For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అరటి రోజ్ వాటర్ తయారు చేసిన ఫేస్ ప్యాక్ తో వస్తుంది ఫెయిర్ నెస్

అరటి రోజ్ వాటర్ తయారు చేసిన ఫేస్ ప్యాక్ తో వస్తుంది ఫెయిర్ నెస్. మీరు మీ ఇంట్లోనే తయారు చేసుకోగల ఫేస్ ప్యాక్.

|

వాతావరణ ఉష్ణోగ్రతలో వచ్చే మార్పుల పట్ల మీరు సరైన జాగ్రత్తలను తీసుకోకపోతే, మన చర్మం దాని సహజమైన అందాన్ని కోల్పోతుంది. పెరుగుతున్న కాలుష్యం, ధూళి, దుమ్ము, వాతావరణ ఉష్ణోగ్రతలో వచ్చే హెచ్చుతగ్గులు, ఇంకా అనేక ఇతర కారణాలు మన చర్మాన్ని కఠినమైనదిగాను, నిర్జీవంగాను, పొడిగాను మారుస్తుంది కాబట్టి మనము మన చర్మం కోసం వారంలో ఒక్కసారైనా జాగ్రత్తలు తీసుకోవాలసిన అవసరం ఉంది.

కాబట్టి, మనం పోగొట్టుకున్న అందాన్ని తిరిగి మనం ఏవిధంగా పొందాలి ? ఇలాంటి సమయంలో మనము సరైన చికిత్స కోసం దగ్గరలో ఉన్న సెలోన్కు వెళ్తాం, కానీ మీరు మీ ఇంట్లోనే తయారు చేసుకోగల ఫేస్ ప్యాక్ల మాటేమిటి మరి ? మీరు మీ ఇంట్లోనే తయారుచేసుగల ఫేస్ ప్యాక్ లు చాలా సురక్షితమైనవి & సులభంగా తయారుచేసుకోవచ్చు కూడా.

banana face pack for oily skin

మీరు ఈ ఆర్టికల్ను చదివిన తర్వాత, అరటి + రోజ్ వాటర్తో చేసిన ఫేస్ ప్యాక్ను ట్రై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, సెలూన్కు వెళ్లడానికి బదులు మీరు ఈ ప్యాక్నే ఎక్కువగా ఉపయోగిస్తారు.

అరటి అనేది సంవత్సర మొత్తం కాలంలో దొరికే ఏకైక పండుగా ఉండటమే కాకుండా, ఇది మీ చర్మాన్ని సంరక్షించే ఒక "సూపర్ ఫుడ్" అని కూడా మనందరికీ బాగా తెలుసు. ఎందుకు దీనినే సూపర్ ఫుడ్గా పిలుస్తారు అని మీరు అడగవచ్చు ? ఎందుకంటే, అరటిలో ఉండే విటమిన్లు, పోషకాలు మీ చర్మానికి కావలసిన పోషణను అందించి మరింత సజీవంగా ఉంచుతుంది. అలాగే ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా కూడా ఉంచుతుంది. ఏ పండు గొప్పతనం ఏమిటంటే, ఇది అన్ని రకాల చర్మాలకు గొప్పగా ఉపయోగపడుతుంది.

ఫేస్ ప్యాక్ కోసం కావలసిన పదార్ధాలు :

1 అరటిపండు (మెత్తనిది)
1 టీ స్పూను దాల్చిన చెక్క పొడి
5 చుక్కల రోజ్ వాటర్

తయారీ విధానం :

• ఒక గిన్నెలోకి అరటి పండును తీసుకుని బాగా మెత్తగా చేసుకోవాలి.
• ఆ తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని, 5 చుక్కల రోజ్ వాటర్ను జతచేసి బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని ఎలా వాడాలి

ఇలా తయారుచేసుకున్న ఫేస్ ప్యాక్ ను మీ ముఖానికి సమాంతరంగా అప్లై చేతరంగా అప్లై చేప్లై చేసి, 10 నిమిషాల వరకు బాగా ఆరేలా ఉండనివ్వాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. మీరు ఇలా వారానికి ఒకసారి చేయటం వల్ల మీరు మరింత ప్రకాశవంతమైన చర్మాన్ని పొందగలరు.
(గమనిక : దాల్చిన చెక్క పొడికి బదులుగా మీరు తేనెను కూడా వాడవచ్చు)

అరటి, దాల్చిన చెక్క పొడి & రోజ్ వాటర్ తో చేసిన ఫేస్ ప్యాక్ వల్ల కలిగే లాభాలు

నిస్తేజంగా ఉన్న చర్మానికి సరైన చికిత్సను చేయటంలో దాల్చిన చెక్క పొడి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ & యాంటీ ఫంగల్ లక్షణాలు మొటిమలను, పింపుల్స్ను ఏర్పరిచే కారకాలతో
పోరాడటానికి సహాయం చేస్తాయి, అంతేకాకుండా చనిపోయిన చర్మ కణాలను తొలగించడం, చర్మంపై పుట్టే మంటను తగ్గించడం, చర్మంపై ఏర్పడే చారలను తగ్గించడం, పొడిచర్మాన్ని చికిత్స చేయడం & మీ చర్మానికి సహజసిద్ధమైన కాంతిని అందించడం వంటివి చేస్తాయి.
ఇప్పటివరకు ఈ ఫేస్ ప్యాక్ను ఎలా తయారు చేయాలో, ఎలా ఉపయోగించాలో చూసాం కానీ, ఇప్పుడు అరటి & రోజ్-వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.

1. స్కిన్ మాయిశ్చరైజర్

1. స్కిన్ మాయిశ్చరైజర్

అరటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది మీ చర్మాన్ని హైడ్రేట్గా ఉంచి, చాలాకాలం పాటు తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. కాబట్టి అరటి మీ ముఖాన్ని అందంగా మార్చి హెడ్లైట్గా, తేమగా ఉండేలా చేస్తుంది.

2. శరీరంపై అధికంగా ఉత్పత్తి అయ్యే ఆయిల్స్ను నియంత్రిస్తుంది

2. శరీరంపై అధికంగా ఉత్పత్తి అయ్యే ఆయిల్స్ను నియంత్రిస్తుంది

అరటిలో ఉండే విటమిన్-సి ఒక అద్భుతమైన ఎక్స్పోలియేటర్గా పనిచేస్తుంది. ఇది మీ చర్మం ఉపరితలం పై చనిపోయిన చర్మకణాలను, అదనపు కొవ్వును, శ్లేష్మమును తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉన్న పొటాషియం, విటమిన్లు మీ చర్మాన్ని కాంతివంతంగా ఉంచేటట్లుగా చేయడంలో మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.

3. వృద్ధాప్యమును దూరంగా ఉంచుతుంది

3. వృద్ధాప్యమును దూరంగా ఉంచుతుంది

అరటిలో ఉండే విటమిన్ A, B లు వయసు పైబడటం వల్ల వచ్చే మడతలను, గీతలను నివారించడంలో సమర్థవంతంగా పోరాడగలవు. ఇది అకాల వృద్ధాప్యాన్ని కలిగించే స్వేచ్ఛా రాడికల్స్ - చర్మం పై దాడి చేయకుండా రక్షిస్తుంది, అందువల్ల మీరు మరింత ఆకర్షణీయమైన చర్మాన్ని పొందగలరు.

4. మొటిమలతో పోరాడుతుంది

4. మొటిమలతో పోరాడుతుంది

జిడ్డు గల చర్మము మొటిమలకు, చర్మంపై తెరవబడి ఉన్న రంధ్రాలను మూసివేసేటట్లుగా దారితీస్తుంది. అరటిలో లెప్టిన్ అనబడే ప్రోటీన్లు ఉండటంవల్ల మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడుతాయి.

5. డార్క్ స్పాట్స్ను నివారిస్తుంది

5. డార్క్ స్పాట్స్ను నివారిస్తుంది

వయసు ఆధారిత మచ్చలు, మొటిమలు గుర్తులు, పింపుల్ మార్కుల వంటి ఇతరాలు మీ చర్మాన్ని నిస్తేజంగా, నిర్జీవంగా ఉంచుతాయి. మీ ముఖంపై అరతిని ఉపయోగించడం ద్వారా డార్క్ స్పాట్స్ను తేలికగా నివారించగలరు. అలా కొంతకాలం పాటు అరటి ఉపయోగించడం వల్ల మీ ముఖము కోల్పోయిన కాంతిని తిరిగి పొందగలుగుతుంది.

6. రోజ్-వాటర్ వల్ల మీ చర్మానికి కలిగే ప్రయోజనాలు

6. రోజ్-వాటర్ వల్ల మీ చర్మానికి కలిగే ప్రయోజనాలు

ఇది మొటిమలను నివారిస్తుంది . రోజు వాటర్ లో ఉండే అద్భుతమైన లక్షణాలు ముఖం నుండి అదనంగా ఉత్పత్తి అయ్యి మొటిమలకు కారణమైన శ్లేష్మమును తొలగిస్తుంది. మీ చర్మంపై మొటిమలు ఏర్పడటానికి కారణమయ్యే బ్యాక్టీరియాను ఈ రోజ్-వాటర్ చంపుతుంది.

7. మీ స్కిన్ను బాగా టోన్ చేస్తుంది

7. మీ స్కిన్ను బాగా టోన్ చేస్తుంది

చర్మ సంరక్షణ పద్ధతులలో టోనింగ్ అనేది అత్యంత ప్రధానమైనది. ఈ టోనింగ్ వల్ల మీ చర్మం నుంచి అధికంగా ఉత్పత్తి అయ్యే ఆయిల్ను & దుమ్మును తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్గా ఉంచుతుంది. రోజ్-వాటర్ చర్మము యొక్క pH స్థాయిని బ్యాలెన్స్ చేస్తుంది.

8. మీ చర్మాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది

8. మీ చర్మాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది

టోనర్లు మీ చర్మాన్ని పొడిగా మారుస్తాయని మీరు వినే ఉంటారు. మీరు మీ చర్మంపై స్వచ్ఛమైన రోజ్వాటర్ వంటి తేలికైన పదార్ధం ఉపయోగిస్తున్నప్పుడు మాత్రం ఇది నిజం కాదు. రోజ్ వాటర్ మీ చర్మాన్ని మెరుగుపరచి, మీ చర్మాన్ని రోజంతా హైడ్రేట్గా ఉంచుతుంది.

9. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది

9. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది

వృద్ధాప్యమనేది ఒక సహజమైన ప్రక్రియ, కానీ సూర్యరశ్మి నేరుగా మీ చర్మాన్ని తాగడం, మీ చర్మంపై కటినమైన రసాయన పదార్థాల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలను కలిగి ఉండటం, అనారోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి మొదలగునవి మీ వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తాయి. అందువల్ల రోజ్ వాటర్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మీ సమస్యను పరిష్కరించడానికి బాగా సహాయపడుతుంది.

10. సున్నితమైన చర్మం కోసం ఇది చాలా మంచిది

10. సున్నితమైన చర్మం కోసం ఇది చాలా మంచిది

రోజు వాటర్ అన్ని రకాల చర్మాలకు చాలా మంచి ప్రభావాన్ని కలుగజేస్తుంది ముఖ్యంగా, సున్నితమైన చర్మం కలిగిన వ్యక్తులకు కూడా అధిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఎందువల్లనంటే, ఈ రోజు వాటర్లో ఉన్న తేలికపాటి పదార్ధాలు సున్నితమైన చర్మానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు స్కిన్ ఇరిటేషన్ను & ఎరుపుదనం నుంచి ఉపశమనాన్ని కలుగజేయడంలో సహాయపడతాయి.

English summary

Homemade Banana And Rosewater Face Pack For Glowing Skin

Banana is one fruit that's available all year round and is also known as the "Superfood" for the skin. "And why is it known as the Superfood," you may ask? It's because banana contains vitamins and nutrients that nourish and revitalize the skin. Also, it makes the skin smooth and soft; and the best thing about this fruit is, it's great for all skin types.
Story first published:Wednesday, June 13, 2018, 17:18 [IST]
Desktop Bottom Promotion