For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రకాశవంతమైన చర్మ సౌందర్యానికి నిమ్మతో కూడిన అదనపు ప్రయోజనాలు : పూర్తి వివరాలు

ప్రకాశవంతమైన చర్మ సౌందర్యానికి నిమ్మతో కూడిన అదనపు ప్రయోజనాలు : పూర్తి వివరాలు

|

ఆరోగ్యకరమైన మరియు అందమైన చర్మాన్ని పొందడానికి కృత్రిమ రసాయనాలవైపు మొగ్గు చూపడం అంత శ్రేయస్కరం కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. తరచుగా మనలో అనేకులు, సౌందర్యారాధకులుగా ఉన్న కారణాన, చర్మ సౌందర్యానికి వేర్వేరు రసాయనిక ఉత్పత్తుల మీద ఆధార పడడం చూస్తూనే ఉంటాము. తెలీకుండా ఆర్దిక స్థోమతను మించి డబ్బులు వెచ్చిస్తూ, కృత్రిమ సౌందర్య సాధనాలకు మరియు సెలూన్లకు అధిక సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు కూడా. అయినా ప్రయోజనాలు అంతంతమాత్రమే.

కొన్ని సందర్భాలలో ఆ కృత్రిమ రసాయనాలతో కూడిన సౌందర్య సాధనాలు చర్మాన్ని సున్నితంగా చేయడం, లేదా ప్రతికూల ప్రభావాలను చూపడం, కాలుష్యం, దుమ్ము, ధూళి, సూర్యరశ్మి ప్రభావం, అతి వేడి, జీవక్రియల అసమతౌల్యం, సంక్రమణలు మరియు దీర్ఘకాలిక వ్యాధులు, హార్మోనుల అసమతౌల్యం, డీహైడ్రేషన్ వంటి మొదలైన అనేక సమస్యలు చర్మ సౌందర్యంపై తీవ్ర ప్రభావాన్నే చూపుతుంటాయి. ఫలితంగా, తప్పనిసరి పరిస్థితుల్లో కెమికల్ పీలింగ్ లేదా బొటాక్స్ వంటి వాటికి వైద్యుల సూచనలమేర నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది కూడా. ఖర్చుతో కూడుకున్న అంశాలే అయినా, విజయావకాశాలు అనేక పరిస్తితులమీద ఆధారపడి ఉంటాయి.

How To Do Lemon Clean Up At Home?

కావున సరైన ఆహార, వ్యాయామ ప్రణాళికలతో కూడిన ఆరోగ్యకర దైనందిక జీవన శైలిని అవలంబిస్తూ, కొన్ని గృహ చిట్కాలను పాటించడం ద్వారా అందమైన మరియు ప్రకాశవంతమైన చర్మాన్ని, ఎటువంటి రసాయనిక ఉత్పత్తులు మరియు సెలూన్ల జోలికి పోకుండా సాధించవచ్చునని అనేకమంది నిపుణులు సూచిస్తున్నారు.

కానీ మీలో ఎంతమందికి తెలుసు, సెలూన్లతో అవసరం లేకుండా గృహ చిట్కాలతోనే అంతకు మించిన ప్రయోజనాలను పొందగలరని? అటువంటి గృహ సౌందర్య సాధనాలలో ప్రధానమైనది నిమ్మ.

నిమ్మకాయ యొక్క సౌందర్య ప్రయోజనాలు అందరికీ విస్తృతంగా తెలిసినదే. ఇది సిట్రస్ పండ్ల జాతికి చెందినందువలన, విటమిన్-సి ని విరివిగా కలిగి ఉంటుంది. ఈ విటమిన్ –సి చర్మాన్ని లోతుగా శుద్ది చేయడంలో మరియు చర్మరంధ్రాలలోని మృత కణాలను తొలగించి, చర్మరంద్రాలను తెరవడంలో సహాయపడుతుంది. మరియు విస్తారంగా వృద్ది చెందిన చర్మాన్ని ఆరోగ్యకర కణాలతో నింపడంలో ప్రయోజనకారిగా ఉంటుంది. నిమ్మకాయలో ఉండే ఆల్ఫా-హైడ్రాక్సీ ఆమ్లాలు, బ్లాక్హెడ్స్(పిగ్మేంటేషన్) మరియు ఇతర నల్లటి మచ్చలను సమర్థవంతంగా తొలగించడంలో సహాయపడుతుంది.

ఈ వ్యాసంలో, నిమ్మకాయతో మీ ఇంటిలోనే పొందే సౌందర్య ప్రయోజనాల గురించిన వివరాలను పొందుపరచడం జరిగినది.

మొదటి దశ :

మొదటి దశ :

నిమ్మకాయ మరియు ఉప్పు స్క్రబ్ :

చనిపోయిన మృతకణాలను చర్మం నుండి తీసివేయడంలో ఈ స్క్రబ్ సహాయపడుతుంది. నిమ్మకాయ-ఉప్పు కలిగిన ఈ స్క్రబ్ చర్మసమస్యలు మరియు ఇన్ఫెక్షన్స్ సోకకుండా సహాయపడే యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది.

కావలసినవి:

1 టేబుల్ స్పూన్ ఉప్పు.

½ స్పూన్ నిమ్మ రసం.

1 టీస్పూన్ నీరు.

తయారుచేసే విధానం:

తాజా నిమ్మ రసంలో, ఉప్పును కలపాలి. క్రమంగా కొన్ని నీటిబొట్లను జోడించి అన్ని పదార్ధాలను మిశ్రమం అయ్యేలా బాగా కలపండి. కడిగిన ముఖంపై ఈ మిశ్రమాన్ని 2-3 నిమిషాల పాటు మీ చేతివేళ్ల సహాయంతో వృత్తాకారంలోవర్తించి, కొన్ని నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేయడం ద్వారా, మూసుకు పోయిన చర్మ రంధ్రాలను తెరవడంలో సహాయపడుతుంది.

రెండవ దశ :

రెండవ దశ :

నిమ్మకాయ టోనర్:

స్క్రబ్బింగ్ తర్వాత చర్మానికి టోనింగ్ ముఖ్యం. నిమ్మరసం చర్మానికి మంచి టోనర్ వలె సహాయపడుతుంది.

కావలసినవి:

2-3 టేబుల్ స్పూన్ల నిమ్మ రసం.

కొన్ని చుక్కలు రోజ్ వాటర్.

తయారుచేసే విధానం:

ఒక శుభ్రమైన గిన్నెలో నిమ్మరసం మరియు రోజ్ వాటర్ వేసి మిశ్రమంగా కలపాలి. ఈ ద్రావణంలో ఒక కాటన్ బాల్ ముంచి, మీ ముఖం మీద సున్నితంగా రుద్దండి. 5 నిముషాల పాటు అలాగే వదిలేసి, చల్లని నీటితో ముఖాన్ని శుభ్రపరచండి.

మూడవ దశ :

మూడవ దశ :

నిమ్మకాయ మరియు పాల మిశ్రమం : క్లెన్సర్

ఈ క్లెన్సర్లోని లాక్టిక్ యాసిడ్ మూలాలు, బ్లాక్హెడ్స్ తొలగించడంలో సహాయం చేస్తుంది. శుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన చర్మానికి ఈ క్లెన్సర్ అద్భుతంగా పనిచేస్తుంది.

కావలసినవి:

1 స్పూన్ నిమ్మ రసం.

1 టేబుల్ స్పూన్ పచ్చి పాలు.

తయారుచేయు విధానం :

స్వచ్ఛమైన గిన్నెను తీసుకుని అందులో తాజా నిమ్మరసం మరియు పచ్చి పాలు వేసి కలపండి. అందులో ఒక కాటన్ బాల్ ముంచి, మీ ముఖం మీద వర్తించండి. 10 నిమిషాలు ఆరనిచ్చాక, చల్లటి నీటితో శుభ్రపరచండి. శుభ్రం చేసేటప్పుడు వృత్తాకారంలో మీ చర్మానికి మసాజ్ వలె చేయండి.

నాల్గవ దశ:

నాల్గవ దశ:

నిమ్మకాయ మరియు దానిమ్మపండు ఫేస్ ప్యాక్:

దానిమ్మపండు చర్మంలోని అదనపు చెడు నూనెను తొలగిస్తుంది. నిమ్మ మరియు దానిమ్మపండు కలయిక చర్మంపై మొటిమలు మరియు బ్లాక్హెడ్స్ తొలగించడంలో మీకు సహాయం చేయగలవు.

కావలసినవి:

దానిమ్మ పైతొక్క.

నిమ్మరసం.

తయారుచేయు విధానం:

మొట్టమొదటగా దానిమ్మ తొక్కను ఎండబెట్టి పొడిగా చేయవలసి ఉంటుంది. ఈ పొడి సున్నితంగా ఉండేలా గ్రైండ్ చేయాలి. ఈ దానిమ్మ తొక్క పొడిలో, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయండి. మీ ముఖం మీద వలయాకారంలో ఈ మిశ్రమాన్ని వర్తించండి. 20-30 నిముషాల పాటు పూర్తిగా పొడిబారేవరకు వదిలివేయండి. 30 నిమిషాల తరువాత సాధారణ నీటితో సున్నితంగా కడిగివేయండి. ఆ తర్వాత తప్పనిసరిగా మాయిశ్చరైజర్ ముఖానికి అప్లై చేయండి.

గుర్తుంచుకోవలసిన అంశాలు :

గుర్తుంచుకోవలసిన అంశాలు :

1. మీ చర్మం మీద నిమ్మరసం వర్తించిన తర్వాత సూర్యరశ్మి ప్రభావానికి గురికాకూడదు అని నిపుణులు సూచిస్తుంటారు.

2. ఫేషియల్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఎట్టి పరిస్థితుల్లో మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం మరచిపోకూడదు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.


English summary

How To Do Lemon Clean Up At Home?

The beauty benefits of lemon are widely known. It helps in removing the dirt accumulated in clogged pores thus leaving a healthy and clean skin. The alpha-hydroxy acids that lemon contains also helps in getting rid of blackheads and other dark spots effectively. Scrubbing, toning, cleansing and mask can give you a better skin.
Story first published:Tuesday, September 11, 2018, 16:16 [IST]
Desktop Bottom Promotion