For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మంపై ట్యాన్ తొలగించడానికి, బొప్పాయి తక్షణ నివారణగా పనిచేస్తుందా?

|

ఎండలోకి అడుగు పెట్టటానికి ముందుగా సన్ స్క్రీన్ ను పూసుకోమని చర్మ సంరక్షణ నిపుణులు చెప్పడానికి వెనుక అనేక కారణాలు ఉంటాయి. చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం నుండి, వృద్ధాప్య లక్షణాలు మరియు చర్మం కమిలిపోవడం వరకు, సూర్యుడి నుండి వెలువడే కఠినమైన అతినీలలోహిత కిరణాలు, మన చర్మానికి అనేక విధాలుగా హాని కలిగిస్తాయి.

సూర్య కిరణాల బహిర్గతం కావడం వలన ఎదురయ్యే దుష్ప్రభావాలు మనకు దీర్ఘకాలంలో మాత్రమే తెలిసివస్తాయి. చర్మము కమిలిపోవడం అనేది మాత్రమే వెంటనే తెలియవచ్చే సమస్య.అతినీలలోహిత కిరణాలు బహిర్గతమయినప్పుడు, చర్మం యొక్క రంగు నల్లగా మారడంతోపాటు, కమిలినట్లుగా కనిపిస్తుంది. కఠినమైన చర్మ సమస్యలతో బాధపడుతున్నవారెవరికైనా ట్యానింగ్ ను వదిలించుకోవటం, అంత సులభమైన పని కాదని ఎరుకే!

ఎండకు కమిలిన చర్మానికి మగ్గిన బొప్పాయి:

ఎండ మూలంగా అసమాన మేనిఛాయతో పాటుగా చర్మం పొడిబారడం మరియు గరకుగా మారడం కూడా మనం గమనించవచ్చు. కానీ, సరైన చికిత్స సహాయంతో, కమిలిన చర్మంను తిరిగి దాని సహజ రంగుకు తీసుకురావచ్చు. .

వివిధ రకాల యాంటీ-టాన్ క్రీములు మరియు మాస్కులు మార్కెట్ లో లభిస్తున్నప్పటికి, చర్మంపై ట్యాన్ తక్షణమే తొలగించడానికి, ఒక సురక్షితమైన మరియు చవకైన మార్గం కావాలనుకునే వారికై, అత్యుత్తమ గృహవైద్య నివారణలు ఉన్నాయి. వీటిని ప్రయత్నించి చూడండి.

చర్మంపై ట్యానింగ్ ను తొలగించడానికి ఉపయోగపడే కొన్ని గృహవైద్య నివారణల గురించి ఇప్పుడు మీకు తెలుపబోతున్నాము.

చర్మంపై ట్యానింగ్ ను తొలగించడానికి గృహవైద్య నివారణలు:

మేనిఛాయను తేలికపరచే లక్షణాలు మరియు యాంటిఆక్సిడెంట్లు కలిగి ఉన్న పదార్థాలు, చర్మంపై ట్యానింగ్ ను తొలగించడానికి ఉత్తమమైనవిగా భావిస్తారు. యాంటిఆక్సిడెంట్లు చర్మాన్ని ఎండ వలన చర్మానికి కలిగిన నష్టాన్ని మరమ్మతు చేస్తే, మేనిఛాయను తేలికపరచే లక్షణాలు కమిలిన భాగానికి సాధారణ మెరుపు తీసుకువస్తుంది.

టొమాటో, ఓట్ మీల్, నిమ్మ రసం మరియు బొప్పాయి వంటి గృహనివారణలు చర్మంపై ట్యాన్ ను అత్యంత ప్రభావవంతంగా తొలగిస్తాయని చెబుతారు. మరీ ముఖ్యంగా, బొప్పాయి ఆ పనిని తక్షణమే చేసి చూపిస్తుంది.

కమిలిన చర్మానికి తక్షణ పరిష్కారంగా బొప్పాయి పనిచేస్తుందా?

పండిన బొప్పాయి కమిలిన చర్మానికి అద్భుతమైన తక్షణ పరిష్కారంగా ప్రచారంలో ఉంది. బొప్పాయిలో ఉండే పెపైన్ అనే ఎంజైమ్, చర్మంపై ట్యానింగ్ ను తొలగించడానికి ఉపయుక్తంగా ఉండే ఒక అద్భుత సమ్మేళనం. అంతేకాకుండా, బొప్పాయిలో కీలకమైన విటమిన్లు మరియు పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మం యొక్క సహజ ఆరోగ్యాన్ని పునరుద్ధరించి, సూర్యుని యొక్క కఠినమైన అతినీలలోహిత కిరణాల వలన కలిగే నష్టాన్ని సరిచేస్తాయి.

బొప్పాయిలో ఉండే విటమిన్ ఇ వంటి సమ్మేళనాలు ఉపసమనకారకాలుగా పనిచేస్తాయి మరియు ఎండకు కాలిన చర్మాన్ని చల్లబరుస్తాయి. బొప్పాయిని చర్మంపై పూతగా రాసుకుంటే, చర్మానికి ట్యానింగ్ నుండి ఉపశమనమే కాక దురద మరియు ఎరుపుదనం కూడా నివారిస్తుంది.

అంతేకాకుండా, ముగ్గిన బొప్పాయిని ఉపయోగించి చర్మానికి చికిత్స చేస్తే, అతినీలలోహిత కిరణాలకు బహిర్గతం కావడం వల్ల ఏర్పడిన చర్మం మీద వయస్సు పైబడిన అకాల సంకేతాలను (ముడుతలు, నోటి చుట్టూ ముడుతలు, సన్నని గీతలు), దూరంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

పండిన బొప్పాయిని చర్మంపై ఏ విధంగా ఉపయోగించవచ్చు?

పండిన బొప్పాయి వివిధ రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. మీరు నేరుగా దీనిని చర్మానికి రాసుకోవచ్చు లేదా నిమ్మరసం వంటి ఇతర సమర్థవంతమైన పదార్థాలతో కలిపి ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం చర్మ సమస్యల నుండి తక్షణ ఫలితాలను పొందాలంటే , పండిన బొప్పాయిని ఏ విధంగా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.

ఒకటవ విధానం:

- ఒక పండిన బొప్పాయి తొక్క తీసి, ముక్కలుగా చేయండి.

- ముక్కలను చిదిమి పేస్ట్ చేయండి.

- ట్యాన్ ఉన్న ప్రాంతంలో దీనిని పూసుకోండి.

- కొన్ని నిమిషాలు పాటు ఈ పేస్టుతో నెమ్మదిగా మర్దన చేసుకుని, 20 నిముషాల పాటు ఆరనివ్వాలి.

- చర్మంను సాధారణ నీటితో కడిగిన వెంటనే మీకు తక్షణ ఫలితాలు కనిపిస్తాయి.

రెండవ విధానం:

- 1 టేబుల్ స్పూన్ బొప్పాయి పేస్ట్, 1 టీస్పూన్ సేంద్రీయ తేనె మరియు ½ టీస్పూన్ నిమ్మ రసం కలపాలి.

- మృదువైన పేస్ట్ ను పొందడానికి బ్లెండర్లో ఈ పదార్థాలను తిప్పి మిశ్రమాన్ని తయారు చేయండి.

- ప్రభావిత ప్రాంతం మీద ఈ మిశ్రమాన్ని రాసుకుని కొన్ని నిమిషాల పాటు మృదువుగా మర్దన చేసుకోండి.

- తరువాత సాధారణ నీటితో శుభ్రపరచుకోండి.

మూడవ విధానం:

- ఒక గిన్నె తీసుకుని, ఒక్కో టేబుల్ స్పూన్ బొప్పాయి పేస్ట్ మరియు పెరుగు తీసుకోండి.

- అవి రెండూ బాగా కలిసేలా, ఒక స్పూన్ తో కలపండి.

- తరువాత చర్మంపై ట్యాన్ ఉన్న ప్రదేశంలో రాసుకోండి.

- 15-20 నిమిషాల పాటు ఆరనిచ్చి,సాధారణ నీటితో శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

కాబట్టి, మీ చర్మంపై ట్యానింగ్ కు చికిత్స చేయవలసి వచ్చినప్పుడు తదుపరిసారి, వాణిజ్య ఉత్పత్తుల వెనుక పడకుండా, పైన పేర్కొన్న పద్ధతులను పాటించి చూడండి. ఇది మీ చర్మంపై ట్యాన్ ను తొలగించడమే కాక, మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు అందంగా ఉంచటానికి సహాయపడుతుంది.

English summary

Is Ripe Papaya An Instant Remedy For Tanned Skin?

If you are looking for a safe and inexpensive way to remove tanning in an instant, then it is best to give home remedies a try. Ripe papaya is touted to be an excellent instant remedy for the tanned skin. This fruit contains an enzyme, papain, which is a wondrous compound for removing tanning from the skin.
Story first published: Wednesday, August 22, 2018, 18:00 [IST]