For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దానిమ్మపండు ఉపయోగించి అందమైన పెదాలను ఎలా పొందాలో మీకు తెలుసా?

దానిమ్మపండు ఉపయోగించి అందమైన పెదాలను ఎలా పొందాలో మీకు తెలుసా?

|

దానిమ్మ చాలా పోషకమైన మరియు రుచికరమైన పండు. దానిమ్మపండు రుచికరమైన డ్రింక్స్ మరియు డెజర్ట్‌ వంటి వంటలలో మాత్రమే ఉపయోగిస్తారు. కానీ ఇది మీ చర్మానికి అవసరమైన అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దానిమ్మలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పండులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి మరియు యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి మరియు అందమైన చర్మాన్ని అందివ్వడానికి సహాయపడతాయి.

దానిమ్మపండు ఉపయోగించి అందమైన పెదాలను ఎలా పొందాలో మీకు తెలుసా?

మంచి ఆరోగ్యకరమైన ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దానిమ్మ చర్మ సంరక్షణ మీ వృద్ధాప్య రూపాన్ని ఎదుర్కోవటానికి మరియు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

 మొటిమల సమస్య ఉంటే

మొటిమల సమస్య ఉంటే

మీ అందమైన ముఖం మీద మొటిమల సమస్య ఉంటే అది కొద్దిగా బాధించేది. మీరు ఇకపై మొటిమల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తరచుగా మొటిమలు హార్మోన్ల కొరత వల్ల కలుగుతాయి. అలాగే, ముఖం మీద ఉన్న నూనె వల్ల మొటిమలు వస్తాయి. మీరు దానిమ్మపండును ముఖం మీద పూస్తే, మీరు మొటిమలను మాయంచేయచ్చు. ఒక ఫేస్ ప్యాక్ కోసం 1 టేబుల్ స్పూన్ దానిమ్మ, 2 టేబుల్ స్పూన్లు బ్రౌన్ షుగర్, 1 టీస్పూన్ తేనె మరియు ఆరెంజ్ పౌడర్ కలపండి మరియు దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు వదిలివేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మీ ముఖంలో మొటిమలు కొద్ది రోజుల్లో మాయమవుతాయి. మీరు ఈ మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్‌లో కూడా నిల్వ చేసుకుని ఉపయోగించవచ్చు.

చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా

చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా

వాయు కాలుష్యం, జీవనశైలి మరియు ఒత్తిడి మీ యవ్వన చర్మాన్ని పాడు చేస్తుంది. కానీ ఈ ఆరోగ్యకరమైన దానిమ్మపండు దీనిని నివారించడంలో మీకు సహాయపడుతుంది. మీరు ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తినవచ్చు లేదా తేనె, పెరుగు మరియు దానిమ్మతో పేస్ట్ గా తయారు చేసుకోవచ్చు. మీరు వారానికి రెండుసార్లు మీ ముఖం మీద ఈ మిశ్రమాన్ని అప్లై చేసే ముందు కొద్దిగా నిమ్మకాయను కలపండి మరియు మీ చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తుంది.

నిగనిగలాడే పెదవులు

నిగనిగలాడే పెదవులు

మీరు చాలా అందమైన మరియు ఎరుపు పెదాలను కోరుకుంటే మీరు దానిమ్మను ఉపయోగించవచ్చు. మీరు దానిమ్మపండు ఉపయోగించిన తర్వాత, మీకు లిప్‌స్టిక్ అవసరం ఉండదు. ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, తేనె మరియు కొబ్బరి నూనె తీసుకోండి. దీనితో దానిమ్మ రసం వేసి సరిగ్గా వచ్చేవరకు వెచ్చగా ఉంచండి. తర్వాత స్టౌ మీద నుండి క్రిందికి దింపి చల్లబరచండి. తరువాత రిఫ్రిజిరేటర్లో ఉంచండి మరియు అవసరమైనప్పుడు ఉపయోగించండి.

చర్మం వాపును తగ్గిస్తుంది

చర్మం వాపును తగ్గిస్తుంది

ఇప్పుడు, చర్మం శుభ్రపరచడం అనేది ఒక సాధారణ విషయంగా మారింది. చాలా మంది సోరియాసిస్‌తో బాధపడుతున్నారు. దానిమ్మ నూనె సాధారణంగా దుకాణాల్లో లభిస్తుంది. మీరు దీన్ని నేరుగా మీ చర్మంపై పూయవచ్చు. ఈ దానిమ్మ నూనెను రెండు లేదా మూడు చుక్కలను చర్మంపై రాసి వృత్తాకారంలో మసాజ్‌ చేయండి. ఈ దానిమ్మ నూనె మీ చర్మం కోలుకోవడానికి సహాయపడుతుంది.

చనిపోయిన కణాలను రికవరీ చేస్తుంది

చనిపోయిన కణాలను రికవరీ చేస్తుంది

మన చర్మంలోని కణాలు రోజూ చనిపోతాయి మరియు ఆ ప్రదేశంలో కొత్త కణాలు అభివృద్ధి చెందుతాయి. ఈ కొత్త కణాల ఏర్పాటుకు దానిమ్మపండు సహాయపడుతుంది. కాబట్టి రోజూ మీ ఆహారంలో దానిమ్మపండును చేర్చుకోవడం మంచిది. సాధారణంగా మార్కెట్లలో లభించే దానిమ్మ నూనెను కొనండి మరియు ప్రతిరోజూ మీ ముఖం మీద పూయండి. మీరు కనీసం ఒక వారంలో మార్పును పొందుతారు. మరియు మీరు మీ చర్మం మృదువుగా మరియు దృఢంగా అనుభూతి చెందుతారు. ఈ నూనెను చాలా వరకు సన్ క్రీములు మరియు మొటిమల క్రీములలో ఉపయోగిస్తుంటారు. మీరు వాటిని కూడా ఉపయోగించవచ్చు.

హైడ్రేషన్

హైడ్రేషన్

మీ చర్మం చాలా పొడిగా, పగుళ్లు మరియు పగిటినట్లయితే, పరిష్కారం దానిమ్మపండు. ప్రతిరోజూ దానిమ్మపండు తినండి, తద్వారా మీరు మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు లేదా దానిమ్మ రసాన్ని నేరుగా మీ ముఖం మీద రాసుకోవచ్చు. లేకపోతే మీరు రోజూ దానిమ్మపండు రసం తాగవచ్చు.

చర్మ పోషణ

చర్మ పోషణ

దానిమ్మపండు శతాబ్దాలుగా పోషణ కోసం ఉపయోగిస్తున్నారు. కానీ ఇది ప్రస్తుతం మరింత సులభంగా అందుబాటులో ఉంది మరియు చర్మ సంరక్షణలో విస్తృతంగా ఉపయోగించబడుతోంది. మీరు మీ చర్మాన్ని పోషించుకోవాలనుకుంటే, మీరు దానిమ్మను ఎంచుకోవచ్చు.

English summary

Benefits of Pomegranate For Skin You Should Know

Pomegranates are delicious. Not only are they great for preparing healthy desserts and recipes, but it’s even great for your skin! Packed with powerful antioxidants with vitamins and minerals, this delectable fruit has anti-ageing properties and promotes better skin!
Story first published:Wednesday, February 26, 2020, 16:36 [IST]
Desktop Bottom Promotion