For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ చర్మం కాంతివంతంగా మెరవాలంటే సింపుల్ గా బియ్యం పిండిని ఇలా వాడండి

మీ చర్మం కాంతివంతంగా మెరవాలంటే సింపుల్ గా బియ్యం పిండిని ఇలా వాడండి

|

చర్మ సౌందర్యానికి మార్కెట్లో క్రీమ్స్, ఫేస్‌ప్యాక్, లోషన్లు, స్క్రబ్బర్లు ఇలా చాలానే ఉండొచ్చు. కానీ, వాటిని ఎన్ని రోజులని ఉపయోగిస్తాం.. అవి ఎంత కాలం అందుబాటులో ఉంటాయని ఎవ్వరు చెప్పలేం. అయితే ఇదే క్రమంలో హోం మేడ్ ప్రొడక్ట్ ను చాలా మంది నిర్లక్ష్యం చేసి ఉంటారు. హోం మేడ్ ప్రొడక్ట్స్ వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాల గురించి చాలా మందికి తెలిసి ఉండక పోవచ్చు. హోం మేడ్ ప్రొడక్ట్స్ వల్ల మంచి లాభాలున్నాయి. అంతే కాదు వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

హోం మేడ్ ప్రొడక్ట్స్ అంటే టైం వేస్ట్ అని చాలా మంది అనుకుంటారు. కానీ మార్కెట్లో లభించే రసాయనిక ఉత్పత్తులు చర్మానికి హాని కలిగిస్తాయి. వీటిలోని కెమికల్స్ తక్షణ ఫలితాలు చూపించినప్పటికీ, తర్వాత తర్వాత చర్మాని ఎక్కువ హాని చేస్తాయి. కాబట్టి హోం ప్రొడక్ట్ లో కూడా కొన్ని ప్రభావితమైన ఫలితాలనిచ్చేవి ఉన్నాయి. అలాంటి వాటిలో బియ్యం పిండి ఒకటి. ఇది రసాయనిక ప్రొడక్ట్స్ కంటే అధికంగా ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే..

బియ్యం పిండిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని తాజాగా మార్చేలా చేస్తాయి. దాంతో పాటు చర్మ లావణ్యాన్ని పెంచుతుంది. ఇందులో చర్మంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడే గుణంతో పాటు, చర్మంను సాఫ్ట్ గా మరియు యూత్ ఫుల్ గా కనబడేందుకు తేమను పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. ప్రత్యేకించి ముఖంలోని కండరాలు రిలాక్స్ అవడానికి తోడ్పడుతుంది. దీని ఫలితంగా అలసట లక్షణాలు పోయి ముఖం హాయిగా కనిపిస్తుంది. బియ్యం పిండిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని తాజాగా మార్చేలా చేస్తాయి. దాంతో పాటు చర్మ లావణ్యాన్ని పెంచుతుంది. ప్రత్యేకించి ముఖంలోని కండరాలు రిలాక్స్ అవడానికి తోడ్పడుతుంది. దీని ఫలితంగా అలసట లక్షణాలు పోయి ముఖం హాయిగా కనిపిస్తుంది. మరి బియ్యం పిండితో చర్మానికి పొందే అమేజింగ్ బెన్ఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

బియ్యం పిండితో చర్మానికి కలిగే ఉపయోగాలు:

బియ్యం పిండితో చర్మానికి కలిగే ఉపయోగాలు:

  • చర్మంను శుభ్రం చేస్తుంది
    • మొటిమలతో పోరాడుతుంది.
      • చర్మం అందంగా మార్చుతుంది
        • ముఖానికి న్యాచురల్ గ్లో అందిస్తుంది.
          • చర్మంను కాంతివంతంగా మార్చడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది
            • చర్మంలో డార్క్ సర్కిల్స్ ను నివారిస్తుంది
              • సన్ టాన్ నివారిస్తుంది.
              • చర్మ సంరక్షణకు బియ్యం పిండి ఏవిధంగా ఉపయోగించాలి:

                చర్మ సంరక్షణకు బియ్యం పిండి ఏవిధంగా ఉపయోగించాలి:

                విటమిన్స్, మినిరల్స్ అధింగా ఉండే అలోవెరాలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీసెప్టిక్ , యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ. ఇవి చాలా ఎఫెక్టివ్ గా మొటిమలతో పోరాడి ఇన్ఫ్లమేషన్ నుండి ఉపశమనం కలిగిస్తాయి. అదే విధంగా తేనెలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కూడా మొటిమలకు దారితీసే బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

                కావల్సినవి:

                బియ్యం పిండి : 1టేబుల్ స్పూన్

                అలోవెర జెల్: 1టేబుల్ స్పూన్

                తేనె : 1 టేబుల్ స్పూన్

                పద్దతి:

                ఒక గిన్నె తీసుకుని అందులో బియ్యం పిండి వేయండి

                దానికే కలబంద గుజ్జు మరియు బియ్యం పిండి జోడించండి. మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.

                ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి అప్లై చేయాలి.

                20 నిముషాలు అలాగే ఉంచాలి.

                తర్వాత నీటితో శుభ్రపరచాలి.

                చర్మం శుభ్రపరచడానికి

                చర్మం శుభ్రపరచడానికి

                బేకింగ్ సోడ చర్మం శుభ్రపరచడం మాత్రమే కాదు, ఇది ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు హెల్తీ స్కిన్ పొందడానికి సహాయపడుతుంది. అలాగే తేనెలో ఉండే ఎమోలియంట్ గుణాలు స్కిన్ సాఫ్ట్ గా మార్చుతుంది.

                కావల్సినవి:

                బియ్యం పిండి : 1 టేబుల్ స్పూన్

                బేకింగ్ సోడ: చిటికెడు

                తేనె : 1 టేబుల్ స్పూన్

                పద్దతి:

                ఒక గిన్నెలో బియ్యం పిండి తీసుకోవాలి.

                దానికి చిటికెడు బేకింగ్ సోడా, తేనె జోడించి మూడింటిని బాగా మిక్స్ చేయాలి.

                ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి సున్నితంగా మర్ధన చేయాలి.

                బాగా డ్రై అయిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

                డ్రై స్కిన్ :

                డ్రై స్కిన్ :

                అరటిపండు చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా కళ్ళ క్రింద భాగంలో నలుపు తొలగించి కాంతిని ప్రేరేపిస్తుంది. అదే విధంగా ఆముదంలో ఉండే రిసినోలిక్ యాసిడ్ చర్మంలోని డీప్ గా చొచ్చుకుపోతుంది. దాంతో డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి,

                కావల్సినవి:

                బియ్యం పిండి : 1టేబుల్ స్పూన్

                చిదిమిని అరటిపండు: 1

                ఆముదం నూనె: 1/2టేబుల్ స్పూన్

                పద్దతి:

                ఒక బౌల్లో బియ్యం పిండి తీసుకోండి

                దీనికి అరటిపండు గుజ్జును జోడించండి. ఈ రెండు పదార్థాలను బాగా మిక్స్ చేయాలి.

                ఇప్పుడు ఆముదం కూడా జోడించి మిక్స్ చేయండి.

                ఈ మిశ్రమాన్ని కళ్ళ క్రింద అప్లై చేయండి.

                అరగంట సేపు అలాగే ఉంచి , తర్వాత చన్నీటితో శుభ్రం చేయండి.

                సన్ ట్యాన్ తొలగిస్తుంది:

                సన్ ట్యాన్ తొలగిస్తుంది:

                పచ్చిపాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంలో మలినాలను తొలగిస్తుంది. ముఖ్యంగా ఎండకు కమిలిన చర్మం తిరిగి కాంతివంతంగా మార్చడంలో బియ్యం పిండి సహాయపడుతుంది

                కావల్సినవి

                బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు

                పచ్చిపాలు : కొద్దిగా

                పద్దతి

                గిన్నెలో బియ్యం పిండి తీసుకోవాలి

                దీనికి సరిపడా పాలు కలపాలి.

                ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.

                అరగంట సేపు అలాగే వదిలేయాలి.

                తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేయాలి.

                చర్మంలో ముడుతలను నివారిస్తుంది:

                చర్మంలో ముడుతలను నివారిస్తుంది:

                కార్న్ ఫ్లోర్ లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది చర్మంలోని ఏజింగ్ లక్షణాలను మరియు అందుకు కారణమయ్యే ముడుతలను నివారిస్తుంది. రోజ్ వాటర్ లో చర్మరంద్రాలను టైట్ చేస్తుంది. అదే క్రమంలో గ్లిజరిన్ చర్మానికి ఎక్కువగా మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది. దాంతో చర్మం సాఫ్ట్ గా మరియు తేమగా మరియు యంగ్ గా మార్చుతుంది.

                కావల్సినవి:

                బియ్యంపిండి : 1 టేబుల్ స్పూన్

                కార్న్ ఫ్లోర్ : 1టేబుల్ స్పూన్

                రోజ్ వాటర్ : 1 టేబుల్ స్పూన్

                గ్లిజరిన్ కొన్ని చుక్కలు

                పద్దతి:

                ఒక గిన్నెలో బియ్యంపిండి తీసుకోండి

                దీనికి మొక్కజొన్నపిండి మరియు రోజ్ వాటర్ జోడించండి. మూడు బాగా కలిసే మిక్స్ చేయండి.

                చివరగా గ్లిజరిన్ వేసి బాగా మిక్స్ చేయాలి.

                ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి

                ఇది డ్రై అయ్యే వరకు అలాగే ఉంచి,

                తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

                వెంటనే చల్లటి నీళ్ళు ముఖం పై చిలకరించుకోండి.

English summary

Rice Flour: Benefits For Skin & How To Use

Rice Flour: Benefits For Skin & How To Use
Desktop Bottom Promotion