For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రకాశవంతమైన చర్మాన్ని పొందటం కోసం ఆరెంజ్ మీకు ఏ విధంగా సహాయం చేయగలదు ?

|

ఆరెంజ్లో యాంటిఆక్సిడెంట్లు, కొన్ని ముఖ్యమైన ఖనిజాలు & ఇతర విటమిన్లను కలిగి ఉంటాయి. కానీ అది మీ ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా, మీ అందంను మెరుగుపర్చడంలో కూడా సహాయపడగలవని మీకు తెలుసా? అవును, మీరు సరిగ్గానే చదివారు! ఈ ఆరెంజ్లను యవ్వనమైన & అందమైన చర్మమును పొందేందుకు ఫేస్ మాస్క్లు / ప్యాక్ల రూపంలో ఉపయోగించవచ్చు.

స్కిన్ టాన్, బ్లేమిషేస్, డ్రై స్కిన్ మొదలైన వంటి కొన్ని సాధారణ చర్మ సమస్యలు మనకు ఎదురవుతూ ఉన్నాయి. ఈ సమస్యలన్నింటి కోసం మీకు ఉన్న అద్భుతమైన పరిష్కారం "ఆరెంజ్", దీనిని ఈ వేసవి కాలంలో మీరు ఒక్కసారి ప్రయత్నించండి. సాధారణ సిట్రిక్ పండులా ఉండే వాటిలో, నారింజను ఈ వేసవిలో మీరు సులువుగా గుర్తించవచ్చు. కాబట్టి, మీరు కావాలని కోరుకున్న వాటిని, సరైన సమయంలో అందిపుచ్చుకోవడంలో మటుకు ఆలస్యం చెయ్యవద్దు, బాహ్యంగా ఉన్న మీ చర్మ సౌందర్యాన్ని సంరక్షించడం కోసం నారింజను ఉపయోగించడం మర్చిపోవద్దు.

Does Orange Help In Getting A Glowing Skin? Find Out

ఇప్పుడు, మీరు వాటిని ఎలా ఉపయోగించాలో అని ఆశ్చర్యపోతున్నారా ? చింతించకండి. ఈ వ్యాసం, నారింజ వల్ల కలిగే చర్మ ప్రయోజనాల కోసం మీకు పూర్తి మార్గదర్శిని అందిస్తుంది. అలాగే మీకు అందమైన & దోషరహితమైన చర్మమును పొందడానికి ప్యాక్లు, మాస్క్ల రూపంలో వీటిని ఎలా ఉపయోగించుకోవాలో అనే విషయాన్ని తెలియజేస్తుంది.

1. ప్రకాశవంతమైన చర్మం కోసం :

1. ప్రకాశవంతమైన చర్మం కోసం :

ఈ నారింజలో ఉండే విటమిన్ సి & యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడానికి సహాయం చేస్తుంది. ఆరోగ్యకరమైన, మృదువైన చర్మాన్ని పొందడం కోసం నారింజను వినియోగించడం మీకు బాగా సహాయపడుతుంది. చర్మం ప్రకాశించేలా ఉంచడానికి బాహ్యంగా నారింజను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.

దీని కోసం, తేనెను తురిమిన నారింజ రసముతో బాగా కలపాలి. మీ ముఖం మీద ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. ఆ ప్యాక్ బాగా ఆరేలా 15 నిముషాల పాటు అలానే వదిలేసి, ఆపై మీ ముఖాన్ని శుభ్రంగా కడిగి, మీ ముఖాన్ని పొడిగా ఉంచండి. మంచి ఫలితాల కోసం దీన్ని వారంలో రెండుసార్లు ప్రయత్నించండి.

2. పొడి చర్మాన్ని నివారించడం కోసం :

2. పొడి చర్మాన్ని నివారించడం కోసం :

మీరు పొడి చర్మాన్ని కలిగి ఉంటే, ఈ సాధారణ ఆరెంజ్ ఫేస్ ప్యాక్తో మీ సమస్యను దూరం చేసుకోవచ్చు. దీనిని ఒక యాంటీ ఏజింగ్ మాస్క్లా కూడా ఉపయోగించవచ్చు.

కావలసిన పదార్థాలు :

నారింజ రసం : 2-3 టేబుల్ స్పూన్లు

సోర్ క్రీమ్ : 1 టేబుల్ స్పూను

ఎలా ఉపయోగించాలి:

పైన చెప్పిన అన్ని పదార్ధాలను బాగా కలిపి, మెత్తని పేస్ట్లా చేయండి. మీ మెడ & ముఖంపై ఈ పేస్ట్ను అప్లై చేసి, 15 నిముషాల పాటు అలానే వదిలివేయండి. ఆ తర్వాత, గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ మీ చర్మాన్ని మృదువుగా & హైడ్రేట్గా మారుస్తుంది, అందువలన మీ చర్మం పొడిగా ఉండకుండా నివారించబడుతుంది.

3. జిడ్డైన చర్మం కోసం :

3. జిడ్డైన చర్మం కోసం :

ఈ మాస్క్ మీ చర్మాన్ని మృదువుగా & శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. జిడ్డుగల చర్మం ప్రధానంగా మోటిమలను కలిగి ఉంటుంది. ఈ మాస్క్ మీ ముఖం నుండి అదనపు ఆయిల్ను వదిలించడంలో మీకు సహాయం చేస్తుంది.

కావలసిన పదార్థాలు :

నారింజ రసం : 3 టేబుల్ స్పూన్లు

మజ్జిగ : 1 టేబుల్ స్పూన్లు

శనగపిండి : 2 టేబుల్ స్పూన్లు

నిమ్మ రసం : 1 టేబుల్ స్పూన్లు

ఎలా ఉపయోగించాలి:

ఈ పేస్ట్ను చేయడానికి పైన పేర్కొన్న అన్ని పదార్థాలను బాగా కలపండి. అలా తయారైన మిశ్రమాన్ని మీ ముఖానికి మరియు మెడకు అప్లై చేయండి. అప్లై చేసిన 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మీ శరీర భాగాలను పొడిగా ఉంచేలా శుభ్రపరచుకోండి. ఆయిలీ స్కిన్ కోసం ఉపయోగించబడే ఈ ఫేస్ ప్యాక్ మిమ్మల్ని మరింత యవ్వనంగా ఉంచుతుంది.

4. టాన్ను నివారించడానికి :

4. టాన్ను నివారించడానికి :

ఈ ప్యాక్ ద్వారా, మీరు సూర్యతాపం నుంచి ఎదుర్కొంటున్న టాన్ను తొలగించడం ద్వారా, చర్మపు పూర్వ స్థితిని కలగజేస్తుంది. చనిపోయిన చర్మ కణాల ఫలితంగా టాన్ అనేది ఏర్పడుతోంది. ఈ ప్యాక్ చనిపోయిన చర్మ కణాలను తొలగించి, చర్మాన్ని ప్రకాశవంతంగా తయారు చేయడంలో సహాయం చేస్తుంది.

కావలసిన పదార్థాలు :

నారింజ రసం : 1 టేబుల్ స్పూన్

గుడ్డు తెల్లసొన : 1 టేబుల్ స్పూన్

పెరుగు : 1 టేబుల్ స్పూన్

ఎలా ఉపయోగించాలి:

పైన చెప్పిన అన్ని పదార్ధాలను బాగా కలిపి, మెత్తని పేస్ట్లా చేయండి. మీ మెడ & ముఖంపై ఈ పేస్ట్ను అప్లై చేసి, 15 నిముషాల పాటు అలానే వదిలివేయండి. ఆ తర్వాత, గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ముసుగు మీ ముఖం మీద ఒక సహజ కాంతిని ఏర్పరచటంలో సహాయపడుతుంది. వారంలో కనీసం రెండుసార్లు ఈ ప్యాక్ను ప్రయత్నించండి.

5. మచ్చలను తొలగించడం కోసం :

5. మచ్చలను తొలగించడం కోసం :

క్రమం తప్పకుండా ఈ ప్యాక్ను మీరు ఉపయోగించినట్లయితే ఇది ముఖంపై ఉన్న మచ్చలను తగ్గిస్తుంది.

కావలసిన పదార్థాలు :

నారింజ రసం

నిమ్మ రసం : 1 టీస్పూన్

తేనె : 2 టేబుల్ స్పూన్లు

ఆలివ్ నూనె : 1 టీస్పూన్

ఎలా ఉపయోగించాలి:

ఈ పేస్ట్ను చేయడానికి పైన పేర్కొన్న అన్ని పదార్థాలను బాగా కలపండి. అలా తయారైన మిశ్రమాన్ని మీ ముఖానికి మరియు మెడకు అప్లై చేయండి. అప్లై చేసిన 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మీ శరీర భాగాలను పొడిగా ఉంచేలా శుభ్రపరచుకోండి. మీ జిడ్డైన చర్మాన్ని కలిగి ఉంటే ఆలివ్ నూనెను వాడటాన్ని నివారించాలని సూచించబడింది.

English summary

Does Orange Help In Getting A Glowing Skin? Find Out

Oranges are packed with antioxidants and these contain some important minerals and other vitamins. Oranges can be used in the form of masks and packs to gain a young and beautiful skin. It can be used with ingredients like honey, yogurt, etc., to treat several skin-related issues. DIY Orange Face Masks
Story first published: Thursday, April 12, 2018, 13:34 [IST]
Desktop Bottom Promotion