For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ మోచేతుల రంగును తేలికపర్చటానికి మీకు బహుశా తెలియని 6 ఇంటి చిట్కాలు

మీరు ఎంతో అందమైన డ్రస్ వేసుకుని తయారయినా, నల్లటి మోచేతులు మీ లుక్ ను నాశనం చేస్తాయి. మీకు గుర్తుండే ఉంటుంది, ఎన్నోసార్లు ఒక అందమైన తెల్లని డ్రస్ ను కేవలం నల్లబడ్డ మోచేతుల కారణంగా కట్టుకోవడం మానేసారని.

By Deepthi Tas
|

మీరు ఎంతో అందమైన డ్రస్ వేసుకుని తయారయినా, నల్లటి మోచేతులు మీ లుక్ ను నాశనం చేస్తాయి. మీకు గుర్తుండే ఉంటుంది, ఎన్నోసార్లు ఒక అందమైన తెల్లని డ్రస్ ను కేవలం నల్లబడ్డ మోచేతుల కారణంగా కట్టుకోవడం మానేసారని. ఈ సమస్యను పరిష్కరించడానికి అనేక పద్ధతులున్నాయి; అన్నిటిలోకెల్లా సాధారణమైనది మీ మోచేతులపై నిమ్మకాయ తొన రుద్దుకోవటం. మేమిక్కడ నల్లబడ్డ మోచేతుల రంగు తేలికయ్యే ప్రభావవంతమైన ఇంటి చిట్కాల లిస్టును ఇచ్చాం.

మోచేతులపై చర్మం సాధారణంగా గరుకుగా లేదా మందంగా ఉంటుంది. మరియు మిగతా చర్మం కన్నా వేగంగా తేమను కోల్పోతుంది. అందుకే మోచేతులు కఠినంగా మారిపోతాయి. మీరెంత పట్టించుకోకుండా వదిలేస్తే అంత గట్టి, మొండి చర్మంగా మారిపోతుంది. మోచేతులు సాధారణంగా మృతకణాలు తొలగించకపోవడం, మాయిశ్చరైజ్ చేయకపోవడం మరియు సన్ స్క్రీన్ రాసుకోకపోవడం వలన నల్లబడతాయి. అందుకని మోచేతుల సంరక్షణ కూడా ముఖ్యమైనదే.

ఎటువంటి లోపం లేని మోచేతి చర్మాన్ని పొందాలనుకుంటే, ఈ కింది సింపుల్ మరియు ప్రభావవంతమైన ఇంటి చిట్కాలు చదివి మీ నల్ల మోచేతుల రంగును మార్చుకోండి.

పుదీనాకు జై

పుదీనాకు జై

మన రోజువారీ వంటకాలలో వాడుకునే ముఖ్యమైన మొక్క పుదీనా, ఇది నల్లని మోచేతుల రంగు తేలిక చేయటంలో చాలా బాగా పనిచేస్తుంది. చేతిలో పట్టినన్ని పుదీనా ఆకులను తీసుకుని అరకప్పు నీళ్ళలో మరిగించండి. అరచెక్క నిమ్మకాయను ఆ మరుగుతున్న నీటిలో పిండండి. ఈ మిశ్రమాన్ని దూదితో మీ మోచేతులకి పట్టించండి. ఒక 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

చక్కెర మరియు ఆలివ్ నూనె కూడా సాయపడతాయి

చక్కెర మరియు ఆలివ్ నూనె కూడా సాయపడతాయి

చక్కెర మరియు ఆలివ్ నూనెల మిశ్రమం మృతకణాలను తొలగించే ఎక్స్ ఫోలియేటర్ లాగా మరియు మాయిశ్చరైజర్ లాగా చర్మంపై పనిచేస్తుంది. సమాన పరిమాణాలలో ఆలివ్ నూనె మరియు చక్కెరలను తీసుకుని గట్టి పేస్టులా కలపండి. ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు మోచేతులపై రుద్ది కొంచెం సబ్బు మరియు నీళ్ళతో కడిగేయండి.

వంట సోడా మరియు పాలే ఇక దిక్కు

వంట సోడా మరియు పాలే ఇక దిక్కు

వంట సోడా మరియు పాలతో గట్టి పేస్టు కలపండి. ఈ పేస్టును మీ మోచేతిపై పట్టించి చర్మం రంగు మారినట్టు కన్పించేదాకా గుండ్రంగా రుద్దండి. పాలల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ రంగును తగ్గిస్తే, వంట సోడా మృతకణాలను చర్మంపై నుండి తొలగిస్తుంది.

కొబ్బరినూనె మరియు నిమ్మరసంతో

కొబ్బరినూనె మరియు నిమ్మరసంతో

ఒక బౌల్ లో ఒక చెంచా కొబ్బరినూనె మరియు అరచెంచా నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని మోచేతిపై రాసి 15 నుంచి 20 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత టిష్యూ పేపర్ తో చర్మాన్ని తుడిచేయండి. కొబ్బరినూనె తేమను అందివ్వటమే కాక, సహజంగా రంగును విఛ్చిన్నం చేసే బ్లీచర్ కూడా.

పెరుగు మరియు వెనిగర్ మిశ్రమం

పెరుగు మరియు వెనిగర్ మిశ్రమం

2 చెంచాల పెరుగును 2 చెంచాల వెనిగర్ తో కలపండి. దీన్ని మీ మోచేతులకి పట్టించి 20 నుంచి 30 నిమిషాల పాటు వదిలేయండి. మిశ్రమం చేతికే పట్టి ఉండేట్లా ఒక గుడ్డను కూడా చేతులకి కప్పి ఉంచవచ్చు. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది మరియు వెనిగర్ లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఈ రెండూ రంగు తగ్గటంలో సాయపడతాయి.

సంప్రదాయ సెనగపిండి ప్యాక్

సంప్రదాయ సెనగపిండి ప్యాక్

మనందరం ముఖాలకి సెనగపిండి ప్యాక్ లు వాడే ఉంటాం. దీన్నే మీరు మీ నల్లబడిన మోచేతులకి కూడా ప్రయత్నించవచ్చు! మెత్తగా సెనగపిండి మరియు పెరుగును కలిపి ఆ పేస్టును మోచేతులకి పట్టించండి. ఎండిపోగానే గుండ్రంగా రుద్దుతూ తర్వాత నీటితో కడిగేయండి.

మీరు పెరుగు బదులు నిమ్మరసం కూడా వాడవచ్చు. నిమ్మరసం తీసుకుని సెనగపిండితో కలపండి. ఈ మిశ్రమాన్ని మోచేతులపై రాసి గుండ్రంగా రుద్దండి. ఎండిపోయాక నీటితో కడిగేయండి.

సెనగపిండి మరియు పెరుగులో కాంతిని పెంచే లక్షణాలుంటాయి, మచ్చలను ప్రభావవంతంగా తగ్గిస్తాయి మరియు నిమ్మ సహజమైన రంగును విఛ్చిన్నం చేసే బ్లీచర్.

ఆలోవెరా మరియు తేనెతో మీ చర్మాన్ని శాంతపర్చండి

ఆలోవెరా మరియు తేనెతో మీ చర్మాన్ని శాంతపర్చండి

ఆలోవెరా మొక్క మీ బాల్కనీలో ఏ ఉపయోగం లేకుండా పడి ఉన్నట్టుంది. అందులోంచి ఆలోవెరా జెల్ మరియు తేనెతో మీ రంగు గాఢమయిన మోచేతుల మచ్చలు పోగొట్టుకోండి. ఆలోవెరా జెల్ మరియు తేనె పేస్టును చేసి మీ మోచేతులపై రాయండి. 30 నిమిషాల తర్వాత కడిగేయండి.

విలాసవంతమైన పసుపు, తేనె మరియు పాల ప్యాక్

విలాసవంతమైన పసుపు, తేనె మరియు పాల ప్యాక్

పసుపులో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు చర్మాన్ని కాపాడుతూ రంగు తేలికపరుస్తాయి. తేనె సహజ మాయిశ్చరైజర్. సమాన పరిమాణాలలో పసుపు, తేనె మరియు పాలను మెత్తని పేస్టులా కలపండి. ఈ ప్యాక్ ను మీ మోచేతులపై పట్టించి 20 నిమిషాలు వదిలేయండి. కడిగేసేముందు 2 నిమిషాలపాటు పేస్టుతో అక్కడ రుద్దండి.

ప్రొఫెషనల్ చిట్కా;

ప్రొఫెషనల్ చిట్కా;

మీకు ఎండిపోయిన చర్మం ఉన్నట్లయితే మరియు నిమ్మరసం గుచ్చుకుంటున్నట్లయితే, మీ మోచేతిని వాసిలైన్ వంటి పెట్రోలియం జెల్లీతో తేమపర్చుకుని లేదా ఈ నిమ్మ సంబంధ మిశ్రమం వాడే రోజు ముందు రాత్రి బాడీ లోషన్ రాసుకోవడమో చేయండి.

బోల్డ్ స్కై - బ్రేకింగ్ న్యూస్ అలర్ట్'స్ పొందండి. బోల్డ్ స్కైకి సబ్ స్క్రైబ్ అవ్వండి.

English summary

Home Remedies For Dark Elbows | Home Tips For Dark Elbows | Home Remedies For Dark Elbow Skin

Home Remedies For Dark Elbows, Home Tips For Dark Elbows, Home Remedies For Dark Elbow Skin,These are some home remedies for dark elbows. Try the home tips for dark elbows to remove the darkness. Lighten the dark elbows naturally with these home r
Desktop Bottom Promotion