For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మసంరక్షణకై దానిమ్మ, గ్రీన్ టీ ఫేస్ ప్యాక్

|

యాక్నే వలన ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఈ సమస్య తరచూ ఎదురవుతుంటే దీని వలన వచ్చే సమస్యలు మరింత ఇబ్బందికి గురిచేస్తాయి. మీరు అక్యూట్ యాక్నే సమస్యతో బాధపడుతున్నారా? మార్కెట్ లో అందుబాటులో ఉండే అన్ని రకాల కమర్షియల్ క్రీమ్స్ ని ప్రయత్నించి చూశారా? అయినా, ఫలితం లేదా? యాక్నే సమస్య నుంచి ఉపశమనం అందలేదా?

మొండి యాక్నే సమస్యతో మీరు తీవ్రమైన నిరాశకు గురయ్యారా? యాక్నే మార్క్స్ అనేవి తగ్గుముఖం పట్టేందుకు ఇబ్బంది పెడుతున్నాయా? మీ స్కిన్ మరింత సెన్సిటివ్ గా మారిందా? కాబట్టి, కెమికల్ ప్రోడక్ట్స్ వాడితే స్కిన్ పై దుష్ప్రభావం పడుతోందా? అయితే, దిగులు చెందకండి. ఇంకా మించిపోయింది ఏమీ లేదు. ఈ సమస్యకు నేచురల్ ప్రోడక్ట్స్ తో పరిష్కారాన్ని పొందవచ్చు.

దానిమ్మ ఫేస్ ప్యాక్

దానిమ్మ ఫేస్ ప్యాక్

ఈ సమస్యను పరిష్కరించేందుకు అనేక సహజసిద్ధమైన ప్రోడక్ట్స్ తో పాటు ఇంగ్రిడియెంట్స్ మీకు ఉపయోగపడతాయి. అయితే, దానిమ్మకంటే ప్రభావవంతంగా మరేదీ పనిచేయలేదు. హోంమేడ్ దానిమ్మ ఫేస్ ప్యాక్ అనేది చర్మంపై అద్భుతం చేస్తుంది. యాక్నేను తొలగించి యాక్నేమార్క్స్ కూడా కనుమరుగయ్యేలా చేస్తుంది.

ఈ పండుని స్వర్గానికి చెందిన పండుగా అందుకే అంటారు. దీనిలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది కేవలం రుచికరంగా ఉండటమే కాదు. దీని ఫ్లేవర్ అనేది మిగతా ఫుడ్ ఐటమ్స్ యొక్క రుచిని పెంపొందించడానికి తోడ్పడుతుంది. అంతేకాక, ఇది అనేక హెల్త్ బెనిఫిట్స్ ను అందిస్తుంది. తద్వారా, చర్మం కాంతిని సంతరించుకుని మరింత ప్రకాశవంతంగా అలాగే ఆరోగ్యవంతంగా మారుతుంది.

1. గ్రీన్ టీను జోడించడం ద్వారా

1. గ్రీన్ టీను జోడించడం ద్వారా

దానిమ్మ యొక్క చర్మ సంరక్షణ గుణాలను గ్రీన్ టీను జోడించడం ద్వారా పొందవచ్చు. గ్రీన్ టీ లో సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి శరీరాన్ని డిటాక్సిఫై చేసేందుకు తోడ్పడతాయి. అందువలన, చర్మానికి సహజకాంతి అందుతుంది. చర్మంపై మచ్చలు తొలగిపోతాయి.

ఈ హోమ్ మేడ్ దానిమ్మ మరియు గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ ను ఏ విధంగా తయారుచేసుకోవాలి ఇక్కడ వివరించాము. ఈ ఆర్టికల్ ద్వారా యాక్నే సమస్యల నుంచి ఏ విధంగా రక్షణ పొందాలో తెలుసుకోండి మరి.

2. సులభంగా తయారుచేసుకోవచ్చు

2. సులభంగా తయారుచేసుకోవచ్చు

ఈ హోమ్ మేడ్ దానిమ్మ మరియు గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ ను సులభంగా తయారుచేసుకోవచ్చు. దీని అప్లై చేసుకోవడం కూడా సులభమే. అన్ని రకాల యాక్నే ప్రాబ్లెమ్స్ కి ఈ సింపుల్ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ ద్వారా పరిష్కారం లభిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి కేవలం ఐదు నిముషాలు మాత్రమే పడుతుంది. ఈ ప్యాక్ తయారీకి మీకు కావలసిన పదార్థాలన్నీ మీ కిచెన్ లో లేదా రిఫ్రిజిరేటర్ లో మీకు లభిస్తాయి.

3. కావలసిన పదార్థాలు

3. కావలసిన పదార్థాలు

ఒక టేబుల్ స్పూన్ దానిమ్మ పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ (ఒక ప్యాకెట్ ను వడగట్టి ఉంచండి), ఒక టేబుల్ స్పూన్ తేనె,

4. అప్లై చేసుకునే విధానం:

4. అప్లై చేసుకునే విధానం:

దానిమ్మ పేస్ట్ సిద్ధంగా లేకపోతే, కొన్ని తాజా దానిమ్మ గింజలను తీసుకుని వాటిని మిక్సర్ లో లేదా బ్లెండర్ లో వేసి బ్లెండ్ చేసి చిక్కటి మిశ్రమాన్ని తయారుచేసుకోండి. ఒక పాత్రలోకి ఈ పేస్ట్ ను తీసుకోండి. అందులో పెరుగును జోడించండి. . ఈ పదార్థాలను బాగా కలిపి చిక్కటి మిశ్రమాన్ని తయారుచేసుకోండి.ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ను ఈ మిశ్రమానికి జోడించి బాగా కలపండి.. గ్రీన్ టీ ఈ మిశ్రమంతో పూర్తిగా కలిసిందని భావించాక ఒక టేబుల్ స్పూన్ తేనెను ఈ ప్యాక్ లో జోడించండి.

5. పది నిమిషాల పాటు

5. పది నిమిషాల పాటు

ఈ పేస్ట్ ను ఫేస్ కు అప్లై చేసి అయిదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేయండి. దీని వలన ఈ పదార్థాలలోని చర్మ సంరక్షణ గుణాలు చర్మంలోకి బాగా చొచ్చుకుపోతాయి. ఈ ఫేస్ ప్యాక్ ను ఇరవై నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి. ఆ తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. మెత్తటి టవల్ తో ముఖాన్ని తుడుచుకోండి. చర్మాన్ని గట్టిగా అదిమి తుడవకూడదు. స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. లేదంటే యాక్నే సమస్య మరింత విజృంభిస్తుంది.

. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు సార్లు అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ కై మిశ్రమాన్ని ఎప్పటికప్పుడు తయారుచేసుకోవాలి. తద్వారా, ఈ ఫేస్ ప్యాక్ లో వాడిన పదార్థాలలో చర్మ సంరక్షణ గుణాలు చర్మంలోకి ప్రవేశిస్తాయి.

6. దానిమ్మ, గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ వలన అందే ప్రయోజనాలు

6. దానిమ్మ, గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ వలన అందే ప్రయోజనాలు

యాక్నేకి దారితీసే కారణాలు అనేకం కావచ్చు. మీ యాక్నే సమస్య తీవ్రంగా ఉన్నట్టయితే మీరు డెర్మటాలజిస్ట్ ను సంప్రదిస్తే పరిస్థితి చేజారిపోకుండా ఉంటుంది. కొన్ని ఆరోగ్య సమస్యల వలన లేదా కొన్ని చర్మ సమస్యల వలన యాక్నే సమస్య తలెత్తవచ్చు.

ఒకవేళ మీది చిన్నపాటి చర్మ సమస్య అయితే, హోమ్ మేడ్ దానిమ్మ మరియు గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ తో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సమస్య నుంచి మీకు ఉపశమనం లభించవచ్చు. ఈ ప్యాక్ తయారీలో వాడిన పదార్థాలన్నిటిలో చర్మసంరక్షణ గుణాలు అధికంగా ఉన్నాయి. అందువలన, ఈ యాక్నే సమస్య నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది.

7. దానిమ్మ

7. దానిమ్మ

దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తున్నాయి. విటమిన్ ఏ, సి మరియు ఈలు ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. అలాగే, ఇందులో యాంటీ ఇంఫ్లేమేటరీ పదార్థాలు కూడా అనేకం కలవు. అందువలన, యాక్నే సమస్యతో పోరాడే గుణం దానిమ్మలో కలదు. ఫ్రీ రాడికల్స్ వంటి అన్ స్టేబుల్ అక్షీజన్ మాలిక్యూల్స్ ని న్యూట్రలైజ్ చేసే సామర్థ్యం యాంటీ ఆక్సిడెంట్స్ కు కలదు.

ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి సెల్స్ ను అలాగే టిష్యూస్ ను దెబ్బతీసి శరీరంలో ఇంఫ్లేమేషన్ కు దారితీస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి శరీరంలోని ఇంఫ్లేమేషన్ ను తగ్గించి యాక్నే సమస్యను అరికడతాయి. యాక్నేకు దారితీసే అంశంలో ఇంఫ్లేమేషన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. చర్మం ఎంతగా ఇంఫ్లేమేషన్ కు గురైతే, యాక్నే అంతగా వేధిస్తుంది.

8. గ్రీన్ టీ

8. గ్రీన్ టీ

గ్రీన్ టీ లో కేట్చిన్స్ అధికంగా కలవు. ఇవి యాంటీ మైక్రోబయాల్ నేచర్ కలిగినవి. అందువలన, యాక్నేకి దారితీసే బాక్టీరియాను నశింపచేస్తాయి. అలాగే, ఇందులో యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ కలవు. ఇవి యాక్నే ద్వారా కలిగే రెడ్ నెస్ మరియు ఇంఫ్లేమేషన్ ను తగ్గిస్తాయి. గ్రీన్ టీ ను టీ రూపంలో తాగినా కూడా యాక్నేకు దారితీసే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ను తగ్గిస్తాయి.

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను న్యూట్రలైజ్ చేసి స్కిన్ సెల్స్ ను ప్రొటెక్ట్ చేస్తాయి. తద్వారా, స్కిన్ సెల్స్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ విధంగా ఏజింగ్ సమస్య అరికట్టబడుతుంది. గ్రీన్ టీలో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి యాక్నే ద్వారా కలిగే స్కార్స్ ను అలాగే మార్క్స్ ను హీల్ చేయడానికి తోడ్పడతాయి.

లార్జ్ పోర్స్ వలన దుమ్మూ ధూళి చర్మంపై పేరుకుపోతుంది. తద్వారా, పోర్స్ క్లాగ్ అవుతాయి. పింపుల్స్ సమస్య తలెత్తుతుంది. గ్రీన్ టీ అనేది ఈ సమస్యకు అద్భుతమైన టోనర్ గా పనిచేస్తుంది. పోర్స్ ని అన్ క్లాగ్ చేస్తుంది.

9. పెరుగు

9. పెరుగు

స్వచ్ఛమైన, తీపిలేని పెరుగు లేదా గ్రీక్ యోగర్ట్ వంటి చిక్కటి పెరుగులో బాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి ప్రోబయాటిక్ ఫుడ్. ప్రోబయాటిక్ ఫుడ్ ను తీసుకోవడం ద్వారా శరీరంలో ఇంఫ్లేమేషన్ సమస్య తగ్గుతుంది. లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్, లాక్టోబాసిలాస్ డెల్బీరుకీ లేదా బైఫీడోబాక్టీరియమ్ బైఫీడం సబ్ స్పెసీస్ వంటి యాక్నే ఫైటింగ్ బాక్టీరియా పెరుగులో పుష్కలంగా లభిస్తుంది.

అంతేకాక, పెరుగులో లాక్టిక్ యాసిడ్ లభిస్తుంది. ఇది నేచురల్ యాంటీబయాటిక్ గా వ్యవహరిస్తుంది. ఇది కొలాజిన్ ప్రొడక్షన్ ను పెంపొందించి సహజసిద్ధమైన ఎక్స్ఫోలియేటర్ గా పనిచేస్తుంది. స్వచ్ఛమైన పెరుగులో జింక్ మరియు విటమిన్ బి వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

10. తేనె

10. తేనె

తేనే అనేది సహజసిద్ధమైన కెమికల్ ఫ్రీ సొల్యూషన్. ఇది యాక్నేను తొలగించేందుకు తోడ్పడుతుంది. చాలామటుకు యాంటీ యాక్నే ప్రోడక్ట్స్ లో తేనెని విరివిగా వాడతారు. పింపుల్స్ మరియు యాక్నే సమస్యను నిర్మూలించేందుకు తేనెను దశాబ్దాలుగా వాడుతున్నారు. ప్రొపియోనిబ్యాక్ట్రియం యాక్నెస్ అనే బాక్టీరియమ్ ద్వారా యాక్నే సమస్య తలెత్తుతుంది.

తేనెలో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు పుష్కలంగా లభిస్తాయి. అందువలన, చర్మాన్ని లోపల నుంచి అలాగే వెలుపల నుంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాక, తేనె అనేది అద్భుతమైన డిటాక్సిఫయింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మెటబాలిజం ను బూస్ట్ చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. దీనిని తగిన మోతాదులో తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు.

English summary

Pomegranate And Green Tea Face Pack For Treating Acne

While there are a lot of natural products and ingredients that can give you the desired results, nothing works as quickly and effectively as pomegranate. A homemade pomegranate face pack can work wonders in clearing up those ugly acne and scar marks.