For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేందుకు తోడ్పడే లెమన్ ఫేస్ ప్యాక్స్

చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేందుకు తోడ్పడే లెమన్ ఫేస్ ప్యాక్స్

|

నిమ్మలో లభ్యమయ్యే యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు మినరల్స్ అనేవి ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనాలను చేకూరుస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, నిమ్మలో సౌందర్యాన్ని పెంపొందించే గుణాలు కూడా ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? అవును, మీరు చదివినది నిజమే! మాస్క్ ల రూపంలో నిమ్మను వాడితే మీ చర్మం యవ్వనంగా అలాగే మరింత అందంగా మారుతుంది.

స్కిన్ ట్యాన్, బ్లేమిషెష్, అన్ ఈవెన్ స్కిన్ టోన్ వంటి కొన్ని సమస్యలు సాధారణంగా ఎదురవుతాయి. అయితే, ఇటువంటి చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు నిమ్మ తోడ్పడుతుంది. సిట్రిక్ ఫ్రూట్స్ కోవలోకి చెందే నిమ్మ ఎండాకాలంలో ఎక్కువగా అందుబాటులోకి వస్తుంది. కాబట్టి, ఈసారి మీరు నిమ్మకాయను కొన్నప్పుడు నిమ్మకాయ ద్వారా అందే సౌందర్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొన్నిటిని చర్మ సౌందర్యాన్ని పరిరక్షించడం కోసం ఉపయోగించండి.

ఇప్పుడు, నిమ్మ ద్వారా చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడమెలా అని మీకు ఆశ్చర్యం కలిగి ఉండవచ్చు. కాస్త ఓపిక పట్టండి. ఈ ఆర్టికల్ లో నిమ్మ ద్వారా చర్మానికి అందే ప్రయోజనాలను వివరిస్తాము. నిమ్మను ప్యాక్స్ అలాగే మాస్క్స్ రూపంలో ఎలా వాడితే చర్మ సౌందర్యం మెరుగవుతుందో మీకు తెలియచేస్తాము.

Lemon Face Packs For Skin Brightening


కాంతివంతమైన చర్మం కోసం:

నిమ్మలో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. నిమ్మను తీసుకోవడం ద్వారా చర్మం ఆరోగ్యంగా అలాగే కోమలంగా మారుతుంది. నిమ్మను ఏ విధంగా అప్లై చేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలా వాడాలి:

1. కొంత నిమ్మను గ్రేట్ చేసి అందులో తేనెను జోడించండి.

2. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోండి. పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రంగా తుడుచుకుని తడిని ఆరనివ్వండి.

3. ఈ పద్దతిని వారానికి రెండు సార్లు పాటిస్తే మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు.

నిమ్మ మరియు టమాటో ఫేస్ ప్యాక్:

ఈ ప్యాక్ అనేది సన్ ట్యాన్ తో పాటు బ్లేమిషెస్ ని తొలగించేందుకు తోడ్పడుతుంది.

కావలసిన పదార్థాలు

అర టీస్పూన్ నిమ్మరసం

1 టేబుల్ స్పూన్ తేనె

1 టీస్పూన్ టమాటో పల్ప్

ఎలా వాడాలి:

1. ఈ పదార్థాలని బాగా కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి.

2. ఈ మిశ్రమాన్ని ముఖంపై ఫింగర్ టిప్స్ సహాయంతో అప్లై చేసుకోవాలి. సర్క్యూలర్ మోషన్ లో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

3. ఇరవై నిమిషాల పాటు ఈ ప్యాక్ ని అలాగే వదిలేయాలి. ఆ తరువాత చల్లటి నీటితో ప్యాక్ ను తొలగించుకోవాలి.

4. చర్మం డ్రై గా మారితే కాస్తంత మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవడం మంచిది.

నిమ్మ మరియు క్రీమ్ ఫేస్ ప్యాక్:

ఈ మాస్క్ అనేది డ్రై స్కిన్ పై మెరుగైన ఫలితాలను చూపిస్తుంది.

కావలసిన పదార్థాలు:

2-3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం

1 టేబుల్ స్పూన్ సోర్ క్రీమ్

ఎలా వాడాలి:

1. నిమ్మరసంలో కాస్తంత సోర్ క్రీమ్ ను జోడించి మిశ్రమాన్ని తయారుచేసుకోండి.

2. ఈ మిశ్రమాన్ని మెడపై అలాగే ముఖంపై అప్లై చేసుకోండి. పదిహేను నిమిషాల వరకు అలాగే ఉండండి.

3. పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రపరుచుకోండి.

నిమ్మ మరియు శనగపిండి ఫేస్ ప్యాక్:

ఈ మాస్క్ అనేది చర్మాన్ని స్మూత్ గా అలాగే శుభ్రంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. ఆయిలీ స్కిన్ అనేది మొటిమలకు దారితీస్తుంది. ఈ మాస్క్ వలన చర్మంపై పేరుకుపోయిన అదనపు నూనె తొలగిపోతుంది. అందువలన, చర్మం తిరిగి కాంతివంతంగా మారుతుంది.

కావలసిన పదార్థాలు:

3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం

1 టేబుల్ స్పూన్ మజ్జిగ

2 టేబుల్ స్పూన్ల శనగపిండి

ఎలా వాడాలి:

1. పైన చెప్పిన పదార్థాలని బాగా కలిపి పేస్ట్ లా తయారుచేసుకోండి.

2. ఈ పేస్ట్ ను ముఖంపై అలాగే మెడపై అప్లై చేసుకోండి.

3. ముప్ఫై నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో వాష్ చేసుకోండి. ముఖంపై తడిలేకుండా తుడుచుకోండి.

నిమ్మ మరియు ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్:

ఈ ప్యాక్ అనేది సన్ ట్యాన్ ను తొలగించి ఈవెన్ టోన్ ను అందించేందుకు తోడ్పడుతుంది. ట్యాన్ అనేది డెడ్ స్కిన్ సెల్స్ అక్యుములేషన్ వలన ఏర్పడుతుంది. ఈ ప్యాక్ వలన డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ నిమ్మరసం

1 టేబుల్ స్పూన్ ఎగ్ వైట్

1 టేబుల్ స్పూన్ యోగర్ట్

ఎలా వాడాలి:

1. పై పదార్థాలన్నిటినీ బాగా కలపగా తయారైన మిశ్రమాన్ని ముఖంపై అలాగే మెడపై అప్లై చేసుకోండి.

2. ఇరవై నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో వాష్ చేయండి.

3. ఈ మాస్క్ అనేది ముఖానికి సహజ కాంతిని అందించేందుకు తోడ్పడుతుంది. ఈ రెమెడీని వారానికి రెండు సార్లు ప్రయత్నించండి.

నిమ్మ మరియు తేనె ఫేస్ ప్యాక్:

చర్మంపై పిగ్మెంటేషన్ సమస్యకి ఈ రెమెడీ ఉపయోగపడుతుంది.

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ నిమ్మరసం

2 టేబుల్ స్పూన్ల తేనె

1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్

ఎలా వాడాలి:

1. 1 టీస్పూన్ నిమ్మరసాన్ని 2 టేబుల్ స్పూన్ల తేనెను అలాగే 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ను కలిపి చిక్కటి మిశ్రమాన్ని తయారుచేసుకోండి.

2. ఈ మిశ్రమాన్ని క్లీన్స్ చేసిన ముఖంపై అప్లై చేసుకుని ముప్పై నిమిషాల పాటు అలాగే వదిలేయండి.

3. గోరువెచ్చటి నీటితో రిన్స్ చేయండి.

నిమ్మ మరియు గ్రీన్ టీ ఫేస్ ప్యాక్:

ఈ ప్యాక్ అనేది చర్మానికి కాంతినందిస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.

కావలసిన పదార్థాలు:

2 టేబుల్ స్పూన్ల గ్రీన్ టీ

చిటికెడు పసుపు

అర టీస్పూన్ నిమ్మరసం

ఎలా వాడాలి:

1. పదార్థాలన్నిటినీ ఒక పాత్రలోకి తీసుకుని బాగా కలపాలి.

2. ఈ లెమన్ ఫేస్ మాస్క్ ని ఒక కాటన్ బాల్ సహాయంతో అప్లై చేసుకోవాలి.

3. మూడు నిమిషాల పాటు ఈ ప్యాక్ ని ఆరనివ్వాలి.

4. మరొక కాటన్ బాల్ ని వాడి ఈ మిశ్రమంతో ఇంకొక లేయర్ ని అప్లై చేసి ఇంకొక మూడు నిమిషాల పాటు ప్యాక్ ని అలాగే వదిలేయాలి.

5. చివరగా, నార్మల్ వాటర్ తో ప్యాక్ ను తొలగించాలి.

English summary

Lemon Face Packs For Skin Brightening

The antioxidants and minerals contained in lemon work effectively. But did you know that apart from its health benefits, lemons can even help in enhancing your beauty? Yes, you just read that right! Lemons can be used in the form of masks and packs to gain a young and beautiful skin.
Story first published:Friday, June 22, 2018, 5:49 [IST]
Desktop Bottom Promotion