For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ చర్మ సమస్యల పరిష్కారానికి తేనె మరియు నిమ్మరసం

తేనె మీ చర్మాన్ని సంరక్షించి మీ అందాన్ని పరిపరి విధములుగా ఇనుమడింపచేస్తుంది. ప్రతిరోజూ ముఖానికి తేనె రాసుకోవడం వలన పలు ప్రయోజనాలు ఉన్నాయి. ముఖానికి తేనెతో మాస్క్ వేసుకుంటే మొటిమలు నల్ల మచ్చలు తగ్గుతాయ

|

మనం అందరం రకరకాల చర్మ సంబంధ సమస్యలను ఎదుర్కుంటాము. కొన్నిసార్లు ఈ చర్మసమస్యలు ఇతర సమస్యలకు దారితీస్తాయి. ఇక చర్మ సంరక్షణ విషయానికి వస్తే సాధారణంగా నల్ల మచ్చలు, మొటిమలు,చర్మం పొడిబారటం వంటి సమస్యలు చాలామందిలో చూస్తుంటాం.

తేనె మీ చర్మాన్ని సంరక్షించి మీ అందాన్ని పరిపరి విధములుగా ఇనుమడింపచేస్తుంది. ప్రతిరోజూ ముఖానికి తేనె రాసుకోవడం వలన పలు ప్రయోజనాలు ఉన్నాయి. ముఖానికి తేనెతో మాస్క్ వేసుకుంటే మొటిమలు నల్ల మచ్చలు తగ్గుతాయి. అంతే కాకుండా తేనె చర్మాన్ని పొడిబారనివ్వదు.

benefits of lemon and honey for skin

నిమ్మరసం కూడా మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీని మంట, వాపు తగ్గించే లక్షణం చర్మంపై మృతకణాలు తొలగించి ఆరోగ్యంగా కనపడేటట్లు చేస్తుంది.

తేనె, నిమ్మరసంలను పలు చర్మ సమస్యల పరిష్కారానికి వినియోగించవచ్చు. ఇంట్లోనే కూర్చుని అందమైన మచ్చలేని చర్మాన్ని పొందటానికి వీటిని ఎలా వాడాలో, వాటి ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మాయిశ్చరైజర్:

1. మాయిశ్చరైజర్:

చర్మానికి మాయిశ్చరైజర్ అత్యవసరం. ఏ రకమైన చర్మతత్వం ఉన్నవారికైనా మాయిశ్చరైజర్ రాసుకోవడం వలన తేమ చేకూరి చర్మం మృదువుగా మారుతుంది.

తేనె, నిమ్మరసాలతో చర్మానికి మంచి మాయిశ్చరైజర్ తయారుచేయవచ్చు. ఆఫీ ఎలాగో తెలుసుకుందాం.

రెండు చెంచాల నిమ్మరసం మరియు ఒక చెంచాడు తేనె తీసుకుని బాగా కలపండి. దీనిని ప్రతిరోజు పడుకోవడానికి అరగంట ముందు ముఖానికి పట్టించి మర్దన చేసుకోండి.

అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి

2. మృతకణాలను నివారిస్తుంది:

2. మృతకణాలను నివారిస్తుంది:

చర్మంపై మృతకణాలు పేరుకుపోవడం అనేది చాలా మందిలో ఒక సమస్య. తేనె, నిమ్మరసంలను కలిపి రాసుకుంటే ఈ సమస్య నివారింపబడుతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

3. నల్లని మచ్చలు తొలగిస్తుంది:

3. నల్లని మచ్చలు తొలగిస్తుంది:

నల్లని మచ్చలను నివారించేందుకు తేనె, నిమ్మరసం ఉపయోగపడతాయి. ఇవి మచ్చలను తొలగించడమే కాక చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. వీటిని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం.

ఒక టేబుల్ స్పూన్ ఓట్ మీల్ పౌడర్ కు ఒక చెంచాడు తేనె, రెండు చెంచాల నిమ్మరసం కలపండి. బాగా కలిపి ముద్దగా చేయండి. దీనిని ముఖానికి, మెడకు మాస్క్ లాగా వేసుకోండి. అలా ఇరవై నిమిషాలు వదిలేసి తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

4. మొటిమలను నివారిస్తుంది:

4. మొటిమలను నివారిస్తుంది:

తేనె నిమ్మరసాల మిశ్రమం మొటిమలు మరియు వాటి మచ్చలను తొలగిస్తుంది.తేనె, నిమ్మరసం ను సమపాళ్లలో కలిపి అందులో దూది ఉండ ముంచి మొటిమలు ఉన్న ప్రాంతాల్లో రాసుకోవాలి

పది నిమిషాలు తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి.

5. చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది:

5. చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది:

తేనె, నిమ్మరసాలలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ లు ట్యాన్ ను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా తాయారు చేస్తాయి.వీటిలో ఉండే సహజంగానే చర్మాన్ని తెల్ల బరిచే గుణాలు చర్మాన్ని మెరిసేటట్టు చేస్తాయి.

కావలసిన పదార్థాలు:

ఒక టేబుల్ స్పూన్ శనగ పిండి

ఒక స్పూన్ తేనె

రెండు స్పూన్ల నిమ్మరసం

చిటికెడు పసుపు

తయారుచేసే పద్ధతి:

తయారుచేసే పద్ధతి:

అన్ని పదార్థాలను ఒక గిన్నెలో కలిపి ముఖానికి బాగా పట్టించండి. తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి.

6. పెదవులను కాంతివంతంగా తయారు చేస్తుంది:

6. పెదవులను కాంతివంతంగా తయారు చేస్తుంది:

నిమ్మకాయలో ఉండే సిట్రస్ ఎక్స్ట్రాక్ట్ ట్యాన్ ను తొలగించి పెదవులను కాంతివంతంగా చేస్తుంది. తేనె పెదవులకు పోషణనిచ్చి, మృదువుగా తయారు చేసి తేమగా ఉంచుతుంది. దీనికై కొన్ని చుక్కల తేనె , కొన్ని చుక్కల నిమ్మరసం తీసుకుని బాగా కలపండి. దీనిని పెదవులకు బాగా పూసుకోండి. గంట తరువాత తడి వస్త్రంతో తుడిచేయండి.

7. ముడుతలను తొలగిస్తుంది:

7. ముడుతలను తొలగిస్తుంది:

తేనె, నిమ్మరసాల ముడుతలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడతాయి. కేవలం తేనె మరియు నిమ్మరసాలను నుదిటిపై రాసుకోవచ్చు లేదా దానికి బియ్యపు పిండిని కూడా కలిపి వాడవచ్చు. బియ్యపు పిండిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ లు చర్మానికి తేమను చేకూరుస్తాయి.

ఒక చెంచాడు బియ్యపు పిండికి ఒక చెంచాడు తేనె మరియు రెండు చెంచాల నిమ్మరసం కలపండి. ఒక వేళ పేస్ట్ మరీ చిక్కగా అనిపిస్తే మరి కాస్త తేనె కలపండి. దీనిని నుదురు మరియు ఇతర ప్రదేశాల్లో మాస్క్ లాగా రాసుకోండి. దాని ఆరేవరకు వదిలేసి తరువాత కడిగేయండి. ఇలా వారానికి రెండుసార్లు చేయండి.

English summary

Get Beautiful And Flawless Skin With Honey And Lemon

We all face an umpteen number of skin-related issues. Sometimes, certain skin-related issues can also lead to several health problems. When coming to skin care, some of the most common issues faced are black spots, acne, dry skin, etc. Honey can protect your skin and enhance your beauty in several ways. Applying honey on your face every day can have great benefits. Using a honey mask can aid in treating acne and dark spots. It also treats other issues like dry skin.
Story first published:Tuesday, March 20, 2018, 11:00 [IST]
Desktop Bottom Promotion