For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లవంగం నూనెను వాడటం ద్వారా యాక్నే సమస్యను తగ్గించుకోవడమెలా?

లవంగం నూనెను వాడటం ద్వారా యాక్నే సమస్యను తగ్గించుకోవడమెలా?

|

చర్మంపై యాక్నే సమస్య తలెత్తితే ప్రశాంతత లోపించడం సహజం. ఇది ఒక రకమైన వరస్ట్ స్కిన్ కండిషన్. ఈ మొండి యాక్నే సమస్యను నివారించడం కష్టతరం కూడా. ప్రత్యేకించి, ముఖ్యమైన సందర్భాలలో యాక్నే సమస్య తలెత్తినప్పుడు అప్పుడు ఎదురయ్యే ఫ్రస్ట్రేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.

ముఖంపై మొటిమలు ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు. గెట్ టు గెదర్స్ మరియు పార్టీలను అవాయిడ్ చేసేందుకు ప్రయత్నిస్తాము. అయితే, ప్రతి సమస్యకి ఎదో ఒక పరిష్కారం ఉంటుంది. అటువంటి పరిష్కారం యాక్నే సమస్యకు కూడా ఉంటుంది.

యాక్నే సమస్యను తగ్గించేందుకు లవంగం నూనె అనేది సమర్థవంతంగా పనిచేస్తుందని తేలింది. చర్మం లోలోపల నుంచి పోషణని అందించి యాక్నేను నిర్మూలించేందుకు లవంగం నూనె తోడ్పడుతుంది. సహజంగా యాక్నే సమస్యను తొలగించి మళ్ళీ మళ్ళీ ఈ సమస్య తలెత్తకుండా చూస్తుంది. లవంగం నూనెను వివిధ రకాలుగా వాడటం ద్వారా యాక్నేను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

యాక్నేకు చికిత్సగా లవంగం నూనె:

యాక్నేకు చికిత్సగా లవంగం నూనె:

లవంగం మొక్క నుంచి సేకరించబడిన లవంగం నూనెలో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు సమృద్ధిగా లభిస్తాయి. లవంగం నూనె ఘాటుగా ఉంటుంది. ఈ ఎసెన్షియల్ ఆయిల్ లో అనేక ఔషధ గుణాలు లభ్యమవుతాయి. యాక్నేను నిర్మూలించడమనేది ఈ ఆయిల్ నుంచి అందే ముఖ్య ప్రయోజనం. వివిధ రకాల బాక్టీరియాలను నశింపచేయడంలో ఈ ఆయిల్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఆ విధంగా యాక్నేకు దారితీసే బాక్టీరియాను ఇది నిర్మూలిస్తుంది. లవంగం నూనెను వాడటం ద్వారా వివిధ రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. ఇది అనాల్జేసిక్ అలాగే యాంటీ సెప్టిక్ నేచర్ కలిగినది. స్కిన్ ఇంప్యూరిటీస్ సమస్యలను సులభంగా లవంగం నూనెను వాడటం ద్వారా తగ్గించుకోవచ్చు. తద్వారా, సిస్టిక్ యాక్నే ద్వారా కలిగే నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

లవంగం నూనెను వాడటం ద్వారా యాక్నేను నిర్మూలించడం:

లవంగం నూనెను వాడటం ద్వారా యాక్నేను నిర్మూలించడం:

యాక్నేను తగ్గించుకోవడానికి లవంగం నూనెను వాడాలనుకుంటే లవంగం నూనెను ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైయిజర్ తో అలాగే ఆయిల్ ఫ్రీ క్లీన్సర్ తో కలిపి వాడాలి. ఒక చుక్క లవంగం నూనెను ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి. పది నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. ఆ తరువాత, క్లీన్సర్ తో ముఖాన్ని శుభ్రపరచుకొని ఆ తరువాత ముఖంపై తడిని టవల్ తో తుడుచుకుని మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి. ఇది స్పాట్ ట్రీట్మెంట్ లా ఎంతో ప్రభావవంతమైనది.

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. లవంగం నూనె యాక్నేకు దారితీసే బాక్టీరియాను నశింపచేస్తుంది. అయితే, లవంగం నూనెను తగిన మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే, లవంగం ఘాటును చర్మం తట్టుకోలేకపోవచ్చు.

లవంగం నూనెలో కొబ్బరి నూనెను కలిపి వాడటం వలన యాక్నే నశిస్తుంది:

లవంగం నూనెలో కొబ్బరి నూనెను కలిపి వాడటం వలన యాక్నే నశిస్తుంది:

అయిదు నిముషాలు ఆవిరి పట్టడం ద్వారా చర్మంలోని పోర్స్ ఓపెన్ అవుతాయి. ఆ తరువాత మూడు లేదా అయిదు చుక్కల లవంగం నూనెలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి సర్క్యూలర్ మోషన్ లో మసాజ్ చేయాలి. యాక్నే సమస్య ఉన్న ప్రాంతాలపై ఈ పద్దతిని పాటించాలి. ఆ తరువాత, ఆయిల్ ఫ్రీ క్లీన్సర్ తో ముఖాన్ని వాష్ చేసుకోవాలి.

దుమ్మూ ధూళి వలన పోర్స్ క్లాగ్ అయినప్పుడు కొబ్బరి నూనె వలన పోర్స్ క్లీన్ అవుతాయి. అలాగే, కొబ్బరి నూనె వలన చర్మానికి పోషణ లభిస్తుంది. కొబ్బరి నూనెను లవంగం నూనెతో కలిపినప్పుడు యాక్నేకు దారి తీసే బాక్టీరియా అనేది నశింపబడుతుంది.

ఫౌండేషన్ తో లవంగం నూనె:

ఫౌండేషన్ తో లవంగం నూనె:

మేకప్ అప్లికేటర్ ని వాడటం ద్వారా తగిన మోతాదులో ఫౌండేషన్ ను తీసుకోండి. ఒక చుక్క లవంగం నూనెను దీనికి జోడించండి. మీరు సాధారణంగా అప్లై చేసుకునే విధంగా మేకప్ ను చేసుకోండి. మీరు నిద్రకు ఉపక్రమించే సమయంలో మేకప్ ను తొలగించుకోవడం మరచిపోకండి. ఈ ట్రీట్మెంట్ ను మేకప్ అప్లై చేసే ప్రతిసారి పాటించండి.

ఫౌండేషన్ తో పాటు లవంగం నూనెను వాడటం వలన యాక్నే నుంచి ఉపశమనం లభిస్తుంది. యాక్నే వలన కలిగే తీవ్రమైన ఇబ్బంది తగ్గుముఖం పడుతుంది. మేకప్ వేసుకొని రోజులలో కూడా చర్మం శుభ్రంగా ఉంటుంది.

మాయిశ్చరైజర్ తో క్లోవ్ ఆయిల్:

మాయిశ్చరైజర్ తో క్లోవ్ ఆయిల్:

ఈ ట్రీట్మెంట్ ను ప్రారంభించడానికి ముందు మీరు మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇందుకోసం మీరు ఆయిల్ ఫ్రీ క్లీన్సర్ ను వాడాలి. ఆ తరువాత చర్మంపైన తడిని టవల్ తో తుడుచుకుని కాస్తంత మాయిశ్చరైజర్లో ఒక చుక్క లవంగం నూనెను కలిపిన మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకోవాలి. ఈ మాయిశ్చరైజర్ మరియు లవంగం నూనె మిక్స్ తో ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి.

ఈ ప్రాసెస్ ను రోజుకొక్కసారి పాటించాలి. ఈ సులభ పద్దతి ద్వారా చర్మంపై తేమ ఎప్పుడూ నిలిచే ఉంటుంది. లవంగం నూనె అనేది పోర్స్ ఇన్ఫెక్ట్ అవకుండా రక్షిస్తుంది. తద్వారా, యాక్నే మరియు బ్రేకవుట్స్ నుంచి రక్షణను అందిస్తుంది.

అయితే, యాక్నే ను తొలగించుకునేందుకు లవంగం నూనెను వాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా, లవంగం నూనెను వాడటం వలన చర్మం దెబ్బతింటుంది. ఈ ఆయిల్ అనేది గాఢత ఎక్కువగా కలిగి ఉంటుంది. కాబట్టి, దీనిని తగిన మోతాదులో వాడటం మంచిది. అలాగే, దీని వాడకం యొక్క ఫ్రీక్వెన్సీని కూడా లిమిట్ లో ఉంచాలి.

యాక్నేను నిర్మూలించేందుకు లవంగం నూనెను వాడటానికి ఉపయోగపడే కొన్ని చిట్కాలు:

యాక్నేను నిర్మూలించేందుకు లవంగం నూనెను వాడటానికి ఉపయోగపడే కొన్ని చిట్కాలు:

• లవంగం నూనెను ఏ విధంగా వాడినా ఎక్కువ సేపు ముఖంపై ఈ నూనె ఉండకూడదు. త్వరగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అప్లై చేసుకున్న కొన్ని నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోకపోతే చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది.

• సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారు తాము అప్లై చేసుకోవాలనుకున్న మిక్స్ తో ముందుగా ప్యాచ్ టెస్ట్ ను చేయాలి. ఆ తరువాతే ప్రభావిత ప్రాంతంపై ఈ మిక్స్ ను అప్లై చేసుకోవాలి.

English summary

How To Get Rid Of Acne Using Clove Oil

Obtained from the clove plant, clove oil is famous for its antibacterial properties. This clove oil has a heavy aroma and is considered to be an essential oil that does possess several health benefits - one of them being treating your acne. Skin infections can be effectively treated using clove oil, as it is analgesic and antiseptic in nature.
Story first published:Friday, June 8, 2018, 15:13 [IST]
Desktop Bottom Promotion