Latest Updates
-
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి
ముక్కు మీది బ్లాక్ హెడ్స్ ను ఎలా తొలగించాలి?
ముక్కు మీది బ్లాక్ హెడ్స్ ను ఎలా తొలగించాలి?
బ్లాక్ హెడ్స్ మనకు చికాకు కలిగించే చర్మ సమస్యలలో ముఖ్యమైనవి. ఇవి మన ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయడం వలన నలుగురితో కలిసే ఏదైనా వేడుకలో ఉత్సాహంగా పాలుపంచుకోలేము. ఇవి సాధారణంగా గడ్డం, బుగ్గలు, మొదలైన భాగాల్లో కనిపించినప్పటికి, ఎక్కువగా ముక్కుపై కనిపిస్తాయి. ఇవి ఎటువంటి చర్మ పొర లేని చిన్న మచ్చలు.
అతిగా సూర్యతాపానికి గురవడం మరియు కాలుష్యం వంటి ఇతర పర్యావరణ కారణాల వలన చర్మం మీద బ్లాక్ హెడ్స్ వస్తాయి. కొన్నిసార్లు, హార్మోన్ మార్పులు కూడా దీనికి కారణం కావచ్చు. వివిధ కారణాల వలన చర్మంన్పై మృతకణాలు పేరుకుపోయి, బ్లాక్ హెడ్స్ ఏర్పడి ముఖం కాంతివిహీనంగా మారుతుంది.

బ్లాక్ హెడ్స్ ను తొలగించడానికి, మృతచర్మకణాలను తొలగించడం చాలా అవసరం. వారానికి ఒకటి లేదా రెండుసార్లు క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే, మంచి ఫలితం ఉంటుంది. కొన్ని రకాల వంటింటి పదార్థాలను దీనికై మనం ఉపయోగించవచ్చు. అవేమిటో, ఇప్పుడు మనం చూద్దాం.

1. కోడి గుడ్డు తెల్లసొన మాస్కు
గుడ్డు యొక్క తెల్లసొనలో ఉన్న పోషకాలు మృతచర్మకణాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇవి బ్లాక్ హెడ్స్ ను కూడా తొలగిస్తాయి.
కావలసిన పదార్థాలు:
2 గుడ్డు తెల్లసొనలు
ఎలా వాడాలి:
1. 2 గుడ్లు నుండి తెల్లసొనలు వేరుచేయండి.
2. బ్లెండర్ సహాయంతో, బాగా మృదువుగా గిలకొట్టండి.
3. తరువాత, టిష్యు కాగితాలను మీ ముక్కు మీద పెట్టండి.
4. ఇప్పుడు బ్రష్ తో తెల్లసొనను కాగితంపై పూయండి.
5. గుడ్డు తెల్లసొన బాగా ఇంకెంత వరకు ఆగండి.
6. పొడిగా మారిన తర్వాత, కాగితంను తొలగించండి.
7. ఇలా పలుమార్లు చేస్తే తేడా మీకే తెలుస్తుంది.

2. చక్కెర మరియు నిమ్మకాయ మాస్క్
ఈ మాస్కును చర్మం మీది మృతకణాలను తొలగించడానికి ఉత్తమమైనదిగా భావిస్తారు. ఇది చర్మం నుండి విషతుల్య పదార్థాలను తొలగిస్తుంది.
కావలసిన పదార్థాలు:
1 టేబుల్ స్పూన్ చక్కెర
2-3 టేబుల్ స్పూన్ల నిమ్మ రసం
ఎలా వాడాలి:
1. ఒక శుభ్రమైన గిన్నెలో, ఒక టేబుల్ స్పూన్ చక్కెర తీసుకోండి.
2. ఇప్పుడు ఒక నిమ్మకాయను కట్ చేసి, కొన్ని చుక్కల నిమ్మరసం చక్కెరలో వేసి పిండి బాగా కలపాలి.
3. దీనితో మీ ముక్కు మీద మృదువుగా కొన్ని నిమిషాల పాటు వలయాకార కదలికలలో మర్దన చేయండి.
4. 10 నిముషాలు తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
5. ఉత్తమమైన మరియు వేగవంతమైన ఫలితాల కొరకు ఇలా వారానికి 2-3 సార్లు చేయండి.

3.పాలు మరియు జిలాటిన్ మాస్క్:
ఈ మాస్క్ చర్మం సంరక్షణకు బాగా పనిచేస్తుంది.
కావలసిన పదార్థాలు:
1 టేబుల్ స్పూన్ పాలు
1 టేబుల్ స్పూన్ జెలాటిన్
ఎలా వాడాలి:
1. ఒక శుభ్రమైన గిన్నెలో 1 టేబుల్ స్పూన్ రుచి, వాసన లేని జెలటిన్ పొడి తీసుకోండి.
2. జెలటిన్ పౌడర్ లో 1 టేబుల్ స్పూన్ పాలు వేసి, నెమ్మదిగా రెండు పదార్థాలను కలపాలి.
3. ఇప్పుడు, కొన్ని సెకన్ల పాటు ఈ మిశ్రమాన్ని వేడి చేయండి.
4. మిశ్రమం కొద్దిగా చల్లారాక, మీ ముక్కు మీద ఒక పొరలా పూసుకోండి.
5. సుమారు 15 నిముషాల ఆరనివ్వండి.
6. తరువాత ఆ పొరను తీసివేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివలన చర్మరంధ్రాలు తెరచుకుంటాయి.

4. తేనె మరియు పైనాపిల్ మాస్క్
పైనాపిల్ చర్మం నుండి అదనపు నూనెను తొలగించడంలో సహాయపడుతుంది మరియు తేనె చర్మం తేమగా ఉండేలా చేస్తుంది.
కావలసిన పదార్థాలు:
1 కప్పు పైనాపిల్ రసం
2 టేబుల్ స్పూన్లు తేనె
ఎలా వాడాలి:
1. ఒక పైనాపిల్ ను చిన్న చిన్న ముక్కలుగా కోసి, బ్లెండ్ చేయండి.
2. ఇప్పుడు రసాన్ని వడగట్టి ఒక శుభ్రమైన గిన్నెలో వేయండి.
3. 2 టేబుల్ స్పూన్ల తేనేని ఈ రసంలో వేయండి.
4. మీ ముఖానికి ఈ మాస్కును రాసుకుని 20 నిమిషాలు ఆరనివ్వండి.
5. 20 నిముషాల తర్వాత, గోరువెచ్చని నీటిలో ముంచిన బట్టతో దాన్ని తుడిచేయండి.

5. టమాటో మరియు ఉప్పు
టమాటోలోని యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని శుభ్రపరచి, హైడ్రేట్ చేయడంలో సహాయపడతాయి.
కావలసిన పదార్థాలు:
1 టేబుల్ స్పూన్ ఉప్పు
2 టేబుల్ స్పూన్లు టమాటో ప్యూరీ
ఎలా వాడాలి:
1. ఒక టొమాటో తీసుకొని బ్లెండ్ చేసి ప్యూరీ చేయండి.
2. టమాటో ప్యూరీలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు కలపండి.
3. బాగా కలిసాక, మీ ముక్కు మీద ఈ మిశ్రమాన్ని మృదువుగా వలయాకారంలో మర్దన చేసుకుంటూ రాసుకోండి.
4. 5-10 నిముషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.



Click it and Unblock the Notifications