For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో జిడ్డు చర్మ తత్త్వం కలిగిన వారికి ఉపయోగపడే ఫేస్ ప్యాకులు

వేసవిలో ఆయిల్ స్కిన్ కలిగిన వారికి ఉపయోగపడే ఫేస్ ప్యాక్స్

|

వేసవిలో ఎప్పుడూ ప్రత్యేక చర్మ సంరక్షణ అనివార్యం. సంవత్సరం మొత్తం మీద, ఈ కాలంలో మాత్రం మండే సూర్యుని బారి నుండి తప్పించుకోవడానికి చర్మం పై ఎక్కువ శ్రద్ధ మరియు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఐతే అన్ని రకాల చర్మ తత్వాలు కలిగిన వారికి ఈ జాగ్రత్తలన్నీ అవసరం కాకపోయినా, జిడ్డు చర్మం కలిగిన వారు మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. జిడ్డు చర్మం పై మొటిమలు, మచ్చలు, దద్దుర్లు, కురుపులు మొదలైనవి వచ్చే అవకాశం ఎక్కువ. ఇటువంటి చర్మ సమస్యలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.

Summer Face Packs For Oily Skin

మార్కెట్లో రకరకాల ఉత్పత్తుల లభ్యత ఉన్నప్పటికిని, ఎక్కువ కాలం పాటు వాటిని వినియోగిస్తే దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. ఇంట్లో కూర్చుని మీరు ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందగలిగినప్పుడు, ఇక కలత చెందటం ఎందుకు? అవును మీరు చదువుతున్నది నిజమే!

మీకోసం ఈ వేసవిలో సూర్యుని ప్రతాపం నుండి మీ చర్మాన్ని కాపాడుకునేందుకు ఉపయోగపడే కొన్ని ఫేస్ ప్యాకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. బియ్యం పిండి మరియు పసుపు:

1. బియ్యం పిండి మరియు పసుపు:

పసుపు వలన కలిగే సౌందర్య ప్రయోజనాలు మనందరికీ తెలిసినవే. పసుపులో యాంటీ సెప్టిక్ మరియు యాంటీ బాక్టీరియల్ తత్వాలు ఉంటాయి. వరిపిండి చర్మ రంధ్రాలను తెరుచుకునేటట్టు చేసి మృత కణాలను తొలగిస్తుంది.

కావలసిన పదార్ధాలు: ఒక టేబుల్ స్పూన్ వరిపిండి, ఒక టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ తేనె.

తయారీ విధానం: ఒక గిన్నెలో పైన చెప్పిన పదార్ధాలన్నిటిని కలిపి పేస్టులా చేయండి. ఈ పేస్టు బాగా చిక్కగా ఉన్నట్లు అనిపిస్తే, కొంచెం నీరు కలపండి. ఈ పేస్టును మీ ముఖం మరియు మెడపై రాసుకోండి. ఇరవై నిమిషాల తరువాత నీటితో శుభ్రపరచుకోండి.

2. గుడ్డులోని తెల్లసొన మరియు శనగ పిండి:

2. గుడ్డులోని తెల్లసొన మరియు శనగ పిండి:

శనగ పిండి మంచి ఎక్స్ఫోలియేటర్ గా పనిచేస్తుంది కనుక చర్మం పై పేరుకున్న మృత కణాలను తొలగిపోతాయి. గుడ్డు తెల్లసొనలో ఉండే విటమిన్ ఏ చర్మం పై మచ్చలను తేలికపరచి, చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది.

కావాల్సిన పదార్ధాలు: ఒక టేబుల్ స్పూన్ గుడ్డులోని తెల్లసొన , ఒక టేబుల్ స్పూన్ శనగ పిండి ఒక టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, ఒక టేబుల్ స్పూన్ తేనె

తయారీ విధానం: పైన చెప్పిన అన్ని పదార్ధాలను ఒక గిన్నెలో కలిపి పేస్టులా చేయండి. బాగా కలిపి చిక్కని పేస్టులా చేయండి. ఈ పేస్టును మీ ముఖం మరియు మెడపై రాసుకోండి. ముప్పై నిమిషాల తరువాత ముఖాన్ని నీటితో శుభ్రపరచుకోండి.

౩. నిమ్మరసం మరియు ఓట్స్:

౩. నిమ్మరసం మరియు ఓట్స్:

ఓట్స్ చర్మం పై పేరుకున్న అధిక జిడ్డును గ్రహించుకుంటాయి. ఈ స్క్రబ్ మృత కణాలను తొలగించడమే కాక, నిమ్మరసం కలిగి ఉండటం వలన చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

కావలసిన పదార్ధాలు: రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పౌడర్ మరియు నిమ్మరసం.

తయారీ విధానం: ఓట్స్ ను బ్లెండ్ చేసి పొడిగా చేయండి. దీనికి కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి పేస్టుగా చేయండి. దీనిని ముఖానికి పూసుకుని ఐదు నిమిషాల పాటు నలుగు వలె నలిపి , పదిహేను నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి.

4. తేనె మరియు నిమ్మరసం:

4. తేనె మరియు నిమ్మరసం:

తేనె మరియు నిమ్మరసంలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం పై త్యాన్ తొలగించి, మెరుపును చేకూరుస్తాయి. ఇవి చర్మం పై అధిక నూనెను తొలగిస్తాయి. వీటిలో సహజంగా ఉండే చర్మాన్ని తెల్లబరిచే లక్షణాలు, ముఖానికి ప్రకాశాన్ని ఇస్తాయి.

కావలసిన పదార్ధాలు: రెండు టీ స్పూన్ల తేనె మరియు ఒక టీ స్పూన్ నిమ్మరసం.

తయారీ విధానం: పైన చెప్పిన పదార్ధాలని బాగా కలపాళీ. ప్రతిరోజూ పడుకోవడానికి అరగంట ముందు ముఖానికి, మెడకు మృదువుగా మర్దన చేసుకోవాలి. ముప్పై నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

5. నారింజ తొక్కలు మరియు పెరుగు:

5. నారింజ తొక్కలు మరియు పెరుగు:

ఈ మాస్కు మీ చర్మం ఉత్పత్తి చేసే అధిక నూనెను తొలగిస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం మృతకణాలను తొలగించడమే కాక చర్మాన్ని మెరిపిస్తుంది.

కావలసిన పదార్ధాలు: 3 టేబుల్ స్పూన్ల నారింజ తొక్కల పొడి మరియు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు.

తయారీ పద్ధతి: ఒక గిన్నెలో పెరుగును బాగా చిలక్కోట్టండి. దానికి మూడు టేబుల్ స్పూన్ల నారింజ తొక్కల పొడి కలపండి. వీటిని బాగా కలిపి ముఖానికి, మెడకు పూసుకోండి. ముప్పై నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరు వెచ్చని నీటితో కడిగేయండి.

6. టమాటో గుజ్జు:

6. టమాటో గుజ్జు:

టమాటో గుజ్జు కూడా జిడ్డు చర్మాన్ని సమర్థవంతంగా నివారించడానికి ఉపయోగపడుతుంది.

కావలసిన పదార్ధాలు: పావు కప్పు టమాటో గుజ్జు, ఒక టీస్పూన్ తేనె

తయారీ పద్ధతి: ఒక గిన్నెలో టమాటో గుజ్జును మరియు తేనెను బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై పూతగా పూసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వండి. తరువాత శుభ్రంగా ముఖం కడుక్కుని పొడిగా తుడుచుకోండి. టమాటో చర్మం పై పేరుకున్న మృతకణాలను తొలగించడమే కాక ట్యానింగ్ ను కూడా నివారిస్తుంది.

English summary

Summer Face Packs For Oily Skin

Summer season always demands special care for the skin. Oily skin is prone to acne or breakouts, greasy skin, zits, dark patches, etc. Why to worry when you can get permanent solutions sitting back at home? Yes, you read that right! Some ingredients like honey, lemon, tomato, etc., can help you to get rid of oily skin.
Story first published:Tuesday, May 8, 2018, 17:44 [IST]
Desktop Bottom Promotion