For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జిడ్డైన చర్మం కోసం ఆచరించవలసిన ప్రభావవంతమైన ఇంటి చిట్కాలు !

|

మీ చర్మంలో ఉత్తేజకరమైన సేబాషియస్ గ్రంధులు ఉండటం వల్ల, చర్మం నుండి సహజమైన ఆయిల్ (లేదా) క్రొవ్వు పదార్ధంతో మిళితమైన శ్లేష్మము అనేది అధికంగా ఉత్పత్తి అవడానికి దారి తీయవచ్చు. ఈ కారణం చేత, మీ చర్మము కళావిహీనంగా మరియు కాంతిని కోల్పోయిన వివిధ రకాల పరిస్థితులకు దారితీస్తుంది.

ఈ రకమైన చర్మము, ఎక్కువగా పగిలిపోవడానికి మరియు దెబ్బతినడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ఈ రకమైన చర్మం కలవారు - చర్మ రంధ్రాల నుండి బయటకు విసర్జించబడే మలినాలను మరియు వ్యర్ధాలను నివారించవలసిన అవసరం ముఖ్యంగా ఉంది. లేకుంటే, అవన్నీ చర్మ రంధ్రాలను అడ్డుకుని, చర్మం పగుళ్ళకు దారితీస్తుంది.

ఈరోజు, మీ చర్మం నుండి జిడ్డును పోగొట్టడం కోసం ఆచరించవలసిన ప్రభావవంతమైన ఇంటి చిట్కాల జాబితాను సిద్ధం చేసి - బోల్డ్ స్కై మీ ముందుకు తీసుకువచ్చింది !

Easy And Effective All-natural Facial Scrub Recipes For Oily Skin

మీ చర్మాన్ని శుభ్రం చేసే స్ర్కబ్స్ అనేవి బ్రౌన్ షుగర్, నిమ్మరసం వంటి ఇతర సహజసిద్ధమైన పదార్ధాలతో స్ర్కబ్స్ ని తయారు చెయ్యడం వల్ల, మీ చర్మానికి స్నేహపూర్వకమైనదిగా ఉంటుంది. ఈ పదార్ధాలు మీ చర్మంపై అధికంగా ఉత్పత్తి కాబడుతున్న సహజమైన ఆయిల్ (లేదా) క్రొవ్వు పదార్ధంతో మిళితమైన శ్లేష్మమును తొలగించి, మీ చర్మ రంధ్రాలను శుభ్రపర్చగల లక్షణాలతో పూర్తిగా నింపబడి ఉన్నాయి.

కాబట్టి, మీరు ఈ స్క్రబ్స్ గురించి మరింత విలువైన సమాచారాన్ని చదివి తెలుసుకోండి.

1 వ రకం - స్క్రబ్ : బ్రౌన్ షుగర్ మరియు నిమ్మరసం

1 వ రకం - స్క్రబ్ : బ్రౌన్ షుగర్ మరియు నిమ్మరసం

కావలసిన పదార్థాలు :

బ్రౌన్ షుగర్ - 1 టీస్పూను

నిమ్మరసం - 2 టీస్పూన్లు

ఎలా ఉపయోగించాలి:

- ఒక గిన్నెలో పైన పేర్కొన్న పదార్ధాలను ఉంచి, బాగా కలపాలి.

- మీ ముఖానికి ఈ మిశ్రమాన్ని రాసి, కొద్ది నిమిషాలు శాంతముగా స్క్రబ్తో శుభ్రం చేయండి.

- ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడగండి.

ప్రయోజనాలు:

ఈ మిశ్రమము, మీ చర్మం నుండి అధికంగా ఉత్పత్తి కాబడుతున్న శ్లేష్మమును మరియు కఠినంగా ఉన్న ముఖ ఛాయను తీసివేస్తుంది.

2 వ రకం - స్క్రబ్ : శెనగపిండి మరియు గుడ్డులోని తెల్లనిసొన

2 వ రకం - స్క్రబ్ : శెనగపిండి మరియు గుడ్డులోని తెల్లనిసొన

కావలసిన పదార్థాలు :

1 గుడ్డులోని తెల్లనిసొన

1 టీస్పూను శెనగపిండి

ఎలా ఉపయోగించాలి:

- పైన పేర్కొన్న పదార్థాలను ఒకే మిశ్రమంగా కలిపి ఉంచండి.

- మంచి ఫలితాల కోసం మీ ముఖం మీద ఈ మిశ్రమాన్ని ఒక పూతగా పూయండి.

- ఇది బాగా ఆరిపోయిన తర్వాత, మీ చర్మాన్ని గోరు వెచ్చని నీటితో కడుగుతూ స్క్రబ్తో శుభ్రం చేయాలి.

- ముఖము పొడిగా మారిన తర్వాత, తక్కువ మోతాదులో స్కిన్ టోనర్ను అప్లై చేయండి.

ప్రయోజనాలు:

మీ చర్మంలో ఉత్తేజకరమైన సేబాషియస్ గ్రంధుల నుండి సహజంగా ఉత్పత్తి కాబడిన ఆయిల్ను, చాలా అద్భుతంగా తొలగిస్తుంది.

3 వ రకం - స్క్రబ్: పాలపొడి మరియు టమోటాలు

3 వ రకం - స్క్రబ్: పాలపొడి మరియు టమోటాలు

కావలసిన పదార్థాలు :

2 టీస్పూన్ల - టమోటా గుజ్జు

½ టీస్పూన్ - పాలపొడి

ఎలా ఉపయోగించాలి:

- పైన చెప్పిన పదార్థాలను పేస్ట్లా మారే వరకూ బాగా కలపండి.

- ఈ పేస్టును మీ ముఖ చర్మం మీద రాసిన 10-15 నిమిషాలకి పొడిగా మారుతుంది.

- ఆ తర్వాత, మీ చర్మాన్ని గోరు వెచ్చని నీటితో కడుగుతూ స్క్రబ్తో శుభ్రపరచాలి.

ప్రయోజనాలు:

పాలపొడితో కలిపిన టొమాటో గుజ్జును మీ ముఖం మీద అప్లై చేయడం వలన, చర్మం నుండి బయటకు వచ్చే కొవ్వుతో కూడిన శ్లేష్మము నుండి ఉపశమనాన్ని కలుగజేస్తూ మీ చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా తయారుచేస్తుంది.

4 వ రకం - స్క్రబ్ : బియ్యం పిండి మరియు దోసకాయ రసం

4 వ రకం - స్క్రబ్ : బియ్యం పిండి మరియు దోసకాయ రసం

కావలసిన పదార్థాలు :

2 టీస్పూన్ల - దోసకాయ జ్యూస్

½ టీ స్పూను - బియ్యం పిండి

ఎలా ఉపయోగించాలి:

- ఒక గిన్నెలో ఆ 2 పదార్థాలను తీసుకొని, స్పూన్ సహాయంతో బాగా కలపాలి.

- మీ తడి ముఖం మీద మంచి ఫలితాలను పొందడానికి ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి.

- మీ ముఖాన్ని స్క్రబ్బింగ్ చేసే ముందు, కొన్ని నిమిషాల పాటు అలానే వదిలేయండి.

- ఆ తర్వాత, మీ చర్మాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

- ఉత్తమ ఫలితాల కోసం మాయిశ్చరైజర్ను తక్కువ పరిమాణంలో ఉపయోగించండి.

ప్రయోజనాలు:

మన ఇంట్లో తయారు కాబడిన ఈ స్క్రబ్ చర్మం నుండి ఉత్పత్తి అయ్యే శ్లేష్మమును సంగ్రహించడమే కాకుండా, చర్మము యొక్క నిగారింపు రంగును పొందేలా కూడా చేస్తుంది.

5 వ రకం - స్క్రబ్ : ఓట్మీల్, లావెండర్ ఆయిల్, మరియు నిమ్మరసం

5 వ రకం - స్క్రబ్ : ఓట్మీల్, లావెండర్ ఆయిల్, మరియు నిమ్మరసం

కావల్సిన పదార్థాలు :

1 టీస్పూన్ - వండిన ఓట్మీల్

2 టీస్పూన్ల - నిమ్మరసం

3-4 చుక్కల లావెండర్ ఆయిల్

ఎలా ఉపయోగించాలి:

- ఈ మిశ్రమాలన్ని కలిపి ఒకే ఆకృతికి వచ్చేలా అన్ని పదార్ధాలను బాగా కలపండి.

- మీ ముఖమంతటకీ ఈ పదార్థాన్ని రాసి, కొన్ని నిమిషాలు పాటు మెల్లగా మసాజ్ చెయ్యాలి.

- ఒక్క 5 నిమిషాల తరువాత, మీ ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయండి.

- స్కిన్ టోనర్ను ఉపయోగిస్తూ ఉండాలి.

ప్రయోజనాలు:

ఈ ప్రత్యేకమైన ఫేషియల్ స్క్రబ్తో మీ ముఖంలో దాగున్న మలినాలను మరియు చెడు వ్యర్థాలను తొలగించి, చర్మం నుండి అదనంగా ఉత్పత్తి అయ్యే శ్లేష్మమును నివారిస్తుంది.

English summary

Easy And Effective All-natural Facial Scrub Recipes For Oily Skin

Easy And Effective All-natural Facial Scrub Recipes For Oily Skin,It is important to exfoliate your skin on a regular basis as this will help to prevent buildup of dirt and impurities on the skin. Using natural facial scrubs such as brown sugar, lemon juice etc can help to restore the glow on your skin .
Story first published:Tuesday, February 13, 2018, 13:29 [IST]
Desktop Bottom Promotion