For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేషియల్ మసాజ్ కోసం బ్యూటీపార్లర్ అవసరం లేదు.. ఇంట్లోనే ఇలా ట్రై చేయండి...

అద్భుతమైన ఫేషియల్ మసాజ్ కోసం మీ ఇంట్లోనే మీరు పాటించవలసిన మార్గాలు !

|

ప్రతి మహిళ ఫేషియల్ మసాజ్ను పొందటమనేది అవసరమని భావిస్తుంది. ఎందుకంటే ఇది మీలో వున్న ఒత్తిడిని తగ్గించే ఆహ్లాదపరిచే ఒక అద్భుతమైన అనుభవం. స్కిన్ ఎక్స్పోర్ట్స్ & బ్యూటీషియన్స్ చెప్పినదాని ప్రకారం, మీ ముఖాని కనీసం నెలలో ఒకసారి ఫేషియల్ మసాజ్ను చేయడం వల్ల మీ ముఖచర్మం పై అద్భుతాలు జరుగుతాయని.

చనిపోయిన చర్మకణాలు మీ ముఖాన్ని కప్పివుంచే సమయంలో మీ చర్మపు అంతర్గత సౌందర్యాన్ని కోల్పోయేటట్లుగా చేస్తుంది. మీరు రెగ్యులర్గా ఫేషియల్ మసాజ్ చేయటంవల్ల, మీ ముఖంపై చనిపోయిన చర్మకణాలను మొత్తంగా సేకరించడంతో పాటు అదనంగా చర్మంపై అదనంగా ఉత్పత్తి అయ్యే ఆయిల్ను & ముఖంపై పేరుకుపోయిన ధూళిని పూర్తిగా వదిలించుకోవచ్చు.

Follow These Simple Steps To Give Yourself A Facial Massage At Home

కాంతివంతమైన, ఆకర్షణీయమైన మరియు పరిశుభ్రమైన ముఖచర్మాన్ని పొందడం కోసం చాలామంది మహిళలు మసాజ్ సెంటర్ను (లేదా) సెలూన్కు వెళ్తుంటారు. కానీ మీరు సందర్శించే స్పా సెంటర్ వంటివి చాలా తరచుగా ఎక్కువ ఖర్చుతో కూడుకొని ఉంటాయి. అంతేకాకుండా, సెలూన్లు & మసాజ్ సెంటర్లలో లభించే అందం చాలా ఖరీదుతో కూడుకున్నవి. అయినప్పటికీ, మీరు ఇంట్లోనే ఫేషియల్ మసాజ్ను ఎలా చేయాలో అనే ప్రాథమిక అంశాలను నేర్చుకోవడం వల్ల వేలాది రూపాయలను ఖర్చు చేయనవసరం లేదు.

ఈ క్రింద తెలియజేసిన ఫేషియల్ మసాజ్ చిట్కాల గురించి మరింతగా తెలుసుకోవటం వల్ల మీరు చాలా తక్కువ ఖర్చులో మంచి ముఖ-సౌందర్యాన్ని పొందగలరు !

ఫేషియల్ మసాజ్ కోసం అవసరమైన విషయాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం !

మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్య విషయాలు :-ఫేషియల్ మసాజ్ కోసం అవసరమైన విషయాలు ఏమిటో

మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్య విషయాలు :-ఫేషియల్ మసాజ్ కోసం అవసరమైన విషయాలు ఏమిటో

• చల్లని నీరు

• స్కిన్ మాయిశ్చరైజర్

• ఐ క్రీమ్

• పేస్ స్క్రబ్

• టోనర్

• కాటన్

• స్పాంజ్

• ఒక గిన్నె

• మసాజ్ క్రీమ్

• మేకప్ రిమూవర్

• ఫేస్ ప్యాక్

అద్భుతమైన ఫేషియల్ మసాజ్ కోసం మీ ఇంట్లోనే

అద్భుతమైన ఫేషియల్ మసాజ్ కోసం మీ ఇంట్లోనే

• చల్లని నీరు

• స్కిన్ మాయిశ్చరైజర్

• ఐ క్రీమ్

• పేస్ స్క్రబ్

• టోనర్

• కాటన్

• స్పాంజ్

• ఒక గిన్నె

• మసాజ్ క్రీమ్

• మేకప్ రిమూవర్

• ఫేస్ ప్యాక్

మసాజ్ చేసే విధానం :-

మసాజ్ చేసే విధానం :-

పైన చెప్పిన అంశాలను మీరు పూర్తి చేసిన తర్వాత, మీ ముఖము మసాజ్ కోసం సిద్ధంగా ఉంది.

• మీరు స్క్రబ్బింగ్ను ఉపయోగించిన తర్వాత, మసాజ్ క్రీమ్తో మీ ముఖాన్ని మసాజ్ చేయాలి. మీ అరచేతిలో మసాజ్ క్రీమ్ను కొద్ది మొత్తంలో తీసుకుని రెండు చేతులతో బాగా రుద్దుతూ ఉండటం వల్ల ఆ క్రీమ్ కాస్త వెచ్చగా మారుతుంది, దీని వల్ల మీ మర్దన ప్రక్రియ సులభతరం అవుతుంది.

. మీ గడ్డం ప్రాంతంలో మర్దన చేయటం మొదలుపెట్టేటప్పుడు నెమ్మదిగా కింద నుంచి పైకి చేయాలి. ఒకసారి ఈ క్రీమ్ మొత్తాన్ని మీ ముఖానికి వర్తించడం ద్వారా, అసలు మర్దన అనేది ప్రారంభమవుతుంది. మీ రెండు చేతులను ఉపయోగించి మీ ముఖాన్ని కిందనుంచి పైకి మసాజ్ చేస్తూ ఉండాలి. దీనిని మీ గొంతు ప్రాంతం నుంచి ప్రారంభించాలని సిఫారసు చేయబడింది.

• పై విధంగా మసాజ్ చేస్తున్న సమయంలో, పై పెదవి మధ్యభాగంలో చేరుకుని అక్కడ నుంచి మసాజ్ను ప్రారంభించండి.

• ఆ తర్వాత, ముక్కు ప్రాంతంలో మీ వేళ్లను ఉంచి - బుగ్గలు, ఆ తర్వాత చెవుల వరకు మర్దనను కొనసాగించండి.

• ఆ తర్వాత మీ కళ్ళను మసాజ్ చేయండి. కంటి చుట్టూ మీ వేళ్లను ఉంచి, కంటి చుట్టూ పై దిశలో మసాజ్ చేస్తూ ఉండాలి.

• మీ బొటనవేలును ఉపయోగించే రెండు కనురెప్పలను మూసివేసి కాసేపు మీరు విశ్రాంతి తీసుకోవాలి.

• అలా ఇప్పుడు, చర్మానికి అప్లై చేయబడిన మసాజ్ క్రీమ్ మీ చర్మంలోకి పూర్తిగా శోషించబడుతుంది. ఇప్పుడు ఒక స్పాంజితో మీ ముఖంపై అధికంగా ఉన్న క్రీమ్ను తొలగించాలి.

చివరి దశలో :-

చివరి దశలో :-

• మీ చర్మానికి అనుగుణమైన ఫేస్ ప్యాక్ను మీరు వాడవచ్చు. అలాంటి ప్యాక్ను అప్లై చేసిన తర్వాత, ఆ ప్యాక్ బాగా ఆరేలా 20 నిముషాల వరకూ వేచి ఉండాలి. మీ ముఖంపై ఈ పేస్ ప్యాక్ను సమాంతరంగా అప్లై చేయడానికి అప్లికేటర్ బ్రష్ను ఉపయోగించవచ్చు.

• ఆ తర్వాత, మీ ముఖంపై టోనర్ను అప్లై చేయడానికి దూది పింజను ఉపయోగించండి.

• ఐ-క్రీమును మీ చేతివేళ్ళ పై తీసుకుని కంటి ప్రాంతం చుట్టూ సమానంగా అప్లై చేస్తూ, బాగా మసాజ్ చేయాలి.

• చిట్టచివరిగా, మాయిశ్చరైజర్ను కొంత మొత్తంలో తీసుకుని మీ బుగ్గలు, నుదురు, గడ్డం వంటి ప్రాంతాలలో మెల్లగా అప్లై చేయండి.

మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్య విషయాలు :-

మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్య విషయాలు :-

• ఈ మసాజ్ ప్రక్రియను మొదలుపెట్టే ముందు, మీ చేతులు సానిటైజర్తో బాగా శుభ్రపరచుకునేలా నిర్ధారించుకోండి.

• మీ చర్మానికి అనుకూలమైన ప్రొడక్ట్స్ను మాత్రమే ఉపయోగించండి.

• మీ ముఖానికి మసాజ్ చేసే రోజు, మీ ముఖాన్ని శుభ్రపరిచే ప్రొడక్ట్స్ను ఉపయోగించవద్దు. మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి కాస్త చల్లని నీరును ఉపయోగించండి.

కాబట్టి, మీ ముఖానికి ఫేషియల్ మసాజ్ను చేయాలనుకునేటప్పుడు, ఒక ప్రత్యేకమైన సందర్భం కోసం వేచి చూడవద్దు. అంతేకాకుండా ఈ ఫేషియల్ మసాజ్ ను సొంతంగా మీ ఇంట్లోనే మీకు మీరుగా స్వతహాగా చేసుకోవచ్చు.

English summary

Follow These Simple Steps To Give Yourself A Facial Massage At Home

Every woman quite often feels the need to get a facial massage done. It is a relaxing and pleasant experience that relieves one of all the stress. Going by what the skin experts and beauticians say, facial massage at least once a month can do wonders to your facial skin.
Desktop Bottom Promotion