 నిమిషాల తర్వాత, సాధారణ నీళ్లతో కడిగివేయండి. ఆ తర్వాత, కాసేపు ఆరనిచ్చి మాయిశ్చరైజర్‌ రాసుకోండి.

4) యోగర్ట్‌ మరియు నిమ్మరసం

4) యోగర్ట్‌ మరియు నిమ్మరసం

నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్‌ చర్మంపై ఉండే దద్దుర్లు లేదా చారలను నయం చేయగలదు. దీంతోపాటు నిమ్మరసంలో చర్మం రంగును మెరుగుపరిచే లక్షణాలున్నాయి. అంతేకాదు మొటిమలు రావడానికి ప్రధాన కారణమైన చర్మంపై అదనపు జిడ్డును తొలగించడంలోనూ నిమ్మరసం బాగా పనిచేస్తుంది.

కావల్సిన పదార్థాలు

1 టేబుల్‌ స్పూన్‌ యోగర్ట్‌

½ టేబుల్ స్పూన్‌ నిమ్మరసం

ఎలా ఉపయోగించాలి

శుభ్రమైన గిన్నెలో యోగర్ట్‌ను తీసుకోండి, నిమ్మకాయను కోసి దానిపై పిండండి. రెండింటినీ బాగా కలపండి. దాన్ని మీ ముఖంపై రాసుకోండి. ఆ తర్వాత మీ ముని వేళ్లతో మృదువుగా వలయాకారంలో కొన్ని నిమిషాల పాటు మర్దనా చేసుకోండి. ఆ తర్వాత 20 నిమిషాలు వదిలివేయండి. 20 నిమిషాల తర్వాత, చల్లని నీళ్లతో కడగండి. ఆ తర్వాత, మృదువైన టవల్‌తో తుడుచుకోండి.

మీ వీలును బట్టి ఈ నాలుగింటిలో అవసరమైన దాన్ని చేసుకుని మొటిమల సమస్యనుంచి విముక్తి పొందండి. మీ చర్మకాంతిని కూడా మెరుగుపరుచుకుని మరింత అందంగా మెరిసిపోండి.

English summary

DIY Yogurt Face Masks For Acne Cure and Control

Yogurt is an age-old remedy to get a radiant and bright skin. Yogurt not only helps in improving the complexion of the skin but also helps in curing acne and breakouts. The anti-inflammatory, antiseptic and antifungal properties in yogurt help in fighting acne-causing germs. You can use it with ingredients like lemon, honey, etc, for better results.
Story first published:Saturday, July 21, 2018, 13:06 [IST]
Desktop Bottom Promotion