For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ సమ్మర్ లో బాడీ యాక్నే(చర్మంపై మొటిమలు, మచ్చలు) సమస్యను అధిగమించడమెలా?

ఈ సమ్మర్ లో బాడీ యాక్నే(చర్మంపై మొటిమలు, మచ్చలు) సమస్యను అధిగమించడమెలా?

|

యాక్నే అనేది చాలా మంది ఫేస్ చేసే సాధారణ సమస్య. దాదాపు అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు.

ఈ సమ్మర్ లో, మీ శరీరం అనేది ఎంతో ఆయిల్ ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే చెమటను చిందిస్తుంది. కాబట్టి, ఆయిల్ తో చెమట కలవడంతో యాక్నే సమస్య తలెత్తుతుంది.

ఛాతిపై అలాగే వీపుపై బ్రేకవుట్స్ కనిపిస్తాయి. ఇవి ముఖంపై కనిపించే బ్రేకవుట్స్ కంటే కొంత డిఫెరెంట్ గా ఉంటాయి. వీటిని టెక్నికల్ గా ఫోలీక్యులైటిస్ అనంటారు. హెయిర్ ఫోలికల్స్ అనేవి ఇన్ఫెక్ట్ అవడం వలన ఈ సమస్య ఎదురవుతుంది. వీటిని ఫేషియల్ యాక్నేను ట్రీట్ చేసే ప్రోడక్ట్స్ తో అలాగే ఇంగ్రిడియెంట్స్ తో తొలగించుకోవచ్చు.బాక్టీరియా అనేది పోర్స్ లో స్టక్ అయి శరీరంపై యాక్నేను కలిగిస్తుంది.

Remedies To Beat Body Acne This Summer

అయితే, బాడీ బ్రేక్ అవుట్స్ అలాగే బాడీ యాక్నే వంటివి సడన్ గా ఎదురయ్యే సమస్య కాదు. ఇవి చర్మంపై సడన్ గా సమ్మర్ సీజన్ లో మాత్రమే ఎదురయినా ఇవి అప్పటికప్పుడు ఎదురయ్యే సమస్య కాదు. పోర్స్ లో బాక్టీరియా పేరుకుపోవడం వలన ఈ సమస్య తలెత్తుతుంది.

కొన్నిసార్లు, బాడీ యాక్నే సమస్యను మెడిసిన్స్ ను తీసుకోవడం ద్వారా అలాగే క్రీమ్స్ ను అప్లై చేయడం ద్వారా అధిగమించవచ్చు. అయితే, ఇంట్లో లభించే పదార్థాలతో తయారుచేసే నేచురల్ రెమెడీస్ ను పాటిస్తే ఈ సమస్యను మరింత సులభంగా అధిగమించవచ్చు.

షోల్డర్ యాక్నే, బాడీ యాక్నే లేదా యాక్నే సమస్య వచ్చే స్కిన్ పై ఈ రెమెడీస్ ను పాటిస్తే ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు.

నిమ్మ మరియు షుగర్ స్క్రబ్:

నిమ్మ మరియు షుగర్ స్క్రబ్:

నిమ్మ రసంలో ఉండే యాస్ట్రింజెంట్ ప్రాపర్టీస్ అనేవి ఇంఫ్లేమేషన్ కు దారి తీసే యాక్నే, ఓపెన్ క్లాగ్డ్ పోర్స్ సమస్యను తగ్గిస్తూ డల్ కాంప్లెక్షన్ ను బ్రైటన్ చేయడానికి తోడ్పడతాయి. నిమ్మ అనేది డార్క్ స్కిన్ ను లైటెన్ చేయడానికి తోడ్పడుతుంది.

ఎలా వాడాలి:

ఒక నిమ్మ కాయను తీసుకుని సగంగా కట్ చేయాలి. లెమన్ స్లైసెస్ ను అందుబాటులో ఉంచుకున్నా సరే.

నిమ్మను షుగర్ తో కవర్ చేయండి. ఇప్పుడు, మీ షోల్డర్ లేదా చెస్ట్ ను ఈ మిశ్రమంతో స్క్రబ్ చేయండి. కనీసం 2 లేదా మూడు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ ను కంటిన్యూ చేయండి. షుగర్ గ్రేన్యుల్స్ పూర్తిగా కరిగిపోయే వరకు ఈ ప్రాసెస్ ను ఫాలో అవ్వండి. ఆ తరువాత 5 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి. ఆ తరువాత శుభ్రమైన క్లాత్ ను తీసుకుని స్కిన్ ను శుభ్రపరుచుకోండి. లేదా నీటితోనైనా శుభ్రపరుచుకోండి.

ఆపిల్ సైడర్ వినేగార్:

ఆపిల్ సైడర్ వినేగార్:

ఆపిల్ సైడర్ వినేగార్ లో లాక్టిక్ యాసిడ్ అలాగే మాలిక్ యాసిడ్ లభ్యమవుతాయి. ఇవి బాడీ యాక్నేను ట్రీట్ చేయడానికి తోడ్పడతాయి. అలాగే చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి పిహెచ్ లెవల్స్ ని బాలన్స్ చేయడానికి తోడ్పడతాయి.

ఎలా వాడాలి:

కొన్ని చుక్కల ఆపిల్ సిడర్ వినేగార్ ను నీళ్లలో డైల్యూట్ చేసి ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయండి. ఈ ఏరియాను పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో రిన్స్ చేయండి. ఈ విధంగా, రోజుకు రెండు లేదా మూడు సార్లు పాటించండి.

ప్రత్యామ్న్యాయంగా, కాస్తంత ఆపిల్ సిడర్ వినేగార్ ను నీళ్ళల్లో డైల్యూట్ చేసి తాగండి. ఈ విధంగా రోజుకు రెండు సార్లు చేస్తే మంచి ఫలితం పొందవచ్చు.

ఓట్స్:

ఓట్స్:

బాడీ యాక్నేను తగ్గించేందుకు ఓట్ మీల్ తోడ్పడుతుంది. ఇందులో, యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ కలవు. ఇవి ఇంఫ్లేమేషన్ ను అలాగే పెయిన్ ను తగ్గించేందుకు తోడ్పడతాయి.

ఎలా వాడాలి:

ఒక టేబుల్ స్పూన్ ఓట్ మీల్ పౌడర్ మరియు పెరుగును ఒక టీస్పూన్ టర్మరిక్ పౌడర్ లో కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. దీనిని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి. ఇది ఆరాక, అయిదు నిమిషాల పాటు సర్క్యూలర్ మోషన్ లో స్క్రబ్ చేయాలి. వార్మ్ వాటర్ తో రిన్స్ చేయాలి. ఈ పద్దతిని వారానికి ఒకసారి పాటించాలి.

టర్మరిక్:

టర్మరిక్:

మొటిమల నివారణకు టర్మరిక్ అనేది ప్రాచీన కాలం నుంచి వాడుకలోనున్న గొప్ప రెమెడీ. ఇందులో యాంటీ బాక్టీరియల్ ప్రొపెర్టీస్ కలవు. ఇవి యాక్నేను కలిగించే బాక్టీరియాను నశింపచేస్తాయి.

ఎలా వాడాలి:

ఒక టీస్పూన్ టర్మరిక్ పౌడర్ లో కొంత వాటర్ అలాగే కొబ్బరి నూనెను కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి. దీనిని ఒక గంట పాటు అలాగే ఉండనివ్వాలి. గోరువెచ్చటి నీటితో ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రపరచాలి.

టమాటో జ్యూస్:

టమాటో జ్యూస్:

టమాటోలో కొన్ని శక్తివంతమైన విటమిన్స్ అలాగే మినరల్స్ కలవు. ఇవి చర్మసంరక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. టమాటోలో ఇంఫ్లేమేషన్ కు దారితీసే బాక్టీరియా కలదు.

ఎలా వాడాలి:

టమాటో స్లైస్ ను తీసుకోండి. దానిని మ్యాష్ చేసి గుజ్జులా తయారుచేసుకోండి. ఇప్పుడు, ఇందులో ఒక టీస్పూన్ తేనెను కలపండి. ఈ రెండు పదార్థాలని బాగా కలిపి ప్రభావిత ప్రాంతంపై మాస్క్ లా అప్లై చేసుకోండి.

దీనిని 15 నుంచి 20 నిమిషాల వరకు అలాగే ఉంచండి. తరువాత, నీళ్లతో వాష్ చేయండి.

అలోవెరా జెల్:

అలోవెరా జెల్:

అలోవెరా జెల్ లో అస్ట్రింజెంట్ మరియు యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కలవు. ఇవి బాడీ యాక్నేను హీల్ చేయడానికి తోడ్పడతాయి.

ఎలా వాడాలి:

ఒక టీస్పూన్ అలోవెరా జెల్ ను తీసుకోండి. షవర్ తీసుకున్న తరువాత అలోవెరా జెల్ ను ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయండి. దీనిని వాష్ చేయవలసిన అవసరం లేదు. కొద్ది నిమిషాలలో ఆరిపోతుంది.

ప్రత్యామ్న్యాయంగా, ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ను కొన్ని చుక్కల నిమ్మరసంలో అలాగే అర టీస్పూన్ తేనెలో కలపి ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఈ పదార్థాలని బాగా కలిపి ప్రభావిత ప్రాంతంపై సున్నితంగా అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రపరచాలి.

English summary

Remedies To Beat Body Acne This Summer

Acne is a major issue faced among all of us, irrespective of whether we are men or women. But acne can not only appear on the face, it also can appear on the other parts of the body. The best way to get rid of this is by using some ingredients like lemon, aloe vera, oats, etc.Body Acne And Its Remedies
Story first published:Friday, April 13, 2018, 13:02 [IST]
Desktop Bottom Promotion