For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై నోస్ సమస్య మిమ్మల్ని ఇబ్బందిపెడుతోందా? స్కిన్ పీలింగ్ వేధిస్తోందా? ఈ రెమెడీస్ ను ప్రయత్నించండి

|

డ్రై లేదా ఫ్లేకీ నోస్ సమస్య సాధారణంగా వింటర్ సీజన్ లో కనిపిస్తుంది. ముక్కుకి ఇరువైపులా ఈ సమస్య తలెత్తవచ్చు లేదా ముక్కుమీద ఈ సమస్య కనిపించవచ్చు. కారణమేదైనా డ్రై నోస్ వలన ముక్కు చుట్టూ ఉన్న డ్రై స్కిన్ ఫ్లేకీ గా, స్కేలీగా, పీలీగా ఆలాగే నొప్పిగా కూడా ఉంటుంది.

అయితే, ఈ సమస్య కేవలం వింటర్ సీజన్ లో మాత్రమే కనిపిస్తుంది అనుకుంటే పొరపాటే. వివిధ ఫ్యాక్టర్స్ వలన ఈ సమస్య ఎప్పుడైనా తలెత్తుతుంది.

Is Your Skin On Both The Sides Of Your Nose Constantly Peeling Off? Try These Remedies

మీరు వాడే కాస్మటిక్స్ అలాగే సోప్స్ వలన చర్మం డ్రై గా మారుతుంది. చర్మం డ్రై గా మారితే ఏజింగ్ ప్రాసెస్ అనేది వేగంగా ప్రారంభం అవుతుంది. ఎందుకంటే, సెబాకీయాస్ గ్లాండ్స్ అనేవి ఏజ్ పైబడే కొద్దీ పనితీరులో మందగిస్తాయి. క్లైమేట్ లో మార్పులు, కొన్ని రకాల మెడికేషన్స్ ను వాడటం, కాంటాక్ట్ డెర్మటైటిస్, పెరీ ఓరల్ డెర్మటైటిస్, మేకప్ అండ్ కాస్మటిక్స్, సెబారిక్ డెర్మటైటిస్ వంటివి కొన్ని ఈ సమస్యకు దారితీసే కారణాలు.

కొంతమందిని, ఈ సమస్య దీర్ఘకాలం పాటు వేధిస్తే మరికొంతమందిలో ఈ సమస్య సులభంగా తొలగిపోతుంది. అయితే, ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు కొంత కేర్ ను తీసుకోవాలి. ఒకవేళ ఇది క్రానిక్ సమస్య అయితే, మీరు కచ్చితంగా మెడికల్ అడ్వైస్ ను తీసుకోవాలి. క్రానిక్ సమస్య కానప్పుడు కొన్ని నేచురల్ రెమెడీస్ ను అలాగే టిప్స్ ను పాటించడం ద్వారా ఫ్లేకీ మరియు డ్రై నోస్ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. డ్రై నోస్ సమస్యను పరిష్కరించే కొన్ని సులభ చిట్కాలను ఈ ఆర్టికల్ లో పొందుబరిచాము. వీటిని పాటించి పీలింగ్ స్కిన్ ప్రాబ్లమ్ ని తగ్గించుకోండి మరి.

స్క్రాచ్ చేయకండి:

స్క్రాచ్ చేయకండి:

ముక్కు చుట్టూ ఉన్న డ్రై ఏరియాను స్క్రాచ్ చేయకండి. ఎందుకంటే, స్క్రాచ్ చేయడం వలన చర్మం ఇరిటేషన్ కు గురవుతుంది. బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ, దురదగా అనిపిస్తే ప్రభావిత ప్రాంతంపై ఐస్ క్యూబ్ ను అప్లై చేయాలి. దీని ద్వారా రెడ్ నెస్ తో పాటు దురద కూడా తగ్గుతుంది.

సన్ స్క్రీన్ ను ఉపయోగించండి:

సన్ స్క్రీన్ ను ఉపయోగించండి:

సన్ స్క్రీన్ అనేది మీ దగ్గర కచ్చితంగా ఉండవలసిన ముఖ్యమైన ప్రోడక్ట్. అయితే, సన్ స్క్రీన్ ను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ లేదా అలో వెరా బేస్ కలిగిన సన్ స్క్రీన్ ను ఎంచుకోండి. ఇలా చేయడం ద్వారా చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది.

ఎక్స్ఫోలియేషన్:

ఎక్స్ఫోలియేషన్:

చర్మాన్ని హైడ్రేటెడ్ గా అలాగే మాయిశ్చరైజ్డ్ గా ఉంచేందుకు ఎక్స్ఫోలియేషన్ అనేది ఉపయోగపడుతుంది. సరైన ఎక్స్ఫోలియేషన్ పద్దతులను పాటించడం ద్వారా చర్మం పొడిబారడమనే సమస్య అరికట్టబడుతుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు చర్మాన్ని ఎక్స్ఫోలియెట్ చేసుకోవడం తప్పనిసరి. అయితే, అతిగా ఎక్స్ఫోలియెట్ చేయడం వలన చర్మం మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని గుర్తించండి.

నీళ్లు తాగండి:

నీళ్లు తాగండి:

చర్మాన్ని బయట నుంచి మాయిశ్చరైజ్ చేయడంతో పాటు లోపల నుంచి కూడా మాయిశ్చరైజ్ చేస్తేనే ఫ్లెకీ స్కిన్ సమస్య తొలగిపోతుంది. ఆ విధంగా చర్మం మరింత డ్రై గా మారకుండా హైడ్రేటెడ్ గా ఉంటుంది. మీరు తగినన్ని నీళ్లు తీసుకుంటేనే శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. కాబట్టి, నీటిని తగినంత తీసుకుంటూ ఉంటే ఫ్లేకీ స్కిన్ అలాగే డ్రై నోస్ సమస్య తలెత్తదు.

గోరువెచ్చటి నీటిని తీసుకోండి:

గోరువెచ్చటి నీటిని తీసుకోండి:

ముఖాన్ని వేడినీటితో శుభ్రం చేసుకోవడం మంచిది కాదు. దీని వలన చర్మంలో నున్న ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి తొలగిపోతాయి. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. అందువలన, ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవడం మంచిది. దీని వలన చర్మం మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది. తద్వారా, ఫ్లెకీ నోస్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

ఐస్ ను అప్లై చేయండి:

ఐస్ ను అప్లై చేయండి:

కొన్ని సార్లు ముక్కు చుట్టూ ఉన్న ఇంఫ్లేమేషన్ అనేది రెడ్ గా అలాగే దురదగా మారుతుంది. దీని వలన ఇరిటేషన్ మరింత ముదురుతుంది. కాబట్టి, ఐస్ క్యూబ్స్ ను వాడి ఈ సమస్యను సులభంగా అరికట్టవచ్చు. ఒక టవల్ లో ఐస్ క్యూబ్స్ ను ఉంచి ఆ టవల్ ను ప్రభావిత ప్రాంతంపై ఉంచాలి. ఐస్ ను నేరుగా స్కిన్ పై అప్లై చేయకూడదు. ఎందుకంటే, చర్మం మరింత దెబ్బతింటుంది. ఐస్ క్యూబ్ రెమెడీను ప్రతి రోజూ రెండు సార్లు పాటిస్తే ఫలితం ఉంటుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎఫెక్టివ్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి. చర్మంలోకి సులభంగా ఇంకిపోతాయి. స్కిన్ టోన్ ని ఈవెన్ అవుట్ చేయడానికి ముక్కుపై రెడ్ నెస్ ను ప్రశాంతపరచడానికి తోడ్పడతాయి. చర్మాన్ని మృదువుగా అలాగే ప్రకాశవంతంగా మార్చేందుకు కూడా తోడ్పడతాయి. కాస్తంత కొబ్బరి నూనెను చర్మంపై అప్లై చేయండి. ఈ పద్దతి రెడీ మేడ్ మాయిశ్చరైజర్ కంటే మెరుగ్గా పనిచేస్తుంది. ఈ పద్దతిని ఫాలో అవుతూ ఉంటే మెరుగైన ఫలితాలను గమనించగలుగుతారు.

English summary

Is Your Skin On Both The Sides Of Your Nose Constantly Peeling Off? Try These Remedies

Flaky or peeling skin on nose is normally seen mostly during the winter season. It can appear either on both sides of the nose or even on the nose. Some natural home remedies and tips like petroleum jelly, exfoliation, washing your face with warm water, etc., can help you get rid of this issue.Get Rid Of Dry Nose
Story first published:Thursday, April 26, 2018, 14:56 [IST]
Desktop Bottom Promotion