For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయిలీ స్కిన్ కలిగిన వారికి స్టెప్ బై స్టెప్ మేకప్ టిప్స్

మేకప్ అంటే అందరికీ ఇష్టమే. మన అందానికి మెరుగులు దిద్దడానికి మేకప్ ఉపయోగపడుతుంది. ఆకర్షణీయంగా కనపడడానికి సహకరిస్తుంది. మనలోని ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది. ఇంకా చెప్పాలంటే, ప్రియమైన వారి దృష్టి మనపై ప

|

మేకప్ అంటే అందరికీ ఇష్టమే. మన అందానికి మెరుగులు దిద్దడానికి మేకప్ ఉపయోగపడుతుంది. ఆకర్షణీయంగా కనపడడానికి సహకరిస్తుంది. మనలోని ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది. ఇంకా చెప్పాలంటే, ప్రియమైన వారి దృష్టి మనపై పడేలా చేస్తుంది.

వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మనం మేకప్ పై శ్రద్ధ వహిస్తాము. అయినా కూడా, మేకప్ అనేది ఆశించిన ఫలితాలను కలిగించకపోవడం చూస్తూనే ఉంటాము. కొన్ని సార్లు మేకప్ అనేది పూర్తిగా పాడైపోతుంది కూడా. ఏదైనా ముఖ్యమైన ఈవెంట్ కు వెళ్లదలచి అద్దం ముందు గంటల కొద్దీ సమయాన్ని గడిపినా కూడా మేకప్ వలన మనకు ఉపయోగం లేకపోతే నిరాశకు గురవుతాము. ఫస్ట్ ఇంప్రెషన్స్ అనేవే బలంగా ముద్రపడిపోతాయన్న విషయం తెలిసినదే కదా.

makeup tip for oily skin

అందుకే మేకప్ ప్రోడక్ట్స్ ని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. చర్మ తత్వాన్ని బట్టి మేకప్ ప్రోడక్ట్స్ ని ఎంచుకోవాలి. బెస్ట్ సెల్లర్స్ వారి మేకప్ ప్రోడక్ట్స్ అనేవి అన్నిరకాల చర్మాలకి సూట్ అవకపోవచ్చు. వాటిని వాడడం వలన చర్మం మరింత దెబ్బతినవచ్చు.

సాధారణ స్కిన్ కలిగిన వారిని మేకప్ ప్రాడక్ట్స్ అనేవి ఇబ్బందికి గురి చేయకపోవచ్చు. వీరికి దాదాపు అన్నిరకాల మేకప్ ప్రోడక్ట్స్ సూట్ అవుతాయి. అయితే, ఆయిలీ స్కిన్ కలిగిన వారికి మేకప్ వేసుకోవడమనేది కష్టతరమైన ప్రక్రియ.

ఆయిలీ స్కిన్ వలన మేకప్ అనేది త్వరగా కరిగిపోతుంది. అలాగే, వీరు వాడే ప్రోడక్ట్స్ అనేవి చర్మ రంధ్రాలను మూసివేయకూడదు. సరైన ప్రాడక్ట్స్ ని వాడకపోతే మొటిమల సమస్య ఎక్కువగా బాధించవచ్చు. ఈ మొటిమలు త్వరగా తగ్గకపోవచ్చు.

మీ చర్మం అనేది ఎల్లప్పుడూ గ్రీజీగా అలాగే షైనీగా ఉంటే మీది ఆయిలీ చర్మమని అర్థం. ఆయిల్ గ్లాండ్స్ అనేవి అత్యంత చురుకుగా పనిచేయడం వలన చర్మం ఎల్లప్పుడూ జిడ్డుగా ఉంటుంది.

అందువలన, ఇటువంటి చర్మం కలిగిన వారు తరచూ ముఖాన్ని కడుగుతూ ఉండాలి. తద్వారా, జిడ్డుతనం అనేది ముఖంలో పేరుకోవడం తగ్గుతుంది. ఒకవేళ, ఎక్కువగా జిడ్డు పేరుకుంటే, చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వలన బ్లాక్ హెడ్స్ సమస్యతో పాటు మొటిమలు కూడా ఏర్పడతాయి.

అందువలన, ఆయిలీ స్కిన్ ని డీల్ చేయడం కాస్తంత కష్టతరమే. ఇటువంటి చర్మం కలిగిన వారు చర్మసంరక్షణకై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. అలాగే, మేకప్ చేసుకునే విధానంపై కూడా మరింత శ్రద్ధ చూపించాలి.

మేకప్ ని ప్రతి రోజూ అవాయిడ్ చేయడం మంచిదే. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాలలో మేకప్ అనేది అత్యవసరమవుతుంది.

కాబట్టి, కింద వివరించిన స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ని పాటించి ఆయిలీ స్కిన్ పై మేకప్ ని అప్లై చేసుకోండి. ఈ స్టెప్స్ వలన సమస్య పరిష్కారమవుతుంది.

స్టెప్ 1:

ప్రైమర్ ను అప్లై చేయండి

ప్రైమర్ ను అప్లై చేయండి

ఆయిల్ ఫ్రీ లుక్ రావడంతో పాటు మేకప్ ఎక్కువసేపు నిలవాలంటే ప్రైమర్ ను అప్లై చేయడం తప్పనిసరి. అలాగే, చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. మాయిశ్చరైజర్ అనేది చర్మంలోని నూనెని బాలన్స్ చేస్తుంది. అలాగే, మేకప్ చర్మంపై ఇమిడిపోవడానికి సహకరిస్తుంది.

ప్రైమర్ అనేది అదనపు నూనెని తొలగించి మేకప్ అనేది కరిగిపోకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. కాబట్టి, మీ చర్మాన్ని సరైన షైన్ ఫ్రీ మాయిశ్చరైజర్ తో హైడ్రేట్ చేయండి. ఆ తరువాత ఆయిల్ కంట్రోల్ ప్రైమర్ ని వాడండి. ఇప్పుడు, మేకప్ కి మీ చర్మం సిద్ధమైనట్లే.

స్టెప్ 2:

కన్సీలి

కన్సీలి

ఆయిలీ స్కిన్ వలన మొటిమల మచ్చలతో పాటు వివిధ రకాల మార్క్స్ అనేవి ఏర్పడతాయి. వీటిని కవర్ చేయడానికి కన్సీలర్ ని వాడాలి. ఫౌండేషన్స్ కంటే చిక్కటి కన్సిస్టెన్సీ లో ఉండే వీటిని మచ్చలపై అలాగే వివిధ మార్క్స్ పై అప్లై చేయడం ద్వారా ముఖంపై నున్న మచ్చలను కవర్ చేయవచ్చు. లైట్ వెయిట్ గా ఉండి ఎక్కువ కవరేజ్ ని ఇచ్చే వాటిని ఎంచుకోండి.

కన్సీలర్ ని మునివ్రేళ్ళతో అప్లై చేయండి. కొంత కన్సీలర్ ని తీసుకుని డార్క్ స్పాట్స్ పై అలాగే బ్లేమిషెష్ పై అప్లై చేయండి. డార్క్ సర్కిల్స్ ని కవర్ చేసేందుకు కన్సీలర్ కళ్ళ కింద వీ షేప్ లో అప్లై చేస్తే బాగుంటుంది.

స్టెప్ 3:

ఫౌండేషన్

ఫౌండేషన్

మీ కాంకీలర్ సెట్ అయిన తరువాత ఇప్పుడు మనం మేకప్ లోని ముఖ్యమైన ఘట్టానికి వచ్చినట్టే. ఫౌండేషన్ అనేది మేకప్ కి పునాది లాంటింది. దీనిని సరిగ్గా అప్లై చేయకపోతే మేకప్ పాడైపోతుంది. ఈ స్టెప్ అనేది మీ లుక్ ని పెంచుతుంది లేదా తుంచుతుంది. సరైన ఫౌండేషన్ ను కొనే ముందు తగిన పరిశోధనను చేయండి. అలాగే, మీరు ఎంచుకునే షేడ్ కూడా చాలా ముఖ్యం. మీ స్కిన్ టోన్ కు దగ్గరగా ఉండే షేడ్స్ ను ఎంచుకోండి.

చాలామటుకు ఫౌండేషన్స్ అనేవి హెవీగా ఉంటూ స్కిన్ పోర్లని బ్లాక్ చేస్తాయి. కాబట్టి, మీకు సరైన కవరేజ్ అనేది కాంకీలర్ ద్వారా లభిస్తే ఫౌండేషన్ ను పక్కన పెట్టండి. అందుకు బదులుగా, తేలికపాటి బిబి లేదా సీసీ క్రీమ్ లను వాడండి. ఇవి మొటిమలు ఏర్పడే సమస్యను తగ్గిస్తాయి.

ఒక వేళ ఫౌండేషన్ ను వాడలనుకుంటే, ఆయిల్ ఫ్రీ వాటర్ లేదా మినరల్ బేస్డ్ ఫౌండేషన్ కి ప్రాధాన్యం ఇవ్వండి. ఇవి, చర్మంలోని అన్ ఈవెన్ ప్రదేశాలను నింపటం ద్వారా ఈవెన్ స్కిన్ టోన్ ని కలిగిస్తాయి. ఫౌండేషన్ ని కూడా ఫింగర్ టిప్స్ తోనే అప్లై చేయాలి. బ్రేక్ అవుట్స్ ని అరికట్టేందుకు శుభ్రమైన స్పాంజ్ ని అలాగే బ్రష్ ని వాడటం మంచిది.

స్టెప్ 4:

సెటింగ్ పౌడర్

సెటింగ్ పౌడర్

ఫౌండేషన్ ని అప్లై చేసిన తరువాత ట్రాన్స్లుసెంట్ పౌడర్ తో ఫౌండేషన్ ని సెట్ చేయాలి. టి జోన్ వంటి ప్రదేశాలలో ఆయిల్ లీక్ ను అడ్డుకునేందుకు సెటింగ్ పౌడర్ ను అప్లై చేయండి.

స్టెప్ 5:

సెటింగ్ స్ప్రే

సెటింగ్ స్ప్రే

చివరగా మేకప్ ను ఫినిషింగ్ స్ప్రే తో సెట్ చేస్తే మేకప్ ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. అలాగే, సెటింగ్ స్ప్రే వలన మేకప్ అనేది నేచురల్ లుక్ ని ఇస్తుంది.

English summary

Take a look at step by step makeup tips for oily skin

Although we love makeup and do it frequently, it has to be done right to get the desired effect It is important to choose your makeup products according to your skin type. Oily skin is difficult to deal with. Applying makeup on it may be a whole different ball-game all together.
Story first published:Monday, January 15, 2018, 16:09 [IST]
Desktop Bottom Promotion