For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ సమస్యలకు బంగాళదుంపల రసంతో పరిష్కారాలు

చర్మ సమస్యలకు బంగాళదుంపల రసంతో పరిష్కారాలు

|

పండ్లు మరియు కూరగాయలు మనకు ఆరోగ్యాన్ని, మనం తినే ఆహారానికి రుచిని చేకూర్చడమే కాక, మన సౌందర్యాన్ని పెంపొందించడానికి కూడా తోడ్పడతాయి.

మనం ప్రతిదినము సాధారణంగా ఉపయోగించే బంగాళదుంప అన్ని రకాల చర్మ సమస్యల నివారణకు పనికొస్తుందని, మెరిసే ఆరోగ్యకరమైన చర్మాన్ని మీకు అందిస్తుందని మీరెప్పుడైనా ఊహించారా? అవును, క్రమం తప్పకుండా చర్మానికై బంగాళదుంపల రసంను వాడటం వలన పలురకాల ప్రయోజనాలను పొందవచ్చు.

Potato Juice Hacks For Beautiful Skin

బంగాళదుంపల రసం వలన ఒనగూడే సౌందర్య ప్రయోజనాలు: ఇతర సహజ పదార్థాలతో కలిపి వాడినపుడు, బంగాళదుంపల రసం ఈ క్రింది విధాలుగా తోడ్పాటును అందిస్తుంది.

బంగాళదుంపల రసంను వెలికితీయడం ఎలా?:

బంగాళదుంపల రసంను వెలికితీయడం ఎలా?:

క్రిమిసంహారక మందులు వినియోగించకుండా పండించిన ఆర్గానిక్ బంగాళదుంపలను సౌందర్య పోషణకై వినియోగించాలి. బంగాళదుంపలను బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. వీటిని జ్యూసర్ లో వేసి రసం తీయాలి. మీ వద్ద జ్యూసర్ లేని యెడల బంగాళదుంపలను తురిమి, పిండి రసం తీయాలి.

బంగాళదుంపల రసంను సౌందర్య పోషణకై వాడటం ఎలా?:

బంగాళదుంపల రసంను సౌందర్య పోషణకై వాడటం ఎలా?:

బంగాళదుంపల రసంను వివిధ ఇతర చర్మానికి మేలుచేసే సహజ పదార్థాలతో కలిపి వాడితే, మెరిసే అందమైన చర్మం మీ సొంతమవుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

1. చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి:

1. చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి:

బంగాళదుంపల రసం మరియు నిమ్మరసం సమాన పరిమాణంలో తీసుకుని కలపండి. బంగాళదుంప మరియు నిమ్మకాయ లోని బ్లీచింగ్ గుణాలు చర్మం యొక్క రంగును సహజ పద్ధతిలో తేలిక పరుస్తుంది. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా నల్లబడిన భాగాల్లో పూసుకుంటే తేడా బాగా గమనించవచ్చు.

2. కళ్ళ చుట్టూ నల్లని వలయాలని తొలగించడానికి:

2. కళ్ళ చుట్టూ నల్లని వలయాలని తొలగించడానికి:

బంగాళదుంపల రసంను రోజు కళ్ళ చుట్టూ రాసుకుంటే ప్రయోజనం ఉంటుంది. బంగాళదుంపల రసం చర్మాన్ని బిగుతుగా మార్చి, ముడుతలను, వయసు పెరుగుతున్న లక్షణాలను తగ్గిస్తుంది. మీ కళ్ళ కింద చర్మం సున్నితంగా ఉండటం వలన, ముడతలు ముందుగా అక్కడే కనిపిస్తాయి. ఇటువంటి సమయంలో బంగాళదుంపల రసం అక్కరకు వస్తుంది. తాజా బంగాళదుంపల రసంను కళ్ల చుట్టూ దూది ఉండ సహాయంతో రాసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తరువాత చల్లని నీటితో కడిగేయండి.

3. క్లెన్సర్ గా పనికొస్తుంది:

3. క్లెన్సర్ గా పనికొస్తుంది:

బంగాళదుంపల రసం సహజమైన క్లెన్సర్ గా పని చేస్తుంది. ఐదు టీ స్పూన్ల బంగాళదుంపల రసంకు ఒక టీ స్పూన్ వంట సోడా మరియు కప్పుడు నీరు కలపండి. దీనిని చర్మానికి రాసుకోవడం వలన మీ చర్మరంధ్రాలను శుభ్రపడతాయి.

4. యాంటీ-ఏజింగ్ సాధనంగా పనిచేస్తుంది:

4. యాంటీ-ఏజింగ్ సాధనంగా పనిచేస్తుంది:

బంగాళదుంపల రసం ముడుతలు, సన్నని గీతలు, చర్మం పొడిబారడం వంటి వివిధ రకాల వయసు పైబడిన చిహ్నాలతో పోరాడుతుంది. బంగాళదుంపల రసం మరియు పెరుగు సమాన పరిమాణంలో తీసుకొని కలిపండి. దీనికి ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను కలిపి మాస్కువలె వేసుకోండి. ఇది మీ చర్మానికి తేమను చేకూర్చి పైన చెప్పబడిన సమస్యలను తగ్గిస్తుంది.

5. కళ్ళు ఉబ్బడాన్ని తగ్గిస్తుంది:

5. కళ్ళు ఉబ్బడాన్ని తగ్గిస్తుంది:

బంగాళదుంపల రసం మరియు కీరా రసం సమాన పరిమాణంలో తీసుకొని కలిపండి. దీనిని కళ్ల చుట్టూ రాసుకుని పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. తరువాత చల్లని నీటితో కడిగేయండి. బంగాళదుంపల రసం మరియు కీరా రసంలకు చర్మానికి చలువచేసే గుణం ఉండటం వలన అలసిన కళ్ళను తాజాగా చేసి, కళ్ళు ఉబ్బడాన్ని తగ్గిస్తాయి.

6. మొటిమలతో పోరాడుతుంది:

6. మొటిమలతో పోరాడుతుంది:

బంగాళదుంపల రసం మీ చర్మానికి మెరుగైన ఛాయను అందిస్తుంది. బంగాళదుంపల రసంను ఇయర్ బడ్ సహాయంతో మచ్చలపై రాసుకోవడం లేదా బంగాళదుంపల రసంలో ముంచిన దూదితో ముఖాన్ని అద్దుకోవడం చేయాలి. ఐదు-పది నిమిషాలు పాటు ఆరనివ్వాలి. బంగాళదుంపలోని యాంటీ- బాక్టీరియల్ తత్వాలు, మొటిమలను కలుగజేసే బాక్టీరియాను నాశనం చేస్తాయి.

7. చర్మంపై మరకలు, మచ్చలను తొలగిస్తుంది:

7. చర్మంపై మరకలు, మచ్చలను తొలగిస్తుంది:

తాజా బంగాళదుంపల రసంను మొటిమల ద్వారా ఏర్పడిన మచ్చలపై రాసుకుని పది-పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా క్రమం తప్పకుండా చేయండి. బంగాళదుంపలలోని "కెటకోలేజ్" అనే ఎంజైము మేని ఛాయ తేలికపడి, మచ్చలు తొలగిపోవడానికి సహకరిస్తాయి.

8. మృతకణాలను తొలగిస్తుంది:

8. మృతకణాలను తొలగిస్తుంది:

రెండు టేబుల్ స్పూన్ల బంగాళదుంపల రసం మరియు నిమ్మరసం తీసుకుని కలపండి. దీనితో కళ్ళ చుట్టూ తప్ప మిగిలిన ప్రదేశంలో వలయాకారంలో మృదువుగా మర్దన చేసుకోండి. 30 నిమిషాలు తరువాత నీళ్లతో కడిగేయండి. ఈ మిశ్రమం హైపర్ పిగ్మెంటేషన్, మంట మరియు పొడి చర్మాన్ని నివారిస్తుంది.

9. చర్మం పై జిడ్డును తగ్గిస్తుంది:

9. చర్మం పై జిడ్డును తగ్గిస్తుంది:

ఒక బంగాళదుంప రసంకు ఇక టీ స్పూన్ నిమ్మరసం మరియు కొన్ని చుక్కలు రోజ్ వాటర్ కలపండి. దూది ఉండతో ఈ మిశ్రమాన్ని ముఖమంతా పూసుకుని పదిహేను నిమిషాలు ఆరనివ్వండి. బాగా ఆరినాక నీటితో కడిగేయండి.

10. పొడి చర్మ చికిత్స నిమిత్తం పనికొస్తుంది:

10. పొడి చర్మ చికిత్స నిమిత్తం పనికొస్తుంది:

ఒక బంగాళదుంప రసంకు ఇక టీ స్పూన్ తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా పూసుకుని పదిహేను నిమిషాలు ఆరనివ్వండి. బాగా ఆరినాక నీటితో కడిగేయండి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే మంచి ఫలితముంటుంది.

11. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది:

11. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది:

ఒక బంగాళదుంప రసంకు రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్,బొక్క టేబుల్ స్పూన్ తేనె కలపండి. దీనిని ముఖానికి రాసుకుని పది నిమిషాలు తరువాత నీటితో కడుక్కోండి. ఆలివ్ ఆయిల్ మరియు తేనె చర్మంలో తేమను పునరుద్దరిస్తే, బంగాళదుంపలోని విటమిన్లు మరియు ఖనిజాలు, సన్నని గీతలు లేని ఆరోగ్యవంతమైన చర్మాన్ని ప్రసాదిస్తాయి.

12. సూర్య తాపానికి కమిలిన చర్మాన్ని సాధారణ స్థితికి తీసుకు వస్తుంది:

12. సూర్య తాపానికి కమిలిన చర్మాన్ని సాధారణ స్థితికి తీసుకు వస్తుంది:

కమిలిన చర్మానికి బంగాళదుంప రసం అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది. బంగాళదుంప రసంను ప్రభావిత ప్రదేశంలో రాసుకుంటే, చల్లని అనుభూతి వెంటనే కలుగుతుంది. ఎండ వలన కలిగిన మంట మరియు కమిలిన నల్లదనం తగ్గిస్తుంది

13. ముడుతలు లేని మృదువైన చర్మాన్ని అందిస్తుంది:

13. ముడుతలు లేని మృదువైన చర్మాన్ని అందిస్తుంది:

ఒక బంగాళదుంప రసాన్ని వెలికితీసి, దానిలో ఒక టీ స్పూన్ పాలు, కొన్ని చుక్కల గ్లిజరిన్ కలపండి. దీనిని చర్మమంతటా రాసుకుని పదిహేను నిమిషాల తరువాత నీటితో కడిగేయండి. ఇలా క్రమం తప్పకుండా రాసుకోండి. తేడాను గమనించండి.


English summary

Potato Juice Hacks For Beautiful Skin

Potato Juice Hacks For Beautiful Skin,Did you know that potato can, in fact, help in banishing almost all your skin woes, and contribute towards a healthy glowing skin? Well, read on to know more,చర్మ సమస్యలకు బంగాళదుంపల రసంతో పరిష్కారాలు
Story first published:Thursday, May 17, 2018, 17:10 [IST]
Desktop Bottom Promotion