For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైట్ హెడ్స్ మిమ్మల్ని ఆందోళన పెడుతున్నాయా?అయితే మీకోసమే ఈ సహజ పరిష్కారాలు

వైట్ హెడ్స్ మిమ్మల్ని ఆందోళన పెడుతున్నాయా? అయితే మీకోసమే ఈ సహజ పరిష్కారాలు.

|

ఎవరు మాత్రం మచ్చలేని, అందమైన చర్మాన్ని ఇష్టపడరు? కానీ మనకు ప్రతీరోజు లెక్కలేనన్ని చర్మ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. అటువంటి ఒక సమస్య వైట్ హెడ్స్. అవి బ్లాక్ హెడ్స్ లాంటివే అయినా మూసుకుపోయిన చర్మరంధ్రాల ఉపరితలం కింద చిన్న తెల్లని లేదా పసుపు పచ్చని బొడిపెల్లాగా కనిపిస్తాయి.

వైట్ హెడ్స్ ఆక్సిజన్ తో చర్య చెందటం వలన బ్లాక్ హెడ్స్ గా మారి నల్లగా కనిపిస్తాయి. ఇవి ముక్కు, చెంపలు, నుదురు మరియు కణతలపైనా ఎక్కువగా కనిపిస్తాయి.

Whiteheads treatment

వైట్ హెడ్స్ సమస్య మన ఆత్మగౌరవాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అవి ఎప్పుడైనా, ఎక్కడైనా రావచ్చు. అవి మీ రూపాన్ని పాడుచేస్తాయి. ఇవి మృతకణాలు పెరుకుపోవడం వలన చర్మ రంధ్రాలు మూసుకుపోయి ఉబ్బటం వలన ఏర్పడతాయి.

ఎండలో అతిగా తిరగటం,ఎక్కువగా మేకప్ ను వినియోగించడం, చర్మంలో నూనె ఉత్పత్తి అధికంగా ఉండటం, యుక్తవయస్సులో వచ్చే హార్మోన్ల మార్పు, గర్భం, ఋతుక్రమం, గర్భనిరోధక మాత్రలు, వాతావరణంలో అధిక తేమ, అధిక కాలంపాటు స్టెరాయిడ్ క్రీములు వాడటం మొదలైన కారణాల వలన కూడా వైట్ హెడ్స్ ఏర్పడవచ్చు.

ఇప్పుడు మనం గృహవైద్యం ద్వారా వైట్ హెడ్స్ ను ఎలా నివారించుకోవచ్చో తెలుసుకుందాం!

యాపిల్ సిడర్ వెనిగర్:

యాపిల్ సిడర్ వెనిగర్:

యాపిల్ సిడర్ వెనిగర్ లో ఉండే యాస్ట్రిజంట్ గుణాలు చర్మంలో అధికంగా ఉత్పత్తి అయిన నూనెలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. అంతేకాక దీనిలో ఉండే యాంటీబాక్టీరియల్ మరియు యాంటీమైక్రోబియల్ తత్వాలు మంటను తగ్గిస్తాయి.

ఒక స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ ను ఒక కప్పు నీటిలో కలిపి ఈ ద్రావకాన్ని ముఖంపై దూది ఉండ సహాయంతో రాసుకోండి. పది నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

తేనె:

తేనె:

తేనెలోని యాంటీబాక్టీరియల్ గుణాలు వైట్ హెడ్స్ ను ప్రభావవంతంగా తొలగిస్తాయి. తేనె చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి ఆరామమిస్తుంది.

తేనెను కొంచం వేడి చేసి ముఖంపై వైట్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో రాసుకోండి. దీనిని ఇరవై నిమిషాలు ఆరనిచ్చి నీటితో కడిగేయండి. ఇలా రోజు విడిచి రోజు చేస్తే వైట్ హెడ్స్ మాయమయ్యే వరకు చేయండి.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసం చర్మంపై పెరుకున్క్ మృతకణాలను తొలగిస్తుంది. దీనిలోని యాస్ట్రిజంట్ గుణాలు చర్మంలో అధికంగా ఉత్పత్తి అయిన నూనెలను తొలగిస్తాయి.

ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి నిమ్మరసం తీయండి. దీనిలో దూది ఉండ ముంచి వైట్ హెడ్స్ ఉన్న చోటంతా రాసుకోండి. దీనిని పదిహేను నుండి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి గోరు వెచ్చని నీటితో కడిగేయండి.

టూత్ పేస్ట్:

టూత్ పేస్ట్:

టూత్ పేస్ట్ కొన్ని గంటల్లోనే వైట్ హెడ్స్ ను ఎండిపోయేట్టు చేస్తుంది. వైట్ హెడ్స్ ను తొలగించడానికి తెల్లని టూత్ పేస్ట్ ను మాత్రమే వాడండి.

వైట్ హెడ్స్ ను టూత్ పేస్ట్ తో కప్పినట్లు రాసుకుని అరగంట పాటు ఆరనివ్వండి. అరగంట తరువాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. ఇలా రోజుకు ఒకట్రెండు సార్లు చేస్తే బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

కలబంద:

కలబంద:

కలబందలో బ్లాక్ హెడ్స్ ను తొలగించడానికి అవసరమైన అద్భుతమైన క్లెన్సింగ్ లక్షణాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా కలబందను వాడితే చర్మానికి తేమనందించి తాజాగా ఉంచుతుంది.

ఒక టేబుల్ స్పూన్ తాజా కలబంద గుజ్జును తీసుకుని బాగా మెదపండి. దీనికి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని బాగా కలపండి. ఈ మిశ్రమంతో చర్మాన్ని3-4నిమిషాల పాటు మృదువుగా మర్దన చేసుకోండి. తరువాత పది నిమిషాలు ఆరనిచ్చి ముఖాన్ని కడిగేయండి. ఇలా కనీసం వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితముంటుంది.

కొబ్బరినూనె:

కొబ్బరినూనె:

కొబ్బరినూనె క్లెన్సర్ మరియు మాయిశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీనిని రాసుకుంటే వైట్ హెడ్స్ ను సులభంగా తొలగిస్తుంది.

రెండు చుక్కలు కొబ్బరినూనె తీసుకుని వేళ్ళతో వైట్ హెడ్స్ ఉన్న చోటంతా మర్దన చేసుకోండి. తరువాత కొన్ని గంటల పాటు వదిలేయండి. ఇలా మీరు ప్రతిరోజు పడుకోబోయే ముందు చేయవచ్చు.

English summary

Worried Of Whiteheads On Your Face? Here Are Some Natural Remedies To Treat Them

Whiteheads are similar to blackheads but appear as small white or yellow bumps as they form under the surface of closed pores. They can pop up anywhere and at anytime and ruin your look. But proper treatment can help to remove these fast. It can be treated with ingredients such as lemon, honey, rose water, etc.
Story first published:Thursday, April 5, 2018, 12:38 [IST]
Desktop Bottom Promotion