For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ చర్మ సమస్యలన్నీ పటాపంచలు చేయడానికి ఎలాంటి క్రీములు అవసరం లేదు..కొబ్బరి నూనె చాలు..

మీ చర్మ సమస్యలన్నీ పటాపంచలు చేయడానికి ఎలాంటి క్రీములు అవసరం లేదు..కొబ్బరి నూనె చాలు..

|

సాధారణంగా వయస్సైన లక్షణాలు మొదటగా ముఖంలోనే కనబడుతాయి. ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా స్త్రీలకు వయస్సైన లక్షణాలు ఏమాత్రం కనబడటం ఇష్టం ఉండదు. స్త్రీలకు అతి పెద్ద శత్రువు ఏజింగ్. ముఖంలో ముడుతలు, సన్నని చారలు కనబడ్డాయంటే అందాన్ని అలర్ట్ చేస్తుంది. వెంటనే మీకు మీరు మార్పుకోవాలని, తెలుపుతుంది. ఏజింగ్ ఇష్టపడని వారే కాదు, ముఖంలో ముడుతలు, చారలు కనబడేవారు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

అందుకోసం ఏంతో దూరం వెళ్ళాల్సిన పనిలేదు. బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం మీ ఇంట్లో ఉండే కొబ్బరి నూనెను రొటీన్ గా వాడితే చాలు ఈ ఏజింగ్ సమస్యను దూరం చేయవచ్చు. కొబ్బరి నూనె న్యాచురల్ ఆయిల్ మాత్రమే కాదు ప్రభావవంతంగా మరియు సురక్షితంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే కొన్ని గుణాలు ఏజింగ్ లక్షణాలను దూరం చేసి యవ్వనంగా కనబడేలా చేస్తుంది. . కొబ్బరి నూనె ఉపయోగించి టెస్ట్ చేసిన కొన్ని హోం రెమెడీస్ మీకోసం...

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కేవలం కొబ్బరి నూనె ఒక్కటే చాలు చర్మాన్ని స్మూత్ గా...తేమగా తయారవ్వడానికి. చర్మంలో ముడుతలకు కారణం అయ్యే పొడి చర్మానికి, దురద పెట్టే చర్మానికి ఇది ఒక సంప్రదాయ పద్దతి.

పద్దతి:

పద్దతి:

కొన్ని చుక్కల కొబ్బరినూనెను చేతి వేళ్ళపై వేసుకుని ముఖానికి మరియు మెడకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. నూనె అప్లై చేసిన తర్వాత రాత్రి మొత్తం అలాగే కూడా వదిలేసి ఉదయం శుభ్రం చేసుకోవచ్చు. ఈ పద్దతిని ఫ్రీక్వెంట్ గా అనుసరిస్తుంటే ఖచ్చితమైన మార్పును మీరే గమనిస్తారు.

కొబ్బరి నూనె-అలోవెర:

కొబ్బరి నూనె-అలోవెర:

చర్మ కణాలను బలోపేతం చేయడానికి మరియు స్కిన్ ఎలాసిటి పెంచడానికి కొబ్బరి నూనె, కలబంద మరియు కీరదోసకాయ వంటి కాంబినేషన్ ఉపయోగించవచ్చు. మీ సమస్య త్వరగా మరియు ఎఫెక్టివ్ గా పరిష్కారం అవుతుంది.

పద్దతి:

పద్దతి:

కీరదోసకాయ తొక్క తీసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ కు కొద్దిగా కొబ్బరి నూనె, అలోవెర జెల్ మిక్స్ చేసి ముఖానికి మెడకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది పూర్తిగా చర్మంలోకి గ్రహించేలా మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి కనీసం మూడు సార్లు కనుక చేస్తుంటే ఖచ్చింగా మీ చర్మంలో మార్పు వస్తుంది.

కొబ్బరి నూనె-ఆముదం నూనె

కొబ్బరి నూనె-ఆముదం నూనె

కొబ్బరి నూనె అద్భుతమైన స్కిన్ కండీషనర్. ఎందుకంటే ఇందులో యాంటీయాక్సిడెంట్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. కొబ్బరి నూనెలో ప్రత్యేకంగా చర్మం తేమగా, కాంతివంతంగా మరియు యవ్వనంగా ఉంచే గుణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి, ఈ రెండు నూనెలను కలపబడం వల్ల ఇది మొటిమలు మరియు మచ్చలను నివారించడానికి కూడా మంచి ఎంపిక.

పద్దతి:

పద్దతి:

కొబ్బరి నూనె-ఆముదం నూనె మిశ్రమాన్ని కొన్ని చుక్కలను అరచేతిలో తీసుకుని రెండు చేతులను రబ్ చేసి ముఖానికి అప్లై చేసి సున్నితంగా..ముఖం మొత్తం అప్లై చేయాలి. కనీసం ఒక గంట సేపు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా ఫ్రీక్వెంట్ గా చేస్తుంటే సాగిన మీ చర్మంలో తప్పనిసరిగా మార్పు కనబడుతుంది.

కొబ్బరి నూనె తేనె:

కొబ్బరి నూనె తేనె:

మనందరికి తెలుసు తేనె స్కిన్ సాప్టెనింగ్ ఏజెంట్ అని, అంతే కాదు ఇది డ్యామేజ్ అయిన చర్మాన్ని కూడా నయం చేస్తుంది. దీనికి న్యూట్రీషియన్ కోకనట్ ఆయిల్ మిక్స్ చేస్తే నయం చేసే గుణాలు మరింత పెరుగుతాయి. దాంతో ముడుతలకు, చారలకు మచ్చలకు బైబై చెప్పవచ్చు.

పద్దతి:

పద్దతి:

కొబ్బరి నూనె మరియు తేనె రెండింటిని మిక్స్ చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. ఒక గంట తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఒక వారంలో మీ చర్మంలో గొప్ప మార్పును తప్పనిసరిగా గమనిస్తారు.

కొబ్బరి నూనె-గుడ్డు

కొబ్బరి నూనె-గుడ్డు

గుడ్డు సాగిన చర్మంను టైట్ గా మార్చుతుంది ముడుతలను పోగొడుతుంది,. అదే విధంగా కొబ్బరి నూనె ఏజింగ్ లక్షణాలు కనబడకుండా ఆలస్యం చేస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్ లో అద్భుతమైన మార్పును మీరు గమనిస్తారు.

పద్దతి:

పద్దతి:

ఒక బౌల్ తీసుకుని అందులో ఎగ్ వైట్ వేసి బాగా గిలకొట్టాలి. అందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె, కొద్దిగా తేనే(అవసరం అయితేనే) వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసి, తడిలేకుండా తుడవాలి. ఈ పద్దతిని కనీసం మూడు సార్లు రిపీట్ చేస్తే తప్పకుండా మార్పును మీరు చూస్తారు.

English summary

Effective Home Remedies To Treat Wrinkles Using Coconut Oil

There is no denying the fact that signs of ageing on your face are your biggest enemies. Fine lines and wrinkles not only alter your beauty, but also change the way you feel about yourself. Since they tend to get deeper, you need to treat them immediately and effectively.
Desktop Bottom Promotion