For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో పొడిబారిన చర్మంతో బాధపడుతున్నారా ? అయితే ఈ 5 సహజసిద్దమైన మాయిశ్చరైజింగ్ ఫేస్ మాస్క్స్ మీకోసమే!

చలికాలంలో పొడిబారిన చర్మంతో బాధపడుతున్నారా ? అయితే ఈ 5 సహజసిద్దమైన మాయిశ్చరైజింగ్ ఫేస్ మాస్క్స్ మీకోసమే!

|

శీతాకాలం సమీపంలో ఉంది. మరియు ఏ ఇతర కాలాల్లో లేని విధంగా, ఈ కాలంలో మీ చర్మానికి అధిక సంరక్షణా బాధ్యతలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది. శీతాకాలంలో మన చర్మం ఎక్కువ నష్టానికి గురవుతుంది. ముఖ్యంగా పొడిబారడం, మొఖం మీద చర్మం పగుళ్ళకు గురవడం, ఎర్రబడడం వంటి సమస్యలను తరచుగా ఎదుర్కొనవలసి ఉంటుంది.

Moisturising Winter Face Masks For Dry Skin

కావున, సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. అయితే, మాయిశ్చరైజర్లను ఉపయోగించడం ద్వారా, చర్మాన్ని పొడిబారకుండా, పగుళ్ళకు లోనుకాకుండా కొంత వరకు నిరోధించవచ్చు. కానీ పూర్తిస్థాయిలో సమస్యను వదిలించుకోవాలని భావించిన ఎడల, కొన్ని సహజ నివారణా పద్ధతులను అనుసరించవలసి ఉంటుంది. ఈ వ్యాసంలో, మీ ముఖం పొడిబారడం, నుండి చర్మ పగుళ్ళను నివారించడానికి గల కొన్ని ఉత్తమమైన శీతాకాలపు మాయిశ్చరైజర్ల గురించిన వివరాలను అందివ్వడం జరిగింది.

అవేమిటో, వాటి ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం!

1. తేనె మరియు పాలు :

1. తేనె మరియు పాలు :

తేనె మరియు ముడి పాలు కలయికతో కూడిన ఈ మాయిశ్చరైజర్, తక్షణమే చర్మాన్ని తేమగా మార్చి, మరియు సహజ సిద్దమైన గ్లో అందివ్వడంలో సహాయం చేస్తుంది. దీనికి మీకు కావలసినదల్లా 2 టేబుల్ స్పూన్ల తేనె మరియు 5 నుండి 6 టేబుల్ స్పూన్ల ముడి పాలు. ఈ పదార్ధాలను ఒక శుభ్రమైన గిన్నెలో మిశ్రమంగా కలపండి. దీనిని మీ ముఖం మీద వృత్తాకార వలయంలో మర్దన చేస్తున్నట్లుగా వర్తించండి. 20 నిముషాల పాటు అలాగే ఉంచిన తర్వాత, చల్లని నీటితో శుభ్రం చేయండి.

2. అరటి మాస్క్ :

2. అరటి మాస్క్ :

అరటి పండు, శీతాకాలంలో కూడా చర్మం లోపలి పొరల నుండి, పోషకాలను అందిస్తూ సహజమైన తేమ లక్షణాలను పెంపొందిస్తూ, చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయం చేస్తుంది. ఈ మాస్క్ అరటి పండు, పెరుగు మరియు తేనె వంటి ఇతర పదార్ధాలతో కూడుకుని ఉంటుంది. మొదటగా, బాగా పండిన అరటి పండులో సగ భాగాన్ని తీసుకోండి. ఒక మృదువైన పేస్ట్ వలె చేయడానికి దాన్ని మాష్ చేయండి . ఈ అరటి పండు గుజ్జులో 1 టేబుల్ స్పూన్ పెరుగు మరియు 1 టేబుల్ స్పూన్ తేనెను కలపండి. ఈ పదార్ధాలన్నింటినీ బ్లెండ్ చేయండి. మీ ముఖాన్ని, శుభ్రంగా కడిగి, టవల్ తో తుడిచిన తర్వాత, ముఖం మరియు మెడ మీద ఈ మాస్క్ ని పొరలా వర్తించండి. 20 నిమిషాల పాటు అలాగే వదిలివేసి, పొడిగా మారిన తర్వాత చల్లని నీటితో శుభ్రపరచండి. మెరుగైన ఫలితాల కోసం, నెలలో కనీసం 2 నుండి 3 మార్లు అనుసరించండి.

Most Read: మద్యం వాసన మిమ్ములను అసౌకర్యానికి గురిచేస్తుందా? అయితే ఈ పద్దతులు పాటించండి. Most Read: మద్యం వాసన మిమ్ములను అసౌకర్యానికి గురిచేస్తుందా? అయితే ఈ పద్దతులు పాటించండి.

3. వోట్మీల్ మాస్క్ :

3. వోట్మీల్ మాస్క్ :

శీతాకాల సమయంలో మీ చర్మం పగుళ్ళకు గురైన ఎడల, ఈ మాస్క్ ఉత్తమంగా సూచించబడుతుంది. ఈ ప్రత్యేకమైన మాస్క్, చర్మానికి తేమను అందించి హైడ్రేట్ చేసి, పునరుజ్జీవనం గావిస్తుంది. 2 టేబుల్ స్పూన్ల వోట్మీల్ తీసుకుని పొడిగా చేయండి, ఒక టేబుల్ స్పూన్ సాదా పెరుగు మరియు ఒక టేబుల్ స్పూన్ ముడి తేనెను జోడించి, అన్ని పదార్థాలను సమ్మిళితం చేయండి. మీ ముఖం మీద దీనిని వృత్తాకార వలయంలో వర్తించి, మాస్క్ పొడిగా మారే వరకు కొన్ని నిముషాల పాటు అలాగే వదిలివేయండి. తర్వాత సాధారణ నీటిని ఉపయోగించి శుభ్రం చేయండి. ఉత్తమ ఫలితాల కోసం వారంలో కనీసం రెండు సార్లు అనుసరించడం మంచిది.

4. నిమ్మరసం మరియు స్ట్రాబెర్రీ :

4. నిమ్మరసం మరియు స్ట్రాబెర్రీ :

మీ చర్మం పగుళ్ళకులోనై, ఎర్రగా మారి బాధపెడుతున్న ఎడల, స్ట్రాబెర్రీ - నిమ్మరసం మాస్క్ ఉత్తమంగా పనిచేస్తుంది. స్ట్రాబెర్రీలో ఉండే సాలిసిలిక్ యాసిడ్, చర్మంపై మొటిమలు లేదా వాపును నివారించడంలో సహాయపడుతుంది. ఈ మాస్క్ తయారీకి, కొన్ని తాజా స్ట్రాబెర్రీలు, ఒక టేబుల్ స్పూన్ తేనె మరియు 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం అవసరమవుతాయి. ఒక బ్లెండర్లో, అన్ని పదార్ధాలను చేర్చి పేస్ట్ వలె చేయండి. ముఖాన్ని శుభ్రపరచి, దీనిని నలువైపులా విస్తరించేలా అప్లై చేయండి. సుమారు 30 నిముషాల పాటు వదిలివేసి, పొడిబారిన తరువాత మంచినీటితో శుభ్రపరచండి.

Most Read:డేటింగ్ లో ఉన్నప్పుడు సెక్స్ తప్ప అన్నీ అయిపోయాయి, డబ్బు కోసం ఆశపడ్డా,నరకం అనుభవిస్తున్నా Most Read:డేటింగ్ లో ఉన్నప్పుడు సెక్స్ తప్ప అన్నీ అయిపోయాయి, డబ్బు కోసం ఆశపడ్డా,నరకం అనుభవిస్తున్నా

5. అవకాడో, తేనె మరియు గుడ్డు పచ్చ సొన :

5. అవకాడో, తేనె మరియు గుడ్డు పచ్చ సొన :

చర్మానికి తేమను అందిస్తూ, హైడ్రేట్ చేయడంతో పాటు, అనేక ఇతర చర్మ సమస్యల నివారణా చికిత్సలో కూడా ఈ మాస్క్ సహాయపడుతుంది. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల పండిన అవకాడో, 2 టేబుల్ స్పూన్ల తేనె, మరియు ఒక టేబుల్ స్పూన్ గుడ్డు పచ్చసొనను వేసి మిళితం చేయండి. ఈ పదార్ధాలను మిశ్రమంగా కలిపిన తర్వాత, మీ ముఖం మరియు మెడ మీద పూర్తిగా విస్తరించేలా వర్తించండి. 30 నుండి 40 నిముషాల పాటు పూర్తిగా పొడిబారే వరకు అలాగే వదిలివేయండి. తర్వాత సాధారణ నీటిని ఉపయోగించి ముఖాన్ని శుభ్రపరచండి. ఉత్తమ ఫలితాలకోసం వారానికి ఒకసారి కనీసం అనుసరించండి.

ఎటువంటి దుష్ప్రభావాలు, మరియు కృత్రిమ రసాయనాలు లేని, పైన చెప్పిన ఈ 5 మాస్కులు, చర్మంలో తేమ స్థాయిలను పెంచి, హైడ్రేట్ గా ఉండునట్లు నిర్వహిస్తూ, శీతాకాలంలో సహజ సిద్దమైన మాయిశ్చరైజర్ వలె ఉపయోగపడుతాయి. క్రమంగా చర్మం కాంతివంతంగా మెరిసేలా సహకరించగలవు. కావున ఈ శీతాకాలం, మీ చర్మ సంరక్షణకు తీసుకునే జాగ్రత్తలలో భాగంగా, ఇటువంటి సహజ సిద్దమైన మాయిశ్చరైజర్లు వర్తించడానికి కొంత సమయం కేటాయిస్తున్నారని నిర్ధారించుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Moisturising Winter Face Masks For Dry Skin

Winter is approaching and unlike any other climate, winter demands something extra when it comes to skin care. Our skin is more prone to damage during the winters. It can cause your skin to peel off and lead to redness of the skin. You can use ingredients like honey, banana, etc., to hydrate your skin.
Desktop Bottom Promotion