For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ లెమన్ ప్యాక్స్ తో మీ స్కిన్ గ్లో మరింత పెరుగుతుందట...

విభిన్న రకాల చర్మాలకు నిమ్మతో కూడిన ఫేస్ ప్యాక్స్

|

కొన్ని సందర్భాలలో మీ చర్మం రకాన్ని అనుసరించి ఉత్పత్తులు లేదా నివారణలను ఎంచుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు, పొడి చర్మానికి కొన్ని రకాల పదార్ధాలు సరిపోతే, జిడ్డు లేదా ఆయిలీ చర్మానికి కొన్ని ప్రత్యేకమైన పదార్ధాలని వినియోగించవలసి ఉంటుంది. అంతేకాకుండా సాధారణ చర్మం, సున్నితమైన చర్మ రకాలు కూడా ఉంటాయి. కానీ ఎటువంటి చర్మ రకాలకైనా వినియోగించగల పదార్దాలు మాత్రం కొన్నే ఉంటాయి, అందులో నిమ్మకాయ ఒకటి. మనం సాధారణంగా వినియోగించే ఫేస్ వాష్ లేదా ఇతర చర్మ సంరక్షణా ఉత్పత్తులలో నిమ్మను కలిగి ఉన్న ఎడల, చర్మానికి ఎంతో ఉపయోగం చేకూరుతుందని మనకు ఇదివరకే తెలుసు. అటువంటి నిమ్మతో కూడిన, మరియు ఇంట్లో తయారు చేయగల మాస్కులను ఉపయోగించడం ద్వారా మరిన్ని ప్రయోజనాలను పొందగలరని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు.

How To Use Lemon For Different Skin Types?

నిమ్మకాయ, విటమిన్ సి ని పుష్కలంగా కలిగి ఉంటుంది, అది సహజమైన ఎక్స్ఫోలియేటర్ వలె పనిచేస్తుంది. ఇది చనిపోయిన మృత చర్మ కణాలను తొలగిస్తూ, ఆరోగ్యకరమైన మరియు ప్రకాశవంతమైన చర్మాన్ని అందివ్వడంలో ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, చర్మంపై మొటిమలు మరియు వాపు సంబందిత చికిత్సలో సహాయపడే యాంటీ బాక్టీరియల్ లక్షణాలను సైతం కలిగి ఉంటుంది.
ఈరోజు, ఈ వ్యాసంలో మనం వివిధ చర్మ రకాల కోసం నిమ్మను ఏవిధంగా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.

జిడ్డు చర్మం కోసం :

జిడ్డు చర్మం కోసం :

కావలసిన పదార్ధాలు :

1 టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి

2 టేబుల్ స్పూన్ల నిమ్మ రసం

కొన్ని చుక్కల రోజ్ వాటర్

తయారుచేయు విధానం :

ఈ కూలింగ్ మాస్క్ సిద్ధం చేయడం చాలా సులభం. ఒక గిన్నెలో ముల్తాని మట్టిని తీసుకుని, తాజా నిమ్మరసాన్ని మరియు రోజ్ వాటర్ను అందులో జోడించండి. క్రమంగా మృదువైన పేస్ట్ తయారయ్యేలా అన్ని పదార్ధాలను బాగా కలపండి. ముఖాన్ని శుభ్రపరచి, ముఖం మరియు మెడ మీద దీనిని వర్తించండి. సగం పొడిగా మారిన తర్వాత, చల్లటి నీటితో శుభ్రం చేయవచ్చు. మీ చర్మాన్ని పూర్తిగా పొడిగా మారేలా చేయగలిగే లక్షణాలు ఉన్న కారణంగా, ఈ మాస్క్ పూర్తిగా పొడిగా మారేంత వరకు ఉంచకూడదని గుర్తుంచుకోండి.

పొడి చర్మం కోసం :

పొడి చర్మం కోసం :

కావలసిన పదార్ధాలు :

2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం

1 టేబుల్ స్పూన్ ముడితేనె

కొన్ని చుక్కల బాదం నూనె

తయారుచేయు విధానం :

శుభ్రమైన గిన్నెను తీసుకోండి. అందులో నిమ్మ రసం, ముడితేనె మరియు కొన్ని చుక్కల బాదం నూనెను జోడించండి. అన్ని పదార్థాలను మిశ్రమంగా కలపండి. మీ పొడిముఖం మీద నలువైపులా విస్తరించునట్లు వర్తించి, 15 నుండి 20 నిమిషాల వరకు వేచి ఉండండి. 20 నిమిషాల తరువాత మీ ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసి, పొడిగా ఉంచండి.

తేనె సహజ సిద్దంగానే చర్మాన్ని డీహైడ్రేషన్ గురికాకుండా చూస్తూ, తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.

సున్నితమైన చర్మం కోసం :

సున్నితమైన చర్మం కోసం :

కావలసిన పదార్ధాలు :

1 టేబుల్ స్పూన్ తాజా పెరుగు

1 టేబుల్ స్పూన్ నిమ్మ రసం

గంధపు నూనె 2 నుండి 3 చుక్కలు

రోజ్ వాటర్ కొన్ని చుక్కలు

తయారుచేయు విధానం :

ఒక గిన్నెలో సాదా పెరుగు, నిమ్మరసం, గంధపు చమురు మరియు కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి ఒక చెంచాతో మిశ్రమంగా కలిపి 5 నిమిషాలు పక్కన ఉంచండి. 5 నిముషాల తరువాత మీ ముఖం మీద నలుదిక్కులా విస్తరించునట్లు వృత్తాకార వలయంలో ఈ మాస్కును మసాజ్ వలె వర్తించండి. దీనిని 20 నుండి 30 నిముషాల పాటు అలాగే వదిలి వేసి, ఆ తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేయండి. సున్నితమైన చర్మానికి ఉత్తమమైన పరిష్కారంగా ఉన్న కారణంగా, క్రమం తప్పకుండా ఉపయోగించడానికి ప్రయత్నించండి.

సాధారణ చర్మం కోసం :

సాధారణ చర్మం కోసం :

కావలసిన పదార్ధాలు :

½ టేబుల్ స్పూన్ టమోటా రసం

కొన్ని చుక్కలు నిమ్మరసం

1 టేబుల్ స్పూన్ వోట్స్

తయారుచేయు విధానం :

మొదటగా, ఓట్స్ పొడిగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి, దీనిలో తాజా నిమ్మరసం మరియు టమోటా రసాన్ని చేర్చండి. అన్ని పదార్ధాలను మిశ్రమంగా కలపండి. ఈ ముసుగును ముఖం మీద నలువైపులా విస్తరించునట్లు వర్తించండి. తరువాత అలాగే 15 నిముషాలు ఉండనివ్వండి. 15 నిముషాల తరువాత మీ చేతివేళ్ళతో లేదా కుంచెను ఉపయోగించి సాధారణ నీటితోశుభ్రం చేసుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఫాషన్, సౌందర్య, జీవన శైలి, ఆరోగ్య, ఆహార, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

How To Use Lemon For Different Skin Types?

Sometimes it is difficult to choose products or remedies according to your skin type. For example, dry skin needs a specific ingredient whereas oily skin might require another. We all know that lemon has Vitamin C that acts as a natural exfoliator. It helps in eliminating dead skin cells and thus giving a healthier and brighter skin.
Desktop Bottom Promotion