For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దానిమ్మతో మీ చర్మాన్ని నిగారించేలా చేయడం ఎలా ?

|

మనమంతా దానిమ్మపండును ఆహారంలో భాగంగా ప్రతిరోజూ తీసుకునేందుకు ఇష్టపడుతుంటాము. మన శరీరానికి అవసరమైన అన్ని ఖనిజాలను, విటమిన్లను ఈ దానిమ్మపండు కలిగి ఉంటుంది. దీని వల్ల మన శరీరంలో రోగనిరోధకశక్తి బాగా పెరుగుతుంది. దానిమ్మపండు మన జీర్ణక్రియను, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలోనూ బాగా ఉపయోగపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే దానిమ్మ వల్ల మనకు చాలా రకాల ప్రయోజనాలను కలుగజేస్తాయి.

కానీ ఈ దానిమ్మను మనం బాహ్య శరీరంపై ఉపయోగించినట్లయితే మన చర్మసౌందర్యాన్ని సంరక్షించడంలో ఎలా సహాయపడుతుందో మీకు తెలుసా ? దానిమ్మపండులో ఉన్న విటమిన్ A చర్మం కోసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా చర్మం యొక్క స్థితిస్థాపకతను నిలబెట్టుకోవడంలో సహాయపడుతుంది. దానిమ్మపండులో ఉన్న విటమిన్ E "ప్రొటెక్టర్" గా పనిచేస్తుంది. ఇది శరీరంలో సంచరించే స్వేచ్ఛా రాడికల్తో పోరాడుతుంది, నేరుగా సూర్య-కిరణాలు చర్మంపై పడకుండా కాపాడుతుంది, చర్మంపై ఉన్న ముడతలను తగ్గించి, నిరోధిస్తుంది.

దానిమ్మపండు - విటమిన్లు A, C & E వంటి వాటికి మంచి మూల వనరుగా ఉంది, అందువల్ల మీ చర్మాన్ని ప్రకాశవంతంగా & ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన మల్టీవిటమిన్లను దానిమ్మలో ఉంటాయి కావున మీ శరీరానికి చికిత్స చేయడంలో, తక్కువ మోతాదులో వినియోగించే దానిమ్మ సరిపోతుంది.

వివిధ చర్మ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడే దానిమ్మతో సమర్థవంతమైన ఫేస్ ప్యాక్లను తయారుచేయవచ్చు. ఈ ఫేస్ ప్యాక్లు ముడుతలు గల చర్మంపై పోరాడటంతో పాటు మొటిమలను తీసివేసి, మీ చర్మాన్ని కాంతివంతంగా చేయడంతో పాటు ఇంకా మరెన్నో చేయవచ్చు.

1. చర్మాన్ని ప్రకాశించేలా చేయడం కోసం :

1. చర్మాన్ని ప్రకాశించేలా చేయడం కోసం :

చర్మాన్ని మెరుగుపరచి, ప్రకాశించేలా చేయడానికి దానిమ్మలో ఉండే విటమిన్లు సహాయపడతాయి. ఇది మీ చర్మానికి గల ఒత్తిడిని తగ్గించి, నిస్తేజంగా ఉండకుండా చేయడంలో సహాయపడుతుంది, అందువలన మీ చర్మం తాజాగా ఉంటుంది. మీరు ఈ ఇంటి చిట్కాలతో తక్షణమే మెరిసే చర్మాన్ని పొందవచ్చు.

కావలసినవి:

1 దానిమ్మపండు

1 కప్పు నీరు

ఎలా ఉపయోగించాలి :

దానిమ్మపండులో ఉండే గింజలను బాగా గ్రైండ్ చేసి మెత్తని పేస్టు తయారు చేయాలి. ఈ పేస్టును మీ ముఖం మీద ఉంచి 15 నిముషాల పాటు బాగా ఆరేలా వదిలివేయండి. ఆ తర్వాత, చల్లటి నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీని మొదటి ఉపయోగంలోనే మీరు తేడాను గమనించవచ్చు.

2. స్కిన్ బ్రైట్నింగ్ కోసం :

2. స్కిన్ బ్రైట్నింగ్ కోసం :

ఈ సహజమైన ఫేస్ మాస్క్ మీ ముఖం మీద ఉన్న డార్క్ స్పాట్స్ను తొలగించి, నిస్తేజంగా ఉన్న చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. మెరుగైన ఫలితాలను పొందడానికి ఈ ఫేస్ మాస్క్ను వారంలో ఒక్కసారైనా ఉపయోగించి చూడండి.

కావలసినవి:

1 దానిమ్మపండు

3 టేబుల్ స్పూన్ల పెరుగు

ఎలా ఉపయోగించాలి:

దీని కోసం, మీకు పండిన దానిమ్మపండు అవసరం. దానిమ్మపండులో ఉన్న గింజలను గ్రైండర్లో వేసి, మెత్తని పేస్టులాగా తయారుచేయండి. ఈ పేస్ట్లో 3 టీస్పూన్లు పెరుగును వేసి బాగా కలపాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని మీ ముఖంపై మందంగా ఉన్న ఫేస్ ప్యాక్లా అప్లై చేసి, 15 నిమిషాల వరకూ వేచి ఉండండి. ఆ తర్వాత, గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

3. మొటిమలను నివారించడం కోసం :

3. మొటిమలను నివారించడం కోసం :

మీరు పింపుల్స్ & మోటిమలు గురించి ఎక్కువగా బాధపడుతున్నారా? ఈ దానిమ్మ ఫేస్ ప్యాక్ మీ చర్మంపై ఉన్న మొటిమలను, నల్ల మచ్చలను తగ్గిస్తాయి. మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ ప్యాక్ని వారానికి రెండుసార్లు ఉపయోగించండి.

కావలసినవి:

1 దానిమ్మపండు

1 టీస్పూన్ తేనె

1 టీస్పూన్ నిమ్మరసం

ఎలా ఉపయోగించాలి:

ఒక కప్పు దానిమ్మ గింజలను మెత్తని పేస్ట్లా చేసుకుని దానికి, 1 చెంచా తేనెను & నిమ్మరసాన్ని కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని సమస్యాత్మకమైన ప్రాంతాల్లో అప్లై చేయాలి. అప్లై చేసిన 20 నిమిషాల వరకు బాగా ఆడేలా ఉంచి ఆ తరువాత చల్లని నీటితో శుభ్రం చేయవచ్చు.

4. డ్రై స్కిన్ చికిత్స కోసం :

4. డ్రై స్కిన్ చికిత్స కోసం :

మీ చర్మం సహజమైన తేమను కలిగి ఉండేందుకు, దానిమ్మలో ఉండే హైడ్రేటింగ్ ఎజెంట్ బాగా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా దానిమ్మను ఉపయోగించినప్పుడు ఇది మీ చర్మాన్ని మరింత మృదువుగా, తేమగా & ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది.

కావలసినవి:

½ దానిమ్మపండు

1 చెంచా వోట్మీల్

1 చెంచా తేనె

1 చెంచా గుడ్డు పచ్చసొన

ఎలా ఉపయోగించాలి:

తాజాగా సేకరించిన దానిమ్మ రసానికి, ఓట్మీల్ పౌడర్ను కలిపి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత 1 చెంచా తేనెను & గుడ్డు పచ్చసొనను కూడా జత చేసి బాగా కలపాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15నిముషాల పాటు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుని, మీ చర్మాన్ని పొడిగా మార్చాలి. మెరుగైన ఫలితాల కోసం ఈ ప్యాక్ను వారంలో రెండు సార్లు చెప్పున వాడండి.

English summary

Get A Glowing Skin With These Pomegranate Face Packs

All of us would love to consume pomegranate or add these in our day-to-day food that we eat. But do you know how a pomegranate can help you in getting a beautiful skin if used externally? Pomegranate can be used with several ingredients like egg, honey, lemon juice, etc., to make face packs for attaining beautiful skin.