For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్ సీజన్లో పొడి చేతుల నుండి ఉపశమనం పొందడానికి రెమెడీస్

By Mallikarjuna
|

ఈ వింటర్ సీజన్లో మీరు ఆల్రెడీ డ్రై హ్యాండ్స్ కలిగి ఉన్నారా?చేతులు చూడటానికి పొడి బారీ అసౌకర్యంగా చూడటానికి ఇబ్బందిగా ఉందా, మాయిశ్చరైజర్ అప్లై చేసినా డీహైడ్రేడ్ గా కనబడుతున్నాయా?

అవును అన్నట్లైతే, ఈ ఆర్టికల్ మీకోసమే. ఈ రోజు బోల్డ్ స్కై కొన్ని సింపుల్ చిట్కాలను పరిచయం చేస్తున్నది, వింటర్లో పొడిబారిన చేతులకు ఈ చిట్కాలు ఎఫెక్టివ్ గా పనిచేసి, చేతులను స్మూత్ గా, పొడిబారినవివ్వకుండా అందంగా కనబడేలా చేస్తాయి.

వాతావరణంలో మార్పుల వల్ల , వాతావరణంలో తేమ వల్ల చర్మంలో మాయిశ్చరైజింగ్ గుణాలు తగ్గిపోయి, చేతులు పొడిబారి, చీలినట్లు కనబడుతాయి. చేతులు పొడబారకుండా చూసుకోవడానికి మార్కెట్లో అందుబాటులో ఉండే మాయిశ్చరైజర్స్ మరియు లోషన్స్ బాడీకి అప్లై చేసినప్పుడు కొద్దిసేపు మాత్రమే ఉపశమనం కలిగించవచ్చు. .ఎక్కువ సమయం మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు.

ఎక్కువ సమయం చేతులు స్మూత్ గా , కాంతివంతంగా కనిపించాలంటే, చేతలకు న్యాచురల్ పదార్థాలను ఉపయోగించడం ఉత్తమం. న్యాచురల్ పదార్థాలలో కూడా స్కిన్ న్యూరీషింగ్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి చర్మానికి హైడ్రేషన్ కలిగిస్తాయి. వీటిని అప్లై చేయడం వల్ల ఎక్కువ సమయం మాయిశ్చరైజ్డ్ గా ఉంటాయి.

అటువంటి హోం రెమెడీస్ ను ఈ క్రింది విధంగా సూచించడం జరిగింది, వీటిని ఉపయోగించి ఎఫెక్టివ్ ఫలితాలను పొంది వింటర్లో డ్రై హ్యాండ్స్ నుండి ఉపశమనం పొందండి..

1. ఆలివ్ ఆయిల్

1. ఆలివ్ ఆయిల్

చర్మానికి ఆలివ్ ఆయిల్ డీప్ గా కండీషన్ ఇస్తుంది. కేవలం ఆలివ్ ఆయిల్ ను చేతులకు అప్లై చేసి మసాజ్ చేయాలి. స్నానికి ముందు అప్లై చేసి, కొన్ని గంటల తర్వాత వేడి నీటితో స్నానం చేస్తే చేతులు స్మూత్ గా కాంతివంతంగా కనబడుతాయి. ఈ చిట్కాను రోజూ అనుసరిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

2. బాదం ఆయిల్

2. బాదం ఆయిల్

స్కిన్ న్యూరిషింగ్ రెమెడీ మరొకటి, బాదం , బాదం ఆయిల్ చర్మానికి పోషణను అందించి వింటర్ సీజన్లో బాదం ఆయిల్ చేతులకు అప్లై చేస్తే డ్రై హ్యాండ్స్ నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ రెమెడీని రోజులో రెండు మూడు సార్లు ఉపయోగించడం వల్ల చేతులు సాప్ట్ గా మరియు స్మూత్ గా కనబడుతాయి.

3. తేనె

3. తేనె

తేనె చేతులకు న్యాచురల్ గా తేమను అందిస్తుంది. డ్రై స్కిన్ నివారిస్తుంది. చేతులను సాఫ్ట్ గా మార్చుతుంది. తేనెను అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ రెమెడీని రోజూ ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

4. పెరుగు

4. పెరుగు

పెరుగు న్యాచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. పగిలిన చర్మంను నివారిస్తుంది. పెరుగు చర్మాన్ని స్మూత్ గా మార్చతుంది. పెరుగును చేతులకు అప్లై చేసి అరగంట తర్వాత ట్యాప్ వాటర్ తో కడిగేయాలి. దీన్ని రోజుకు రెండు సార్లు ఉపయోగిస్తే చేతులు స్మూత్ గా కాంతివంతంగా మారుతాయి. .

5. అరటి

5. అరటి

అరటిపండు పోషకాలు కలిగినది. బాగా పండిన అరటి పండును మెత్తగా చేసి, రోజ్ వాటర్ కలిపి చేతలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఇస్తుంది. వారంలో 4,5 సార్లు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

6. అలోవెర జెల్

6. అలోవెర జెల్

అలోవెర జెల్ హైడ్రేటింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది. అలోవెర ప్లాంట్ నుండి జెల్ ను తీసి చేతులకు అప్లై చేయాలి. జెల్ అద్భుతంగా పనిచేస్తుంది. స్నానానికి అరగంట ముందు అప్లై చేసి తర్వాత స్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

7. కొబ్బరి నూనె

7. కొబ్బరి నూనె

కొబ్బరి నూనె బహు ప్రయోజనాలు కలిగినది, అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది., ముఖ్యంగా వింటర్లో సీజన్లో చర్మానికి కావాల్సి పోషణను అందించి డ్రై నెస్ తగ్గిస్తుంది. చేతులను స్మూత్ గా మార్చుతుంది. .

8. మిల్క్ క్రీమ్

8. మిల్క్ క్రీమ్

మిల్క్ క్రీమ్ ఉత్తమ రెమెడీ. ఇది చేతులకు కావల్సిన మాయిశ్చరౌైజర్ ను అందించి, చేతులను తేమగా ఉంచుతుంది. వింటర్ సీజన్లో మిల్క్ క్రీమ్ అప్లై చేయడం వల్ల చేతులు డ్రైనెస్ తగ్గుతుంది. వారంలో నాలుగైదు సార్లు అప్లై చేస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.

English summary

Remedies That Can Soothe Dry Hands During The Winter Season

Remedies That Can Soothe Dry Hands During The Winter Season, Here, we've compiled a list of such remedies that can be easily found in your kitchen cabinet. Read on to know more about them and the most effective way to use them:
Desktop Bottom Promotion