For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోధుమ పిండి ద్వారా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోండి

గోధుమ పిండి ద్వారా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోండి

|

గోధుమ పిండిని చాలా మంది తమ డైట్ లో ముఖ్యమైన భాగంగా ప్రిఫర్ చేస్తారు. గోధుమ పిండితో చేసే చపాతీలు ఆలాగే వివిధ ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చన్న విషయం తెలిసినదే. అందువలన, సాధారణంగా ప్రతి ఇంట్లో గోధుమ పిండి అనేది కచ్చితంగా లభిస్తుందని చెప్పవచ్చు. మనందరికీ తెలిసినట్టుగానే, గోధుమ పిండిలో పోషకాలు అలాగే విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. వీటివలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అదే విధంగా, గోధుమపిండి వలన చర్మానికి కూడా అనేక ప్రయోజనాలు అందుతాయి.

చర్మంపై గోధుమపిండిని పైపూతగా వాడటం వలన చర్మకాంతి మెరుగవుతుంది. ఇంకొక్క ముఖ్య విషయం ఏంటంటే, గోధుమపిండి అన్ని రకాల చర్మాలకు బాగా సూట్ అవుతుంది. మీ చర్మ తత్త్వం ఏదైనా సరే గోధుమపిండి ద్వారా కలిగే లాభాలను మీరు పొందవచ్చు. సెన్సిటివ్, డ్రై, ఆయిలీ లేదా కాంబినేషన్ స్కన్ కలిగిన వారు గోధుమపిండి ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి సౌందర్య ప్రయోజనాలను పొందుతారు. స్కిన్ సెల్స్ రిస్టోర్ అవుతాయి. చర్మం మరింత కాంతిని సంతరించుకుంటుంది.

How To Make Wheat Flour Face Packs For Glowing Skin

అసలు, ఈ గోధుమ పిండిని చర్మ సంరక్షణకు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న ప్రశ్నకు సమాధానం ఈ ఆర్టికల్ లో మీకు లభ్యమవుతుంది. గోధుమపిండిని వివిధ ఫేస్ ప్యాక్స్ లోని మిగతా పదార్థాలతో కలిపి వాడవచ్చు. అటువంటి కొన్ని గోధుమపిండి ఫేస్ ప్యాక్స్ గురించి ఇక్కడ వివరించాము. వీటిని ఇంటివద్దే మీరు ప్రయత్నించవచ్చు.

ట్యాన్ ను రిమూవ్ చేయడం కోసం

ట్యాన్ ను రిమూవ్ చేయడం కోసం

పదార్థాలు

2 కప్పుల గోధుమపిండి

1 కప్పుడు నీళ్లు

ఎలా వాడాలి:

ఒక శుభ్రమైన పాత్రను తీసుకోండి. అందులోకి గోధుమ పిండిని తీసుకుని అందులో కాస్తంత నీటిని జోడించి స్మూత్ పేస్ట్ ను తయారుచేసుకోండి. పేస్ట్ అనేది మరీ చిక్కగా అనిపిస్తే మరికాస్త నీటిని జోడించవచ్చు. ఇప్పుడు, ఈ పేస్ట్ ను ఎండ ప్రభావం పడిన ప్రాంతాలలో చర్మంపై అద్దండి. పది నిమిషాల ఈ పేస్ట్ ను చర్మంపై ఉండనివ్వండి. చివరగా చల్లటి నీటితో పేస్ట్ ను తొలగించండి. ఈ రెమెడీను రోజుకు రెండు సార్లు పాటిస్తే మెరుగైన ఫలితాలను గమనించగలుగుతారు.

చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుకునేందుకు:

చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుకునేందుకు:

కావలసిన పదార్థాలు

2-3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి

1-2 టేబుల్ స్పూన్ల మలై (మిల్క్ క్రీమ్)

ఎలా వాడాలి:

గోధుమ పిండి మరియు మలైని కలిపి స్మూత్ పేస్ట్ ను తయారుచేసుకోండి. దీన్ని ముఖంపై అప్లై చేసుకుని పది నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తరువాత సున్నితంగా స్క్రబ్ చేసుకుంటూ సర్కులర్ మోషన్ లో ఈ పేస్ట్ ను తొలగించండి. ఈ పేస్ట్ ను తొలగించేందుకు నార్మల్ వాటర్ ను వినియోగించండి. ఈ ప్యాక్ ను తరచూ వాడితే చర్మం మరింత ప్రకాశవంతంగా మారుతుంది.

ఆయిలీ స్కిన్ కోసం

ఆయిలీ స్కిన్ కోసం

కావలసిన పదార్థాలు

4 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి

3 టేబుల్ స్పూన్ల పాలు

1 టీస్పూన్ రోజ్ వాటర్

ఎలా వాడాలి:

ఒక శుభ్రమైన పాత్రలోకి గోధుమపిండిని, పాలను అలాగే రోజ్ వాటర్ ను తీసుకోండి. ఈ పదార్థాలను బాగా కలపండి. ఈ ప్యాక్ ను ముఖంపై అప్లై చేసుకోండి. మెడపై కూడా అప్లై చేసుకోండి. ఇరవై నిమిషాల పాటు ప్యాక్ ను తొలగించవద్దు. ఆ తరువాత చల్లటి నీటితో ప్యాక్ ను తొలగించండి. ఈ ప్యాక్ ను రోజుకు రెండుసార్లు వాడితే మంచి ఫలితాలను పొందగలుగుతారు.

మృదువైన చర్మం కోసం

మృదువైన చర్మం కోసం

కావలసిన పదార్థాలు

4 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి

2-3 టేబుల్ స్పూన్ల పాలు

2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్

గులాబీ రేకులు

రెండు టీస్పూన్ల తేనె

ఆరెంజ్ పీల్

ఎలా వాడాలి:

మొదటగా, కప్పుడు నీటిని ఒక సాస్ పాన్ లో మరిగించండి. ఆరెంజ్ పీల్ ను తురిమి దాన్ని నీటిలోకి వేయండి. ఆ నీటిలో కొన్ని గులాబీ రేకులను కూడా వేయండి. మూతపెట్టి మరికొన్ని నిమిషాల పాటు ఆ నీటిని కాచండి. ఇప్పుడు, స్టవ్ పై నుంచి ఈ సాస్ ప్యాన్ ను తీసుకుని ఒక పక్కన ఉంచండి. ఇప్పుడు, పాలను వేడిచేయండి. అందులోకి, ఆరెంజ్ రోజ్ పెటల్స్ వాటర్ ను అలాగే రా హనీను కలపండి. హీట్ ను తగ్గించి ఈ మిశ్రమాన్ని రూమ్ టెంపెరేచర్ లోకి వచ్చాక అందులోకి గోధుమ పిండిని జోడించి పదార్థాలన్నిటినీ బాగా కలపండి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. ఈ ప్యాక్ ఆరిపోయాక ఈ ప్యాక్ ను నార్మల్ వాటర్ తో తొలగించండి. ఆ తరువాత, మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి.

ఈ విధంగా గోధుమపిండిని చర్మ సంరక్షణ కోసం ఉపయోగించి సౌందర్యాన్ని మరింత పెంపొందించుకోవచ్చు.

English summary

How To Make Wheat Flour Face Packs For Glowing Skin

Wheat flour, or atta as we Indians call it, is one of the dominant portions of the daily diet followed by us. Using wheat flour topically on the skin can help in making the skin glow. And the major advantage of wheat flour is that it works equally on all skin types be it sensitive, dry, oily or combination skin. It helps in rejuvenating the skin cells.
Story first published:Wednesday, August 22, 2018, 10:11 [IST]
Desktop Bottom Promotion