ఉసిరికాయ వలన , మొటిమలు, మృతచర్మకణాల తొలగి చర్మ సౌందర్యం రెట్టింపు

ఉసిరికాయ వలన , మొటిమలు, మృతచర్మకణాల తొలగి చర్మ సౌందర్యం రెట్టింపు

అధిక-నాణ్యతతో కూడిన ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తులలో కనిపించే కొన్ని పదార్ధాలు, సహజ ఉత్పత్తులేనని మీరు ఎప్పుడైనా గ్రహించారా? ఇవి చాలా సులభమైన, సహజమైన, చవకైన, ఉత్పత్తులు మరియు గృహ చర్మ చికిత్సలలో ఉపయోగిస్తే, అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి. అంతేకాక, మీరు వాటిని మీరు తయారు చేసినప్పుడు, అవి ఎక్కడ నుండి వచ్చాయో, ఎన్ని రకాలుగా వాడవచ్చో, వాటి ఉపయోగాలు ఏమిటో, వాటి ప్రయోజనాలు ఏమిటో మరియు ఎలా పనిచేస్తాయో మీకు బాగా తెలుస్తుంది. మీకిది అంగీకారయోగ్యమైతే, మీ సౌందర్య పోషణకు ఉపయోగించదగిన అద్భుతమైన పదార్ధం ఉసిరికాయ.

ఉసిరికాయ లేదా 'ఇండియన్ గూస్బెర్రీ' లో అపారమైన పోషక ప్రయోజనాలు ఉన్నాయి. ఉసిరికాయ అమరత్వానికి పర్యాయపదంగా చెప్పడానికి ఒక కారణం ఉంది. ఉసిరికాయ కేశ మరియు చర్మ సంరక్షణకై అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తున్న ఒక ఆయుర్వేద ఆహారం. దీని విలువను గ్రహించిన వారిలో చాలామంది, తమ రోజును ఉసిరిక రసంతో ప్రారంభిస్తున్నారు. మీ కేశ మరియు చర్మ సంరక్షణ కోసం ఉసిరికాయలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకోండి.

5 Ways To Use Amla For Skin Care

ఉసిరికాయ చర్మానికి ఏ విధంగా మేలు చేస్తుంది?

ఉసిరికాయలకు మన చర్మాన్ని బాధించే వివిధ సమస్యలను నయం చేసి, ఎన్నో వైద్యపరమైన ప్రయోజనాలను చేకూర్చే శక్తి ఉంది. ఉదాహరణకి, ఇది ముఖం మీద మోటిమలు, మచ్చలను నిరోధించి చర్మాన్ని మెరిసేటట్టు చేస్తుంది. ఉసిరికాయ మీ చర్మం కోరకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఇప్పుడు!

1. మొటిమలు మరియు మచ్చలను నయం చేస్తుంది.

1. మొటిమలు మరియు మచ్చలను నయం చేస్తుంది.

మొటిమలు మరియు మచ్చలు చికిత్స కొరకు ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఉసిరికాయ పేస్టును ప్రభావిత ప్రాంతం పై రాసుకున్నప్పుడు, మచ్చలు మెల్లగా నయం చేయడమే కాక, మొటిమలను తిరిగి రాకుండా చేస్తుంది. ఇది మన సహజ రక్తాన్ని శుద్ధి చేసే ఒక సహజ పదార్ధంగా పనిచేస్తుంది. చర్మంపై దాడి చేసే సూక్ష్మజీవులను నిర్మూలించి చర్మవ్యాధులను అరికడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఉసిరిక రసం తాగడం వలన, దోషరహిత చర్మం మీ సొంతమవుతుంది.

2. మేనికాంతిని ఇనుమదింపచేస్తుంది.

2. మేనికాంతిని ఇనుమదింపచేస్తుంది.

ఉసిరిక రసంలో ఉండే యాంటిఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి, మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేసి, నూతన కాంతిని ఇస్తాయి. కనుక, ఉసిరిక రసాన్ని మీ ముఖానికి ప్యాకుగా ఉపయోగిస్తే, మేనిఛాయను తేలికపరచి, మచ్చ లేని చర్మాన్ని అందిస్తుంది.

3. వయస్సు మీద పడుతున్న లక్షణాలు మందగించేట్టు చేస్తుంది.

3. వయస్సు మీద పడుతున్న లక్షణాలు మందగించేట్టు చేస్తుంది.

మీ ముఖం మీద పెరుగుతున్న వయస్సు యొక్క సంకేతాలను నివారించేందుకు, ఉసిరిక రసం సహాయపడుతుంది. ఉసిరికాయలో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నందున, మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిలోని విటమిన్ సి, ముఖ్యంగా, మీ చర్మాన్ని చాలా కాలం వరకు యవ్వనంగా ఉంచడంలో తోడ్పడుతుంది. ఉసిరిక రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే, నల్లని మచ్చలు, ముడుతలు, సన్నని గీతలు వంటి వృద్ధాప్య సంకేతాలు తగ్గుముఖం పడతాయి.

 4. చర్మాన్ని టోన్ చేస్తుంది.

4. చర్మాన్ని టోన్ చేస్తుంది.

కొల్లాజెన్ ఉత్పత్తిలో క్షీణత మూలంగా, చర్మం దాని స్థితిస్థాపకత కోల్పోయి కాంతివిహీనంగా, సాగిపోయినట్లు కనిపిస్తుంది. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున, కొల్లాజెన్ కణాలను పునరుత్తేజితం చేసి, మీ చర్మంను మృదువుగా మరియు యవ్వనంగా కనిపించేటట్టు చేస్తుంది. ఇది చర్మాన్ని టోన్ చేసి, బిగుతుగా మారుస్తుంది.

5. పిగ్మెంటేషన్ కు చికిత్స చేస్తుంది.

5. పిగ్మెంటేషన్ కు చికిత్స చేస్తుంది.

పిగ్మెంటేషన్ ను తగ్గించడం ద్వారా ఉసిరికాయ మనకు సహాయం చేస్తుంది. ముఖం మీద క్రమం తప్పకుండా ఉసిరికాయను ఉపయోగించడం ద్వారా, చర్మం పై మచ్చలను మరియు పిగ్మెంటేషన్ ను తేలికగా తగ్గించవచ్చు. ఉసిరికాయ లో సమృద్ధిగా ఉండే యాంటిఆక్సిడెంట్ల వలన ఇది మంచి యాస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది.

6. మృతచర్మకణాలను తొలగిస్తుంది.

6. మృతచర్మకణాలను తొలగిస్తుంది.

మీరు తిన్నా లేదా చర్మం పై పూసుకున్నా, ఉసిరికాయ మంచి క్లెన్సర్ లా పనిచేస్తుంది. తేలికపాటి ఎక్స్ఫోలియేటర్ గా పనిచేయటం మూలాన, ఇది మృతచర్మ కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. మీ చర్మం సున్నితమైనది అయితే, రాసుకునే ముందు ఉసిరిక రసాన్ని ముందు నీటితో పలుచన చేయండి.

7. దెబ్బతిన్న కణజాలాన్ని మరమ్మత్తు చేస్తుంది.

7. దెబ్బతిన్న కణజాలాన్ని మరమ్మత్తు చేస్తుంది.

ఉసిరికాయ, చర్మంపై దెబ్బతిన్న కణజాలాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే కాక, పొడిదనం వలన పొలుసులుగా మారిన చర్మాన్ని కొల్కునేట్టు చేసే ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. చర్మం మీద ఉసిరిక రసంను క్రమం తప్పకుండా పూసుకుంటే, ఆరోగ్యకరమైన, స్పష్టమైన చర్మంను సాధించవచ్చు.

చర్మ సంరక్షణ కొరకు ఉసిరికాయను ఎలా ఉపయోగించాలి?

చర్మ సంరక్షణ కొరకు ఉసిరికాయను ఎలా ఉపయోగించాలి?

చర్మ సంరక్షణ కొరకు ఉసిరికాయలను ఉపయోగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఫేస్ ప్యాక్, క్లెన్సర్ మరియు టోనర్ రూపంలోనే కాక చర్మం పైపూతగా, ఉసిరికాయను ప్రతిరోజు ఉపయోగించడం వలన , కొద్దీ రోజులలోనే మీ చర్మంలో తేడాను మీరు గమనించవచ్చు. మీ చర్మ సంరక్షణ క్రమంలో ఉసిరికాయలను ఉపయోగించే రెండు మార్గాలను ఇప్పుడు తెలియజేయబోతున్నాము.

1. మచ్చలను నిర్మూలించే ఉసిరికాయ & పసుపు ఫేస్ ప్యాక్

కావలసిన పదార్థాలు:

• 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం

• 3 టేబుల్ స్పూన్ల ఉసిరిక పొడి

• 1 టీస్పూన్ పసుపు

వాడే విధానం:

పై పదార్థాలన్నింటిని కలిపి చిక్కని పేస్ట్ తయారు చేసి, మీ ముఖానికి రాసుకోండి.

15 నుంచి 20 నిముషాల పాటు ఆరనిచ్చి కడిగేయాలి.

అందమైన చర్మం పొందేందుకు, ప్రతి వారం ఇలా చేయండి.

2. చర్మం తెల్లబడటం కొరకు ఉసిరిక రసం మరియు బొప్పాయి గుజ్జు మాస్క్ :

2. చర్మం తెల్లబడటం కొరకు ఉసిరిక రసం మరియు బొప్పాయి గుజ్జు మాస్క్ :

కావలసిన పదార్థాలు

• 2 టేబుల్ స్పూన్ ఉసిరిక రసం

• కొంచెం బొప్పాయి గుజ్జు

• 1 టేబుల్ స్పూన్ తేనె

వాడే విధానం:

అన్ని పదార్థాలను బాగా కలిపి మరియు మీ ముఖానికి రాసుకోవాలి.

20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

మేనిఛాయ తేలిక పడేవరకు వారానికి ఒకసారి ఇలా చేయాలి.

Desktop Bottom Promotion