For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏజింగ్ ను అరికట్టేందుకు ఆనియన్ ఏ విధంగా తోడ్పడుతుందో తెలుసుకోండి.

ఏజింగ్ ను అరికట్టేందుకు ఆనియన్ ఏ విధంగా తోడ్పడుతుందో తెలుసుకోండి.

|

ఆనియన్ ని తీసుకోవడం చాలా మందికి ఇష్టమే. ప్రతి రోజూ ఆనియన్ ను ఎదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటాము. ఆనియన్ లో మానవశరీరానికి అవసరమైన ముఖ్య మినిరల్స్ తో పాటు విటమిన్స్ లభిస్తాయి. ఇవి శరీరంలోని ఇమ్యూనిటీని పెంపొందించేందుకు తోడ్పడతాయి. అలాగే, ఆనియన్ డైజెషన్ ప్రాసెస్ ను మెరుగుపరచడానికి అలాగే చర్మంలో చైతన్యం నింపడానికి తోడ్పడుతుంది. ఆనియన్ ద్వారా కలిగే ఈ బెనిఫిట్స్ గురించి మనందరికీ తెలిసిందే.

అయితే, చర్మాన్ని కాంతివంతంగా మార్చి అందంగా తయారుచేసేందుకు ఆనియన్ తోడ్పడుతుందని మీకు తెలుసా? ఆనియన్ లో లభించే విటమిన్ ఏ అనేది చర్మానికి పోషణని అందిస్తుంది. ఇది చర్మంలోని ఎలాస్టిసిటీను నిలిపి ఉంచేందుకు తోడ్పడుతుంది. కొలాజెన్ ఉత్పత్తిని పెంపొందించి ఈ విధంగా సహాయపడుతుంది. ఆనియన్ లో లభించే విటమిన్ ఈ చర్మాన్ని సంరక్షించేందుకు తోడ్పడుతుంది. ఫ్రీ రాడికల్ బలహీనతపై పోరాటం జరపడానికి, చర్మంపై హానికర సూర్యకిరణాల ప్రభావం ఉండకుండా రక్షించేందుకు, ముడతలను అరికట్టేందుకు ఆనియన్ తోడ్పడుతుంది.

how to use onion for skin

ఏ, సీ మరియు ఈ విటమిన్స్ ను ఆనియన్స్ నుంచి సమృద్ధిగా పొందవచ్చు. అంటే, కాస్తంత ఆనియన్ ను తీసుకుంటే శరీరానికి అవసరమైన మల్టీవిటమిన్ డోసేజ్ అందుతుందని అర్థం. తద్వారా, చర్మం ఆరోగ్యకరంగా అలాగే కాంతివంతంగా ఉంటుంది.

ముడతలు, మొటిమల సమస్యలను తగ్గించి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేందుకు కొన్ని సమర్థవంతమైన ఫేస్ ప్యాక్స్ ను ప్రయత్నించవచ్చు.

ఇక్కడ వివరించబడిన ఆనియన్ ఫేస్ ప్యాక్స్ ద్వారా చర్మం కోమలంగా అలాగే ప్రకాశవంతంగా మారుతుంది.

ఏజింగ్ ను అరికట్టేందుకు:

ఏజింగ్ ను అరికట్టేందుకు:

ఆనియన్స్ లో లభించే విటమిన్లు బ్లడ్ సర్క్యూలేషన్ ను పెంపొందించి ముడతల సమస్యను తొలగిస్తాయి.

కావలసిన పదార్థాలు:

1 చిన్న ఆనియన్

కాటన్ బాల్స్

నీళ్లు

ఎలా వాడాలి:

ఎలా వాడాలి:

ఆనియన్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వీటిని బ్లెండ్ చేసి జ్యూస్ ను సేకరించాలి. ఒక కాటన్ బాల్ ని అందులో ముంచి దాంతో ఆనియన్ జ్యూస్ ను ముఖంపై అలాగే మెడపై అప్లై చేయాలి. ఇలా 15 నుంచి 20 నిమిషాలపాటు ఉండనిచ్చి ఆ తరువాత ప్లెయిన్ వాటర్ తో వాష్ చేయాలి. వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ పద్దతిని రిపీట్ చేస్తే మెరుగైన ఫలితాలను త్వరగా గమనించగలుగుతారు.

నిగారింపుని పెంచేందుకు:

నిగారింపుని పెంచేందుకు:

ఆనియన్ లో లభించే విటమిన్లు చర్మాన్ని చైతన్యపరిచేందుకు, అలాగే ప్రకాశవంతంగా మార్చేందుకు తోడ్పడతాయి. చర్మంపై డల్ నెస్ అలాగే స్ట్రెస్ ఛాయలు కనపడకుండా చేస్తాయి. ఈ హోమ్ రెమెడీతో ప్రకాశవంతమైన చర్మాన్ని ఇట్టే పొందవచ్చు.

కావలసిన పదార్థాలు:

ఒక ఆనియన్

ఒక కప్పుడు నీళ్లు

ఎలా వాడాలి:

ఆనియన్స్ ను చిన్న చిన్న ముక్కలుగా తరుగుకుని వాటిని మ్యాష్ చేసి ఒక పేస్ట్ ను తయారుచేసుకోండి. ఈ పేస్ట్ ను ముఖంపై అప్లై చేసి 15 నిమిషాల వరకు అలాగే ఉండనివ్వండి. ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోండి. మొదటి యూజ్ తరువాతే మీరు గుర్తించదగిన మార్పును గమనించగలుగుతారు.

చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేందుకు

చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేందుకు

ఈ నేచురల్ ఫేస్ ప్యాక్ అనేది చర్మంపైన డార్క్ స్పాట్స్ ని తొలగించడానికి తోడ్పడుతుంది. అలాగే, బ్లేమిషెస్ ను కూడా నిర్మూలిస్తుంది. తద్వారా, డల్ స్కిన్ ను ప్రకాశవంతంగా మారుస్తుంది. ఈ బ్రైటెనింగ్ ఫేస్ మాస్క్ ను వారానికి ఒకసారి వాడితే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

కావలసిన పదార్థాలు:

ఒక చిన్న ఆనియన్

3 టేబుల్ స్పూన్ల పెరుగు

ఎలా వాడాలి:

ఇందుకోసం, బాగా పండిన ఆనియన్ కావాలి. తొక్కను తొలగించి ఆనియన్ ను చిన్న చిన్న ముక్కలుగా తరగండి. వీటిని బ్లెండర్ లో ఉంచి పేస్ట్ ను తయారుచేయండి. మూడు టీస్పూన్ల పెరుగును ఈ పేస్ట్ లోకి జోడించి బాగా కలపండి. ఈ దట్టమైన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాలపాటు అలాగే ఉండనివ్వండి. ఆ తరువాత, గోరువెచ్చటి నీటితో శుభ్రపరచండి.

మొటిమలను అరికట్టేందుకు:

మొటిమలను అరికట్టేందుకు:

కావలసిన పదార్థాలు

1 ఆనియన్

1 టీస్పూన్ తేనె

1 టీస్పూన్ నిమ్మరసం

ఎలా వాడాలి:

ఒక ఆనియన్ ను చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. ఆ తరువాత, మ్యాష్ చేసి పేస్ట్ ను తయారుచేసుకోండి. అందులో, ఒక స్పూన్ తేనెను అలాగే ఒక స్పూన్ నిమ్మరసాన్ని కలపండి. వీటిని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అలాగే ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయండి. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉండనివ్వండి. చల్లటి నీటితో శుభ్రపరచండి.

English summary

How Does Onion Prevent In Ageing? Find Out

All of us would love to consume an onion or add it in our day-to-day food we eat. But do you know how an onion can help you in getting a beautiful skin if used externally? Onion can be used with several ingredients like egg, honey, lemon juice, etc., to make face packs for a beautiful skin.DIY Onion Face Packs For Skin
Story first published:Monday, April 30, 2018, 11:38 [IST]
Desktop Bottom Promotion