For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆపిల్ సిడర్ వినేగార్ తో యాక్నేను ఎలా తగ్గించుకోవచ్చు?

ఆపిల్ సిడర్ వినేగార్ తో యాక్నేను ఎలా తగ్గించుకోవచ్చు?

|

యాపిల్ సిడర్ వినేగార్ ద్వారా అందే బ్యూటీ బెనిఫిట్స్ అనేవి ఈ మధ్య కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. షుగర్, ఈస్ట్ మరియు ఆపిల్స్ నుంచి తయారైన ఈ ఒక రకమైన వినేగార్ బ్రౌనిష్ గోల్డ్ కలర్ లో ఉంటుంది. దీని నుంచి అనేక సౌందర్య అలాగే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వివిధ రకాల చర్మ సమస్యలను తగ్గించేందుకు ఆపిల్ సిడర్ వినేగార్ ను ఉపయోగించడం ప్రాచుర్యం పొందిన విషయమే.

అందుకే, దీన్ని ఎసెన్షియల్ స్కిన్ కేర్ ఇంగ్రీడియెంట్ గా పేర్కొంటారు. బ్యూటీ రొటీన్ లో యాపిల్ సిడర్ వినేగార్ ను ముఖ్యమైన స్థానం లభించడానికి కూడా ఒక కారణం ఉంది. ఈ పదార్థంలో వివిధ చర్మ సమస్యలను నివారించే గుణాలు కలవు.

How To Use Apple Cider Vinegar To Treat Acne

ఉదాహరణకు, ఇందులో అల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్స్ కలవు. ఈ పదార్థాలు చర్మంపై పేరుకున్న డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తాయి. అలాగే, చర్మానికి నిగారింపును అందిస్తాయి. స్కిన్ టెక్స్చర్ ను మెరుగుపరిచే గుణాలు కూడా ఇందులో పుష్కలంగా కలవు. అలాగే, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా తొలగిపోతాయి.

యాక్నేను తగ్గించేందుకు యాపిల్ సిడర్ వినేగార్ అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో, సిట్రిక్, లాక్టిక్ మరియు ఎసిటిక్ యాసిడ్స్ కలవు. ఇవి చర్మం యొక్క పీహెచ్ లెవెల్స్ ను బాలన్స్ చేస్తాయి. యాక్నేకు దారితీసే బాక్టీరియాను నశింపచేస్తాయి. ఇందులో, లభించే యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ అనేవి యాక్నే ద్వారా తలెత్తే ఇంఫ్లేమేషన్ , రెడ్ నెస్ తో పాటు దురదను తగ్గించి ఉపశమనాన్ని అందిస్తాయి. వివిధ అధ్యయనాలలో ఈ విషయం స్పష్టమైంది. యాపిల్ సిడర్ వినేగార్ అనేది యాక్నే బారిన పడే చర్మాన్ని సంరక్షిస్తుంది.

ఆపిల్ సిడర్ వినేగార్ ని పైపూతగా స్కిన్ పై వాడితే స్కిన్ పోర్స్ లో దాగున్న మురికి అలాగే బాక్టీరియా తొలగిపోతాయి. దీన్ని రెగ్యులర్ గా వాడితే యాక్నే సమస్య తగ్గిపోతుంది.

ఆపిల్ సిడర్ వినేగార్ ని యాక్నే ప్రోన్ స్కిన్ కలిగిన వారు ఏ విధంగా వాడితే వారి చర్మానికి మేలు కలుగుతుందో ఇక్కడ సరళంగా వివరించాము.

యాక్నే సమస్యను తగ్గించుకునేందుకు ఆపిల్ సిడర్ వినేగార్ టోనర్ ను తయారుచేయడమెలా?

యాక్నే సమస్యను తగ్గించుకునేందుకు ఆపిల్ సిడర్ వినేగార్ టోనర్ ను తయారుచేయడమెలా?

కావలసిన పదార్థాలు:

2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సిడర్ వినేగార్

2 కప్పుల డిస్టిల్డ్ వాటర్

1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్

ఎలా వాడాలి:

• ఈ పదార్థాలన్నిటినీ కలిపి మిశ్రమాన్ని తయారుచేయండి.

•ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్ లోకి తీసుకుని చల్లటి అలాగే పొడి ప్రాంతంలో భద్రపరచండి.

• ఈ టోనర్ ని కాటన్ బాల్ పై కాస్తంత స్ప్రే చేయండి.

• ఈ కాటన్ బాల్ తో చర్మాన్ని సున్నితంగా రుద్దండి.

ఎలా పనిచేస్తుంది?

ఆపిల్ సిడర్ వినేగార్ లో ఉండే యాసిడిక్ ప్రాపర్టీస్ అనేవి అలోవెరా జెల్ లో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ తో కలిసి చర్మాన్ని సంరక్షిస్తాయి. యాక్నేకి దారితీసే బాక్టీరియాను తొలగిస్తాయి. అలాగే, ఈ టోనర్ అనేది తరచూ యాక్నే బారిన పడే వారికి ఇంఫ్లేమేషన్ మరియు ఇచీనెస్ నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది.

యాక్నేను తొలగించడం కోసం యాపిల్ సిడర్ వినేగార్ పేస్ట్ ను తయారుచేయడమెలా

యాక్నేను తొలగించడం కోసం యాపిల్ సిడర్ వినేగార్ పేస్ట్ ను తయారుచేయడమెలా

కావాల్సిన పదార్థాలు:

2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సిడర్ వినేగార్

3 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా

1 టీస్పూన్ డిస్టిల్డ్ వాటర్

ఎలా వాడాలి:

• పైన పేర్కొన్న పదార్థాలని బాగా కలిపి పేస్ట్ ను తయారుచేయండి.

• ప్రభావిత ప్రాంతంపై దీనిని అప్లై చేయండి.

• ఐదు నుంచి పది నిమిషాల పాటు అలాగే ఉంచండి.

• గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడగండి.

ఎలా పనిచేస్తుంది:

యాపిల్ సిడర్ వినేగార్ లోని సుగుణాలు బేకింగ్ సోడాలోని యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ తో కలిసి చర్మాన్ని డీటాక్సిఫై చేసేందుకు తోడ్పడతాయి. తద్వారా, యాక్నేకు దారితీసే బాక్టీరియాను తొలగిస్తాయి.

యాక్నేను తొలగించేందుకు ఆపిల్ సిడర్ వినేగార్ స్క్రబ్:

యాక్నేను తొలగించేందుకు ఆపిల్ సిడర్ వినేగార్ స్క్రబ్:

కావాల్సిన పదార్థాలు:

2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సిడర్ వినేగార్

2 టేబుల్ స్పూన్ల గ్రాన్యులేటెడ్ షుగర్

ఎలా వాడాలి:

• ఈ పదార్థాలని బాగా కలపండి.

• తయారైన మిశ్రమంతో ముఖంపై స్క్రబ్ చేయండి.

• గోరువెచ్చటి నీటితో రిన్స్ చేయండి.

ఎలా పనిచేస్తుంది

ఈ స్క్రబ్ చర్మాన్ని ఎక్స్ఫోలియెట్ చేసేందుకు తోడ్పడుతుంది. పోర్స్ లో పేరుకున్న మురికిని తొలగించి ఇన్ఫెక్షన్ కు దారితీసే బాక్టీరియాపై పోరాటం జరుపుతుంది. ఆపిల్ సిడర్ వినేగార్ లో ఉండే యాసిడిక్ ప్రాపర్టీస్ షుగర్ లో ఉండే హ్యూమేక్టన్ట్ ఏజెంట్స్ తో కలిసి చర్మం యొక్క పీ హెచ్ లెవల్స్ ని బాలన్స్ చేసేందుకు తోడ్పడతాయి. ఆ విధంగా యాక్నే బ్రేకవుట్స్ ను తొలగిస్తాయి.

ఆపిల్ సిడర్ వినేగార్ స్టీమ్

ఆపిల్ సిడర్ వినేగార్ స్టీమ్

కావలసిన పదార్థాలు:

2 టేబుల్ స్పూన్స్ ఆపిల్ సిడర్ వినేగార్

2 కప్పుల బాయిల్డ్ వాటర్

3 లేదా నాలుగు చుక్కల టీ ట్రీ ఆయిల్

ఎలా వాడాలి:

• బాయిల్డ్ వాటర్ ని ఒక పెద్ద పాత్రలోకి తీసుకోండి. అందులో పైన పేర్కొన్న పదార్థాలను వేయండి.

• ఈ నీటిని ముఖానికి ఆవిరి పట్టించండి. ఈ క్రమంలో ఆవిరి బయటకు పోకుండా తలపై టవల్ తో కవర్ చేసుకోండి.

• ఇలా పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆవిరి పట్టండి.

• గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోండి.

ఇదెలా పనిచేస్తుంది:

పోర్స్ లో పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ అలాగే మురికి వలన యాక్నే సమస్య తలెత్తుతుంది. ముఖానికి ఆవిరిపట్టేటప్పుడు మూసుకుపోయిన పోర్స్ అనేవి తెరుచుకుంటాయి. ఆ విధంగా పొర్స్ క్లీన్ అవుతాయి. ఈ విధానంలో ఆవిరి పెట్టడం ద్వారా ఆపిల్ సిడర్ వినేగార్ మరియు టీ ట్రీ ఆయిల్ లోని సుగుణాలు చర్మంలోకి ప్రవేశించి చర్మాన్ని నరిష్ చేస్తాయి. ఆ విధంగా యాక్నే సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది

English summary

How To Use Apple Cider Vinegar To Treat Acne

Often cited as an essential skin care ingredient, there are numerous reasons why apple cider vinegar deserves a spot in your beauty routine. It contains compounds that can treat a myriad of skin problems including acne. Apple cider vinegar is considered to be quite effective in treating acne. It contains citric, lactic and acetic acids.
Story first published:Tuesday, July 31, 2018, 14:54 [IST]
Desktop Bottom Promotion