For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో చర్మసంరక్షణకై రాత్రి వేళలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

By Gayatri Devupalli
|

ఎండల నుండి చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలో అని ఆందోళన చెందుతున్నారా? వేసవి చర్మ సంరక్షణ జాగ్రత్తలు తీసుకోవలసిన కీలక సమయం. వేసవిలో చర్మం పొడిగా,కాంతిహీనంగా,జీవంలేనట్టు తయారవుతుంది. దీనివలన వృద్ధాప్య ఛాయలు త్వరగా కనపడటం ఆరంభమవుతుంది.

పని చేసి అలసిపోయి ఇల్లు చేరాక,లేదా స్కూల్ నుండి లేక స్నేహితులతో షాపింగ్ నుండి తిరిగి వచ్చాక, ఎండ, చెమట, సూర్యుని తీవ్రమైన కిరణాల వలన చర్మం పై కలిగిన ప్రభావం మరియు అలసటను తీర్చుకోవడం గురించి మీరు ముందుగా ఆలోచిస్తారు. కనుక ఇంటికి చేరుకోగానే మేము వివరించబోయే చర్మ సంరక్షణ చర్యలు చేపడితే మీ చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది.

వేసవికాలంలో చర్మ సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంట్లో అతి సులువుగా చేసుకునే చిట్కాల ద్వారా అందమైన చర్మం మీ సొంతమవుతుంది.

వేసవికాలంలో తప్పక పాటించవలసిన కొన్ని ప్రక్రియల గురించి మీకు ఇక్కడ విపులంగా వివారిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? ఒక కన్నెయండి!

Summer Skin Carte Routine For Night

మేకప్ ను తొలగించుకోవాలి:

రోజంతా పనులతో గడిచి ఇల్లు చేరగానే ముందుగా చేయవలసిన పని మేకప్ ను తొలగించడం. ఎంత కొంచెం మేకప్ చేసుకున్నా కానీ తొలగించడాం తప్పనిసరి! మీ చర్మానికి నప్పే నాణ్యత కలిగిన మేకప్ రిమూవర్ ను ఉపయోగించండి. మేకప్ రిమూవర్ తో పాటు క్లెన్సింగ్ క్లాత్ లను కూడా ఉపయోగించండి.

ఇంట్లో తయారు చేసుకున్న మేకప్ రిమూవర్ ను కూడా ప్రయత్నించవచ్చు. తేనెను ఉపయోగించి తయారు చేసుకునే మేకప్ రిమూవర్ ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వాడే పద్ధతి: ఒక టీ స్పూన్ తేనెను రెండు చేతులతో రుద్ది ముఖంకి పూసుకుని వలయాకారంలో మర్దన చేసుకోండి. ఐదు పది నిమిషాలు ఆగి వెచ్చని గుడ్డతో తుడిచేయండి.

మీ ముఖాన్ని క్లెన్స్ చేసుకోండి: మేకప్ రిమూవర్ తో పాటు క్లెన్సర్ ను వాడినప్పటికి కూడా ముఖాన్ని క్లెన్సర్ మరియు గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పెరుగు: పెరుగు పరిపూర్ణమైన సహజ క్లెన్సర్. దీనిలో ప్రొటీన్లు మరియు లాక్టిక్ ఆమ్లాలు మెండుగా ఉంటాయి. లాక్టిక్ ఆమ్లం ముఖంపై ఉండే మృతకణాలను తొలగిస్తుంది. ప్రొటీన్లు చర్మ రంధ్రాలను బిగుతుగా చేసి సన్నని గీతలను తొలగించి తేమను అందిస్తుంది. మేకప్ ను తొలగించుకున్నాక, పడుకోబోయే ముందు ప్రతి రాత్రి ముఖానికి పెరుగును పట్టించండి.

మృతకణాలను తొలగించండి: చర్మం మీద పేరుకుపోయిన మృతకణాలను తొలగించడానికి తేలికైన స్క్రబ్బర్ ను కనీసం వారానికి రెండు సార్లు వాడాలి. ఇలా చేయడం వల్ల తాజాగా, మృదువుగా ఉండే చర్మం మీ సొంతమవుతుంది. మీ చెక్కిళ్ళపై ఉండే రంధ్రాల వద్ద మరియు ముక్కుపై ఉన్న బ్లాక్ హెడ్స్ వద్ద అధిక ధ్యాస పెట్టండి. స్క్రబ్బింగ్ మరీ అధికంగా చేస్తే చర్మము పొడిగా మారే అవకాశముంది.

ఇంటిలోనే సులువుగా స్క్రబ్ ను ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం!

కొబ్బరినూనె చర్మానికి తేమను చేకూరుస్తుంది. ఇది చర్మాన్ని తాజాగా, మృదువుగా మారుస్తుంది.

కొబ్బరినూనె మరియు పంచదార తో స్క్రబ్: దీనికై మీరు రెండు టేబుల్ స్పూన్ల తేనె, మూడు టేబుల్ స్పూన్ల పంచదార మరియు మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెలను తీసుకోండి. వీటిని ఒక గిన్నెలో బాగా కలపాలి. ఈ మిశ్రమం కనుక బాగా పొడిగా ఉంటే కొంచెం కొబ్బరినూనెను కలపండి. పలుచగా అనిపిస్తే పంచదారని కలపండి. దీనితో చర్మానికి మృదువుగా రుద్దుకోండి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

టోన్ చేసుకోండి: స్క్రబ్ చేసుకున్నాక టోనర్ ను ఉపయోగించడం వలన చర్మం యొక pH సంతులనం అవుతుంది. ఒక దూది ఉండను టోనర్ తో తడిపి ముఖం మరియు మెడను సున్నితంగా అద్దాలి.

ఆలోవెరా టోనర్: ఒక ఆలోవెరా ఆకును ముక్కలు చేసి గుజ్జును బయటకు తీయండి. రెండు టేబుల్ స్పూన్ల ఆలోవెరా గుజ్జును ఒక కప్పు చల్లని నీటితో పలుచన చేయండి. ఈ ద్రావణం ఎండవలన కాలిన గాయాలను మరియు దద్దుర్ల నుండి ఉపశమనం ఇస్తుంది.

మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకోండి: మీరు మేకప్ వేసుకున్నా, వేసుకోకున్నా, మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేరుకోవడం చాలా ముఖ్యం. మీరు సాధారణంగా వాడే మాయిశ్చరైజర్ నే రాసుకుని చర్మాన్ని మృదువుగా మాయిశ్చరైజర్ మొత్తం చర్మంలోకి ఇంకేలా ఒత్తండి. మామూలు లిప్ బామ్ తో పెదవులను మాయిశ్చరైజ్ చేసుకోండి. అంతేకాక, మీ చేతులు, మోచేతులు, మోకాళ్ళు, మడమలు మొదలైన భాగాలకు కూడా మాయిశ్చరైజర్ రాసుకోండి.

జుట్టును దువ్వుకోండి: మీరు జుట్టును పొద్దుట లేచేటప్పటికి ముడి వేసుకుని ఉండటంను ఇష్టపడకపోయినట్లైతే, రాత్రి పడుకోబోయే ముందు జుట్టును దువ్వి, లీవ్-ఇన్ కండీషనర్ ను రాసుకోండి. పడుకునేటప్పుడు జుట్టును పోనీ టైల్ వేసుకుంటే వెంట్రుకలు తెగిపోయే అవకాశం ఉంటుంది.

మీ వీపు మీదుగా పడుకోండి: ముఖాన్ని తలగడలో దాచుకుని పడుకోవడం వలన చర్మం మీద ముడుతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక మీ వీపు మీఫుగా పడుకునే అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే, ముఖంపై ముడుతలే కాకుండా మొటిమలు కూడా రావు.

English summary

Summer Skin Carte Routine For Night

Summer Skin Carte Routine For Night,Worried of taking care of your skin under the scorching sun? Summer time is the crucial season where your skin needs a proper care. Summer can make your skin look dull, dry and lifeless. Here are some important summer skin care skin tips that you should follow for the night.
Story first published:Saturday, March 31, 2018, 14:36 [IST]
Desktop Bottom Promotion