For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ అరటిపండు ఆధారిత ఫేస్ ప్యాక్స్ తో గ్లోయింగ్ స్కిన్ ను సొంతం చేసుకోండి

చర్మాన్ని అందంగా అలాగే కాంతివంతంగా మార్చేందుకు అరటిపండు ఎంతగానో తోడ్పడుతుంది. ఇందులో లభించే విటమిన్ ఏ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేందుకు సహకరిస్తుంది. కొలాజెన్ ఉత్పత్తిని పెంపొందించి చర్మాన్ని బిగుతుగ

|

అరటిపండుని తీసుకోవడం అందరికీ ఇష్టమే. స్నాక్స్ గా ఈ పండుని తినడం చాలామందికి అలవాటు. ఇందులో ఎన్నో పోషకవిలువలు ఉన్నాయి. శరీరానికి అవసరమైన మినరల్స్ తో పాటు విటమిన్స్ ఇందులో లభ్యమవుతాయి. ఇవన్నీ, శరీరంలోని ఇమ్యూనిటీని పెంపొందించడానికి తోడ్పడతాయి. అరటిపండు డైజేషన్ ని మెరుగుపరిచేందుకు తోడ్పడుతుంది. అదే విధంగా, చర్మసౌందర్యాన్ని సంరక్షించేందుకు కూడా అరటిపండు ముఖ్య పాత్ర పోషిస్తుంది. చర్మసౌందర్యాన్ని పరిరక్షించుకోవడంలో అరటిపండు పాత్ర కీలకం.

చర్మాన్ని అందంగా అలాగే కాంతివంతంగా మార్చేందుకు అరటిపండు ఎంతగానో తోడ్పడుతుంది. ఇందులో లభించే విటమిన్ ఏ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేందుకు సహకరిస్తుంది. కొలాజెన్ ఉత్పత్తిని పెంపొందించి చర్మాన్ని బిగుతుగా ఉంచేందుకు చర్మం ఎలాస్టిసిటీను రిటెయిన్ చేసేందుకు తోడ్పడుతుంది. అరటిలో లభించే విటమిన్ ఈ చర్మ సంరక్షణకారిణిగా వ్యవహరిస్తుంది. ఫ్రీ రాడికల్ డేమేజ్ ను అరికట్టి, చర్మాన్ని హానికరమైన సూర్యకాంతి నుంచి రక్షిస్తుంది. తద్వారా, ముడతలను నివారిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా మారుస్తుంది.

banana beauty benefits in telugu

వివిధ చర్మ సమస్యల నుంచి రక్షణ పొందేందుకు ప్రభావవంతమైన బనానా ఫేస్ ప్యాక్స్ ను మనం తయారుచేసుకుందాం. వీటిని వాడటం ద్వారా, ముడతలు, మొటిమల వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు.

ఇప్పుడు చర్మ సంరక్షణకై అరటిపండులను వాడటమెలాగో తెలుసుకుందాం. తద్వారా, ఆరోగ్యకరమైన, అందమైన చర్మాన్ని సొంతం చేసుకుందాం.

చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే అరటిపండు

చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే అరటిపండు

అరటిపండులో లభించే విటమిన్స్ చర్మ కాంతిని పెంపొందిస్తాయి. చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి. చర్మాన్ని అలసటగా కనిపించకుండా అడ్డుకుంటాయి. తద్వారా, చర్మం ఎల్లప్పుడూ తాజాగా కనిపిస్తుంది. ఈ హోంరెమెడీతో ఇన్స్టెంట్ గా గ్లోయింగ్ స్కిన్ ను సొంతం చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు:

1 అరటిపండు

1 కప్పుడు నీళ్లు

ఎలా వాడాలి:

ఎలా వాడాలి:

అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా తరుగుకుని వాటిని మ్యాష్ చేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసుకుని పదినిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత, చల్లటి నీటితో ఈ ప్యాక్ ను తొలగించాలి. మొదటి యూజ్ కే మీరు గుర్తించదగిన మార్పును గమనిస్తారు.

చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేందుకు అరటిపండు ప్యాక్

చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేందుకు అరటిపండు ప్యాక్

ఈ నేచురల్ ఫేస్ మాస్క్ లో డార్క్ స్పాట్స్ ని మటుమాయం చేసే సామర్థ్యం కలదు. అలాగే బ్లేమిషెస్ ని తొలగించి డల్ స్కిన్ ని బ్రైట్ గా మార్చే గుణాలు కూడా ఈ ప్యాక్ లో కలవు. ఈ బ్రైటెనింగ్ మాస్క్ ని వారానికి ఒక సారి వాడితే మంచి ఫలితం పొందవచ్చు.

కావాల్సిన పదార్థాలు:

అరటిపండు

ఒక టీస్పూన్ తేనె

ఎలా వాడాలి:

ఎలా వాడాలి:

ఈ ప్యాక్ తయారీ కోసం బాగా పండిన అరటిపండును తీసుకోవాలి. అరటిపండుని చిన్న ముక్కలుగా చేసుకుని బ్లెండర్ సహాయంతో పేస్ట్ ను తయారుచేసుకోవాలి. ఒక టీస్పూన్ తేనెను ఈ పేస్ట్ లో కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిముషాల పాటు ఉంచాలి. ఆ తరువాత, గోరువెచ్చటి నీటితో శుభ్రపరచుకోవాలి.

మొటిమలను అరికట్టే అరటిపండు:

మొటిమలను అరికట్టే అరటిపండు:

మొటిమలు అలాగే యాక్నే సమస్యతో మీరు దిగులుపడుతున్నారా? ఈ అరటిపండు ప్యాక్ తో యాక్నే స్కార్స్ తో పాటు బ్లాక్ స్పాట్స్ తొలగిపోతాయి. ఈ ప్యాక్ ని వారానికి ఒకసారి వాడి మంచి ఫలితాన్ని పొందండి.

కావాల్సిన పదార్థాలు:

1 అరటిపండు

1 టీస్పూన్ తేనె

1 టీస్పూన్ నిమ్మరసం

ఎలా వాడాలి:

ఎలా వాడాలి:

ఒక అరటిపండును తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. ఆ తరువాత వాటిని మ్యాష్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ తేనెను అలాగే ఒక స్పూన్ నిమ్మరసాన్ని కలపాలి. వీటిని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి.

English summary

Get A Glowing Skin With These Banana Face Packs

All of us would love to consume banana or add this in our day-to-day food we eat. But do you know how a banana can help you in getting a beautiful skin if used externally? Banana can be used with several ingredients like egg, honey, lemon juice, etc., to make face packs for attaining a beautiful skin.
Story first published:Wednesday, March 28, 2018, 14:09 [IST]
Desktop Bottom Promotion