For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రకాశవంతమైన చర్మ సౌందర్యం కోసం, కీరదోసకాయతో చేసిన ఫేస్-ప్యాక్ ని ట్రై చేయండి !

ప్రకాశవంతమైన చర్మ సౌందర్యం కోసం, కీరదోసకాయతో చేసిన ఫేస్-ప్యాక్ ని ట్రై చేయండి !

|

వేసవికాలం రాగానే అందరూ తమ శరీరం పైన, చర్మ సౌందర్యం పైన ఎక్కువ శ్రద్ధను కలిగి ఉంటారు. అందుకోసం రకరకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు, ఆ జాబితాలో మొట్టమొదటగా ఉండేది కీరదోసకాయ. ఈ కీరదోసకాయతో ఉండే కూలింగ్ ఏజెంట్స్ వేసవితాపం నుంచి శరీరాన్ని రక్షిస్తూ, శరీరానికి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

వేసవికాలం వచ్చిందంటే చాలు, ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ఉన్న రిఫ్రిజరేటర్లు వెగ్గీస్తో పూర్తిగా నిండి ఉంటాయి. చాలా తక్కువ ధరతో, మంచి పోషకాలను కలిగి ఉండే ఈ కీరదోసకాయ అందరికీ సులభంగా లభ్యమయ్యే విధంగా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇలాంటి గొప్ప లక్షణాలు కలిగివున్న కీరదోసకాయ, మనకు ఈ వేసవి కాలంలో బాగా ఉపయోగపడతాయి.

Homemade Cucumber Face Packs For A Glowing Skin You Must Try,

ఈ కీరదోసకాయలు మన ఆరోగ్యంతో పాటు, శరీర సౌందర్యాన్ని సంరక్షించడంలో కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ కీరదోసకాయను ఉపయోగించడం వల్ల మనము ఎలాంటి అద్భుతమైన ఫలితాలను పొందుతామో ఇక్కడ తెలుసుకుందాం !

కీరదోసకాయ వల్ల చర్మానికి కలిగే ఫలితాలు ఏమిటి ?

మన శరీర సౌందర్యంలో ఈ కీరదోసకాయను ఒక భాగంగా చేసుకుని దాన్ని ప్రాముఖ్యతను తెలుసుకునేముందు, మన చర్మ సౌందర్యాన్ని సంరక్షించడంలో ఇది ఎలా పనిచేస్తుందో అనే విషయం గూర్చి మొదటగా తెలుసుకుందాం. మనము ఈ కీరదోసను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలైతే కలుగుతాయో, వీటిని చర్మ సంరక్షణ కోసం ఉపయోగించడం వల్ల కూడా అన్నే లాభాలను కలుగజేస్తాయి.

కీరదోసలో యాంటీ ఆక్సిడెంట్లు & యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి ఏజెంట్లు ఉండటమే కాక, చర్మ సౌందర్యాన్ని పర్యరక్షించేందుకు అవసరమైన విటమిన్ ఎ, బీ1, సి, బయోటిన్, పొటాషియం వంటి గొప్ప పోషకాలను కలిగి ఉంది.

ఈ కీరదోస పీచులో ఉండే ఆస్కార్బిక్ & కాఫిక్ అనబడే యాసిడ్స్, స్కిన్ ఇరిటేషన్ నుంచి మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది అలాగే చర్మానికి కావల్సినంత నీటి నిల్వలను కొనసాగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మీ కంటి చుట్టూ ఉన్న నల్లటి వలయాలను తగ్గించడానికి, కళ్ళ మంటలను తగ్గించడానికి, అలెర్జీలను తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.

కీరదోసతో కలిగే ప్రయోజనాలు :

• మీ చర్మ ఛాయను కాంతివంతంగా తయారు చేస్తుంది.

• చర్మాన్ని హైడ్రేట్గాఉంచుతుంది.

• స్కిన్ టోన్ను సహజసిద్ధంగా కలిగి ఉండేలా చేస్తుంది.

• యవ్వనమైనా, ఆరోగ్యవంతమైన చర్మాన్ని అందిస్తుంది.

• చర్మంలో ఉత్పత్తి కాబడే శ్లేష్మాన్ని తగ్గిస్తుంది.

• మొటిమలను & మచ్చలను తొలగిస్తుంది.

• నీటిని అధిక శాతంలో కలిగి ఉన్నందున మీ చర్మాన్ని మాయిశ్చరైజర్గా ఉంచుతుంది.

• స్కిన్ టాన్లను, సన్ బర్న్స్, దద్దుర్లను తగ్గిస్తుంది.

వేసవిలో చర్మ రక్షణ కోసం కీరదోసతో ఇంటిలోనే తయారు చేసుకోగల ఫేస్ ప్యాక్స్ :-

1. కీరదోసకాయ + శనగపిండి (బెసాన్) ఫేస్-ప్యాక్ :

1. కీరదోసకాయ + శనగపిండి (బెసాన్) ఫేస్-ప్యాక్ :

• 2 టేబుల్ స్పూన్ల శనగపిండికి + 3 టేబుల్ స్పూన్ల కీరదోసకాయ రసాన్ని కలిపి బాగా మిక్స్ చేయాలి.

• కళ్ళుకి, నోటికి తప్ప ముఖానికి & మెడకు సమానంగా అప్లై చేయాలి.

• 20-30 నిమిషాల వరకు అలా వదిలివేయడం వల్ల ఆ ఫేస్ ప్యాక్ పొడిగా మారుతుంది.

• ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడిగి, పొడిగా మార్చాలి.

ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని తాజాగా ఉంచడమే కాకుండా, వేసవి కాలంలో మీ చర్మం నిగారించేలా చేస్తుంది.

2. కీరదోసకాయ + పెరుగుల ఫేస్-ప్యాక్ :

2. కీరదోసకాయ + పెరుగుల ఫేస్-ప్యాక్ :

• 1/4 కప్పు కీరదోసకాయ (తొక్క తీసిన) గుజ్జును సేకరించాలి.

• ఈ కీరదోసకాయ గుజ్జుకు 2 టేబుల్ స్పూన్ల పెరుగును కలిపి బాగా మిక్స్ చేసి, మెత్తని పేస్ట్లా తయారు చేయండి.

• మీ ముఖంపై పేస్ట్ను అప్లై చేసిన 15 నిముషాల వరకూ బాగా ఆరనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఈ ఫేస్ ప్యాక్ జిడ్డైన, మొటిమలకు గురైన చర్మంకు ఎంతో అనువైనది అయినప్పటికీ, ఇది సున్నితమైన చర్మం కలవారిపై, చాలా సురక్షితంగా ఉపయోగించబడుతుంది.

3. కీరదోసకాయ + టమోటాల ఫేస్-ప్యాక్ :

3. కీరదోసకాయ + టమోటాల ఫేస్-ప్యాక్ :

• 1/4 కప్పు కీరదోసకాయ (తొక్క తీసిన) గుజ్జును, ½ కప్పు టమోటా గుజ్జుతో బాగా కలిపి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి.

• 1-2 నిమిషాలపాటు వృత్తాకార కదలికలో మీ ముఖం, మెడ భాగాలపై నెమ్మదిగా మసాజ్ చేస్తూ, ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి.

• అలా 15 నిముషాల పాటు వదిలివేసిన తర్వాత చల్లని నీటితో మీ శరీర భాగాలను శుభ్రం చేసుకోవాలి.

ఈ ఫేస్ ప్యాక్ ఎండ తీవ్రత వల్ల ఏర్పడిన టాన్ను తొలగించడంలో ఆదర్శవంతమైనదిగా ఉంటూ, మీ చర్మాన్ని మరింత మృదువుగా తయారుచేస్తుంది.

4. కీరదోసకాయ, ముల్తానీ మట్టి + రోజ్ వాటర్ల ఫేస్ ప్యాక్

4. కీరదోసకాయ, ముల్తానీ మట్టి + రోజ్ వాటర్ల ఫేస్ ప్యాక్

• 2 టేబుల్ స్పూన్ల కీరదోసకాయ రసానికి, 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ను & 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిని కలిపి బాగా పేస్ట్ చేయండి.

• ఇలా తయారైన మిశ్రమాన్ని మీ ముఖానికి, మెడ మీద సమానంగా అప్లై చేయండి. ఒక్క 15 నిముషాల పాటు దానిని అలానే వదిలేయండి.

• ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుని మీ చర్మాన్ని పొడిగా మార్చాలి.

ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మంపై ఉత్పత్తి అయ్యే ఆయిల్ను & గ్రిమ్ను గ్రహిస్తుంది, మరియు మోటిమలను తగ్గిస్తుంది.

5. కీరదోసకాయ + అలోవెరా జెల్ ఫేస్ మాస్క్ :

5. కీరదోసకాయ + అలోవెరా జెల్ ఫేస్ మాస్క్ :

5. కీరదోసకాయ - అలోవెరా జెల్ ఫేస్ మాస్క్ :

• 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్కు, 1/4 తురిమిన కీరదోసకాయ గుజ్జును కలపాలి.

• ముఖం & మెడ మీద ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి.

• ఆ ఫేస్ ప్యాక్ను 15 నిముషాల పాటు అలానే వదిలివేయండి, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి.

ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది.

English summary

Homemade Cucumber Face Packs For A Glowing Skin You Must Try

Come summer, and we all load our refrigerators with this cooling veggie. No doubt, cucumber is a health food, and is much in demand during the scorching summer heat. This cheap, humble veggie is packed with nutrients that are vital for our body and skin.
Story first published:Tuesday, April 24, 2018, 6:38 [IST]
Desktop Bottom Promotion