For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ టూత్పేస్ట్ చిట్కాలతో అద్భుతంగా మీ మొటిమలను వదిలించుకోండి !

ఈ టూత్పేస్ట్ చిట్కాలతో అద్భుతంగా మీ మొటిమలను వదిలించుకోండి !

|

మొటిమలు నిజంగా అందర్నీ బాధపెడుతున్నాయి, అలాగే మోటిమలకు-గురయ్యే చర్మంతో వ్యవహరించడము ఒక ముగింపులేని నిరంతరమైన ప్రక్రియగా అనిపించవచ్చు. చర్మం ఉపరితలం మీద ఎక్కువగా దుమ్ము చేరుకోవడం & శ్లేష్మము అధికంగా ఉత్పత్తి అయ్యే కారణంగా మొటిమలు ఏర్పడతాయి.

మీ ముఖ చర్మము మరింతగా బ్రేక్అవుట్లకు కారణం అయ్యేందుకు సహాయపడే మొటిమలను వదిలించుకోవడానికి చాలావరకు ఇంటి చిట్కాలు పుష్కలంగా మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే, మీరు ఒక ముఖ్యమైన ఈవెంట్కు (లేదా) మరుసటి రోజు ఉదయం పెళ్లికి సిద్ధమైనప్పుడు మీ ముఖంపై తాజాగా ఏర్పడిన మొటిమలను గుర్తిస్తే మీరేం చేయగలరు ? అటువంటి సమయాల్లో ఇది సత్వరమైన పరిష్కారాలను కోసం అన్వేషిస్తాము !

Get Rid Of Pimples With These Awesome Toothpaste Hacks

చర్మ సంరక్షణ చిట్కాలు :

అనివార్యంగా ఏర్పడినా మొటిమలకు సత్వర పరిష్కారం మార్గంగా టూత్పేస్ట్ అనేది నిజంగా చాలా మంచి ఆప్షన్గా ఉంటుంది (దీనిని జాగ్రత్తగా, సరైన పద్ధతిలో ఉపయోగించినప్పుడు మాత్రమే). టూత్పేస్టు మొటిమలను ఏమి చెయ్యగలదో అని ఆశ్చర్యపోతున్నారా? దాని కోసం మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ఈ క్రింది తెలిపిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.

మొటిమలపైన టూత్పేస్టు ఎలా పనిచేస్తుంది?

మొటిమను పోరాడటానికి సత్వర-పరిష్కార మార్గంగా, కేవలం టూత్పేస్టుని మాత్రమే ఉపయోగించడం అనేది పూర్తిగా నిరాధారమైనది కాదు. టూత్పేస్టులో గల పెరాక్సైడ్, బేకింగ్ సోడా, ఆల్కహాల్ వంటి కొన్ని సాధారణ పదార్ధాలు ముఖంపై వున్నా మొటిమలను ఎండిపోయేలా చేయడానికి బాగా సహాయపడుతుంది. టూత్పేస్టులో ఉండే 'ట్రిక్లోసెన్' అనే పదార్ధం మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. కాబట్టి మీ బాత్రూమ్ కౌంటర్లో సైలెంట్గా కూర్చొని ఉన్న టూత్పేస్టులో, మనకో ప్రయోజనకారిగా వున్న కొన్ని రకాల పదార్థాలను కలిగి ఉంటుంది.

టూత్పేస్టు మాస్క్లా పనిచేస్తుంది & ఇది చర్మం నుంచి మలినాలను కూడా తొలగిస్తుంది. ఇది కొన్ని రకాల ప్రక్రియల్లో భాగంగా మీ చర్మాన్ని పొడిగా మార్చి, మొటిమల పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

మొటిమల నివారణ కోసం టూత్పేస్ట్ను ఉపయోగించినప్పుడు సూచించబడిన మార్గదర్శకాలు :-

మొటిమల నివారణ కోసం మీరు టూత్పేస్టును ఉపయోగించే ముందు కొన్ని విషయాల గురించి తప్పక తెలుసుకోవాలి. మనకు తెలిసిన దాని ప్రకారం, టూత్పేస్ట్ చర్మం కోసం కాదు; కానీ దంతాల సంరక్షణకోసం ఉపయోగించబడతున్నది. టెస్టులో ఉండే ఫ్లోరైడ్ & మెంథాల్ వంటి కొన్ని ఇతర పదార్థాలు మీ చర్మాన్ని చికాకుపరుస్తాయి (ప్రత్యేకించి మీరు సున్నితమైన చర్మంలమును కలిగి ఉంటే)!

కాబట్టి, మొటిమల సత్వర నివారణ కోసం ఉపయోగించే టూత్పేస్టును DIY (డు ఇట్ యువర్సెల్ఫ్) మొటిమలను తాత్కాలికంగా ఎండిపోయేలా చేయడానికి మాత్రమే ఉపయోగించుకోవచ్చు గాని శాశ్వత నివారణ కోసం కాదని మీరు ముందుగా తెలుసుకోవాలి. మీరు సున్నితమైన చర్మమును కలిగి ఉంటే, మీ చర్మంపై టూత్పేస్టు వినియోగాన్ని నివారించడం మంచిది.

• మోటిమల చికిత్స కోసం మీరు ఉపయోగించే టూత్పేస్టు కేవలం పేస్ట్ రూపంలో మాత్రమే ఉండాలి కాని జెల్ రూపంలో కాదు.

• రంగును కలిగి ఉండే పేస్టును వాడకండి, ఎందుకంటే ఇది మీ చర్మమును చికాకు పెట్టవచ్చు (లేదా) మండేలా చేయవచ్చు. వైట్ టూత్పేస్టులో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నందున కేవలం ఆ పేస్టుని మాత్రమే వాడండి.

• తెల్లబరిచే ఫలితాలను కలిగి ఉన్న టూత్పేస్టులను చర్మంపై ఉపయోగించడం మానుకోండి. అలాంటి వాటిలో మీ చర్మాన్ని మండేలా చేసే బ్లీచింగ్ ఏజెంట్లను కలిగి ఉంటాయి.

• సంకలితాలను కలుగచేయని సహజమైన సేంద్రీయ టూత్పేస్ట్ను ఉపయోగించండి, అంటే దానర్థం ఫ్లోరైడ్ను కలిగిలేని టూత్పేస్ట్ను అన్నమాట !

• బేకింగ్ సోడా, టీ-ట్రీ-ఆయిల్, ట్రిక్లోసన్ వంటి ఇతర పదార్ధాలను కలిగి ఉన్న టూత్పేస్ట్ను ఉపయోగించడం చాలా ఉత్తమం, ఎందుకంటే అవి మచ్చలను తొలగించడంలో సమర్థవంతంగా ఉంటాయి. కానీ, సున్నితమైన చర్మమును కలిగిన వ్యక్తులపై ట్రిక్లోసన్ బాగా పని చేయకపోవచ్చని తెలుసుకోండి.

• చర్మ ఉపరితలానికి దగ్గరగా ఉన్న కొన్ని రకాల మచ్చలను తొలగించడంలో మాత్రమే టూత్పేస్ట్ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది బ్లాక్-హెడ్స్ మీద పని చేయదు. ఒకవేళ మీరు చర్మంపై పెద్ద బ్రేక్అవుట్లను కలిగి ఉంటే టూత్పేస్ట్లను ఉపయోగించడానికి ప్రయత్నించకండి. అటువంటి సందర్భాలలో, మీరు చర్మవ్యాధి నిపుణుడిని కలవడం చాలా మంచిది.

మీ మొటిమల సమస్యను దూరం చేయడంకోసం టూత్పేస్ట్ ఎలా ఉపయోగించాలి?

మీ మొటిమల సమస్యను దూరం చేయడంకోసం టూత్పేస్ట్ ఎలా ఉపయోగించాలి?

మొటిమల నివారణకు టూత్ పేస్టును ఉపయోగించటానికి ముందు, మీ ముఖాన్ని ఒక సున్నితమైన క్లీన్సర్ & వెచ్చని నీటితో శుభ్రపరుచుకొని, మీ చర్మాన్ని పొడిగా మార్చాలి.

మొటిమలపై నేరుగా అప్లై చేయాలి :

మొటిమలపై నేరుగా అప్లై చేయాలి :

నేరుగా మొటిమలపై టూత్ పేస్టును తక్కువ మొత్తంలో అప్లై చేయండి. టూత్పేస్ట్ను వాడేటప్పుడు అది మొటిమల పై మాత్రమే ఉండేలా చూసుకోవాలి, దాని చుట్టుపక్కల చర్మంపై మాత్రము కాదు. టూత్పేస్ట్ సమర్థవంతంగా పని చేయడానికి రాత్రిపూట గానీ (లేదా) కనీసం 2 గంటల సమయాన్ని గాని కేటాయించాలి. ఆ తర్వాత తడిగా ఉన్న బట్టను ఉపయోగించి టూత్పేస్ట్ను తొలగించండి. లేదా, గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగి, మృదువైన టవల్తో మీ చర్మం పొడిగా ఉండేలా తేమను తొలగించండి.

టూత్ పేస్టు + బేకింగ్ సోడా :

టూత్ పేస్టు + బేకింగ్ సోడా :

1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను, అలాగే టూత్పేస్ట్ను తీసుకొని, ఆ రెండింటిని బాగా కలపాలి. మీ ముఖాన్ని శుభ్రపర్చిన తరువాత ఈ మిశ్రమాన్ని మొటిమలపై వాడండి. దీనిని రాత్రి పడుకునే ముందు అప్లై చేయాలి (లేదా) 30 నిముషాల పాటు బాగా ఆరేంత వరకూ ఉంచాలి. ఆ తర్వాత మీ ముఖాన్ని చల్లని నీటితో కడగాలి, అలా ఏర్పడిన పొడి చర్మాన్ని నివారించడానికి అలోవెరా జెల్ను (లేదా) మాయిశ్చరైజర్ను ఉపయోగించాలి.

బేకింగ్ సోడాలో ఉన్న యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మీ మొటిమల ఎర్రదనాన్ని & పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

టూత్ పేస్టు + ఉప్పు :

టూత్ పేస్టు + ఉప్పు :

ఒక గిన్నెలో 1 టీ స్పూన్ మోతాదులో ఉప్పును, అలాగే టూత్పేస్ట్ను తీసుకొని బాగా కలపండి. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో దీన్ని అప్లై చేయండి. ఇది ఒక మంచి స్క్రబ్గా పనిచేస్తుంది. అలా అప్లై చేసిన కొన్ని నిమిషాల వరకూ వేచి ఉండండి, ఆ తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. చివరిగా మీ చర్మాన్ని తేమగా ఉంచేందుకు అలోవెరా జెల్ను (లేదా) మాయిశ్చరైజర్ను వాడండి.

ఈ పద్ధతిలో మనము ఉప్పును వాడుతున్నాము. ఇది ఎక్స్ఫోలియేటర్ & యాంటీ బాక్టీరియ ఏజెంట్ ఉండటమే కాకుండా, ఇది చర్మపు pH స్థాయిని సమతుల్యంగా కొనసాగించడంలో కూడా సహాయపడుతుంది.

టూత్ పేస్టు + నిమ్మకాయ :

టూత్ పేస్టు + నిమ్మకాయ :

ముక్కలుగా చేసిన నిమ్మకాయను టూత్ పేస్టులో ముంచి, మీ ముఖముపై సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతంలో వాడండి. 30 నిముషాల పాటు దానిని అలానే వదిలేయండి. ఆ తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడగండి. పొడి చర్మాన్ని నివారించడం కోసం చివరిగా మాయిశ్చరైజర్ను వాడండి.

నిమ్మకాయ, ఒక గొప్ప రక్తస్రావ నివారిణిగా ఉన్నందున మొటిమలు ఎండిపోవటానికి బాగా సహాయపడుతుంది, అలాగే ఇది అన్ని రకాల చర్మాలకు బాగా పనిచేస్తుంది.

టూత్ పేస్టు + ఐస్ క్యూబ్స్ :

టూత్ పేస్టు + ఐస్ క్యూబ్స్ :

ఒక చిన్న టవల్లో కొన్ని మంచు గడ్డలను ఉంచి, మొటిమలపై టూత్పేస్ట్ను అప్లై చేసి, ఆ మొటిమలను మంచు గడ్డలతో బాగా పాముతూ ఉండండి. ఇలా 10-15 నిముషాల వరకు చేస్తూ ఉండండి. ఆ తర్వాత, మీ ముఖాన్ని చల్లటి నీటితో కడిగి, మాయిశ్చరైజర్ను అప్లై చేయండి.

మంచు గడ్డలు, మీకు చికాకును కలిగించే మొటిమల నుంచి ఉపశమనమును కలిగించేలా చేస్తుంది. ఇవి మొటిమలను ఎండిపోయేలా చేసి, మరింత చిన్నవిగా మార్చేస్తుంది.

మొటిమల పరిష్కారం కోసం టూత్పేస్ట్ను తరచుగా ఎన్నిసార్లు ఉపయోగించాలి?

మొటిమల పరిష్కారం కోసం టూత్పేస్ట్ను తరచుగా ఎన్నిసార్లు ఉపయోగించాలి?

ఒక రోజులో అనేకసార్లు టూత్ పేస్టును ఉపయోగించినప్పుడు మీ చర్మము చికాకు పడేలా చేయగలదు. అందువల్ల, మూడు రోజులకు ఒకసారి రోజుకు ఒకసారి టూత్పేస్టును ఉపయోగించడం ఒక మంచి మార్గం. మొటిమల పరిమాణంలో వచ్చే ఫలితాలను మీరు గమనించవచ్చు. దాని తరువాత, మొటిమలు వాటికవే స్వతహాగా నయం కాబడతాయి.

గమనిక: టూత్పేస్ట్ వినియోగమనేది - ఒక చర్మవ్యాధి నిపుణుడి చేత ఆమోదించబడిన మోటిమల చికిత్స కాదు. ఇది చాలా సంవత్సరాల నుంచి ఆచరించబడుతున్న ఇంటి నివారణ చికిత్సగా ఉంది. అలాగే, ఇది అన్ని అన్ని రకాల చర్మాలకు సమర్థవంతంగా పని చేయకపోవచ్చు. ఒకవేళ మీరు మీ చర్మంపై ఏదైనా చికాకును కలిగిన అనుభూతిని పొందినట్లయితే, దానిని ఉపయోగించడం తక్షణమే ఆపండి.

English summary

Get Rid Of Pimples With These Awesome Toothpaste Hacks

Pimples are indeed distressing and an acne-prone skin can seem to be a never-ending nightmare to deal with. Toothpaste can prove to be a 'good option', as quick-fix for a pimple, provided, it is used carefully and in the right manner. Combining toothpaste with baking soda, salt, or lemon could help you get rid of pimples permanently.
Desktop Bottom Promotion