Latest Updates
-
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా
Alia Bhatt Skincare Routine: డెలివరీ తర్వాత మెరిసే చర్మం కావాలంటే.. అలియా భట్ చేసినట్లు చేయండి
కత్రినా చర్మంలా మీకు కూడా సహజమైన మెరుపునిచ్చే ముఖం కావాలంటే కత్రీనా ఫాలో అవుతున్న ఈ సీక్రెట్స్ మీరూ ఫాలో అవండి.
డెలివరీ తర్వాత హార్మోన్లలో మార్పులు, అసమతుల్యత వల్ల చర్మంపై మొటిమలు, స్ట్రెచ్ మార్కులు, దురద, నల్లటి మచ్చలు, కళ్ల కింద నల్లటి వలయాలు, పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలు వస్తాయి. డెలివరీ తర్వాత మహిళ శరీరంలో పోషకాల కొరత ఉంటుంది. అంతే కాకుండా డెలివరీ అయ్యాక తల్లులు బిడ్డ సంరక్షణకు ఎక్కువ సమయం కేటాయించి చర్మ సౌందర్యాన్ని పెద్దగా పట్టించుకోరు. దీని వల్ల చర్మం మరింత డల్ గా మారుతుంది.

ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చర్మ సమస్యలు సాధారణమే. అలియా భట్ ఈ మధ్యే డెలివరీ అయిన సంగతి తెలిసిందే. అయినా తన ముఖంలో ఆ గ్లో ఇంకా చెక్కుచెదరలేదు. చర్మ సంరక్షణ కోసం అలియా భట్ ఏం చేస్తుందో తెలుసుకోండి.
అందరిలాగే అలియా భట్ కూడా గర్భాధారణ, డెలివరీ సమయంలో చర్మ సమస్యలు ఎదుర్కొంది. తన చర్మం కూడా డల్ గా మారిపోయింది. దీని గురించి తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడిన అలియా.. తన సోదరి షాహీన్ భట్ సూచించిన స్కిన్ కేర్ రొటీన్ పాటిస్తూ చర్మ సౌందర్యాన్ని తిరిగి పొందుతున్నట్లు వెల్లడించింది.

అలియా భట్ మార్నింగ్ స్కిన్‌కేర్ రొటీన్:
* ఉదయం నిద్ర లేచిన వెంటనే స్కిన్ క్లెన్సర్ ను ఉపయోగిస్తుంది అలియా భట్.
* చర్మానికి సరిపోయే నాణ్యమైన బ్రాండెడ్ స్కిన్ టోనర్ వాడుతుంది అలియా. వీటిని వాడే ముందు తప్పనిసరిగా మీ చర్మానికి సూట్ అవుతుందో లేదో తెలుసుకోవాలి. అలాగే చర్మాన్ని బిగుతుగా చేసి డ్రైగా మార్చే టోనర్లను ఏమాత్రం ఉపయోగించదు.
* టోనర్ తర్వాత అలియా తన చర్మంపై సీరమ్ ను ఉపయోగిస్తుంది. సీరం చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది చర్మానికి రక్షణ కవచంలా ఉంటుంది. అలాగే చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
* సీరమ్ అనంతరం చాలా తేలికైనా మాయిశ్చరైజర్ ను అప్లై చేస్తుంది. హేవీ మాయిశ్చరైజర్ అప్లై చేస్తే చర్మం జిడ్డుగా మరియు జిగటగా మారుతుంది. చల్లని ప్రదేశాల్లో ఉండే వారు అయితే హెవీ మాయిశ్చరైజర్ వాడొచ్చని సూచించింది.
* చివరగా సన్ స్క్రీన్ ఉపయోగిస్తుంది. ఇంటి నుండి బయటకు వస్తే తప్పనిసరిగా సన్ స్క్రీన్ వాడుతుంది. మార్కెట్ లో అనేక రకాల సన్ స్క్రీన్లు అందుబాటులో ఉంటాయి. మీ చర్మానికి ఏది సరిపోతుందో తెలుసుకుని వాడాలి.



Click it and Unblock the Notifications