For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాఫీ పౌడర్ తో అవుతుంది మీ ఫేస్ పర్పెక్ట్

కాఫీ పౌడర్ ను నేరుగా ముఖానికి అప్లై చేసుకోవడం వలన ప్రయోజనం లేదు. కాఫీలో దాగున్న చర్మ సంరక్షణ గుణాలను అందుకునేందుకు దీనిని పెరుగుతో కలిపి స్క్రబ్ ని తయారుచేసుకోవాలి.

|

కాఫీతో డే ను ప్రారంభించేవారు లక్షల్లో ఉన్నారు. ఉదయాన్నే కాఫీ పడకపోతే వీరికి రోజు గడిచినట్టు ఉండదు. అంతలా, కాఫీ అనేది వీరి జీవితాల్లో పెనవేసుకుపోయింది. కాఫీ లేకుండా వీరు రోజును ఉహించుకోలేరు. కాఫీ తాగడం ద్వారా వీరు రోజును ఉత్సాహంగా ప్రారంభిస్తారు. రోజంతా యాక్టివ్ గా ఉంటారు.

హెక్టిక్ వర్క్ డే నాడు కూడా కప్పు కాఫీ అనేది తనదైన శైలిలో ఎనర్జీని బూస్ట్ చేయడానికి తోడ్పడుతుంది. రోజంతా ఉత్సాహంగా పనిచేసేలా తోడ్పడుతుంది.

coffee face scrub

కప్పు కాఫీలో అమృతం వంటి రుచిని ఆస్వాదించడం కాఫీ ప్రియులకు అలవాటే. కాఫీ పౌడర్, పాలు లేదా నీరు తగిన మోతాదులో కలిపితే అద్భుతమైన కాఫీ తయారవుతుంది.

ఎవరి ఇష్టానికి తగినట్టుగా కాఫీని తయారుచేసుకోవచ్చు. కాఫీ ఆ విధంగా మన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాఫీ తయారీలో పదార్థాలను తగిన మోతాదులో వాడితే రుచికరమైన కాఫీ తయారవుతుంది. మీకు ఉత్సాహాన్ని అందిస్తుంది.

అయితే, మీ జీవితంలో ముఖ్యపాత్ర పోషించేవి మీ చర్మ సంరక్షణ విషయంలో కూడా ముఖ్య పాత్ర పోషించగలుగుతాయని మీరెప్పుడైనా ఆలోచించారా? కాఫీలో చర్మ సంరక్షణ గుణాలు అధికంగా కలవు. ఇది మీ చర్మాన్ని అనేకవిధాలుగా సంరక్షిస్తుంది.

1. స్క్రబ్ ని తయారుచేసుకోవాలి

1. స్క్రబ్ ని తయారుచేసుకోవాలి

అయితే, కాఫీ పౌడర్ ను నేరుగా ముఖానికి అప్లై చేసుకోవడం వలన ప్రయోజనం లేదు. కాఫీలో దాగున్న చర్మ సంరక్షణ గుణాలను అందుకునేందుకు దీనిని పెరుగుతో కలిపి స్క్రబ్ ని తయారుచేసుకోవాలి. ఈ ఆర్టికల్ ఈ కాఫీ స్క్రబ్ గురించి వివరిస్తోంది. ఈ స్క్రబ్ గురించి ఇక్కడ తెలుసుకోండి మరి.

కావాల్సిన పదార్థాలు: ఒక టేబుల్ స్పూన్ కాఫీ గ్రౌండ్,

ఒక టేబుల్ స్పూన్ పెరుగు.

2. తయారుచేసే విధానం

2. తయారుచేసే విధానం

తాజా కాఫీ గ్రౌండ్స్ ని ఒక పాత్రలోకి తీసుకోండి. కాఫీ ఎంత రీసెంట్ గా తయారైనదైతే ఈ స్క్రబ్ వలన బెనిఫిట్స్ అంత గొప్పగా ఉంటాయి. దీనికి, ఒక టేబుల్ స్పూన్ చిక్కటి పెరుగును జోడించండి. పెరుగు అన్ ఫ్లేవర్డ్ అయి ఉండాలి. ఈ పదార్థాలను బాగా కలపండి. ఇప్పుడు ఈ స్క్రబ్ అనేది వాడటానికి సిద్ధంగా ఉంది.

ఈ స్క్రబ్ తయారైన వెంటనే వాడవచ్చు. ఈ స్క్రబ్ ని ఓపెన్ గా ఉంచితే పాడయ్యే ప్రమాదం ఉంది. ఫ్రిడ్జ్ లో పెడితే ఈ స్క్రబ్ యొక్క గుణాలు తగ్గిపోతాయి. కాబట్టి, తయారుచేసుకున్న వెంటనే ఈ స్క్రబ్ ను వాడితే ప్రయోజనం అందుతుంది.

3. అప్లై చేసే విధానం

3. అప్లై చేసే విధానం

ఒక కాటన్ బాల్ ని తీసుకుని దాన్ని గోరువెచ్చటి నీటిలో ముంచండి. దీంతో, ముఖాన్ని క్లీన్స్ చేసుకోండి. దీని వలన చర్మంపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ తో పాటు మలినాలు తొలగిపోతాయి.

ముఖాన్ని అలాగే మెడని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకున్నాక ఇప్పుడు ఈ స్క్రబ్ ను ముఖానికి అలాగే మెడకి అప్లై చేసుకోండి. ముఖాన్ని మొత్తం ఈవెన్ గా స్క్రబ్ తో కవర్ చేయాలి. అలాగే మెడభాగాన్ని కూడా స్క్రబ్ తో కవర్ చేయాలి. రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేయాలి. అయితే, స్క్రబ్బింగ్ ప్రాసెస్ ఐదు నిమిషాలకు మించకూడదు.

4. ఎక్కువసేపు పట్టవచ్చు

4. ఎక్కువసేపు పట్టవచ్చు

స్క్రబ్బింగ్ అయిన తరువాత, ముఖంపై ఐదు నుంచి పది నిమిషాల వరకు స్క్రబ్ ని అలాగే ఉండనివ్వండి. ఈ సమయంలో స్క్రబ్ అనేది ఆరుతుంది. కొన్ని సందర్భాలలో (స్కిన్ టైప్ అలాగే వాతావరణంలో తేమను బట్టి), స్క్రబ్ ఆరడానికి మరికొంత ఎక్కువసేపు పట్టవచ్చు. స్క్రబ్ పూర్తిగా ఆరేవరకు మీరు స్క్రబ్ ను తొలగించకూడదు.

స్క్రబ్ ని తొలగించేటప్పుడు, ఫింగర్స్ ను అలాగే గోరువెచ్చటి నీటిని వాడండి. స్క్రబ్ ని తొలగించాక, ఇంకొక కాటన్ బాల్ ని తీసుకుని దాన్ని గోరువెచ్చటి నీటిలో ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

ఇప్పుడు, మీరు సాధారణంగా వాడే నైట్ క్రీమ్ ను అప్లై చేసుకోండి. ఈ ప్రాసెస్ ను వారానికి ఒకసారి వాడితే మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ ప్యాక్ అనేది పిల్లలకు కూడా సురక్షితమే.

5. కాఫీ వలన చర్మానికి అందే ప్రయోజనాలు

5. కాఫీ వలన చర్మానికి అందే ప్రయోజనాలు

ఈ ఫేస్ స్క్రబ్ తయారీలో కాఫీ గ్రౌండ్స్ ని వాడటం జరిగింది. కాఫీ పౌడర్ కంటే కాఫీ గ్రౌండ్స్ ను ఎందుకు ఎంచుకున్నామంటే గ్రౌండ్స్ లో ఉండే గరుకుతనం చర్మాన్ని ఎక్స్ఫోలియెట్ చేసేందుకు తోడ్పడుతుంది. అలాగే, చర్మానికి సహజ కాంతిని అందిస్తుంది.

6. యాంటీ ఆక్సిడెంట్స్

6. యాంటీ ఆక్సిడెంట్స్

కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. కాఫీలో లభ్యమయ్యే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ అనేది ఎంతో ప్రాచుర్యం చెందినది. దీంతో పాటు ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ వలన చర్మంలోని రక్త ప్రసరణ మెరుగవుతుంది. తద్వారా, చర్మం సహజంగా మెరుస్తుంది.

అందువలన, కాఫీ అనేది కేవలం రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికే పరిమితం కాలేదు. చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు కూడా తోడ్పడుతుంది. వీకెండ్స్ లో ఈ కాఫీ స్క్రబ్ ను ప్రిఫర్ చేయడం ద్వారా చర్మంపై పేరుకున్న మురికి, దుమ్ము మరియు పొల్యూషన్ ను తొలగించుకోవచ్చు.

అలాగే యువీ రేస్ వలన దెబ్బతిన్న చర్మాన్ని తిరిగి మాములు స్థితికి తేవడానికి కాఫీ తోడ్పడుతుంది. కొలాజిన్ మరియు ఎలాస్టిన్ ఉత్పత్తి పెరగడంతో చర్మం సహజ మెరుపును పొందుతుంది. ఇవన్నీ కాఫీ ద్వారా లభించే ప్రయోజనాలు. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ కలిగిన వారికి ఈ కాఫీ స్క్రబ్ అనేది అత్యంత ఉపయోగకరం.

7.. చిట్కా

7.. చిట్కా

డైరీ ప్రోడక్ట్స్ కి మీరు అలర్జిక్ అయితే, ఈ ఫేస్ ప్యాక్ నుంచి మీరు దూరంగా ఉండనవసరం లేదు. అయితే, ఈ ప్యాక్ తయారీలో వాడిన పెరుగుకి బదులుగా మీరు తేనెను వాడవచ్చు. ఈ ప్యాక్ ను వాడి కాఫీ ద్వారా అందే చర్మసంరక్షణ గుణాలను సొంతం చేసుకోండి మరి.

English summary

How To Make Coffee Scrub For Oily Skin

For most millennials, coffee is the only way to wake up. A morning without caffeine is pretty much unimaginable. The day literally kicks start from the moment the first sip of coffee is sipped. Even in the course of a hectic work day, the only thing that keeps us going is that one mug of coffee. It is not wrong to say that coffee is what gives us an energy boost throughout the day.
Desktop Bottom Promotion