For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మంపై పిగ్మంటేషన్ అంటే ఏమిటి? దాన్ని ఇంట్లో ఎలా నయం చేయవచ్చు?

చర్మంపై పిగ్మంటేషన్ అంటే ఏమిటి? దాన్ని ఇంట్లో ఎలా నయం చేయవచ్చు?

|

చర్మంపై రంగు ఎక్కువై నల్లమచ్చలు పడటం, మరోపదంలో చెప్పాలంటే హైపర్ పిగ్మంటేషన్, ఒక చర్మసమస్య.ఇందులో చర్మంపై నల్లని మచ్చలు పట్టీలలాగా పడి, చర్మం రంగు మొత్తం ఒకలానే ఉండదు. ఇది చాలా కారణాల వలన రావచ్చు. వాతావరణ కాలుష్యం, యువి కిరణాలు, హార్మోన్ల సమస్య లేదా ఇంకేదైనా ఆరోగ్య సమస్య వల్ల అయినా రావచ్చు.

చాలామంది ఆడవాళ్ళకి చర్మంపై నల్లమచ్చలు ఉండటం పెద్ద సమస్య. అది ఒక్కోసారి మన ఆత్మవిశ్వాసాన్ని, వ్యక్తిత్వాన్ని కూడా ప్రశ్నిస్తుంది. చాలామంది చర్మంపై రంగు సమస్యలని మార్కెట్లోని వివిధ మేకప్ ఉత్పత్తులను వాడి దాచేస్తుంటారు. కన్సీలర్లు, ఫౌండేషన్, బిబి క్రీమ్ అలాంటి ఇతర ఉత్పత్తులు చర్మం రంగును సమపరుస్తాయి.

What Is Skin Pigmentation? How Can You Treat It At Home?

మార్కెట్లో వందలాది మేకప్ ఉత్పత్తులు ఉంటాయి కానీ, ఈ చర్మ సమస్యను ఇంట్లోనే కొన్ని సహజంగా,సులభంగా దొరికే పదార్థాలతోనే నయం చేయవచ్చు.

అయితే, ఈ చర్మంపై రంగు ఎక్కువయి వచ్చే నల్లమచ్చలకి కొన్ని ఇంటి చిట్కాలను ఇప్పుడు చూద్దాం.

యాపిల్ సిడర్ వెనిగర్

యాపిల్ సిడర్ వెనిగర్

యాపిల్ సిడర్ వెనిగర్ లో చర్మం రంగును తిరిగి తెచ్చే ఘాటైన గుణాలు ఉంటాయి.

కావాల్సిన వస్తువులు

1 చెంచా యాపిల్ సిడర్ వెనిగర్

2 చెంచాల నీరు

ఎలా చేయాలి

యాపిల్ సిడర్ వెనిగర్ ను నీళ్లను కలపండి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్నచోట రాయండి. 5 నిమిషాలు అలా వదిలేయండి. 5 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

పసుపు,సెనగపిండి ప్యాక్

పసుపు,సెనగపిండి ప్యాక్

సెనగపిండి చర్మంపై చనిపోయిన కణాలను, మురికిని తొలగిస్తుంది. పసుపు చర్మంపై రంగును ఒకేలా ఉండేలా చేసి,మచ్చలను తొలగిస్తుంది.

కావాల్సిన వస్తువులు

2 చెంచాల సెనగపిండి

ఒక చిటికెడు పసుపు

1 చెంచా రోజ్ వాటర్

1 చెంచా పాలు

ఎలా చేయాలి

పైన చెప్పిన పదార్థాలన్నీ కలపండి. ఈ ప్యాక్ ను సమస్య ఉన్నచోట రాసి 20 నిమిషాలపాటు వదిలేయండి. ఎండిపోయాక, కొంచెం నీటిచుక్కలు చల్లి తడిసేలా చేయండి. తర్వాత మొదట సవ్యదిశలో తర్వాత అపసవ్యదిశలో రుద్దుతూ ప్యాక్ ను తీసేయండి.

ఉల్లిపాయ

ఉల్లిపాయ

ఉల్లిపాయలో చాలా విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి మచ్చలను తొలగిస్తాయి.

కావాల్సిన వస్తువులు

1 చిన్న ఉల్లిపాయ

ఎలా చేయాలి

చిన్న ఉల్లిపాయను సగానికి కోయండి. ఆ ఉల్లిముక్కను సమస్య ఉన్నచోట చర్మంపై రుద్దండి. 10 నిమిషాలు ఆగండి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. వారంలో దీన్ని 2-3 సార్లు ప్రయత్నించండి.

బంగాళదుంప రసం

బంగాళదుంప రసం

బంగాళదుంపల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా కన్పడేలా చేస్తాయి. అందులో కొంతవరకు బ్లీచింగ్ ఏజెంట్లు కూడా ఉండటంతో చనిపోయిన చర్మకణాలను తొలగించటంలో కూడా సాయపడుతుంది.

కావాల్సిన వస్తువులు

1 బంగాళదుంప

ఎలా చేయాలి

ఒక బంగాళదుంపను చిన్న ముక్కలుగా కోయండి. తర్వాత వాటిని తురిమి,పిండి రసాన్ని తీయండి. ఒక దూది ముక్కను అందులో ముంచి మీ చర్మంపై రాసుకోండి. 15-20 నిమిషాలు అలా వదిలేయండి. మామూలు నీటితో కడిగేయండి.

కడిగాక చర్మం పొడిబారే అవకాశం ఉన్నందున మాయిశ్చరైజర్ రాసుకోండి. ఇలా వారానికి 3 సార్లు చేయండి.

నిమ్మ,తేనె

నిమ్మ,తేనె

నిమ్మలోని,తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై మచ్చలను తొలగించి, కాంతివంతంగా మారుస్తాయి. సహజంగా చర్మాన్ని తెల్లబరిచే గుణాలుండటంవలన మీకు మెరిసే తెల్లని చర్మం లభిస్తుంది.

కావాల్సిన వస్తువులు

1చెంచా సెనగపిండి

1చెంచా తేనె

2చెంచాల నిమ్మరసం

ఒక చిటికెడు పసుపు

ఎలా చేయాలి

అన్ని పదార్థాలను ఒక బౌల్ లో కలిపేసి సమస్య ఉన్నచోట పట్టించండి. 20 నిమిషాలు అలా వదిలేసి,గోరువెచ్చని నీటితో కడిగేయండి. వారంలో 2 సార్లు ఇలా చేస్తే ఫలితాలు వేగంగా,మెరుగ్గా వస్తాయి.

ఆలోవెరా

ఆలోవెరా

ఆలోవెరా చర్మానికి తేమను అందిస్తుంది. అది ఎండలోని యూవి కిరణాల నుంచి,దాని హానికారక ప్రభావాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

కావాల్సిన వస్తువులు

2 చెంచాల ఆలోవెరా జెల్

½ చెంచా తేనె

ఎలా చేయాలి

ఒక బౌల్ లో ఆలోవెరా జెల్ ఇంకా తేనెను కలపండి. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు అలా అందులోనే ఉండనివ్వండి. 10 నిమిషాల తర్వాత మీరు ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్నచోట రాసుకోవచ్చు. 20 నిమిషాలు అలానే ఉండనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగేయండి.

పెరుగు

పెరుగు

పెరుగులో ఉండే సహజమైన ఎంజైములు నిమ్మరసంలోని యాసిడ్లతో కలిసి పనిచేసి చర్మంపై నల్ల మచ్చలను తేటపరుస్తాయి.

కావాలసిన వస్తువులు

1-2 చెంఛాల పెరుగు

2 చెంచాల నిమ్మరసం

ఎలా చేయాలి

రెండిటినీ కలిపి ఆ మిశ్రమాన్ని చర్మంపై రాసుకోండి. ఈ పెరుగుప్యాక్ ను 20 నిమిషాలు అలా వదిలేయండి. నీళ్లతో కడిగేయండి. ఈ చిట్కాను ప్రతిరోజూ పాటించి వేగవంతమైన, మెరుగైన ఫలితాలను చూడండి.

దోసకాయ

దోసకాయ

దోసకాయ రంగుమచ్చలను తొలగించటంలో, చర్మానికి మళ్ళీ జీవం వచ్చేలా చేయటంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

కావాల్సిన వస్తువులు;

½ దోసకాయ

1 చెంఛా చక్కెర

ఎలా చేయాలి

దోసకాయను కోసి,మిక్సీపట్టి మందపాటి పేస్టులా తయారుచేయండి. ఈ దోసకాయ గుజ్జులో 1 చెంచా చక్కెరను వేయండి.ఈ మాస్క్ ను సమస్య ఉన్నచోట్ల రాసి, 10 నిమిషాలు అలా వదిలేయండి. చల్లనీరుతో కడిగేయండి.

వంట సోడా

వంట సోడా

వంటసోడా చర్మంపై చచ్చిపోయిన కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా, తాజాగా కన్పడేలా చేస్తుంది.

కావాల్సిన వస్తువులు

2 చెంచాల బేకింగ్ సోడా

నీరు

ఎలా చేయాలి

ఒక చెంచా బేకింగ్ సోడాను నీటిని ఒక బౌల్ లో కలపండి. ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా గుండ్రంగా మీ చర్మంపై రుద్దండి. మామూలు నీళ్ళతో కడిగేసి, కొంచెం మాయిశ్చరైజర్ రాసుకోండి.

ఇలా రెండు వారాలపాటు రోజూ చేసే మంచి ఫలితాలు వస్తాయి. కానీ, సున్నితమైన చర్మం ఉన్నవారికి ఈ చిట్కా పనిచేయదు.

English summary

What Is Skin Pigmentation? How Can You Treat It At Home?

What Is Skin Pigmentation? How Can You Treat It At Home?,Skin pigmentation is a major worry for most of the women out there. It can at times even question our self-esteem, confidence and personality. So, let us have a look at some of the home remedies for treating hyperpigmentation.
Story first published:Wednesday, May 9, 2018, 16:31 [IST]
Desktop Bottom Promotion