For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెద్దలకు (వయోజనులకు) మొటిమలు గాని ఎదురైతే ఏమి చెయ్యాలి ?

|

అవును, మీరు చదివింది నిజమే ! మొటిమలు అనేవి కేవలం యువకులకు మాత్రమే వచ్చేది కాదు. మీరు ఎదుగుతున్నప్పటి నుండి ఈ విధంగానే ఆలోచించారు, ఆ ఇబ్బందికరమైన మచ్చల్లో ఇకపై మీ జోలికి రావని, వచ్చి మిమ్మల్ని ఆశ్చర్యపరిచవని. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అవి ఇక్కడే తిష్ట వేసి ఉన్నాయి మరియు అవి మిమ్మల్ని త్వరగా వదిలి వెళ్లిపోవడానికి ఏ విధంగాను ప్లాన్ చేయలేదు.

కాబట్టి, ఈ మొటిమల అనేవి పెద్దవారిలో ఎందుకు వస్తాయి ? సాధారణంగా మొటిమలనేవి యుక్తవయసులో శరీరంలో సంభవించే హార్మోన్ల మార్పుల కారణంగా వస్తాయని మనకు తెలుసు. అలాగే ఈ మొటిమలు వయోజనుల్లో రావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి.

What To Do When You Get Adult Acne

హార్మోన్లలో వచ్చే మార్పుల కారణంగా ఇవి సంభవిస్తాయి. నెలవారి మహిళల్లో ఏర్పడే ఋతుచక్రాన్ని నిర్ణయించే హార్మోన్లలో గల మార్పులు మీ చర్మంపై మొటిమలు ఏర్పడ్డానికి కారణం కావచ్చు. ఈ మొటిమలు ఏర్పడటానికి ఒత్తిడి మరియు కాలుష్యం వంటి విషయాలు ఏ విధంగానూ సహాయపడవు.

ఏ వ్యక్తయినా వాళ్ళు చేసే పని భారాన్ని బట్టి ఎక్కువ స్థాయిలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఒత్తిడి, "కార్టిసాల్" అని పిలువబడే హార్మోన్ను విడుదల చేస్తుంది, ఒత్తిడితో మీ శరీరం పోరాడేందుకు ఇది సహాయపడుతుంది. దురదృష్టవశాత్తు, ఈ హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల పింపుల్స్ మరియు మోటిమలు అనేవి అకస్మాత్తుగా ఏర్పడతాయి.

వయోజనలులలో మోటిమలు కలగటానికి ముఖ్య కారణం ఈ గాలి కాలుష్యం. నగరంలో ఉన్న కాలుష్యము తీవ్రస్థాయిలో పెరుగుతూ పోతుంది. నగరంలో మీరు కేవలం ఒక గంట సమయం పాటు వాకింగ్ కోసం అలా బయటకి వెళ్ళినప్పుడు కాలుష్యం కారణంగా గాలిలో ఉన్న దుమ్ము, ధూళి మీ ముఖాన్ని ఆవరిస్తాయి. బాగా తెరుచుకున్న మీ శరీర చర్మరంధ్రాలలో ఈ దుమ్ము చేరినప్పుడు, మొటిమలు ఏర్పడటానికి కారణమవుతాయి.

ఈ మొటిమలు ఏర్పడడానికి గల ఇతర కారణాలు మీరు ఉపయోగిస్తున్న సౌందర్య సాధనాలు (లేదా) మీరు తీసుకొనే ఆహారము. వయోజనుల్లో వచ్చిన మోటిమలను ఎదుర్కోవటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

1. సరైన ఉత్పత్తులను వాడండి :

1. సరైన ఉత్పత్తులను వాడండి :

మీరు మోటిమలను కలిగి ఉన్నవారైతే, మీ మొటిమలను కనబడకుండా అద్భుతంగా మాయం చేస్తుందని చెప్పే కంపెనీల వాగ్దానాలను మీరు నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే, ఆ ప్రొడక్ట్స్ అనేవి మీ యొక్క మొటిమలను మరింత అధ్వానంగా చెయ్యవచ్చు. ఎలాంటి పరిణామాల గురించి చింతించకుండానే మీరు సౌందర్య-సాధనాలతో ప్రయోగాలు చేయగల రోజులు ఎప్పుడో పోయాయి. అందువల్ల, మీరు ఎలాంటి కొత్త ఉత్పత్తులను కొనుగోలు చేసినా, అనగా మాయిశ్చరైజర్లు, ఫేస్ క్లీర్నర్లు మరియు ఇతర చికిత్సా పద్ధతులలో ఉపయోగించే మూల పదార్థాల గురించి తప్పనిసరిగా చదివి తెలుసుకోవాలి.,

2. నమ్మదగిన చికిత్సా విధానాలు :

2. నమ్మదగిన చికిత్సా విధానాలు :

మీ ముఖం మీద ఏర్పడిన మచ్చలను నివారించడం కోసం తీసుకునే చికిత్సలలో, మీకు అందుబాటులో ఉండి నమ్మకమైన వాటిని మాత్రమే ఎంచుకోండి. మీ ముఖం మీద మచ్చలు ఎప్పుడైనా ఏర్పడవచ్చు, మరియు దానికి గల కారణాలు తెలియడం మనకి చాలా కష్టము. చాలామందికి ఈ మచ్చలు ఏర్పడటానికి గల సరైన కారణాలను చాలా సమయం వరకు గుర్తించలేరు. ఇప్పుడు మీరు చాలా ముఖ్యమైన కార్యక్రమానికి హాజరు కావలసిన పరిస్థితుల్లో, మీ మోఖం మీద మొటిమ ఉన్నట్లు మీకు చూపిస్తుంది ? అలాంటి పరిస్థితుల్లో, మీరు తప్పక "స్పాట్ ట్రీట్మెంట్నును" చేయించుకోవడం చాలా ముఖ్యము. ఈ విధమైన చికిత్సలు ఆ మచ్చల యొక్క ఉపరితలాన్ని పొడిగా మాత్రమే చేస్తుంది అంతేతప్ప దానికి కారణమైన బ్యాక్టీరియాను ఏవిధంగాను అడ్డుకోదు. అత్యవసర సమయాలలో మాత్రమే ఈ చికిత్స ఈ విధంగా పనిచేస్తుంది, కానీ ఆ మచ్చల యొక్క ఉపరితలం కింద ఉన్న బ్యాక్టీరియా ఇప్పటికీ సజీవంగానే ఉన్నందువల్ల భవిష్యత్తులో మళ్లీ ఈ మచ్చలు పెద్దవిగా వ్యాప్తి చెందుతాయి.

3. క్లే మాస్క్ :

3. క్లే మాస్క్ :

పెద్దవాళ్లకు ఎదురైనా ఈ మొటిమల కోసం, క్లే మాస్క్ అనేవి మీకు మేలు చేసే స్నేహితులుగా వుంటాయి. మీరు ఈ మాస్క్ కోసం, కర్ర బొగ్గును (లేదా) గ్రీన్-టీని ఆధారంగా చేసుకొని తయారుచేయవచ్చు. మొండిగా ఉన్న మొటిమలకు మరియు బ్లాక్-హెడ్స్ కు బొగ్గులతో చేసిన ఫేస్ మాస్క్, చర్మం యొక్క లోలోపల నుండి బాగా శుభ్రం చేసేదిగా ఉంటుంది. ఒకవేళ మీ చర్మం శ్లేష్మమును ఉత్పత్తి చేయుట వల్ల ఏర్పడిన మొటిమలు గానీ అయితే, వాటికోసం గ్రీన్-టీతో ఫేస్ మాస్క్ను తయారుచేసుకోవచ్చు. క్లే అనేది చర్మం లోపల నుండి ఉత్పత్తి అవుతున్న శ్లేష్మమును పీల్చుకోవడంలో సహాయపడుతుంది, అలాగే మొటిమలు యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది.

4. మొటిమలను చిదపవద్దు :

4. మొటిమలను చిదపవద్దు :

మీ ముఖంపై వచ్చిన మొటిమలను చిదపటం గాని (లేదా) పిందటమ్ గాని చెయ్యవద్దు. ఇలా చేయడం వలన మొటిమలను మరింత ఎక్కువగా పెరుగుతాయి. అంతేకాక, ఏదైనా మొటిమల నుండి వాపు (లేదా) చీము వచ్చినట్లయితే, ఇది చర్మంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతుంది మరియు అక్కడ మంటలను ప్రేరేపిస్తుంది. అలా మీరు మొటిమలను చిదపటం వల్ల, మీరు మరిన్ని మచ్చలను పెంచుకునే అవకాశముంది. దానికి బదులుగా ఆ మొటిమలను అలాగే పూర్తిగా వదిలేయండి.

5. టీ-ట్రీ ఆయిల్ను వాడండి :

5. టీ-ట్రీ ఆయిల్ను వాడండి :

నీ మొటిమలను నివారించడంలో టీ-ట్రీ ఆయిల్ను ఉపయోగించడం చాలా ఉత్తమం. ఇది మీ చర్మంపై చాలా వేగంగా పనిచేస్తుంది అలాగే మీ చర్మాన్ని చాలా సున్నితంగా ఉంచుతుంది. ఈ ఆయిల్ను ఉపయోగించడం వల్ల రాత్రికి రాత్రే మీకు మంచి ఫలితాలు దక్కుతాయని మేము వాగ్దానము చెయ్యలేము. కానీ ఈ ఆయిల్ను వాడటం వల్ల ఆ ప్రాంతంలో గల బ్యాక్టీరియాను నెమ్మది నెమ్మదిగా చంపి, ఒక్క వారంలోనే మీ ముఖంపై మచ్చలు లేకుండా చెయ్యగలదు.

6. మందులను వాడటం :

6. మందులను వాడటం :

కొన్నిసార్లు, సమయోచిత చికిత్సలు సరిపోకపోవచ్చు. దాని అర్థమేమంటే, మీ చర్మంపై అధికమౌతున్న మొటిమలను నివారించడం కోసం మీరేమి చేసినా కూడా చర్మవ్యాధి నిపుణుడిని కలవడం అత్యవసరము. మీరు అనుభవిస్తున్న వాటిలో బాధాకరమేమిటంటే, మొటిమల వల్ల ఏర్పడే నొప్పిని అనుభవించడం చాలా బాధాకరమైనది. మీరో డాక్టర్ను సంప్రదించడం వల్ల వాటి విషయంలో మీరు చేసే తప్పిదాలను గూర్చి చెప్పటమే కాక వాటి నివారణకు అవసరమయ్యే మందులను మీకు అందించడంలో సహాయం చేయగలడు.

7. పొడిగా మారిన చర్మం ఊడిపోవడం :

7. పొడిగా మారిన చర్మం ఊడిపోవడం :

ఎక్స్ఫోలియెట్ అనగా చర్మం ఉపరితలంపై చనిపోయిన చర్మపు కణాలను తొలగించటం. ఇది చర్మం యొక్క పై పొరను వదిలించుకోవటం ద్వారా, ఆ ప్రాంతంలో కొత్త చర్మ కణాల అభివృద్ధికి చాలా దోహదపడుతుంది. వాటి కోసం మీరు చర్మంపై ఎక్కువ రాపిడిని కలిగించు స్క్రబ్లను ఉపయోగించవలసిన అవసరం లేదు. అందుకోసం మీరు గ్లైకోలిక్ యాసిడ్ (లేదా) లాక్టిక్ యాసిడ్లను కలిగి ఉండే సున్నితమైన పీల్స్ను ఉపయోగించవచ్చు. మీరు మరింత తరచుగా ఎక్స్ఫోలియెట్కు వెళుతున్నట్లయితే, వాటికి బదులుగా మీరు మృదువైన సాధనాలను ఉపయోగించడం మేలని సూచిస్తున్నాయి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, మీరు ఎక్స్ఫోలియెట్ చేసిన ప్రతిసారి, చర్మ రంధ్రాలను మూసివేసేందుకు

ఒక టోనర్ను ఉపయోగించాలని గుర్తుంచుకోండి.

English summary

What To Do When You Get Adult Acne

What To Do When You Get Adult Acne,There are many reasons for adult acne, it can be caused by hormonal imbalance, usage of a wrong product, etc. So, read to know the simple remedies to treat adult acne.
Story first published:Monday, February 26, 2018, 17:45 [IST]
Desktop Bottom Promotion