For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ సంరక్షణకై రెడ్ వైన్ ఫేషియల్ ప్రక్రియలో ఎలా ఉపయోగపడుతుంది?

|

ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ మద్య పానీయాలలో, రెడ్ వైన్ ఒకటి. మానవులు ప్రాచీన కాలం నుండి రెడ్ వైన్ ను తాగుతున్న దాఖలాలు ఉన్నాయి.

వైన్ ప్రేమికులకు తీరిక సమయంలో సహచరి మరియు విశ్రాంతి వేళలో వినోదం, ఈ పానీయమే అనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి రెడ్ వైన్ లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? కూడా వస్తుంది. రెడ్ వైన్ లో యాంటిఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నందున, దీని వలన ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.

చర్మానికి మేలు చేయడమే కాక, కోసం గొప్ప నుండి, హృదయారోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బరువు కోల్పోవాలనుకునేవారు, తాగదగిన ఆరోగ్యకరమైన పానీయాలలో ఇది ఒకటి. దీనిలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. రెడ్ వైన్ లోని యాంటిఆక్సిడెంట్లు మరియు టానిన్లు, శరీరంలో నొప్పులను తగ్గిస్తాయి.

అనేక శాస్త్రీయ అధ్యయనాలు, అప్పుడప్పుడు ఒక గ్లాసుడు రెడ్ వైన్ తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య మరియు సౌందర్య ప్రయోజనాలను తెలియజేస్తున్నాయి. దీనిని ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ ఫేషియల్స్ మరియు స్పా చికిత్సల్లో అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు.


ఇంట్లోనే కూర్చుని రెడ్ వైన్ ఫేషియల్ చేసుకోవడం ఎలా?

ప్రపంచంలోని పలు సెలూన్లు మరియు స్పాలు రెడ్ వైన్ ఫేషియల్ సేవలను అందిస్తున్నాయి. కానీ, ఇవి చాలా ఖరీదైనవి. ఇంట్లో ఈ ఖరీదైన ఫేషియల్ యొక్క ప్రభావాలను తక్కువ ఖర్చుతో మన ఇంటి వద్దనే పొందవచ్చు.

దీనికై మీకు కావలసినదల్లా, మంచి నాణ్యత కలిగిన రెడ్ వైన్ బాటిల్ ఒకటి మరియు మిగిలిన పదార్థాలు, దాదాపు ప్రతి వంటగదిలో సాధారణంగా లభించేవే. అంతేకాకుండా, ఫేషియల్ ఫలితాలు మీరు ఉపయోగించిన రెడ్ వైన్ యొక్క నాణ్యతను బట్టి ఉంటుంది. వివిధ రకాలుల్ రెడ్ వైన్ లలో, యాంటిఆక్సిడెంట్లు విభిన్న స్థాయిలో ఉంటాయి. ఉదాహరణకు, పైనాట్ నాయిర్స్ లో రిస్వరట్రాల్ అనే యాంటిఆక్సిడెంట్ అత్యధిక స్థాయిలో ఉంటుంది.

షిరాజ్, కేబర్నెట్స్ మరియు మెర్లోట్ రకం రెడ్ వైన్ లలో,ప్రోసైనిడిన్ అనే యాంటిఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. రెడ్ వైన్ ఉపయోగించి ఫేషియల్ చేసుకునేటప్పుడు, అన్ని దశలలో,అనగా క్లెన్సింగ్, టోనింగ్, స్కబ్బింగ్ మరియు ముఖం మర్దన చేసుకోవడం కోసం కూడా ఉపయోగించవచ్చు. .


క్లెన్సింగ్ కొరకు: ముందుగా మీ ముఖాన్ని తడి వస్త్రంతో శుభ్రపరచుకోవడంతో ప్రారంభించండి. మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల రెడ్ వైన్ లో ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం కలపండి. ఈ మిశ్రమంలో శుభ్రమైన దూది ఉండను ముంచి, మీ ముఖం అంతటా రాసుకోండి. తరువాత మీ ముఖాన్ని, ఈ క్లెన్సర్ ను ఉపయోగించి మృదువుగా మర్దన చేసుకోండి. కాసేపటి తరువాత శుభ్రమైన టిష్యు కాగితాన్ని ఉపయోగించి ముఖాన్నిశుభ్రం చేసుకోవాలి.

స్క్రబ్బింగ్ కొరకు: మీరు రెడ్ వైన్ ను ఉపయోగించి, ఒక ఎక్స్ఫోలియేటింగ్ పేస్ట్ ను తయారు చేయవచ్చు. రెడ్ వైన్ ను ఒక మంచి ఎక్స్ఫోలియేటర్ అయిన బియ్యం పిండి, కాఫీ, పంచదార మొదలైన పదార్థాలతో కలపండి. కొన్ని టేబుల్ స్పూన్ల రెడ్ వైన్ లో, మీరు ఎంపిక చేసుకున్న ఎక్స్ఫోలియేటర్ తో కలపి గరుకైన పేస్టును తయారు చేయండి. చర్మంపై పేరుకున్న మురికి మరియు మృతచర్మకణాలను తొలగించడానికి, ఈ పేస్టును ఉపయోగించి వలయాకార కదలికలతో మర్దన చేసుకోండి.

మర్దన కొరకు: కలబంద గుజ్జు లేదా రోజ్ వాటర్, ఏదైనా సువాసన తైలం కొన్ని చుక్కలు మరియు రెడ్ వైన్ యొక్క టేబుల్ స్పూన్ తీసుకుని, మూడు పదార్ధాలను బాగా కలపండి. దీనితో మీ ముఖానికి మునివేళ్లని ఉపయోగించి మృదువుగా మర్దన చేసుకోండి. మీ నుదురు, గడ్డం మరియు కళ్ళ కింద ప్రత్యేక దృష్టి పెట్టి మర్దన చేసుకోండి. ఇలా చేయడం వలన ముఖానికి జరిగే రక్త ప్రసరణ మెరుగుపడి, మీ ముఖం అంతటికీ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. కనీసం 10 నిమిషాల పాటు మర్దన చేసుకున్నాక, ముఖాన్ని తుడుచుకోండి.

రెడ్ వైన్ ఫేస్ ప్యాక్ కోసం: రెడ్ వైన్ ఫేస్ ప్యాక్ ను రెడ్ వైన్, పెరుగు మరియు తేనెలను, చెరో టేబుల్ స్పూన్ ఉపయోగించి తయారు చేయండి. అన్ని పదార్ధాలను కలిపి, మీ ముఖానికి రాసుకుని, 15 నిముషాల పాటు ఆరనివ్వండి. తరువాత తడిగా ఉన్న వస్త్రంతో దీనిని తుడుచుకున్నాక, మీ ముఖంలో కొట్టొచ్చేట్టు కనబడే వ్యత్యాసాన్ని గమనించండి.

English summary

Red Wine For Skin: Ways To Use It For Facial Skincare

Red Wine For Skin: Ways To Use It For Facial Skincare,Red wine is one of the most popular alcoholic drinks around. Humans have been consuming the ruby red vino since time immemorial. The drink, which has been an instrument of leisure and relaxation for wine lovers, also comes with a number of health benefits. Some of
Story first published: Saturday, August 11, 2018, 10:50 [IST]