For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ ఉదయం ఇలా చేస్తే అందంగా ఉంటారు, చర్మం పాలిపోదు, కాంతివంతంగా మారుతుంది

|

రోజూ ఉదయం మీరు పాటించే కొన్ని అలవాట్లు మీ చర్మ సౌందర్యంపై ప్రభావం చూపుతాయి. కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. చాలా మంది ఉదయం లేవగానే ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా డైరెక్ట్ గా బ్రేక్ ఫాస్ట్ చేసేస్తుంటారు. ఇలా చేస్తే మీ చర్మం త్వరగా పాలిపోతుంది. మీ అందం తగ్గిపోతుంది. అందువల్ల కొన్ని సూచనలు పాటించి అందాన్ని కాపాడుకోండి.

నీళ్లు తాగాలి

నీళ్లు తాగాలి

రోజూ ఉదయం లేవగానే ఒక గ్లాస్ మంచి నీళ్లు తాగండి.

చాలా మంది పొద్దున లేవనగానే టీ కప్ చేతిలో పట్టుకుని తాగుతూ ఉంటారు. అయితే అంతకంటే ముందే మీరు ఒక గ్లాస్ నీరు తాగడం మంచిది. ఒకవేళ కేవలం నీళ్లు మాత్రమే తాగబుద్ది కాకుంటే కాస్త నిమ్మరసం, తేనే కలుపుకుని తాగండి.

శుభ్రపరుచుకోవాలి

శుభ్రపరుచుకోవాలి

ఇక ఉదయం లేవగానే ఫేస్ మొత్తాన్ని శుభ్రపరుచుకోవడం ముఖ్యం. అయితే మీరు ముఖానికి ఉపయోగించే క్రీమ్ లు, సోప్ ల్లో ఎక్కువ రసాయనాలు లేకుండా చూసుకోండి.

కలబంద

కలబంద

ఉదయం లేచిన తర్వాత కలబంద రసం లేదంటే కలబంద తయారైన క్రీమ్ లతో ఫేస్ క్లీన్ చేసుకోవడం చాలా ఉత్తమం.

యాంటీఆక్సిడెంట్, ఆల్కహాల్-ఫ్రీ టోనర్

యాంటీఆక్సిడెంట్, ఆల్కహాల్-ఫ్రీ టోనర్

ఇక మీరు ఉపయోగించే టోనర్ యాంటీఆక్సిడెంట్, ఆల్కహాల్-ఫ్రీ గా ఉండేటట్లు చూసుకోండి. అలాంటి వాటిని ఉపయోగిస్తే చర్మం సున్నితత్వం కోల్పొదు..

వర్క్ అవుట్

వర్క్ అవుట్

రోజూ ఉదయం లేవగానే కొన్ని రకాల వర్క్ అవుట్స్ చేయాలి. ఇవి మీ చర్మం సున్నితంగా ఉండి అందంగా ఉండేందుకు దోహదపడతాయి. ఉదయం లేవగానే ఏరోబిక్ వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని మలినాలు మొత్తం బయటకు వెళ్తాయి.

Most Read : మోచేతులు దగ్గర ఉండే నలుపును పోగొట్టుకునేందుకు చిట్కాలు, ఇలా చేస్తే తెల్లగా మారుతాయి

ఆక్సిజన్

ఆక్సిజన్

అలాగే మీ చర్మానికి, బాడీకి కావాల్సినంత ఆక్సిజన్ అందుతుంది. ఉదయం అలా చల్లటి వాతావరణంలో ఏరోబిక్స్ చేస్తూ ఉంటే బాడీకి కావాల్సినంత ఆక్సిజన్ అంది చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

బ్రేక్ ఫాస్ట్

బ్రేక్ ఫాస్ట్

రోజూ మీరు ఉదయం పూట తీసుకునే బ్రేక్ ఫాస్ట్ కూడా మీ చర్మ సౌందర్యంపై ప్రభావం చూపుతుంది. ఉదయం లేవగానే కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ తినడం అలవాటు చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకండి.

ఆరోగ్యకరమైన అల్పాహారం

ఆరోగ్యకరమైన అల్పాహారం

ఆరోగ్యకరమైన అల్పాహారం కూడా మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. రోజూ తృణధాన్యాలతో తయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ తింటూ ఉండండి. (వోట్మీల్ వంటివి). తాజా పండ్లను తింటూ ఉండండి. వీటిలో మాంసకృత్తులు, కొవ్వుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

చర్మ సౌందర్యం

చర్మ సౌందర్యం

ఇలా రోజు ఉదయం పూట మీకుండే అలవాట్లు అన్నీ కూడా మీ చర్మసౌందర్యంపై ప్రభావం చూపుతాయి. వీటన్నింటినీ రోజూ పాటిస్తే చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవొచ్చు.

English summary

What To Do First Thing In The Morning For Glowing Skin ALL Day!

Thing do the morning glowing skin day
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more