For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొడిచర్మం మమ్మల్ని ఇబ్బంది పెడుతుందా ? అయితే గొప్ప లక్షణాలు కలిగిన వెల్లుల్లిని వాడి చూడండి !

పొడిచర్మం మమ్మల్ని ఇబ్బంది పెడుతుందా ? అయితే గొప్ప లక్షణాలు కలిగిన వెల్లుల్లిని వాడి చూడండి !

|

మీరు పొడి చర్మంతో బాధపడుతున్నారా? ఇది మీ శరీరం పైన, మాడు మీద, పాదాల క్రింద, చేతులు (లేదా) కాళ్ళ మీద ఏర్పడి మిమ్మల్ని నిరంతరాయంగా బాధించేలా చేస్తున్నాయా? అయితే మీరు మీ పొడిచర్మం ఉనికిని దాచి ఉంచేందుకు మాయిశ్చరైజర్ను అన్ని వేళలా మీతో పాటుగా కలిగి ఉండాలి !

Worried Of Dry Skin? This Garlic Treatment Is Really Effective!

వాతావరణంతో సంబంధం లేకుండా రోజువారి పొడిచర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడేవారు మీలానే చాలామంది ఉన్నారు. ఋతువులతో సంబంధం లేకుండా మీ చర్మము ఎల్లప్పుడు పొడిగానే ఉంటుంది. మిమ్మల్ని ఎంతగానో బాధించే ఈ సమస్యకు ఉండే పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం !
పొడిచర్మం ఏర్పడటానికి గల కారణాలేమిటి?

పొడిచర్మం ఏర్పడటానికి గల కారణాలేమిటి?

ఒక వ్యక్తి పాటించే రోజువారి అలవాట్ల బట్టి ఒకటి (లేదా) అంతకన్నా ఎక్కువ కారణాలు ఈ సమస్యకు కారణం కావచ్చు. పొడిచర్మము ఏర్పడటానికి దారితీసే సాధారణ కారణాల జాబితాను మీ ముందుకు తీసుకు వచ్చాము.

 మీరు కఠినమైన సబ్బు షాంపులను ఉపయోగించడం :-

మీరు కఠినమైన సబ్బు షాంపులను ఉపయోగించడం :-

మీ జుట్టును, చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడమనేది చాలా ముఖ్యం. అందుకు గాను మీరు ఉపయోగించే ప్రొడక్టులు చాలా నాణ్యమైన పనితీరును కలిగి ఉండాలి. కానీ మీరు ఉపయోగించే ఇలాంటి ప్రొడక్ట్స్ లో ఉండే రసాయనాలు మీ చర్మాన్ని మరింత పొడిగా మార్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ లో ఉండే ఆల్కలీన్ pH, మీ చర్మం పైపొరను దెబ్బతీసేదిగా ఉన్న కారణంగా, మీ చర్మాన్ని పొడిగా మార్చేందుకు దారితీస్తుంది.

వేడి షవర్లో ఎక్కువసేపు ఉండటం

వేడి షవర్లో ఎక్కువసేపు ఉండటం

మీరు కలిగి ఉన్న శారీరక & మానసిక ఒత్తిడిని దూరంచేసి మీకు ఉపశమనం కలిగించేలా చేయడంలో గోరువెచ్చని షవర్లో స్నానం చేయటమనేది చాలా మంచి ఆలోచన.

 మీ చర్మానికి సరిపడని మాయిశ్చరైజర్ను ఉపయోగించడం :-

మీ చర్మానికి సరిపడని మాయిశ్చరైజర్ను ఉపయోగించడం :-

పొడిచర్మాన్ని కలిగిఉండేవారు మాయిశ్చరైజర్ను ఉపయోగించడం తప్పనిసరి. అలా మీరు ఉపయోగించే మాయిశ్చరైజర్ మీ చర్మానికి సరిపడుతుందా / లేదా అనేది చాలా ముఖ్యం.

తక్కువ మోతాదులో నీరుని తాగటం :-

తక్కువ మోతాదులో నీరుని తాగటం :-

మన జీవితానికి నీరు అనేది అమృతం వంటిది. అలాగే ఇది చర్మానికి అనేక రకాల ప్రయోజనాలను చేస్తుందనేది వాస్తవం. మీరు ఎక్కువ మోతాదులో నీరు తీసుకోవడం వల్ల మీ శరీరం (ముఖ్యంగా మీ చర్మం) నీటికి కృతజ్ఞతలు తెలుపుతుంది !

తరచుగా మీ చర్మాన్ని ఎక్స్పోలియేషన్ చేయడం :-

తరచుగా మీ చర్మాన్ని ఎక్స్పోలియేషన్ చేయడం :-

ఈ ఎక్స్పోలియేషన్ ప్రక్రియ ద్వారా మృత చర్మ కణాలను తీసివేసి, మీ చర్మం మరింత కాంతివంతంగా ఉండటానికి దోహదపడుతుంది కానీ మీరు ఈ ప్రక్రియను మితిమీరి చేయటం వల్ల మీ చర్మం పొడిగా మారే అవకాశం ఉంది.

 కఠినమైన డిటర్జెంట్ల వాడకం :-

కఠినమైన డిటర్జెంట్ల వాడకం :-

మీ బట్టలను శుభ్రం చేసేందుకు ఉపయోగించే అనేక రకాలైన డిటర్జెంట్లు (లేదా) సువాసనతో కూడిన ఫాబ్రిక్ సాప్ట్నర్స్లో ఉండే కఠినమైన రసాయనాల కారణంగా, మీకు చర్మ సంబంధమైన అలర్జీలు ఎదురవడానికి కారణం కావచ్చు. కాబట్టి వాటిని వినియోగాన్ని మానుకోండి!

చలికాలంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం :-

చలికాలంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం :-

ఈ చలికాలంలో మీ జుట్టు & చర్మం రెండూ పొడిగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీరు తరచుగా కొబ్బరినూనె, ఆలివ్ నూనె వంటి వాటితో మీ చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి. మీ ఇంట్లో వాతావరణాన్ని ఎల్లప్పుడూ తేమను కలిగి ఉండేలా చేసే హ్యుమిడిఫైర్ సాధనాలను ఉపయోగించాలి.

కఠినమైన చర్మ చికిత్సలను నివారించాలి :-

కఠినమైన చర్మ చికిత్సలను నివారించాలి :-

చర్మ సంరక్షణకు ఉపయోగించే చికిత్సా విధానాలకు మీ చర్మం స్పందించకపోతే వాటి వినియోగాన్ని వెంటనే నివారించండి.

పొడి చర్మాన్ని నివారించే ఇంటి చిట్కాలు :-

పొడి చర్మాన్ని నివారించే ఇంటి చిట్కాలు :-

చాలామందిలో పొడి-చర్మమనేది ప్రతిసారి ఎదురయ్యే సమస్యగా ఉన్నప్పటికీ దాన్ని అధిగమించడం పెద్ద కష్టమేమి కాదు. పొడిచర్మ నివారణకు మార్కెట్లో లభించే ప్రొడక్ట్స్ను ఉపయోగించడానికి బదులుగా ఇంటి చిట్కాలను వినియోగించటం మంచి ఆలోచన. అలాంటి కొన్ని గృహ ఆధారిత నివారణ మార్గాలను ఇప్పుడు మనం చూద్దాం.

పొడిచర్మం మమ్మల్ని ఇబ్బంది పెడుతుందా

పొడిచర్మం మమ్మల్ని ఇబ్బంది పెడుతుందా

1. మీ చర్మం తడిగా ఉన్నప్పటికీ, మాయిశ్చరైజర్ను కలిగి ఉండేలా చూసుకోండి :- మీ చర్మం తడిగా ఉన్నప్పుడు - మీ చర్మము సులభంగా మాయిశ్చరైజర్ను నిర్బంధించేలా చేయడంలో సహాయపడుతుంది.

2. ఆయిల్స్ మీ చర్మానికి ఫ్రెండ్స్ వంటివి :-

ఈ పొడి చర్మానికి కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్ వంటి వాటిని తరచూ అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలరు.

3. మీరు తరచుగా ఎక్కువ నీటిని తాగాలి :-

డీహైడ్రేషన్ వల్ల మీరు ఇతర అనారోగ్య సమస్యల బారిన పడటమే కాకుండా, మీ చర్మాన్ని పొడిబారేలా చేయగలదని మర్చిపోవద్దు. కాబట్టి మీరు తరచుగా నీరు త్రాగడం వల్ల మీ చర్మం మరింత కాంతివంతంగా & ప్రకాశవంతంగా మారుతుంది.

4. వేడి షవర్ కింద స్నానం చేయడం మానుకోండి :-

ఈ శీతాకాలంలో చాలామంది వేడినీళ్ళతో స్నానం చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. దీనిని నివారించండి! అలా స్నానం చెయ్యడానికి బదులుగా, ఒక మోస్తరుగా ఉండే షవర్ కింద స్నానం చేయడానికి వెళ్ళండి, అలాగే ఒక సున్నితమైన సబ్బు & షాంపూనూ ఉపయోగించండి.

5. పాలను ఉపయోగించండి :- పాలు & తేనె కలయిక మీ చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు అనేక అద్భుతాలను కలుగ చేయవచ్చు, దీనిని కూడా మీ స్నానంలోకి జోడించి, మంచి ఫలితాలను ఆస్వాదించండి.

6. సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్లు :-

మల్టినీ మిట్టి, రోజ్ వాటర్, అలోవెరా, ఆపిల్ సైడర్ వెనీగర్, అరటి, తేనె, అవోకాడో, వేప, బియ్యపు పిండి, గంధము, బ్రౌన్ షుగర్ వంటి మొదలైనవి., మీ పొడి చర్మాన్ని నివారించడంలో చాలా సహాయకారిగా ఉంటాయి.

పొడిచర్మ (డ్రై-స్కిన్) చికిత్స కోసం వెల్లుల్లితో చేసే చికిత్స?

పొడిచర్మ (డ్రై-స్కిన్) చికిత్స కోసం వెల్లుల్లితో చేసే చికిత్స?

మీరు పొడిచర్మ చికిత్స కోసం చాలా రకాల ఇంటి చిట్కాలు పాటించి ఉంటారు వాటిలో సమర్థవంతంగా పనిచేసే ఒక పదార్ధం ఉంది. అదే వెల్లుల్లి! వెల్లుల్లిలో శోథ నిరోధక లక్షణాలు ఫ్లాకీని (పొరలుగా ఉన్న చర్మాన్ని) తీసివేసి, మీ పొడి చర్మాన్ని నివారించడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. ఇది శాస్త్రీయంగా నిరూపించబడనప్పటికీ, తామర వంటి పొడిచర్మ సమస్యల పరిస్థితిని చక్కదిద్దడంలో వెల్లుల్లి సానుకూల ప్రభావాలను చూపించినట్లుగా ప్రాచుర్యం పొందాయి.

పొడి చర్మ సమస్య నివారణకు వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలి ?

పొడి చర్మ సమస్య నివారణకు వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలి ?

వెల్లుల్లిని మెత్తని చూర్ణంగా చేసుకొని, చర్మానికి దరఖాస్తు చేసుకోవడం వల్ల చర్మం పొడిదనాన్ని తగ్గించవచ్చు. ఒక మంచి నివారణ మార్గమేమంటే, బాగా ముద్దగా చేసిన వెల్లుల్లిని నీటితో కలిపి కొన్ని నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి, ఆ మిశ్రమానికి కలబంద గుజ్జును (లేదా) యాపిల్ సైడర్ వినెగార్ను కలపాలి, ఇలా తయారైన మిశ్రమాన్ని ప్రభావితమైన చర్మ ప్రాంతాలలో అప్లై చేయాలి. ఇది బాగా ఆరిపోయిన తర్వాత, నీటితో మీ చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.

వెల్లుల్లి ప్యాక్ :-

వెల్లుల్లి ప్యాక్ :-

ఈ ప్యాక్ను తయారు చేసుకోవడానికి వెల్లుల్లి ముద్దను, తేనెను, రోజ్ వాటర్ను & వైట్-క్లే అవసరమవుతాయి. ఈ పదార్ధాలన్నింటిని బాగా కలిపి మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని, సమస్యాత్మకమైన చర్మ ప్రాంతాలలో అప్లై చేయాలి. 15-20 నిమిషాల పాటు ఈ ప్యాక్ను బాగా ఆరినిచ్చిన తరువాత చల్లని నీటితో మీ చర్మాన్ని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత మీ చర్మానికి మాయిశ్చరైజర్ను అప్లై చేయాలి. ఈ ప్యాక్ను వారానికి 2-3 సార్లు వేసుకోవడం వల్ల మీరు వేగవంతమైన ఫలితాలను పొందగలరు.

English summary

Worried Of Dry Skin? This Garlic Treatment Is Really Effective!

Are you suffering from dry skin? Does the dry flaky skin on your body, primarily on the scalp, under the feet, on the arms or legs a constant cause of worry for you? Are you unable to manage without a moisturiser, and have to carry it with you at all times to soothe your dry skin?
Desktop Bottom Promotion