For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివిధ చర్మ సమస్యలకు ఉద్వాసన పలికేందుకై అద్భుతమైన శాండల్వుడ్ ఫేస్ ప్యాక్స్

|

శాండల్వుడ్ లో చర్మ సంరక్షణ గుణాలు అధికంగా ఉన్నాయి. వేల సంవత్సరాల నుండి శాండల్వుడ్ ని చర్మసంరక్షణ పదార్థంగా గుర్తించి వాడటం ప్రసిద్ధి చెందిన విషయం. ప్రపంచవ్యాప్తంగా శాండల్వుడ్ అనేది చర్మసంరక్షణ కారిగా ప్రాచుర్యం పొందింది. ఇందులో నున్న ఔషధ గుణాలను ఆయుర్వేదా ట్రీట్మెంట్ లో వివిధ చర్మ సమస్యలను తగ్గించేందుకు వాడతారు.

శాండల్వుడ్ పౌడర్ ని అన్ని రకాల చర్మతత్వాల వారు ఉపయోగించవచ్చు. ఆయా చర్మతత్వాలకు అనుగుణంగా కొని మార్పులూ చేర్పులతో శాండల్వుడ్ పౌడర్ ను ఉపయోగిస్తే ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సరైన విధంగా శాండల్వుడ్ ను ఉపయోగిస్తే చర్మ సమస్యలు తొలగిపోతాయి. అన్ని రకాల చర్మ సమస్యలకు శాండల్వుడ్ అద్భుతమైన పరిష్కారంగా వ్యవహరిస్తోంది. చర్మ సమస్యల నుంచి బయటపడేందుకు శాండల్వుడ్ అనేది ప్రకృతి మాత ప్రసాదించిన ప్రసాదం.

Sandalwood face packs to treat skin problems

స్కిన్ కేర్ కోసం శాండల్వుడ్ ను ఉపయోగించాలని అనుకుంటే పౌడర్ రూపంలో నున్న శాండల్వుడ్ ను తీసుకుంటే మంచిది. ఎందుకంటే మరికొన్ని నేచురల్ ఇంగ్రీడియెంట్స్ ను కలిపి ఫేస్ ప్యాక్ లను తయారుచేసేందుకు శాండల్వుడ్ పౌడర్ ఉపయోగకరంగా ఉంటుంది. వీలయితే, ఆర్గానిక్ స్టోర్ నుంచి శాండల్వుడ్ పౌడర్ ను తీసుకోండి. క్వాలిటీ బ్రాండ్ కు చెందిన శాండల్వుడ్ పౌడర్ ను తీసుకోండి.

ఇప్పుడు, శాండల్వుడ్ ఫేస్ ఫ్యాక్స్ ను ఏ విధంగా తయారుచేసుకోవచ్చో తెలుసుకుందాం. తద్వారా, వివిధ చర్మ సమస్యలకు ఉద్వాసన పలుకుదాం.

పింపుల్స్ ను తొలగించి యాక్నే ను అరికట్టేందుకు:

పింపుల్స్ ను తొలగించి యాక్నే ను అరికట్టేందుకు:

పింపుల్స్ కు అద్భుతమైన రెమెడీగా శాండల్వుడ్ పనికొస్తుంది. పింపుల్స్ సమస్య మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు శాండల్వుడ్ ఫేస్ ప్యాక్ అనేది మీకు చక్కటి పరిష్కారంగా ఉంటుంది. శాండల్వుడ్ లో నున్న యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు యాక్నేకు కారణమయ్యే బాక్టీరియాపై పోరాడేందుకు తోడ్పడతాయి. తద్వారా, మచ్చలేని చర్మం మీ సొంతమవుతుంది.

ఒక టేబుల్ స్పూన్ శాండల్వుడ్ పౌడర్ లో ఒక టీస్పూన్ పాలను కలిపి అందులో ఒక చిటికెడు పసుపు పొడిని జోడించండి. వీటిని బాగా కలిపి చక్కటి మిశ్రమంలా తయారుచేసుకోండి. ఈ పేస్ట్ ను చర్మంపై అప్లై చేసి ముప్పై నిమిషాలపాటు అలాగే ఉండనివ్వండి. ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రపరచండి. శాండల్వుడ్ మరియు పసుపులో ఔషధ గుణాలు కలవు. ఇవి ప్రభావిత ప్రాంతాన్ని త్వరగా కోలుకునేలా చేసి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.

వార్ట్స్ ని తొలగించి బ్లేమిషెస్ ను కనుమరుగయ్యేలా చేసేందుకు:

వార్ట్స్ ని తొలగించి బ్లేమిషెస్ ను కనుమరుగయ్యేలా చేసేందుకు:

పింపుల్స్, ర్యాషెస్ మరియు కొన్ని ఇంజ్యూరీలు చర్మంపై శాశ్వతమైన మచ్చలను మిగులుస్తాయి. అటువంటి మొండి మచ్చలను తొలగించేందుకు శాండల్వుడ్ సమర్థవంతంగా తోడ్పడుతుంది. హెచ్ పీ వీ వైరస్ తో సోకే వార్ట్స్ ను తొలగించేందుకు ఇది ఎంతో ప్రభావవంతంగా సహకరిస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ శాండల్వుడ్ పౌడర్ లో కొంత పసుపును కలపండి. ఇప్పుడు ఇందులో ఒక టీస్పూన్ పాలను అలాగే ఒక చిన్న కర్పూర బిళ్ళను జోడించండి. వీటిని బాగా కలిపి పేస్ట్ ను తయారుచేసుకోండి. ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయండి. రాత్రంతా ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రాంతంపై ఉండనివ్వండి. మరుసటి ఉదయాన్నే నీటితో శుభ్రంగా కడగండి. అయితే, ఈ పద్దతిని రెగ్యులర్ గా వాడితే ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు.

ముడతలను, అలాగే ప్రీమెచ్యూర్ ఏజింగ్ స్కిన్ ను అరికడుతుంది:

ముడతలను, అలాగే ప్రీమెచ్యూర్ ఏజింగ్ స్కిన్ ను అరికడుతుంది:

దుమ్ము ధూలికి అలాగే ఎండతో పాటు మరికొన్ని పొల్యూటెంట్స్ కి చర్మం తరచూ ఎక్స్పోజ్ అవడం వలన ప్రీమెచ్యూర్ ఏజింగ్ స్కిన్ సమస్య వేధిస్తుంది. శాండల్వుడ్ పౌడర్ అనేది ఏజింగ్ లక్షణాలను తగ్గించి ఫ్రీ రాడికల్స్ ద్వారా చర్మం దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

రెండు టేబుల్ స్పూన్ల శాండల్వుడ్ పౌడర్ లో ఒక టేబుల్ స్పూన్ తేనెను అలాగే ఒక ఎగ్ యోల్క్ ను కలిపి మిశ్రమాన్ని తయారుచేయండి. దీనిని ఫేస్ మాస్క్ గా అప్లై చేసుకోండి. గంట తరువాత చల్లటి నీటితో వాష్ చేసుకోండి. ఈ ప్రాసెస్ ను రెగ్యులర్ గా ఫాలో అవడం ద్వారా స్కిన్ ఎలాస్టిసిటీ మెరుగవుతుంది. ప్రీమెచ్యూర్ ఏజింగ్ లక్షణాలు అరికట్టబడతాయి. శాండల్వుడ్ లో నున్న యాంటీ సెప్టిక్ ప్రాపర్టీలు డేమేజ్డ్ సేల్స్ ను రిపెయిర్ చేసేందుకు తోడ్పడతాయి. తద్వారా, మీ చర్మం యవ్వనంగా మరింత ప్రకాశంగా మారుతుంది.

డ్రై స్కిన్ సమస్యకు పరిష్కారంగా:

డ్రై స్కిన్ సమస్యకు పరిష్కారంగా:

ఒక టీస్పూన్ శాండల్వుడ్ పౌడర్ లో పావు టీస్పూన్ కొబ్బరి నూనెను అలాగే బాదాం నూనెను, రోజ్ వాటర్ చుక్కలను కలిపి చర్మంపై అప్లై చేసుకుంటే చర్మానికి తేమ అందుతుంది. తద్వారా, పొడిచర్మం సమస్య తగ్గుముఖం పడుతుంది. ఈ పద్దతిని పాటించడం ద్వారా చర్మం ఎక్కువగా పొడిబారకుండా ఉంటుంది. ఈ ప్యాక్ ను వారానికి మూడు సార్లు వాడితే ఉత్తమ ఫలితాన్ని పొందవచ్చు. ఈ ప్యాక్ లో నున్న ఇంగ్రీడియెంట్స్ అనేవి చర్మంపై సహజమైన పీ హెచ్ లెవల్స్ ని రిస్టోర్ చేసేందుకు తోడ్పడతాయి.

ఆయిలీ స్కిన్ ను ట్రీట్ చేసేందుకు:

ఆయిలీ స్కిన్ ను ట్రీట్ చేసేందుకు:

చర్మంపై డ్రై నెస్ తో పాటూ ఆయిలీనెస్ ను అరికట్టేందుకు శాండల్వుడ్ పౌడర్ తోడ్పడుతుంది. కొన్ని పదార్థాలను కూర్చడం ద్వారా ఈ రెండు లాభాలను పొందవచ్చు. ఉదాహరణకి, అర టీస్పూన్ శాండల్వుడ్ పౌడర్ లో ఫుల్లర్స్ ఎర్త్ ని జోడించి అందులో అస్ట్రింజెంట్ లా పనిచేసే టమాటో జ్యూస్ ను కూడా కలిపితే పోర్స్ శుభ్రపడతాయి, బ్లాక్ హెడ్స్/ వైట్ హెడ్స్ తొలగిపోతాయి, అదనపు ఆయిల్ తొలగిపోతుంది. ఈ ప్యాక్ ను వారానికి మూడు సార్లు వాడితే చర్మంపై అదనపు ఆయిల్ తో పాటు చర్మంపై దుమ్మూ ధూళి కూడా తొలగిపోతాయి.

ప్రకాశవంతమైన చర్మాన్ని పొందేందుకై :

ప్రకాశవంతమైన చర్మాన్ని పొందేందుకై :

మీ చర్మాన్ని కాంతివంతంగా అలాగే ప్రకాశవంతంగా మార్చేందుకు మీరు ప్రయత్నిస్తున్నట్టయితే శాండల్వుడ్ ను మీరు ప్రిఫర్ చేయాలి. అర టీస్పూన్ శాండల్వుడ్ పౌడర్ (ఆయిలీ స్కిన్ కై) లేదా శాండల్వుడ్ ఆయిల్ (డ్రై స్కిన్ కై), రెండు టీస్పూన్ల శనగపిండి, చిటికెడు పసుపు మరియు రోజ్ వాటర్ లను కలిపి ఫేస్ ప్యాక్ ను తయారుచేసుకోవాలి. ఈ ప్యాక్ ను రెగ్యులర్ గా వాడటం ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది.

సన్ ట్యాన్ ను తొలగించుకునేందుకు:

సన్ ట్యాన్ ను తొలగించుకునేందుకు:

సన్ ట్యాన్ కు శాండల్వుడ్ అద్భుతమైన పరిష్కారంగా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ శాండల్వుడ్ పౌడర్ లో ఒక టీస్పూన్ పుల్లటి పెరుగును అలాగే అర టీస్పూన్ తేనెను కలపండి. ఇది అద్భుతమైన డీ ట్యానింగ్ ప్యాక్ లా పనిచేస్తుంది. సూర్యరశ్మి వలన చర్మంపై కలిగిన ఇంప్యూరిటీస్ ను అలాగే ఇతర డేమేజ్ లను తొలగించేందుకు ఈ ప్యాక్ తోడ్పడుతుంది. పెరుగుతో పాటు శాండల్వుడ్ పౌడర్ లో కూలింగ్ ప్రాపర్టీస్ అధికంగా లభిస్తాయి. తద్వారా, చర్మం కోమలంగా మారుతుంది.

చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది:

చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది:

శాండల్వుడ్ పౌడర్ ని ఎక్స్ఫోలియేషన్ కై వాడితే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఒక టేబుల్ స్పూన్ శాండల్వుడ్ పౌడర్ లో బ్లాక్ చిక్ పీ పౌడర్ ను కలపండి. కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను లేదా మిల్క్ ను జోడించి పేస్ట్ ను తయారుచేసుకోండి. ఈ పేస్ట్ తో సున్నితంగా సర్క్యూలర్ మోషన్ లో మసాజ్ చేసుకోండి. పదిహేను నిమిషాల వరకు ఆలాగే ఉంచి ఆ తరువాత వాష్ చేసుకోండి.

చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా అలాగే ప్రకాశవంతంగా మార్చేందుకు శాండల్వుడ్ ఫేస్ ఫ్యాక్స్ అద్భుతాలు చేస్తాయి. కల్తీ లేని శాండల్వుడ్ పౌడర్ ని వాడటం ద్వారా మీరు అద్భుత ఫలితాలను పొందవచ్చు.

English summary

Sandalwood face packs to treat skin problems

Sandalwood is valued for its medicinal properties, and is widely used in Ayurveda to treat several skin conditions. Sandalwood powder can be used by people of all skin types. A sandalwood face pack can be best used for pimples and cure acne and pimples in no time. The anti-bacterial properties of sandalwood help your skin fight the acne-causing bacteria.
Desktop Bottom Promotion