For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే హోంమేడ్ వెజిటబుల్ ఫేస్ ప్యాక్స్

మీ చర్మం నిస్తేజంగా ఉంటుందా? అందువలన, మీరు చర్మాన్ని ప్రకాశవంతంగా చేసే మేకప్ ఐటమ్స్ పై ఆధారపడుతూ ఉంటారా? ఇదే సమస్యతో ఎక్కువమంది మహిళలు సతమతమవుతున్నారన్న విషయాన్ని తెలుసుకోండి.

|

మీ చర్మం నిస్తేజంగా ఉంటుందా? అందువలన, మీరు చర్మాన్ని ప్రకాశవంతంగా చేసే మేకప్ ఐటమ్స్ పై ఆధారపడుతూ ఉంటారా? ఇదే సమస్యతో ఎక్కువమంది మహిళలు సతమతమవుతున్నారన్న విషయాన్ని తెలుసుకోండి.

సన్ డ్యామేజ్, కలుషితమైన గాలి, అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్ల వంటి వివిధ రకాల అంశాల వలన చర్మం యొక్క సహజసిద్ధమైన నిగారింపు అణగారిపోతుంది.

glowing skin

డల్ స్కిన్ ప్రాబ్లెమ్ ని తక్షణమే తొలగిస్తామని చెప్పుకునే అనేక బ్రాండ్స్ కి సంబంధించిన బ్యూటీ ప్రాడక్ట్స్ మార్కెట్ లో విరివిగా లభిస్తున్నాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే చర్మాన్ని సంరక్షించగలుగుతాయని భావించవచ్చు. అన్ని రకాల ప్రాడక్ట్స్ అన్ని చర్మతత్వాలకు సూట్ అవ్వవు. అందువలన, వీటిని వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడే ప్రమాదం ఉంది.

మీరు ఇదివరకే ఇటువంటి ప్రాడక్ట్స్ ని వాడి ఫలితం లభించక చింతిస్తున్నారా? అయితే, ఈ ఆర్టికల్ మీ కోసమే. ఈ రోజు బోల్డ్ స్కై లో చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే సమర్థవంతమైన వెజిటబుల్ ఫేస్ ప్యాక్స్ గురించి వివరాలను సేకరించాము.

పొటాటో, సెలరీ, కేరట్, వంకాయ వంటి కొన్ని వెజిటబుల్స్ లో చర్మానికి తగిన పోషణనిచ్చే పోషకవిలువలు అనేకం. ఇవన్నీ, నిస్తేజంగా మారిన మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో తమదైన పాత్ర పోషిస్తాయి. తద్వారా, మీ చర్మం మరింత కాంతివంతంగా అలాగే అత్యంత ప్రకాశవంతంగా మారుతుంది.

ఇందులో, ఈ ఫేస్ ప్యాక్స్ ని ఎలా వాడాలో తెలియచేశాము:

1. పొటాటో ఫేస్ ప్యాక్

1. పొటాటో ఫేస్ ప్యాక్

పొటాటో ని స్లైసెస్ గా కట్ చేసుకుని ఒక ఫోర్క్ తో మ్యాష్ చేసుకోండి.

ఇప్పుడు పొటాటో పేస్ట్ లో రెండు టీస్పూన్ల పెరుగుని కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంపై సున్నితంగా అప్లై చేయండి.

పది నుంచి పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోండి.

వారానికి రెండు సార్లు ఈ విధంగా మీ చర్మాన్ని సంరక్షించుకుంటే మీరు కోల్పోయిన నిగారింపుని త్వరగా తిరిగి పొందుతారు.

2. కేరట్ ఫేస్ ప్యాక్

2. కేరట్ ఫేస్ ప్యాక్

రెండు టీస్పూన్ల కేరట్ జ్యూస్ లో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలపండి.

ఇలా తయారైన మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకోండి. 20 నిమిషాల వరకు ఈ ఫేస్ ప్యాక్ ని అలాగే ఉంచండి.

పది నుంచి పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో ఈ ఫేస్ ప్యాక్ ను తొలగించండి.

ఈ సమర్థవంతమైన వెజిటబుల్ ఫేస్ ప్యాక్ ను వారానికి ఒకసారి వాడినట్లైతే మీ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

3. వంకాయ ఫేస్ ప్యాక్

3. వంకాయ ఫేస్ ప్యాక్

వంకాయ స్లైస్ ను తీసుకుని ఫోర్క్ తో మ్యాష్ చేసుకోండి.

ఈ పేస్ట్ లో ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ను కలపండి.

ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై సున్నితంగా అప్లై చేసుకోండి. పదినిమిషాల వరకు ఈ మిశ్రమాన్ని కదపవద్దు.

ఆ తరువాత, తేలికపాటి క్లీన్సర్ తో అలాగే గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోండి.

నెలలో రెండుసార్లు, ఈ వెజిటబుల్ ఫేస్ ప్యాక్ ను అప్లై చేసుకోవడం ద్వారా కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.

4. బీట్ రూట్ ఫేస్ ప్యాక్

4. బీట్ రూట్ ఫేస్ ప్యాక్

బీట్ రూట్ ని సన్నటి స్లైస్ గా తరిగి ఒక ఫోర్క్ తో మ్యాష్ చేసుకోండి.

ఇప్పుడు, బీట్ రూట్ పేస్ట్ లో రెండు టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ ను కలపండి.

ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి ఇరవై నిమిషాల వరకు అలాగే ఉంచండి.

ఇప్పుడు, గోరువెచ్చటి నీటితో చర్మాన్ని కడగండి.

నెలలో మూడు సార్లు ఈ విధంగా చర్మానికి సంరక్షణని అందించడం ద్వారా మెరిసే చర్మాన్ని పొందవచ్చు.

5. గ్రీన్ పీస్ ఫేస్ ప్యాక్

5. గ్రీన్ పీస్ ఫేస్ ప్యాక్

ఆరేడు గ్రీన్ పీస్ ను మ్యాష్ చేసి ఆ పేస్ట్ లో ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని అలాగే అర టీస్పూన్ కొబ్బరి నూనెను కలపండి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అలాగే మెడపై అప్లై చేయండి.

ఈ ప్యాక్ ని మీ చర్మంపై పదిహేను నిమిషాల వరకు ఉండనివ్వండి.

ఇప్పుడు, తేలికపాటి క్లీన్సర్ తో అలాగే గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగండి.

నెలలో ఒకసారి ఈ ప్యాక్ ను అప్లై చేస్తే చర్మంలో తాజాదనం ఉట్టిపడుతుంది.

6. క్యాబేజ్ ఫేస్ ప్యాక్

6. క్యాబేజ్ ఫేస్ ప్యాక్

రెండు మూడు క్యాబేజ్ ఆకులను బ్లెండర్ లో గ్రైండ్ చేయండి.

ఇప్పుడు, ఈ మిశ్రమంలో ఒక టీస్పూన్ తీపిలేని గ్రీన్ టీ ని జోడించండి.

ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయండి.

పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఈ మిశ్రమాన్ని కదపవద్దు. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో ఈ ప్యాక్ ను ముఖంపై నుంచి తొలగించండి.

నెలలో ఒక్కసారి ఈ ఫేస్ ప్యాక్ ను అప్లై చేయడం ద్వారా కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.

7. సెలెరీ ఫేస్ ప్యాక్

7. సెలెరీ ఫేస్ ప్యాక్

సెలెరీలను మెత్తగా నూరుకుని అందులో ఒక టీస్పూన్ ఆల్మండ్ ఆయిల్ ను అలాగే రెండు టీస్పూన్ల రోజ్ వాటర్ ను కలపండి.

ఈ మిశ్రమాన్ని ముఖంపై అలాగే మెడపై అప్లై చేసుకోండి.

ఇప్పుడు కొద్ది నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఆ తరువాత పది నిమిషాల వరకు ఈ మిశ్రమాన్ని కదపకండి.

కాసేపటి తరువాత గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరుచుకోండి.

నెలకొకసారి ఈ అద్భుతమైన ఫేస్ ప్యాక్ ను అప్లై చేయడం ద్వారా తాజాదనం ఉట్టిపడే చర్మాన్ని పొందవచ్చు.

English summary

Homemade Vegetable Face Packs For Glowing Skin

If you are tired of using the same cosmetics and are not satisfied with the end result, then switch to vegetable packs. Yes, vegetables such as potato, carrot, eggplant, etc., can help you attain a glowing skin in no time. So check out these homemade vegetable face packs.
Story first published:Friday, January 12, 2018, 11:38 [IST]
Desktop Bottom Promotion