Latest Updates
-
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా..
పెదాల సంరక్షణ చిట్కాలు
పెదాల సంరక్షణ చిట్కాలు
పెదాలు మృదువుగా ఉన్నప్పుడే లిప్ స్టిక్ వంటి ప్రోడక్ట్స్ వలన పెదాల అందం రెట్టింపవుతుంది. మృదువైన పెదాల అందాన్ని లిప్ స్టిక్ అనేది మరింత ఎలివేట్ చేస్తుంది. పెదాలను మృదువుగా మార్చేందుకు పెదాల సంరక్షణ అనేది ఎంతో అవసరం.
శరీరంలోని ఇతర ప్రాంతాల చర్మంతో పోలిస్తే పెదాలపైన ఉండే చర్మం ఎంతో పలచగా ఉంటుంది. కాబట్టి, ఇది దెబ్బతినే అవకాశం ఎక్కువ. కాబట్టి, లిప్ కేర్ అనేది అత్యంత అవసరం. అటువంటి సమస్యలను నిరోధించేందుకు లిప్ కేర్ పై శ్రద్ధ కనబరచాలి. రోజువారీ బ్యూటీ రెజైమ్ లో లిప్స్ కి తగినంత సంరక్షణని అందించాలి.

ఇక్కడ వివరించబడిన చిట్కాలను పాటిస్తే పెదాలు మృదువుగా మారతాయి.
పెదాలను చప్పరించకండి:
పెదాలను పదే పదే టచ్ చేయడం అలాగే పెదాలను చప్పరించడం వలన పెదాల అందం దెబ్బతింటుంది. చాలా మందికి పెదాలను అదే పనిగా తడిపే అలవాటు ఉంటుంది. దీని వలన పెదాలు మాయిశ్చరైజ్ అవుతాయని వారు భావిస్తారు. అయితే, దీని వలన సమస్య మరింత జఠిలమవుతుంది. పెదాలను చప్పరిస్తున్నప్పుడు కాసేపటి వరకు పెదాలు మాయిశ్చరైజ్ అయినట్టు అనిపించవచ్చు. కానీ, త్వరగా పెదాలపై తడి ఆరిపోతుంది. దీని వలన పెదాలు డ్రైగా అలాగే ఫ్లేకీ గా మారతాయి. సెలైవాలో ఉండే ఎంజైమ్స్ అనేవి పెదాలను కఠినంగా మారుస్తాయి.
పెదాలను పదే పదే టచ్ చేయడం వలన పెదాలపై ఉండే సహజమైన మాయిశ్చరైజర్ అనేది తొలగిపోతుంది. పెదాలు డ్రై గా మారతాయి.
మేకప్ తొలగించడం ముఖ్యం:
పెదాలు కూడా ఉపశమనం పొందాలి. అందువలన, నిద్రపోయే ముందు మేకప్ ను తొలగించడం ముఖ్యం. ఒక కాటన్ ప్యాడ్ ను ఉపయోగించి పెదాలపై ఉండే లిప్ స్టిక్ ను తొలగించవచ్చు. అలాగే, మేకప్ తో నిద్రపోవడం వలన చర్మం దెబ్బతింటుంది. బ్రేకవుట్స్ తో పాటు అలర్జీలు తలెత్తవచ్చు.
నీళ్లు తాగండి:
పైపూతగా వాడే లిప్ కేర్ ప్రోడక్ట్స్ అనేవి పెదాలకు సంపూర్ణ పోషణను అందించలేవు. కాబట్టి, పెదాల సంరక్షణ కోసం మీరు మరింత శ్రద్ధ వహించాలి. పెదాలు హైడ్రేటెడ్ గా ఉండేందుకు మంచినీళ్లను ఎక్కువగా తీసుకోవాలి. మీరు ఎంత ఎక్కువగా నీటిని తీసుకుంటే పెదాలు అంత హైడ్రేటెడ్ గా ఉంటాయి.
నిద్రపోయే ముందు లిప్స్ ను హైడ్రేట్ చేసుకోండి:
నిద్రలో పెదాలు ఎండిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి, ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు పెదాలను హైడ్రేట్ లేదా మాయిశ్చరైజ్ చేసుకోవడం మంచిది. మీకు నచ్చిన లిప్ బామ్ లేదా పెట్రోలియం జెల్లీను అప్లై చేసుకుని రాత్రంతా అలాగే ఉండనివ్వండి. దీని వలన పెదాలు స్మూత్ గా అలాగే సాఫ్ట్ గా మారతాయి.
ఎక్స్ఫోలియేట్ చేయండి:
తరచూ ఎక్స్ఫోలియేట్ చేసుకోవడం వలన పెదాలపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అనేవి తొలగిపోతాయి. తద్వారా, లిప్స్ మృదువుగా అలాగే పింక్ గా మారతాయి. ఎక్స్ఫోలియేషన్ కోసం హోమ్ మేడ్ స్క్రబ్ ను వాడండి. ఒక టీస్పూన్ సాల్ట్ లో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని తీసుకోండి. ఈ మిశ్రమంతో పెదాలపై ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు మృదువుగా స్క్రబ్ చేయండి. ఆ తరువాత సాధారణ నీటితో పెదాలను రిన్స్ చేయండి. ఈ పద్దతిని వారానికి ఒకటి లేదా రెండు సార్లు పాటిస్తే మంచి ఫలితాలను పొందుతారు.
లిప్ స్టిక్ ను వాడండి:
పెదాల సంరక్షణలో భాగంగా లిప్ స్టిక్ ను వాడాలి. ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు లిప్ స్టిక్ ను అప్లై చేసుకోవడం మరచిపోవద్దు. దీని వలన డర్ట్, ఎండ అలాగే వేడి గాలి నుంచి పెదాలకు రక్షణ లభిస్తుంది.
లిప్ బామ్ ను వాడండి:
పెదాల సంరక్షణలో లిప్ బామ్ పాత్ర ప్రముఖమైనది. మీతో పాటు మేకప్ బ్యాగ్ లో లిప్ బామ్ ను తీసుకువెళ్లడం మరచిపోవద్దు. మీ పెదాలు ఎప్పుడు డ్రై గా మారతాయో మీకు తెలియకపోవచ్చు. అటువంటప్పుడు, లిప్ బామ్ సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications