For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డార్క్ లిప్స్ సమస్య నుంచి ఉపశమనం పొందాలనుకుంటున్నారా? ఈ ప్రభావితమైన హోమ్ రెమెడీస్ ను ప్రయత్నించండి

|

ఈ రోజుల్లో డార్క్ లిప్స్ సమస్య సర్వసాధారణమైపోయింది. మహిళలు ఈ సమస్య వలన తమ అపియరెన్స్ పట్ల కాన్ఫిడెన్స్ ను కోల్పోతున్నారు. పెదాలు గులాబీ రేకుల్లా గులాబీ రంగులో ఉండాలని మగువలు కోరుకుంటున్నారు. అందుకోసం, అనేక రకాల కాస్మెటిక్స్ పై ఆధారపడుతున్నారు. లిప్ స్టిక్స్, టింటేడ్ లిప్ బామ్స్ వంటి కాస్మెటిక్స్ తో పెదాలను ఇబ్బంది పెడుతున్నారు.

అదృష్టవశాత్తూ, ఈ డార్క్ లిప్స్ సమస్య నుంచి ఉపశమనం పొందటం చాలా సులభం. అయితే, ఆ రెమెడీస్ ను తెలుసుకునే ముందు అసలు ఈ సమస్యకు దారితీసే అంశాలేంటో తెలుసుకుందాం.

Want To Get Rid Of Dark Lips? Try These Effective Home Remedies

డార్క్ లిప్స్ కి అనేక కారకాలు దారితీస్తాయి. స్మోకింగ్, టీ కాఫీ లను ఎక్కువగా తీసుకోవటం, సన్ డ్యామేజ్, సరైన కేర్ తీసుకోకపోవటం వంటి వాటివలన డార్క్ లిప్స్ సమస్య తలెత్తుతుంది. ఈ హ్యాబిట్స్ అనేవి లిప్ డిస్కలరేషన్ కి దారి తీయటంతో పాటు పెదాలను రఫ్ గా అలాగే డ్రై గా మారుస్తాయి.

ఇప్పుడు మనం డార్క్ లిప్స్ కి దారితీసే కారణాల గురించి తెలుసుకున్నాం కదా? ఇప్పుడు ఈ బ్యూటీ ప్రాబ్లెమ్ ని ఇంట్లోనే సులభమైన రెమెడీస్ ను పాటించి ఎలా తగ్గించుకోవాలో తద్వారా ఏ విధంగా సహజసిద్ధమైన పింక్ లిప్స్ ను సొంతం చేసుకోవచ్చో తెలుసుకోవచ్చు.

ఇంట్లోనే ఈ రెమెడీస్ ను సులభంగా పాటించవచ్చు. వీటిలో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండటంతో పాటు ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్స్ కూడా కలవు. ఇవన్నీ పెదాలపై ఇంప్యూరిటీస్ ను అలాగే బిల్డ్ అప్ ను తొలగించి సహజంగా దాగున్న పెదాల అందాలను వెలికితీస్తాయి.

ఇక్కడ ప్రస్తావించబడిన ఈ రెమెడీస్ ను పాటించి మీ పెదాల అందాన్ని రెట్టింపు చేసుకోండి మరి.

1. బీట్ రూట్:

1. బీట్ రూట్:

పెదాలకు సహజసిద్ధమైన పింక్ కలర్ ని అందించేందుకు బీట్ రూట్ ఎంతగానో తోడ్పడుతుంది. బీట్ రూట్ ని చిన్న స్లైస్ గా కట్ చేసి ఆ స్లైస్ తో మీ పెదాలపై రబ్ చేయండి. ఈ జ్యూస్ ను పదినిమిషాల పాటు మీ పెదాలపై ఉండేలా జాగ్రత్తపడండి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో పెదాలను శుభ్రపరుచుకోండి.

ఈ రెమెడీని రోజుకు ఒక్కసారి పాటిస్తే డార్క్ లిప్స్ సమస్య కొన్ని రోజులలోనే తగ్గుముఖం పడుతుంది.

2. టమాటో:

2. టమాటో:

టమాటో పల్ప్ అనేది డార్క్ లిప్స్ సమస్యను తొలగించడానికి అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది. కాస్తంత తాజా టమాటో పల్ప్ ని తీసుకుని పెదాలపై సున్నితంగా రబ్ చేయండి. ఆ తరువాత కొంతసేపటి తరువాత గోరువెచ్చటి నీటితో పెదాలను శుభ్రపరచుకోండి.

ఈ పద్దతిని రోజులో రెండు మూడు సార్లు పాటిస్తే రోజీ పింక్ లిప్స్ కొన్ని రోజులలోనే మీ సొంతమవుతాయి.

3. రోజ్ వాటర్:

3. రోజ్ వాటర్:

రోజ్ వాటర్ ని ఉపయోగించి డార్క్ లిప్స్ సమస్యను అధిగమించవచ్చు. పెదాలపై డార్క్ స్కిన్ ను తొలగించి చర్మం డ్రై గా మారకుండా కాపాడే సామర్థ్యం రోజ్ వాటర్ లో కలదు.

ఒక కాటన్ బాల్ ని రోజ్ వాటర్ లో ముంచి దాంతో పెదాలపై రబ్ చేయండి. ఈ పద్దతిని రోజులో కొన్ని సార్లు పాటిస్తే అందమైన పెదాలు మీ సొంతమవుతాయి.

4. అలోవెరా జెల్:

4. అలోవెరా జెల్:

అలోవెరా జెల్ అనేది యాంటీ ఆక్సిడెంట్స్ కు పవర్ హౌస్ లా వ్యవహరిస్తుంది. పెదాలపైన ఉన్న గ్రైమ్ ను తొలగించి సహజ సిద్ధమైన రోజీ లుక్ ను పెదాలకు అందిస్తుంది ఈ జెల్. అలో వెరా లీఫ్ నుంచి కాస్తంత జెల్ ను సేకరించి ఈ జెల్ ను పెదాలపై రబ్ చేయండి. 20-25 నిమిషాల తరువాత పెదాలను నార్మల్ వాటర్ తో శుభ్రపరచండి.

ఈ పద్దతిని రోజుకొకసారి పాటిస్తే పెదాలు అందంగా గులాబీ రంగులోకి మారతాయి.

5. దానిమ్మ:

5. దానిమ్మ:

దానిమ్మ రసంలో పెదాలను అందంగా మార్చే గుణాలున్నాయి. పెదాలపై డార్క్ స్కిన్ ను తొలగించి పెదాలకు హైడ్రేషన్ ను అందిస్తుంది. తద్వారా, పెదాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాటన్ బాల్ ను దానిమ్మ రసంలో ముంచి దాంతో పెదాలను రబ్ చేయండి.

ఈ జ్యూస్ ను 20 నిమిషాల పాటు పెదాలపై ఉండనివ్వండి. ఆ తరువాత చల్లటి నీటితో పెదాలను శుభ్రపరుచుకోండి. ఈ రెమెడీను వారానికి నాలుగైదు సార్లు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

6. చక్కెర:

6. చక్కెర:

చక్కెర అనేది ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్ గా పనిచేసి పెదాలపై దుమ్మును అలాగే ఇంప్యూరిటీస్ ను తొలగిస్తుంది. ఒక టీస్పూన్ గ్రాన్యులేటెడ్ షుగర్ లో ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోండి.

ఈ మిశ్రమంతో పెదాలను స్క్రబ్ చేయండి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో పెదాలను శుభ్రపరుచుకోండి. ఈ హోంమేడ్ స్క్రబ్ ను వారానికి రెండు మూడు సార్లు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

7. తేనె:

7. తేనె:

తేనె అనేది హుమేక్టన్ట్ గా పనిచేసి యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ తో డార్క్ లిప్స్ సమస్యను తొలగిస్తుంది. డార్క్ లిప్స్ సమస్యను తొలగించే సామర్థ్యం తేనెలో కలదు. కాస్తంత తేనెను తీసుకుని పెదాలపై అద్దండి.

మీ మునివేళ్లతో పెదాలను సున్నితంగా మసాజ్ చేయండి. ఆ తరువాత చల్లటి నీటితో పెదాలను శుభ్రపరుచుకోండి.

8. ఆలివ్ ఆయిల్:

8. ఆలివ్ ఆయిల్:

చాప్డ్ లిప్స్ సమస్యను అరికట్టేందుకు ఆలివ్ ఆయిల్ అమితంగా తోడ్పడుతుంది. చర్మాన్ని డేమేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి డార్క్ లిప్స్ సమస్యను తగ్గిస్తుంది.

నిద్రపోయే ముందు కాస్తంత ఆలివ్ ఆయిల్ ను పెదాలకు అడ్డుకోండి. ఉదయాన్నే, గోరువెచ్చటి నీటితో పెదాలను శుభ్రపరుచుకోండి. ఈ పద్దతిని రోజూ పాటిస్తే ఆశించిన ఫలితం లభిస్తుంది.

English summary

Want To Get Rid Of Dark Lips? Try These Effective Home Remedies

Dark lips will no longer be a problem to you. Instead of using the cosmetics and other chemical products, start using the natural home remedies that are easily available at home. Using tomato, beetroot, honey, rose water, etc., on everyday basis will help treat your dark lips effectively.Treat Dark Lips With These Remedies
Story first published:Tuesday, April 3, 2018, 17:40 [IST]
Desktop Bottom Promotion