Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చర్మంపై మచ్చలా..జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు..
చర్మంపై మచ్చలా..జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు..
మారుతున్న జీవనశైలి, వాతావరణ కాలుష్యం, ఇతర కారణాల వల్ల ఇటీవల కాలంలో చర్మ సమస్యలు విజృంభిస్తున్నాయి. వివిధ రకాల సమస్యలు, వ్యాధులు నుండి ఏకంగా చర్మ క్యాన్సర్ వరకూ ఇబ్బందులు కలుగుతున్నాయి. మన శరీరంలో వ్యర్థాలను తొలగించడానికి, శరీర ఉష్ణోగ్ర సమంగా ఉండటానికి శరీరాన్ని బయటి సమస్యల నుండి రక్షించడానికి తోడ్పడేది చర్మమే.
ఇటీవల కాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. చాలా మంది మొటిమలు, మచ్చలు, పులిపిర్లు, చర్మం నల్లబడటం, చర్మం కమిలిపోవడం, చర్మంపై తీవ్రంగా పగుళ్ళు వంటి సాధారణ సమస్యలతో పాటు సోరియాసి, బొల్లి, టినియా వర్సికలర్, చర్మ క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. మారుతున్న జీవనశైలి కాలుష్యం, జన్యుపరమైన సమస్యలు, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి స్మూక్ష్మ జీవులు అతినీలలోహిత కిరణాలు రేడియేషన్ కు గురికావడం వంటి చర్మ సమస్యలు, వ్యాధులకు కారణమవుతున్నాయి.
ముఖ్యంగా యువత మొటిమలు, మచ్చలు వంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యల నుండి సులువుగా బయటపడవచ్చు.

మొటిమలు:
ఇది సాధారణంగా అందరిలో కనిపించే సమస్య. యుక్త వయసు అమ్మాయిలు, అబ్బాయిల్లో మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. హార్మోన్ల అసమతుల్యత వల్ల ఇవి వస్తుంటాయి. ముఖంపై, ఛాతీ మీద, వీపు మీద మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువ.
విటమిన్ ఏ ప్రొడక్టులు, సాలిసైలిక్ యాసిడ్, బెంజైల్ పెరాక్సైడ్, యాంటీ బయాటిక్స్ వినియోగిస్తే మొటిమలు తగ్గిపోతాయి. అయితే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుని.. తగిన చికిత్స తీసుకోవడం బెటర్.

మచ్చలు
మచ్చలు ప్రతి ఒక్కరి శరీరంపై ఉంటాయి. పరిమాణంలో తేాడాలు, ఎరుపు, నలుపు, గోధుమ రంగులలో ఉంటాయి. చాలా వరకు మచ్చలు ఆవ గింజంతా పరిమాణం నుంచి నాలుగైదు సెంటీమీటర్లంత పెద్దగా కూడా ఉంటాయి. కొంత మందిలో పుట్టుకతోనే మచ్చలు పెద్దగా ఉంటాయి. అయితే చిన్న పరిమాణంలో ఉన్న మచ్చలు క్రమేపీ పెద్దగా మారుతుండటం, అవి రంగు మారుతుంతడడం, నొప్పిగా ఉండడం వంటి లక్షణాలు ఉంటే మాత్రం ఏదైనా సమస్య తలెత్తుతున్నట్టు భావించాలి. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

సొరియాసిస్
ఇది కూడా ఒక రకమైన చర్మ వ్యాధి. మోకాళ్లు, మోచేతులు వంటి చోట్ల ఎక్కువగా వస్తుంటుంది. వ్యాధి సోకిన ప్రాంతాల్లో చర్మం ఎర్రగా మారడం, మంట పుట్టడం వంటి లక్షణాలు ఉంటాయి. దాదాపు మూడు శాతం మంది ప్రజలు సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నట్టు అంచనా.

పులిపీర్లు (వాట్స్)
సాధారణంగా చాలా మందికి పులిపీర్లు ఉంటాయి. వైరల్ ఇన్ ఫెక్షన్లు, పలు ఇతర కారణాల వల్ల పులిపీర్లు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎక్కువగా చేతులు, కాళ్ల మీద చిన్న మొటిమలాగా ఏర్పడతాయి. తరువాత కొంత పెద్దగా మారుతాయి. ఇందులోనూ పాపిలోమా వైరల్ ఇన్ ఫెక్షన్ తో వచ్చే ఈ పులిపీర్లు పెరిగే కొద్ది రక్త నాళాలపై ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గజ్జి
దీన్ని డెర్మటైటిస్ అని కూడా అంటారు. ఇది వేళ్ల మధ్య, కాళ్లు, చేతుల మూలల్లో ఎక్కువగా వస్తుంటుంది. ఇది వైరస్ వల్ల వస్తుంది. ఒకరినుంచి మరొకరికి వ్యాప్తి చెందే అంటువ్యాధి. వైద్యుల సలహా మేరకు తగిన మందులు వాడితే త్వరగా తగ్గిపోతుంది.

బొల్లి
ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న చర్మ వ్యాధుల్లో బొల్లి ఒకటి. ఈ వ్యాధి సొకితే చర్మానికి రంగునిచ్చే మెలనిన్ ఉత్పత్తి నిలిచిపోతుంది. దానివల్ల చర్మం రంగు మారిపోతుంది. వ్యాధి సోకిన చోట చర్మం పూర్తి తెల్లగా.. మిగతా చోట్ల సాధారణ రంగులో ఉంటుంది. ఈ వ్యాధి రోగ నిరోధక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. చర్మ కణాలు పనిచేయకుండా చేయడంతోపాటు వాటి మరణానికి కారణం అవుతుంది. లైట్ ట్రీట్ మెంట్ (కాంతి చికిత్స) ద్వారా బొల్లి సమస్యను నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు



Click it and Unblock the Notifications