Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అండర్ ఆర్మ్ పింపుల్స్ నుంచి విముక్తి పొందటామెలా?
అండర్ ఆర్మ్ పింపుల్స్ నుంచి విముక్తి పొందటామెలా?
మీ అండర్ ఆర్మ్స్ ని షేవ్ చేయగానే చికాకు కలిగించే పింపుల్స్ మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయా? ఈ అండర్ ఆర్మ్ పింపుల్స్ ను ట్రీట్ చేయడానికి అనేక పద్ధతులు కలవు. వాటిని తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవండి మరి. బంప్స్ వంటి పింపుల్స్ అనేవి రెండు రకాల సమస్యల వలన కనిపిస్తాయి. ఇంగ్రోన్ హెయిర్ మరియు షేవింగ్ ని సరైన పద్దతిలో చేయకపోవటం వలన ఈ పింపుల్స్ సమస్య వేధిస్తుంది.
షేవ్ చేసిన ప్రతీసారి, వెంట్రుకల మొదళ్ళు చర్మంలోకి చొచ్చుకుపోతాయి. దీనివల్లనే, బంప్స్ ఏర్పడతాయి. యాక్నే లేదా పింపుల్స్ అనే రెడ్ బంప్స్ సమస్య అండర్ ఆర్మ్స్ లో కనిపిస్తుంది. ముఖ్యంగా, బాక్టీరియా వలన ఈ అండర్ ఆర్మ్ పింపుల్స్ సమస్య తలెత్తుతుంది.

శరీరం నుంచి విడుదలైన సహజమైన నూనెలు చర్మాన్ని క్లాగ్ చేయడానికి ప్రయత్నిస్తే చిన్నపాటి ఇన్ఫెక్షన్ అనేది పోర్స్ లో మొదలవుతుంది. కొన్ని సార్లు, చెమట వలన కూడా పింపుల్స్ సమస్య ఎదురవుతుంది. ఈ సమస్య నుంచి వేగంగా బయటపడాలి. ధరించే దుస్తుల నాణ్యత కూడా బాక్టీరియాను పెంచి పోషించడంలో తనదైన పాత్ర పోషిస్తుంది. తక్కువ క్వాలిటీ డిటర్జెంట్ ను వాడటం వలన బాక్టీరియా వేగంగా విస్తరిస్తుంది.
డియోడరెంట్ వలన కూడా అండర్ ఆర్మ్ బంప్స్ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. డియోడరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వలన డెర్మటైటిస్ సమస్య తలెత్తుతుంది. చర్మంతో ఏదైనా కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు చర్మం ఇరిటేట్ అవుతుంది. ఈ సమస్యను డెర్మటైటిస్ అనంటారు. అండర్ ఆర్మ్ పింపుల్స్ ను తొలగించేందుకు కొన్ని ప్రభావవంతమైన హోమ్ రెమెడీస్ ను ప్రయత్నించవచ్చు.



Click it and Unblock the Notifications