For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ అలవాట్లు మీ మొటిమల సమస్యను మరింత పెంచుతాయి

|

ప్రతిరోజూ అనేక స్కిన్ రిలేటెడ్ సమస్యలను మనం ఎదుర్కొంటూనే ఉంటాం . డ్రై స్కిన్, ట్యాన్, యాక్నే లేదా పింపుల్ స్కార్స్ సమస్యను మనం ఎదుర్కొంటూనే ఉంటాం. ఇంకా చెప్పాలంటే ఈ లిస్ట్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఈ సమస్యలన్నీ సాధారణ సమస్యలుగా మారిపోయాయి.

వివిధ ఫాక్టర్స్ ఈ సమస్యలకు దారితీస్తాయి. హెరిడిటరీ లేదా జెనెటిక్ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యతలు లేదా పొల్యూషన్, ఎండలో ఎక్కువసేపు ఉండటం వంటి కొన్ని వాతావరణ అంశాలు ఈ సమస్యలకు దారితీస్తూ ఉంటాయి.

These Will Make Your Acne Worse

ఈ సమస్యల నుంచి ఉపశమనం కోసం మనం హోమ్ రెమెడీస్ ను ప్రయత్నిస్తాం లేదంటే మార్కెట్ లో లభ్యమయ్యే వివిధ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ పై ఆధారపడతాం. అయితే, ఈ సమస్యలకు మన నిర్లక్ష్యం కూడా కారణమవుతుందని మాత్రం గుర్తించలేం. మనం తెలియకుండా పాటించే కొన్ని అలవాట్ల వలన చర్మం అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. తద్వారా, చర్మ సౌందర్యం దెబ్బతింటుంది.

మీ స్కిన్ కేర్ రొటీన్ మీకు ఏ మాత్రం ప్రయోజనం కలిగించట్లేదని భావించకండి. మీ అలవాట్లే మీ చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. దీర్ఘకాలంలో ఈ అలవాట్లను మీరు అవాయిడ్ చేయకపోతే మీ చర్మ సౌందర్యం మరింత దెబ్బతింటుంది. కాబట్టి, ఆ స్కిన్ కేర్ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుని ఆ మిస్టేక్స్ ను అవాయిడ్ చేస్తే మీరు మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోగలుగుతారు.

అతిగా స్క్రబ్ చేసుకోవటం:

అతిగా స్క్రబ్ చేసుకోవటం:

స్క్రబ్బింగ్ అనేది చర్మానికి అవసరమే. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించటానికి స్క్రబ్బింగ్ తోడ్పడుతుంది. అయితే, అతిగా బ్రేక్ అవుట్స్ సమస్య మిమ్మల్ని బాధిస్తున్నప్పుడు స్క్రబ్బింగ్ ను మీరు అవాయిడ్ చేయాలి. యాక్నేపై మీరు కఠినంగా వ్యవహరించకూడదు. సున్నితంగా వ్యవహరించటం ద్వారా యాక్నే నుంచి రక్షణను పొందవచ్చు. స్క్రబ్బింగ్ బదులు తేలికపాటి ఫేస్ వాష్ ను యాక్నే సమస్య తొలగిపోయే వరకు వాడండి.

చర్మానికి సరిపడని ప్రోడక్ట్స్ ని వాడటం:

చర్మానికి సరిపడని ప్రోడక్ట్స్ ని వాడటం:

మీ చర్మతత్వానికి సూట్ అయ్యే ప్రోడక్ట్స్ నే మీరు వాడటానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఏదైనా ప్రోడక్ట్ ను వాడే ముందు ప్యాచ్ టెస్ట్ ను చేసుకోవాలి. ఆ ప్రోడక్ట్ మీ అలర్జిక్ అవునో కాదో తెలుసుకోవాలి. ఎందుకంటే, రాంగ్ ప్రోడక్ట్స్ ని వాడితే యాక్నే సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి, ప్రోడక్ట్స్ ని సరిగ్గా ఎంచుకోండి.

మాయిశ్చరైజింగ్ ను అవాయిడ్ చేయండి:

మాయిశ్చరైజింగ్ ను అవాయిడ్ చేయండి:

ఆయిలీ స్కిన్ తత్త్వం కలిగిన వారిలో యాక్నే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అటువంటప్పుడు, మాయిశ్చరైజింగ్ ను అవాయిడ్ చేయడం ద్వారా యాక్నే సమస్యను నివారించవచ్చని మీరు భావించవచ్చు. కానీ, మీ చర్మతత్వానికి సరిపడే మాయిశ్చరైజర్ ను ఎల్లప్పుడూ వాడాల్సి ఉంటుంది. ఆయిలీ స్కిన్ కు సూట్ అయ్యే మాయిశ్చరైజర్ ను ఎంచుకుని వాడుతూ ఉంటే చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది.

ఒత్తిడి:

ఒత్తిడి:

ఒత్తిడి వలన కూడా బ్రేక్ అవుట్స్ సమస్య ఎదురవుతుంది. ఫిజికల్ ఫ్యాక్టర్స్ తో పాటు మానసిక ఒత్తిడి కూడా యాక్నే సమస్యకు దారితీస్తుంది. ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవటం అవసరం. లేదంటే చర్మంపై మానసిక ఒత్తిడి దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఒత్తిడిగా మీరు ఫీల్ అయ్యేటప్పుడు ధ్యానం, చదవటం లేదా క్విక్ వాక్ కి వెళ్ళటం వంటి కామింగ్ యాక్టివిటీస్ లో లీనమవ్వండి. ఇది మిమ్మల్ని మరింత ప్రశాంతంగా ఉంచుతుంది. మీ చర్మ సౌందర్యాన్ని సంరక్షిస్తుంది.

మొటిమలను గిల్లడం:

మొటిమలను గిల్లడం:

చాలా మంది మొటిమలు కనబడగానే ఆ మొటిమలను నలిపే వరకు ప్రశాంతపడరు. వారిలో మీరు కూడా ఒకరైతే ఈ అలవాటును తక్షణమే మానుకోండి. మొటిమలను నలపడం వలన మీ మొటిమల సమస్య తొలగిపోదు సరికదా మీకు మరిన్ని చర్మ సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి, ఈ సారి మొటిమలను నలపడానికి మీరు ముందుకువెళ్ళే బదులు మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి.

శుభ్రంగా లేని సెల్ ఫోన్స్ ని వాడటం:

శుభ్రంగా లేని సెల్ ఫోన్స్ ని వాడటం:

మీ చర్మం అనేది ఆయిల్ ను అలాగే స్వెట్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవన్నీ, మీరు ఫోన్ అటెండ్ అయినప్పుడు ఫోన్ పై చేరతాయి. కాబట్టి బ్రేక్ అవుట్స్ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఎక్కువ. ఫోన్ ను మీరు తరచూ శుభ్రపరచుకుంటూ ఉండాలి. తద్వారా, బాక్టీరియాను మీరు ఫోన్ నుంచి తొలగించుకున్నవారవుతారు.

ముఖాన్ని తరచూ శుభ్రపరచుకోవటం:

ముఖాన్ని తరచూ శుభ్రపరచుకోవటం:

ముఖాన్ని తరచూ శుభ్రపరచుకోవటం వలన బ్రేక్ అవుట్స్ సమస్య మరింత ఎక్కువవుతుంది. ముఖాన్ని తరచూ శుభ్రపరచుకుంటూ ఉంటే చర్మంలోని ధుమ్మూ ధూళి తొలగిపోతాయన్న అపోహ ఉంది. అయితే, ఎక్కువగా ముఖాన్ని వాష్ చేయడం వలన చర్మంపై నున్న ఎసెన్షియల్ ఆయిల్స్ తొలగిపోతాయి. దానివలన, చర్మం మరింత ఎక్కువగా ఆయిల్స్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి, మొటిమల సమస్య మరింత ఎక్కువవుతుంది.

మేకప్ ని తొలగించకుండా నిద్రించడం:

మేకప్ ని తొలగించకుండా నిద్రించడం:

అలసిన రోజున, చాలా మంది మేకప్ ను తొలగించడానికి కూడా లేజీగా ఫీలై అలాగే నిద్రపోతారు. మేకప్ వలన ముఖంపై అదనపు ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. దీని వలన చర్మం ఆయిలీగా మారుతుంది. తద్వారా, చర్మం ఇంఫ్లేమేషన్ కు గురవుతుంది. అందువలన, యాక్నేతో పాటు పింపుల్స్ సమస్య ఎదురవుతుంది. కాబట్టి, నిద్రపోయే ముందు మేకప్ ను తొలగించడం ముఖ్యం.

శుభ్రంగా లేని గ్లాసెస్ ని ధరించడం:

శుభ్రంగా లేని గ్లాసెస్ ని ధరించడం:

గ్లాసెస్ ని ధరించే వారందరూ వారి గ్లాసెస్ ను క్లీన్ గా ఉంచుకోవటం తప్పనిసరి. లేదంటే, దుమ్ము అలాగే బాక్టీరియ మీ చర్మంపైన నిలిచి యాక్నే మరియు పింపుల్స్ సమస్యలకి దారి తీస్తుంది. కాబట్టి, చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే మీ గ్లాసెస్ ను వేసుకునే ముందు క్లీన్ చేసుకోవటం తప్పనిసరి.

English summary

These Will Make Your Acne Worse

We all face several skin-related issues in our everyday life. Sometimes, your skin care routine just won't be doing good for you, or you just tend to do things that can backfire you in the long run. Some mistakes like not removing makeup, lack of sleep, popping your pimples, etc., can cause damage to your skin.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more