Latest Updates
-
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్!
ఆరంజ్ తొక్క పొడి తో మీ ఛాయను ప్రకాశవంతం చేసుకోవడం ఎలా
మీ చర్మం ప్రకాశవంతంగా చేయడానికి అనేక రకాల సహజ పదార్ధాలు ఉన్నాయి, కానీ సౌందర్య విభాగంలో ఎక్కువ ప్రసిద్దిచెందిన వాటిలో ఇది ఒకటి. మనం మాట్లాడుకునే ఆ సౌందర్య పదార్ధం ఆరంజ్ తొక్క పొడి. ప్రకాశవంతమైన ఛాయ కోస
ప్రకాశవంతమైన ఛాయను మనలో చాలా మంది ఇష్టపడతారు. ఇది మీ సౌందర్యాన్ని పెంచడమే కాకుండా, మీ చర్మం సహజమైన అందంతో కనిపించేట్టు చేస్తుంది.
మీ చర్మం ప్రకాశవంతంగా చేయడానికి అనేకరకాల సహజ పదార్ధాలు ఉన్నాయి, కానీ సౌందర్య విభాగంలో ఎక్కువ ప్రసిద్దిచెందిన వాటిలో ఇది ఒకటి. మనం మాట్లాడుకునే ఆ సౌందర్య పదార్ధం ఆరంజ్ తొక్క పొడి.

ఆరెంజ్ తొక్క పౌడర్ విటమిన్ c కి పుట్టిల్లు, ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది, చర్మ-కాంతి లక్షణాలు కలిగి ఉండి, నిలిచిపోయిన నల్ల మచ్చలను కూడా పోగొడుతుంది.
అంతేకాకుండా, మీరు ఈ సహజ పదార్ధాన్ని ఉపయోగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి, ఇది మీ ఛాయను మెరుగుపరచడమే కాకుండా, మీ చర్మ ఆకృతిని కూడా పెంపోదిస్తుంది.
ఇక్కడ, ఎటువంటి మేకప్ లేకుండా మీ చాయ కాంతివంతంగా పొందడానికి మీరు ఆరంజ్ తొక్క పొడిని ఉపయోగించే అత్యంత అద్భుతమైన మార్గాల జాబితాను కొన్నిటిని ఇచ్చాము.

1.ఆరంజ్ తొక్క పొడి + ఆల్మండ్ ఆయిల్
-½ టీస్పూన్ ఆరంజ్ తొక్కు పొడితో 1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ ని కలపండి.
-ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై పూసి, 5-10 నిమిషాల పాటు వదిలేయండి.
-ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని నీటితో కడగండి.
-ఇంట్లో తయారుచేసిన ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసారి అప్లై చేసినట్లయితే ప్రకాశవంతమైన ఛాయను పొందవచ్చు.

2.ఆరంజ్ తొక్కు పొడి + అలోవేర జెల్
-½ టీస్పూన్ ఆరంజ్ తొక్కు పొడి, 1 టేబుల్ స్పూన్ అలోవేర జెల్ ని కలిపి ఒక మిశ్రమంగా తయారుచేయండి.
-ఈ పేస్ట్ ని మీ చర్మం పై అప్లై చేసి, 10-15 నిమిషాల తరువాత, గోరువెచ్చని నీటితో కడిగేయండి.
-మీ చర్మం ప్రకాశవంతం కావడానికి ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసరిమీ ముఖంపై రాయండి.

3.ఆరంజ్ తొక్కు పొడి – పసుపు + కొబ్బరి నూనె
-1/2 టీస్పూన్ ఆరంజ్ తొక్కు పొడి, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను ఒక బౌల్ లోకి తీసుకుని, పేస్ట్ తయారయ్యే వరకు కలపండి.
-మీ ముఖ చర్మంపై ఈ మిశ్రమాన్ని రాసి, 10 నిమిషాల పాటు అలా వదిలేయడ౦ మంచిది.
-తరువాత, గోరువెచ్చని నీటితో కడిగేయండి.
-కాంతివంతమైన చర్మం కోసం ఈ మిశ్రమాన్ని నెలకు రెండుసార్లు ఉపయోగించండి.

4.ఆరంజ్ తొక్కు పొడి + ఎగ్ వైట్
-ఎగ్ వైట్ ని వేరుచేసి అందులో 1 టీస్పూన్ ఆరంజ్ తొక్కు పొడిని కలపండి.
-మిశ్రమ౦ తయారయ్యేవరకు బాగా కలపండి.
-ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేసి, దాదాపు 10-15 నిమిషాల పాటు వదిలేయండి.
-తరువాత, గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగండి.
-మీ చర్మంపై చికిత్స కోసం ఈ మిశ్రమాన్ని నెలకు 2-3 సార్లు ఉపయోగిస్తే అద్భుతమైన చర్మాన్ని, మంచి అందాన్ని పొందడమే కాకుండా, ఎల్లప్పుడూ తాజాగా కనిపిస్తారు కూడా.

5.ఆరంజ్ తొక్కు పొడి + రోజ్ వాటర్
-½ టీస్పూన్ ఆరంజ్ తొక్కు పొడితో 2-3 టీస్పూన్ ల రోజ్ వాటర్ ని కలపండి.
-మీ ముఖ చర్మంపై ఈ మిశ్రమాన్ని సమానంగా పూయండి, 10-15 నిమిషాల పాటు వదిలేయండి.
-తరువాత, మీ చర్మంపై ఉన్న ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని నీటితో కడిగేయండి.
-అందమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందడానికి ఇంట్లో తయారుచేసిన ఈ మిశ్రమాన్ని వారానికి రెండుసార్లు ఉపయోగించండి.

6.ఆరంజ్ తొక్కు పొడి + ఆలివ్ ఆయిల్
-ఒక బౌల్ లో, ½ టీస్పూన్ ఆరంజ్ తొక్కు పొడి, 2 టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ ని కలపండి.
-పేస్ట్ తయారయ్యేవరకు వీటిని బాగా కలపండి.
-మీ ముఖం చర్మంపై ఈ మిశ్రమంతో మర్దనా చేసి, 10 నిమిషాల పాటు వదిలేసి, సున్నితమైన క్లెన్సర్, గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగండి.
-ఈ మాస్క్ ని వారానికి ఒకసారి వేసుకున్నట్లయితే మీ చర్మంపై ఉన్న నల్ల ;మచ్చలు పోయి, కాంతివంతమైన ఛాయను పొందడానికి సహాయపడుతుంది.

7.ఆరంజ్ తొక్కు పొడి + విటమిన్ E ఆయిల్
-½ టీస్పూన్ ఆరంజ్ తొక్క పొడికి నూనె కలిగిన విటమిన్ E కాప్సిల్ ని కలపండి.
-ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేసి, గోరువెచ్చని నీటితో కడిగే ముందు 10 నిమిషాల పాటు వదిలేయండి.
-గోరువెచ్చని నీటితో చర్మాన్ని కడగండి.
-మీ చర్మం ప్రకాశవంతంగా మెరవడానికి వారానికి రెండుసార్లు ఇంట్లో తయారుచేసిన ఈ మిశ్రమాన్ని ఉపయోగించండి.



Click it and Unblock the Notifications