For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మంపై పేరుకున్న మృతకణాలను ప్రకృతి సహజ పదార్థాలతో ఎలా తొలగించవచ్చు?

చర్మంపై పేరుకున్న మృతకణాలను ప్రకృతి సహజ పదార్థాలతో ఎలా తొలగించవచ్చు?

|

అప్పుడప్పుడు చర్మాన్ని నలుచుకుంటే, చర్మంపై పేరుకున్న మృతకణాలు తొలగి ఆరోగ్యంగా మరియు శుభ్రంగా ఉంటుంది. మృతకణాలు చర్మాన్ని కాంతిహీనంగా మరియు నల్లగా మారుస్తాయి. మృతకణాలు చర్మంపై పేరుకుపోవడం వలన మేనిఛాయ తగ్గిపోతుంది.

నలుచుకోవటం మృతకణాలు మాత్రమే కాక మొటిమలు, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ మొదలనవి కూడా తొలిగిపోతాయి. వీటన్నింటినీ తొలగించడానికి క్రమం తప్పకుండా నాలుగు పెట్టుకోవాలి. దీని వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

How To Remove Dead Skin Cells From Body Naturally?

మృతకణ చికిత్సకు కొన్ని సులువుగా పాటించగలిగే, గృహసంబంధమైన పరిష్కారాలను ఇప్పుడు తెలుసుకుందాం.

✔️తినే సోడా

✔️తినే సోడా

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ తినే సోడా

1 విటమిన్ E గుళిక

వాడే విధానం:

1. ముందుగా ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ తినే సోడా తీసుకోండి.

2. ఒక విటమిన్ E గుళికను తీసుకుని దాన్ని తెరచి లోపల ఉండే నూనెను వెలికి తీయండి.

3. తినే సోడాలో ఈ నూనెను వేసి బాగా కలపాలి.

4. మిశ్రమం బాగా పొడిగా ఉన్నట్లైతే, కొంచెం నీరు కలపండి.

5. ప్రభావిత ప్రదేశంలో రాసుకుని 2-3 నిమిషాల పాటు వలయాకారంలో మృదువుగా మర్దన చేసుకుంటూ రాసుకోండి.

6. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

✔️పంచదార మరియు తేనె

✔️పంచదార మరియు తేనె

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ పంచదార

1 టేబుల్ స్పూన్ తేనె

వాడే విధానం:

1. 1 టేబుల్ స్పూన్ పంచదార మరియు 1 టేబుల్ స్పూన్ తేనె కలపండి.

2. ఈ మిశ్రమంతో ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని నిమిషాల పాటు మృదువుగా మర్దన చేసుకోండి.

3. చివరిగా నీటితో శుభ్రం చేసుకోవాలి.

✔️బ్రౌన్ షుగర్ మరియు కొబ్బరినూనె:

✔️బ్రౌన్ షుగర్ మరియు కొబ్బరినూనె:

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్

1 టేబుల్ స్పూన్ కొబ్బరినూనె

వాడే విధానం:

1. బ్రౌన్ షుగర్ మరియు కొబ్బరినూనెలను బాగా కలపండి.

2. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రదేశంలో రాసుకుని కొద్ది నిమిషాల పాటు మృదువుగా మర్దన చేసుకోండి.

3. కనీసం 5 నిమిషాలు ఆరనిచ్చిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

4. మీ అవసరాన్ని అనుసరించి, పదార్థాల పరిమాణం పెంచుకోవచ్చు.

5. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయాలి.

✔️యాపిల్ సిడర్ వెనిగర్:

✔️యాపిల్ సిడర్ వెనిగర్:

కావలసిన పదార్థాలు:

1 టీ స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్

1 టీ స్పూన్ నీరు

దూది ఉండ

వాడే విధానం:

1. టీ స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ ను 1 టీ స్పూన్ నీటితో పలుచన చేయండి.

2. ఈ ద్రావణంలో దూది ఉండను ముంచి, ప్రభావిత ప్రదేశంలో రాసుకోండి.

3.10-15 నిమిషాలు పాటు ఆరనిచ్చి, చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

4. ఇలా వారానికి కనీసం ఒక్కసారైనా చేయాలి.

✔️కాఫీ గుండ:

✔️కాఫీ గుండ:

కావలసిన పదార్థాలు:

2-3 టేబుల్ స్పూన్ కాఫీ గుండ

1 టేబుల్ స్పూన్ కొబ్బరినూనె/ఆలివ్ నూనె

నీరు

వాడే విధానం:

1. 2-3 టేబుల్ స్పూన్ల కాఫీ పోడిని ఒక గిన్నెలో తీసుకోండి.

2. దీనికి కొన్ని చుక్కల కొబ్బరినూనె/ఆలివ్ నూనె బాగా కలపండి.

3. చివరిగా ఈ మిశ్రమానికి కొంచెం నీటిని కలపండి.

4. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రదేశంలో 3-4 నిమిషాల పాటు మృదువుగా మర్దన చేసుకుంటూ రాసుకోండి.

5. సాధారణ నీటితో కొంతసేపటి తరువాత శుభ్రం చేసుకోవాలి.

✔️ఓట్ మీల్:

✔️ఓట్ మీల్:

కావలసిన పదార్థాలు:

2 టీ స్పూన్ ఓట్ మీల్

నీరు

వాడే విధానం:

1. ముందుగా ఓట్ మీల్ ను బ్లెండ్ చేసి పొడిగా చేసుకోండి.

2. దీనిలో నీటిని కలిపి ప్రభావిత ప్రదేశంలో కొద్ది నిమిషాల పాటు మృదువుగా మర్దన చేసుకోండి.

3. కొద్ది నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

4. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేస్తే ఉత్తమ ఫలితాలు త్వరగా వస్తాయి.

Read more about: how to remedies skin care
English summary

How To Remove Dead Skin Cells From Body Naturally?

Exfoliation of your skin once in a while is important to keep your skin healthy and clean. It helps in removing the dead skin cells that makes the skin look dull and dark. So in order to remove these exfoliation should be done on a frequent basis if you wish to keep your skin healthy always. Some ingredients that you can use are baking soda, honey, sugar, etc,.
Story first published:Monday, July 9, 2018, 12:24 [IST]
Desktop Bottom Promotion